సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అవి ఆదాయపన్ను శాఖ (ఐటీ) రైడ్స్ కాదు.. రాజకీయ దాడులు. ఎన్నికల్లో ఓటమికి భయపడే అధికార బీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీతో కలిసి మా ఇళ్లపై దాడులు చేయించారు. 48 గంటలు నిర్బంధించి, సోదాలు జరిపించారు.’అని మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎ మ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ‘‘అయినా అధికారులు మా వద్ద ఏం పట్టుకోలేకపోయారు.
నా వ్యాపారాలన్నీ పారదర్శకమే. బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులకు కనీస డిపాజిట్ కూడా దక్కనివ్వం’’అని తేల్చి చెప్పారు. రెండు రో జుల ఐటీ దాడుల అనంతరం శనివారం ఆయన ‘సాక్షి ప్రతి నిధి’తో మాట్లాడారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నో భూ దందాలు, అక్రమాలకు పాల్పడినా ఐటీ దాడులు చేయలేద నీ, తాను నిజాయితీ గల అభ్యర్థి కావడం వల్లే ఐటీ దాడులు చేశారని పేర్కొన్నారు.
ఓ విధంగా దాడుల వల్ల నాకు మంచే జరిగింది
‘‘ఈ దాడులు నాకు మంచే చేశాయి. పైసా ఖర్చు లేకుండా తక్కువ కాలంలో నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. రెండు రోజుల పాటు ఇంటింటా తిరిగినా రాని ప్రచారం కేవలం ఈ దాడులతో వచ్చింది. ఇందుకు ఐటీశాఖ అధికారులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా.’’అని లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. ’’మంత్రి సబిత కాంగ్రెస్‌లో గెలిచి, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎన్నికల్లో ఆమెను కచ్చితంగా ఓడించి తీరుతా... సేవకుడిగా ప్రజల్లో నాకు మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపే నన్ను ఎన్నికల్లో గెలిపిస్తుంది.’’అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment