సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా మూడోరోజూ ఐటీ దాడులు కొనసాగాయి. అయితే శుక్రవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మర్రి జనార్ధన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డితో పాటు లైఫ్‌స్టైల్ గ్రూప్ కంపెనీల డైరెక్టర్ గజ్జల మధుసూదన్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం నాటి సోదాల్లో మొత్తం 70 బృందాలు పాల్గొన్నట్టు సమాచారం.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మధుసూదన్‌రెడ్డి చేసిన భూ లావాదేవీలు, ఇందుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారా లపై ఐటీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎల్బీనగర్‌లో 23 ఎకరాల ప్రాజెక్ట్ విషయంలో జరిగిన భారీ నగదు లావాదేవీపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మధుసూధన్ రెడ్డితో పాటు అతడి భార్య, కుమారుడిని సైతం ప్రశ్నించినట్టు తెలిసింది. లైఫ్‌స్టైల్ గ్రూప్ కంపెనీల్లో మధుసూదన్‌రెడ్డి కుమారుడు సుదేశ్‌రెడ్డి ౖడైరెక్టర్‌గా ఉన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వీరంతా సిండికేట్‌గా రియల్ ఎస్టేట్ వ్యా పారాలు చేస్తున్నట్టు లభించిన ఆధారాల మేరకు సోదాలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇలావుండ గా వైష్ణవి గ్రూప్ స్థిరాస్థి సంస్థ, హోటల్ ఎట్ హోం, వాటి అనుబంధ సంస్థల్లోనూ ఐటీ సోదా లు జరిగాయి. మరోవైపు ఐటీ అధికారులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి.
కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటివద్ద కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేని చూపించాలని అభిమానులు, కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఆయన బాల్కనీలోకి వచ్చి కా ర్యకర్తలకు అభివాదం చేశారు. ఇంటి వద్ద ఎలాంటి ఆందోళనలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment