
'కరువు రెతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం'
అనంతపురం: కరువు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఒక్క అనంతపురం జిల్లాకే రూ.1400 కోట్లు కావాలని కలెక్టర్ కోరితే.. రాష్ట్రవ్యాప్తంగా రూ.1500 కోట్లు చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివేధిక ఇవ్వడం దుర్మార్గమన్నారు.
అనంత కరువు సహాయచర్యలకు వెంటనే రూ. 2 వేలకోట్లు విడుదల చేయాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.