
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే కోహినూర్ ఇన్‌ఫ్రా కంపెనీలపై ఇన్‌కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు.
హైదరాబాద్‌లోని మాదన్నపేట, శాస్త్రీపురం, బంజారాహిల్స్, శంషాబాద్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో కోహినూర్ ఇన్‌ఫ్రా కంపెనీ అవకతవకలకు పాల్పడినట్టు ఐటీ అధికారులు ఆరోపించారు. ఏకకాలంలో 30 బృందాలతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే సుమారు 100 వాహనాల్లో ఐటీ అధికారులు సోదాలకు తరలి వెళ్లారు.
ఇది కూడా చదవండి: దుబాయ్ కేంద్రంగా చైనీయుల దందా
Comments
Please login to add a commentAdd a comment