
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆదాయ పన్ను శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో భారీగా సొత్తు బయటపడింది. రూ.15.3 కోట్ల నగదుతోపాటు రూ.7.08 కోట్ల విలువైన 10.14 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు ఐటీ సీఈవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
దీంతో, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 29 నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.365 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లయిందని పేర్కొంది.