‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే హీరోయిన్‌గా సత్తా చాటిన ఆమె ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఈ ఏడాది ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె.. ప్రస్తుతం ‘రాయబారి’ అనే సినిమాలో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే లావణ్య తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతానికి విమానంలో ప్రయాణించిన లావణ్యకు అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది.
సాంకేతిక సమస్యల కారణంగా ఆమె ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్ కావడంతో లావణ్య ప్రయాణానికి అంతరాయం కలిగింది. దీంతో సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ విమానం క్యాన్సిల్ అవుతుందన్న విషయం ముందుగా ఎందుకు తెలియజేయలేదంటూ ఫైర్ అయ్యింది. విమానంలో సీటు రిజర్వ్ చేసుకున్న అనంతరం ఫ్లైట్ క్యాన్సిల్ అని మెసేజ్ రావడం ఏంటని మండిపడింది. ఇలాంటిది గతంలో ఎవరికైనా జరిగిందా లేక తనకే ఎదురైందా అంటూ ఫ్యాన్స్‌ను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment