
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల సెర్చ్ వారెంట్‌తో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని వరమహాలక్ష్మీలో ఐటీ అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది.
ఇక, సోదాల సందర్బంగా సంస్థ ఇప్పటి వరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్బంగా సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను సైతం అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో సీఆర్‌పీఎఫ్ పోలీసులు.. కస్టమర్లను లోపలికి అనుమతించడం లేదు. ఫిలిం నగర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కళామందిర్ గ్రూప్స్, వరమహాలక్ష్మీ, కేఎల్‌ఎం, కాంచీపురం అనుబంధ వ్యాపార సంస్థల లెక్కలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు
Comments
Please login to add a commentAdd a comment