![Hyderabad Consumer Forum Fines Emirates Airlines Rs 2 Lakh - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/7/flight.jpg.webp?itok=cElpz_uQ)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడం, మానసిక వేదనకు, ఇబ్బందులకు గురి చేయటం వంటి కారణాలతో... ఎమిరేట్స్ విమానాయాన సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కారాల ఫోరం రూ.2 లక్షల జరిమానా విధించింది. రద్దు చేసిన విమాన టికెట్ చార్జీలు, వడ్డీతో సహా తిరిగి కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్‌కు చెందిన వినయ్ కుమార్ సిన్హా (57), కృష్ణ సిన్హా (55) దంపతులు టికెట్లు బుక్ చేసి... 2017 జులై 12న డెట్రాయిట్‌లోని బంధు వులను కలిసేందుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. బోస్టన్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లినా... బోస్టన్ నుంచి డెట్రాయిట్‌కు వెళ్లాల్సిన విమానం ఆకస్మికంగా రద్దయింది. నిర్ధారిత సమయంలో డెట్రాయిట్‌కు చేరుకోవటంలో విఫలమైనందుకు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని రద్దు చేసినందుకు వీరిద్దరూ కన్జ్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించారు. దీంతో తాజా తీర్పు వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment