సాక్షి, న్యూఢిల్లీ : గోఎయిర్ ప్రయాణీకులకు మంగళవారం వరుసగా రెండో రోజూ కష్టాలు తప్పలేదు. సిబ్బంది కొరత, విమానాలు అందుబాటులో లేకపోవడంతో రెండో రోజూ గోఎయిర్ 19 విమానాలను రద్దు చేసింది. విమానాల రద్దుతో పలు గమ్యస్ధానాలకు చేరాల్సిన ప్రయాణీకులు వివిధ నగరాల్లో చిక్కుకుపోయారు. సోమవారం ఇవే కారణాలు చూపుతూ గోఎయిర్ ఏకంగా 21 విమానాలను రద్దు చేయడంతో ఆఖరినిమిషంలో ప్రయాణ షెడ్యూల్ తారుమారు కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రతికూల వాతావరణం, వివిధ నగరాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను సంస్థ కారణాలుగా చూపింది. కాక్‌పిట్ సిబ్బంది సమస్యలూ ప్రభావం చూపాయని పేర్కొంది. గోఎయిర్ ప్రతిరోజూ పలు దేశీ, విదేశీ గమ్యస్ధానాలకు రోజూ 200 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. విమానాలు, పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గోఎయిర్ ఇప్పటివరకూ 19 విమానాలు రద్దు చేసిందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కొచ్చి, పట్నా, లక్నో సహా పలు గమ‍్యస్ధానాల నుంచి బయలుదేరాల్సిన విమానాలు రద్దయిన వాటిలో ఉన్నాయని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment