ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన
చెన్నై : చెన్నై నుంచి హైదరాబాద్కు శనివారం ఉదయం బయలుదేరవలసిన ఎయిర్ కోస్టా విమాన సర్వీసు రద్దు అయింది. సదురు విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణికులు ఈ రోజు తెల్లవారుజామునే చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. విమాన సర్వీసు రద్దు విషయం తెలియని ప్రయాణికులు ఎయిర్ పోర్ట్లో పడిగాపులు పడతున్నారు.
విమానం ఎందుకు రద్దు అయిందని ఎయిర్ పోర్ట్ అధికారులను ప్రయాణికులు ప్రశ్నించారు. ఎయిర్ కోస్టా అధికారుల నుంచి మాత్రం ఎటువంటి సమాధానాలు రాలేదు. దీంతో ఎయిర్ కోస్టా యాజమాన్యం నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్ పోర్ట్ లో ఆందోళనకు దిగారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇదే పరిస్థితి
హైదరాబాద్ : బెంగళూరు నగరానికి ఎయిర్ ఇండియా విమానం శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో నిలిచిపోయింది. ఆ విమానంలో బెంగళూరు వెళ్లేందుకు అప్పటికే ప్రయాణికులు ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. బెంగళూరు వెళ్లవలసిన విమాన సర్వీస్ లేదని తెలుసుకున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా వ్యవహరించడం దారుణమని ఎయిర్ ఇండియా అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ప్రయాణికులు ఆందోళనకు దిగారు.