Compensate
-
తెలంగాణలో కోవిడ్ మృతులెందరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం.. మంగళవారం (18న) రాత్రి వరకు కరోనా వైరస్ సోకి చనిపోయినవారు 4,062 మంది మాత్రమే. కానీ సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12 వేల మందికి పైగా కరోనా బాధిత కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించింది. ఇంకా పెద్దసంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పొంతనలేని లెక్కలు చర్చనీయాంశమయ్యాయి కేంద్ర సాయం కోసం..: కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించా లని గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాటిని జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీల ద్వారా పరిశీలించి అర్హమైన దరఖాస్తులను ఎంపికచేసి, పరిహారమిస్తున్నారు. పరిహారం కోసం ఇప్పటివరకు 28,969 దరఖాస్తులు రాగా.. అందులో 15,270 ఆమోదం పొందాయని, 12,148 మం దికి పరిహారం అందించామని ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్లలో వెల్లడిస్తున్న కరోనా మృతుల లెక్కల కంటే.. దరఖాస్తుల సంఖ్య ఏడెనిమిది రెట్లు ఎక్కువున్నాయి. కరోనా మృతుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించిన క్రమంలోనే ఎక్కువ దరఖాస్తుల ను ఆమోదిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
విమానం రద్దు.. ఎయిర్‌లైన్స్‌కు జరిమానా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడం, మానసిక వేదనకు, ఇబ్బందులకు గురి చేయటం వంటి కారణాలతో... ఎమిరేట్స్ విమానాయాన సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కారాల ఫోరం రూ.2 లక్షల జరిమానా విధించింది. రద్దు చేసిన విమాన టికెట్ చార్జీలు, వడ్డీతో సహా తిరిగి కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన వినయ్ కుమార్ సిన్హా (57), కృష్ణ సిన్హా (55) దంపతులు టికెట్లు బుక్ చేసి... 2017 జులై 12న డెట్రాయిట్‌లోని బంధు వులను కలిసేందుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. బోస్టన్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లినా... బోస్టన్ నుంచి డెట్రాయిట్కు వెళ్లాల్సిన విమానం ఆకస్మికంగా రద్దయింది. నిర్ధారిత సమయంలో డెట్రాయిట్కు చేరుకోవటంలో విఫలమైనందుకు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని రద్దు చేసినందుకు వీరిద్దరూ కన్జ్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించారు. దీంతో తాజా తీర్పు వెలువడింది. -
లెక్చరర్ పోస్టుల భర్తీ కష్టమే!
⇒ కాంట్రాక్టు వ్యవహారం తేలే వరకూ అంతే ⇒ పదుల సంఖ్యలోనే ⇒ డెరైక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ⇒ రేషనలైజేషన్ తరువాతే ⇒ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం తేలేవరకు లెక్చరర్ పోస్టులు, హేతుబద్ధీకరణ పూర్తయ్యే వరకు ఉపాధ్యాయపోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావడం కష్టమే. వచ్చేనెల నుంచి నోటిఫికేషన్లు జారీచేసి, భర్తీ చేయాలనుకుంటున్న పోస్టుల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్), పాలిటెక్నిక్ లెక్చరర్, విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టులు ఉండే అవకాశం లేదు. గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల విద్యాలయాల పరిధిలోని పాఠశాలల్లో మాత్రం దాదాపు 2 వేల వరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. హేతుబద్ధీకరణతో లంకె విద్యాశాఖ పరిధిలో 17 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గతంలోనే విదాశాఖ లెక్కలు వేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు.. విద్యార్థులు ఉన్నచోట టీచర్లు లేరు. ఈ నేపథ్యంలో టీచర్ల హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది. అది పూర్తయితేనే ఇంకా ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు అవసరం.. ఎన్నింటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలన్న స్పష్టత రానుంది. అప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ కష్టమేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖాళీలేవీ..? జూనియర్ కాలేజీల్లో 3,755 జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3,164 పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తుండగా, 591 ఖాళీలు ఉన్నాయి. 200 మంది పార్టటైం లెక్చరర్లు పనిచేస్తున్నారు. దీంతో 391 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నట్లు లెక్క. నిబంధనల ప్రకారం మొత్తం ఖాళీల్లో 10 శాతం పోస్టులను పదోన్నతులపైనే భర్తీ చేయాలి. అంటే మొత్తం ఖాళీల్లో 10 శాతం పోస్టులైన 375 ఖాళీలను డెరైక్టు రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి వీల్లేదు. మరోవైపు పోస్టులే మంజూరుకాని కాలేజీల్లో 748 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అంటే ఇందులో మిగిలేవి పెద్దగా ఉండవు. డిగ్రీ, పాలిటెక్నిక్ కాలే జీల్లో.. డిగ్రీ కాలేజీల్లో 450 వరకు డీఎల్ పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 900 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. అందులో సగం మంది పోస్టులు మంజూరై ఖాళీగా ఉన్న వాటిల్లో పనిచేస్తుండగా మరో సగం మంది పోస్టులు మంజూరు కాని కాలేజీల్లో పనిచేస్తున్నారు. ఇక పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీలు 350 పోస్టులు ఉంటే కాం ట్రాక్టు లెక్చరర్లు 450 మంది ఉన్నారు. అంటే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న లెక్చరర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో డీఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం అసాధ్యమన్న వాదన నెలకొంది. -
'కరువు రెతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం'
అనంతపురం: కరువు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఒక్క అనంతపురం జిల్లాకే రూ.1400 కోట్లు కావాలని కలెక్టర్ కోరితే.. రాష్ట్రవ్యాప్తంగా రూ.1500 కోట్లు చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివేధిక ఇవ్వడం దుర్మార్గమన్నారు. అనంత కరువు సహాయచర్యలకు వెంటనే రూ. 2 వేలకోట్లు విడుదల చేయాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. -
ఎన్నాళ్లకిస్తారో పరిహారం!
పరిగి, న్యూస్‌లైన్ : కూరగాయలు సాగుచేసే రైతులను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం మాటలు వట్టివేనని తేలుతోంది. ఒక్కసారి పంట నష్టపోయిన రైతులు.. మళ్లీ సాగుకు సమాయత్తమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టపోతున్న కూరగాయల రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నష్టం వివరాలను రాసుకుని వెళ్తున్నారే తప్ప.. పైసా పరిహారం చెల్లించడం లేదు. వరితోపాటు ఇతర పంటల కు ఆరు నెలలు అటూఇటుగా పరిహారం అందజేస్తున్న అధికారులు కూరగాయల రైతుల విషయం లో వివక్ష చూపుతున్నారు. 2009లో పంటలు నష్టపోయిన రైతుల వివరాలను పంపామని, పరిహారం విడుదలైందని అధికారులు చెబుతున్నా అది ఇంతవరకు రైతులకు చేరలేదు. గత నాలుగేళ్లుగా అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా కూరగాయలు, పండ్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2010, 2011, 2012,13 సంవత్సరాల్లోనూ జిల్లాలో రైతులు భారీగా నష్టపోయారు. వీరంతా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. గత వేసవి సీజన్లో కురిసిన వడగళ్ల వానకు జిల్లాలో మూడు వేల పైచిలుకు ఎకరాల్లో కూరగాయల పంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కానీ పరిహారం ఊసు మాత్రం ఇంతవరకు లేదు. ఇదేనా ప్రోత్సాహం.. జిల్లాను కూరగాయల జోన్‌గా మారుస్తామని, కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని, నిల్వ కోసం శీతల గిడ్డంగులు నిర్మిస్తామని, మార్కెట్ సౌకర్యం కూడా కల్పిస్తామని అధికారులు నాలుగైదు ఏళ్లగా ఊదరగొడుతున్నారు. కానీ చేసింది మాత్రం ఏమీ లేదు. పరిహారం అందిస్తేచాలని, సౌకర్యాలు తర్వాత అని రైతులు అంటున్నారు. 2009లో నాలుగు వేల ఎకరాల్లో పంటలు నష్టపోగా వాటికి సంబంధించి జిల్లాకు రూ.నాలుగు కోట్ల పరిహారం మంజూరైనట్టు అధికారులు చెబుతున్నారని, అది ఇంతవరకు తమ ఖాతాల్లో పడలేదని రైతులు చెబుతున్నారు. 2010, 2011 సంవత్సరాల్లో మూడు వేల ఎకరాల చొప్పున, 2012,13లలో అదే స్థాయిలో రైతులు నష్టపోయారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పండ్ల తోటల నష్టం.. నివేదికలే లేవు జిల్లాలో పండ్ల తోటల నష్టం వివరాలను సేకరించడంలో అధికారులు విఫలమయ్యారు. తెగుళ్లు సోకి నష్టం వాటిల్లితే దానికి పరిహారం ఇవ్వడం వీలుకాదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 8 వేలకుపైగా ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తుండగా అందులో ఆరు వేల పైచిలుకు ఎకరాలు పరిగి నియోజకవర్గంలోనే ఉన్నాయి. రెండేళ్లుగా పండ్ల తోటలకు తెగుళ్లు సోకి సుమారు నాలుగు వేల ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయని, జిల్లా వ్యాప్తంగా రైతు లు కోట్లాది రూపాయలు నష్టపోయారని తెలుస్తోంది. -
పరిహారం.. పరిహాసం..
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో గత జూలై 16 నుంచి ఆగస్టు 27 వరకు ఏకధాటిగా భారీ వర్షాలు కురిశాయి. మూడు దఫాలుగా వర్షాలు కురియడంతో చెన్నూర్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌటాల, దహెగాం, బెజ్జూర్, బేల, జైనథ్ మండలాల్లో అపా ర నష్టం సంభవించింది. ప్రభుత్వం తూతూ మంత్రంగా సర్వే కూడా నిర్వహించింది. ఈ సర్వేలో 50 శాతం నష్టపోయిన రైతులను పరిగణలోకి తీసుకోవడంతో చాలామంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 5.76 లక్షల హెక్టార్లలో సాగవగా ఇందులో పత్తి 3.10 లక్షలు అత్యధికంగా, సోయా 1.19 లక్షలు, వరి 52 వేలు, కందులు 37 వేలు, జొన్న 16 వేల హెక్టార్లలో సాగయ్యాయి. భారీ వర్షాల కారణంగా 1.18 లక్షల మంది రైతులు 67,490 హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు అధికారులు నిర్ధారించారు. రూ.61.25 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బాధిత రైతులకు పరిహారంగా నిర్ధారించారు. 61,752 హెక్టార్లలో 1,11,014 మంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోయిన వారిలో ఉన్నారు. ఇందులో రూ.55.96 కోట్లు చిన్న, సన్నకారు రైతులకే రావాల్సి ఉంది. మహారాష్ట్రలో పరిహారం.. మనకు మొండిచేయి.. ఇదే జూలై నుంచి ఆగస్టు వరకు మహారాష్ట్రలో కూడా వర్షా లు కురిశాయి. అపార నష్టం సంభవించింది. అక్కడి రైతుల కు సకాలంలో పరిహారం అందింది. మన జిల్లా రైతులకు మాత్రం మొండిచేయి ఎదురవుతోంది. మూడు నెలల క్రితం మహారాష్ట్రలోని పెన్‌గంగా సరిహద్దు గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరత్‌పవార్ వచ్చారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో రైతు సంఘాల నాయకులు శరత్‌పవార్‌ను కలిసి నష్టపరి హారం గురించి విన్నవించారు. పంట నష్టపరిహారానికి సం బంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందలేదని, మహారాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందించడంతో తాను మహారాష్ట్రలోని పంటలను పరిశీలించేందుకు వచ్చానని కేంద్ర మంత్రి చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం తీరును తేటతెల్లం చేసింది. అధికారులు సర్వే చేసి పంపించినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సకాలంలో పం పించడంలో విఫలమైంది. దీంతో ఆరు నెలలైనా పరిహారం అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిండా మునిగిన రైతులు ప్రకృతి వైపరీత్యాలకు పంటలు కోల్పోయిన రైతులను గుర్తించి వారికి పరిహారం అందించడంలో అధికారులు ఇంకా పాఠాలు నేర్చుకోవడం లేదు. రైతులకు బాసటగా నిలవాల్సిన రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ పంటనష్టం అంచనాలో వైఫల్యం చెందారన్న విమర్శలున్నాయి. కొన్ని గ్రామాలను అసలే సందర్శించక పోవడంతో పలువురు రైతుల పేర్లు జాబితా కెక్కలేదు. ఆయా గ్రామాల్లో సర్వే చేసినా అనేక మంది పేర్లు నమోదు చేసుకోకుండానే ముగించారు. 50 శాతం కంటే ఎక్కువగా నష్టపోయిన రైతులకే పరిహారం ఇవ్వాలనే నిబంధనతో నష్టాన్ని లెక్కించారు. దీంతో అనేక మంది రైతులు నష్టపోయారు. కలుపు, విత్తనాలు, ఎరువుల ధరల పెరుగడంతో పెట్టుబడి పెరిగింది. ఈ లెక్కన సుమారుగా రూ. 300 కోట్లకు పైగా నష్టం జరిగితే ప్రభుత్వం నామమాత్రంగా రూ.61 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ నిర్ధారించారనే విమర్శలు ఉన్నాయి. వెంటనే పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. -
ఇన్పుట్ సబ్సిడీ కోసం బ్యాంకర్ల హడావిడి
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఇన్‌పుట్‌సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) పరిహారం కోసం రైతుల కన్నా బ్యాంకర్లు తొందర పడుతున్నారు. పరిహారం కోసం వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద రెండు మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం అయితే మరీ ఎక్కువగా హడావుడి చేశారు. వ్యవసాయశాఖ జేడీ ని కలిసేందుకు కార్యాలయం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూశారు. బ్యాంకర్లకు ఇంత తొందరెందుకని ఆరాతీస్తే... ఆర్థిక సంవత్సరం (2013-14) మూడో త్రైమాసికం మంగళవారంతో ముగియనుందని తెలిసింది. 2011, 2012 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో పరిహారంను బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వచ్చిన పరిహారాన్ని మంగళవారం సాయంత్రంలోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటే బ్యాంకుల లక్ష్యాలు సులభంగా చేరుకుంటారని తెలిపారు. మూడో త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించారని పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా ఉంటాయన్నారు. ట్రెజరీకి బిల్లులు సమర్పించాలంటే డ్రాయింగ్ ఆఫీసర్‌గా వ్యవసాయ శాఖ ఏఓ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) సంతకం చేయాల్సి ఉంటుంది. ఆయన గత శనివారం నుంచి సెలవులో ఉండటంతో వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. కీలకమైన ఈ అధికారికి సెల్‌ఫోన్ కూడా లేకపోవడంతో ఆయన్ను సంప్రదించలేకపోయారు. దీంతో ఇన్పుట్ సబ్సిడీ డబ్బుపై అధికారులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. -
ఇన్పుట్ సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు శుభవార్త. వర్షాలతో నష్టపోయిన కష్టజీవికి ఊరటనిచ్చేందుకు సర్కారు సన్నద్ధమైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ) మంజూరీకి పచ్చజెండా ఊపింది. ఇప్పటికే జిల్లాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన ప్రభుత్వం.. బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో వారం రోజుల్లో జిల్లాలకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా జిల్లాకు రూ. 24.45 కోట్లు విడుదల కానున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో పంట నష్టపోయిన 92,483 మంది రైతులకు ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. గత ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లా రైతాంగం కుదేలైంది. సెప్టెంబర్ నెలాఖరు నుంచి నవంబర్ వరకు వరుసగా వర్షాలు కురిశాయి. దీంతో పంటనష్టం అంచానాలకు ఉపక్రమించిన అధికారులు తుది నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు. ఇందులో అధికంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఇవేగాకుండా జొన్న, ఆముదం, సోయాచిక్కుడు పంటలు కూడా పాడయ్యాయి. ఈనేపథ్యంలో నివేదికలు రూపొందించిన వ్యవసాయ శాఖ అధికారులు నవంబర్ నెలాఖరులో ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రెండ్రోజుల క్రితం ఆమోదం తెలిపినట్లు సమాచారం. రెండు,మూడు రోజుల్లో నిధుల వివరాలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇదిలా ఉండగా.. ఉద్యాన పంటలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత రెండేళ్ల నుంచి కూడా నష్టపోయిన ఉద్యాన రైతులకు ఇప్పటివరకు కూడా పరిహారం జాడ లేకపోవడం గమనార్హం. -
వాడీవేడిగా
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లా అభివృద్ధిపై అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధిలేదని జిల్లా ఇన్చార్జి మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా సమీక్ష మండలి(డీఆర్సీ) సమావేశం వాడీవేడిగా జరిగింది.‘జిల్లాలో ఏం జరుగుతుందో తెలియడంలేదు. నిధులు ఎలా మంజూరు చేయించుకోవాలో తెలియదు. వచ్చిన వాటిని ఎలా ఖర్చు చేయాలో మీకు అర్థం కాదు’ అని మంత్రి ధ్వజమెత్తారు. సభ్యుల ప్రశ్నలతో సమావేశం ఉత్కంఠగా సాగింది. ఒక పూట భోజనం పెడితే సరిపోతుందా? గత నెలలో సంభవించిన వరదల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల గురించి అధికారులు పట్టించుకోలేదని వైఎస్సార్సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. సంకువానిగుంట గ్రామస్తులు ఆరురోజులపాటు నడుం లోతు నీళ్లల్లో ఉన్నారని.. వారంతా దళితులేనని తెలిపారు. వారి బాగోగులు పట్టించుకోకుండా ఒక్కరోజు భోజనం పెడితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు బాధితులకు ఎలాంటి పరిహారం అందలేదన్నారు. తామే పడవలో వెళ్లి బాధితులకు ఆహారం అందించాల్సి వచ్చిందని తెలిపారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలి.. బాధితులను ఆదుకోవాలని తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోలేదని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రాంత సమస్య పరిష్కరించాలంటే వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. దీనిపై ఒంగోలు ఆర్డీఓ మాట్లాడుతూ రోడ్లు కోతకు గురికావడంతో ఆ ప్రాంతానికి వెళ్లలేకపోయామని.. ఇప్పుడు పంపిణీ చేయిస్తామనడంతో సభ్యులతో పాటు మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయంత్రం లోగా ఆ గ్రామంలో బియ్యం, కిరోసిన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వమే శనగలు కొనుగోలు చేయాలి జిల్లాలోని కోల్డుస్టోరేజీల్లో పేరుకుపోయిన శనగలను ప్రభుత్వమే వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ప్రతిపాదించారు. శనగ రైతులపై బ్యాంకర్ల ఒత్తిడి తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ప్రాంతంలో 44 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని చీరాల ఎమ్మెల్యే ఆమంచి తెలిపారు. నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ కేంద్రం భవనాన్ని కూల్చివేసి అందులోని సామగ్రిని అమ్ముకున్నారని ఆరోపించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఐసీడీఎస్ సమస్యలను ప్రస్తావించారు. విద్యాశాఖలో పదోన్నతులు కల్పించాలని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసరెడ్డి కోరారు. జిల్లాలో 18 హెచ్ఎం పోస్టులు.. 150 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. హాస్టళ్ల నిర్మాణాలు ఎక్కడ? సింగరాయకొండ, తిమ్మసముద్రంలో చేపట్టిన బీసీ హాస్టళ్ల నిర్మాణాలు గత నాలుగైదు సంవత్సరాలుగా అర్ధాంతరంగా నిలిచిపోయాయని కొండపి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు జీవీ శేషు, బీఎన్ విజయ్‌కుమార్‌లు సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ విషయం తమకు సంబంధంలేదంటూ బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రకటించడంతో.. మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ కూడా ఎవ రో తెలియకుండానే పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. విచారణ చేపట్టి.. కారకులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టులపై రచ్చ.. పాలేటిపల్లి, మల్లవరం రిజర్వాయర్లు, కొరిశపాడు చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతిపై అధికారుల వివరణ ఎవరినీ సంతృప్తి పరచలేదు. వెలిగొండ టన్నెల్ నిర్మాణం కేవలం 46 శాతం పూర్తయితే.. నిర్మాణం మొత్తం ఎప్పటికి పూర్తవుతుందని ఎస్ఈని ప్రశ్నించారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని తమ భూములు స్వాధీనం చేసుకొని కాలువలు తవ్వుతున్నారని.. కానీ ఇప్పటికీ నష్టపరిహారం పంపిణీ చేయలేదన్నారు. ప్రాజెక్టు వ్యవహారాలపై ఇంజినీరింగ్, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, జాతీయరహదారుల శాఖల తో మరోసారి సమావేశం కావాలని తీర్మానించా రు. రిమ్స్ నిర్మాణాల్లో జాప్యం జరిగితే కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కోరారు. బ్యాంకర్లు సహకరించడంలేదు.. బ్యాంకర్ల వల్ల రైతుల నష్టపరిహారం పంపిణీ జాప్యమవుతోందని వ్యవసాయశాఖ జేడీ దొరసాని తెలిపారు. నీలం తుపాను పరిహారంగా జిల్లాకు రూ 5.12 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికి రూ 2.38 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎస్బీఐ, ఎస్బీహెచ్ అధికారులు రైతుల అకౌంట్లలో నగదు జమ చేయడానికి సహకరించడంలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీడ్‌బ్యాంకు మేనేజర్ వివరణ ఇస్తూ సోమవారమే అకౌంట్లకు జమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అన్నదాతతోపరిహాసం!
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: రైతన్న సంక్షేమమే మా ధ్యేయం, రైతు కష్ట కాలంలో ఆదుకోవడానికి కృషి చేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు... క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులకు పొంతనలేకుండా పోతుండడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. యథారాజా....తథా ప్రజా అన్నట్టు ప్రభుత్వానికి తామేమీ తీసిపోమన్న విధంగా వ్యవసాయధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. రైతుకు ఎల్లవేళలా అండగా ఉండి సహాయ సహకారాలు అందించాల్సిన వారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. సీట్లలో కూర్చొని నష్టాన్ని అంచనా వేస్తూ నివేదికలు పంపిస్తున్నారు. దీనికి తోడు రాజకీయ ఒత్తిళ్లు కూడా నివేదికల రూపుమారుస్తున్నాయి. దీంతో నష్టపోయిన రైతుల కంటే అనర్హులే ఎక్కువగా పరిహారాన్ని పొందుతున్నారు. పంట నష్టం జరిగిన ఏడాదికి కాని పరిహారం అందని పరిస్థితి జిల్లాలో నెలకొంది. గత ఏడాది నవంబర్ నెలలో జిల్లాను అతలాకుతలం చేసిన ‘నీలం’ తుఫాన్ నష్టపరిహారం కోసం రైతులు ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారంటే పరిస్థితిని అర్ధంచేసుకోవచ్చు. రైతన్న ఏటా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నాడు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటకు నష్టం వాటిల్లడంతో ఏటా అప్పులు పెరుగుతున్నాయే తప్ప తీరడం లేదు. దీంతో అందరికి అన్నం పెట్టే రైతన్న చేయిచాచే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఖర్చు కొండంత...పరిహారం గోరంత సాగు ఖర్చు పెరగడంతో రైతన్న అవస్థలు పడుతున్నాడు. 2004లో ఎకరం విస్తీర్ణంలో వరి సాగుకు రూ.12వేలు ఖర్చుకాగా, 2006లో రూ. 15 వేలు, 2009లో రూ. 20 వేలు, 2012లో రూ. 24 వేలు, 2013లో రూ. 26 వేలకు ఖర్చుపెరిగింది. ఏటా సాగు ఖర్చు పెరిగినప్పటికీ అందుకు తగ్గట్టుగా పరిహారం మాత్రం పెరగడం లేదు. 2004లో హెక్టారుకు రూ.2500, 2004లో రూ. 4 వేలు, 2009లో రూ. 12 వేలు, 2012లో రూ. 10 వేలు చొప్పన పరిహారం ఇస్తున్నారు. దీంతో ఆ కంటితుడుపు పరిహారం ఏమాత్రం చాలక, పెట్టుబడి లేక అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏమూలకూ చాలదు.. ప్రభుత్వం ఇస్తున్న నష్ట పరిహారం రైతులకు ఏమూలన సరిపోవడం లేదు. పత్తి పంట సాగుకు రైతులకు ఎకరాకు రూ. 30 వేలు వరకు ఖర్చువుతుంది. సాగు చేసిన మూడు నెలల తర్వాత దిగుబడులు ప్రారంభమవుతాయి. పంట నష్టపోతే హెక్టారుకు కేవలం రూ.10 వేలు మాత్రమే పరిహారంగా చెల్లిస్తున్నారు. ఏమూలన సరిపోవడం లేదు. అలాగే వరి, చెరకు, అరటి రైతులకు కూడా తగిన పరిహారం అందడంలేదు. 50 శాతం నష్టం వాటిల్లితేనే.... నష్టం అంచనా వేయడంలో ప్రభుత్వం మెలిక పెట్టడంతో కొంత మంది రైతులకు మాత్రమే పరిహారం అందుతోంది. 50 శాతం నష్టం వాటిల్లితేనే పరిహారం చెల్లిస్తున్నారు. 50 శాతం కంటే తక్కువ నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదు. దీని వల్ల అధికశాతం రైతులకు పరిహారం ముట్టడంలేదు. దీనికి తోడు పంటనష్టం అంచనాలలో పారద్శకత లోపిస్తోంది. రాజకీయ పైరవీలకు తలొగ్గుతున్న అధికారులు...పలుకుబడి ఉన్న వారి పంట నష్టాన్ని పెంచి, సాధారణ రైతులకు తక్కువగా నమోదు చేస్తున్నారు. నష్టం నమోదుకు వెళ్లినప్పుడు అధికారులు రైతులకు సమాచారం తెలియజేయడం లేదు. కొంతమంది అధికారులు తూతూమంత్రంగా లెక్కకడుతుండడంతో అర్హులైన, నిజమైన బాధిత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా సందర్భాలలో అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లకుండా కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు ఇచ్చిన జాబితాను నివేదికలో చేర్చుతున్నారన్న ఆరోపణలు అధికంగా ఉన్నాయి. అమలుకాని భూపేంద్రసింగ్ హుడా కమిటీ సిఫార్సులు మూడేళ్ల క్రితం భూపేంద్ర సింగ్ హుడా కమిటీ హెక్టారుకు రూ. 25 వేలు పరిహారాన్ని రైతులకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే ఇది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. రెండు రోజుల క్రితం జిల్లా రైతులకు భరోసా ఇచ్చేందుకు జిల్లాకు వచ్చిన వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఈ సిఫారసు అమలుచేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే రైతులకు కొంతన్యాయం జరుగుతుందని చెప్పారు. నష్టం జరిగిన ఏడాదికి ... పంట నష్టం జరిగిన ఏడాదికి గాని పరిహారం అందని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో నష్టం వాటిల్లితే వచ్చే ఏడాది ఖరీఫ్ ముగిసిన తరువాత కూడా పరిహారం అందడం లేదు. నష్టం జరగిన వెంటనే పరిహారం అందిస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.