మరో రెండు పట్టణాలకు ఎయిర్‌కోస్టా సర్వీసులు | Air Costa to Start Flights to Madurai from Hyderabad, Chennai | Sakshi
Sakshi News home page

మరో రెండు పట్టణాలకు ఎయిర్‌కోస్టా సర్వీసులు

Published Fri, Jun 20 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

మరో రెండు పట్టణాలకు ఎయిర్‌కోస్టా సర్వీసులు

మరో రెండు పట్టణాలకు ఎయిర్‌కోస్టా సర్వీసులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా తన సర్వీసులను మరో రెండు నగరాలకు విస్తరించింది. తమిళనాడులోని మధురై, చెన్నైలకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌కోస్టా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జూలై 3 నుంచి హైదరాబాద్, చెన్నైల నుంచి మధురైకి విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. అలాగే జూలై 4 నుంచి విజయవాడ నుంచి చెన్నైకి వయా హైదరాబాద్ మీదుగా కొత్త సర్వీసును ప్రారంభిస్తోంది. కొత్త సర్వీసులతో కలిపి తొమ్మిది పట్టణాల నుంచి  34 రోజువారీ సర్వీసులను నడుపుతున్నట్లు ఎయిర్‌కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement