తెలుగు చలనచిత్ర నిర్మాతల ఇళ్లు, కార్యాలయల్లో మూడు రోజులుగా ఐటీ సోదాలు (Income Tax Raids) జరుగుతున్నాయి. పుష్ప 2, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతల ఇళ్లలో ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్‌రాజు ఇంట్లో, ఆఫీసులో.. సుకుమార్ ఇంట్లో.. అలాగే మైత్రీమూవీ మేకర్స్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.
పండక్కొచ్చారు
తాజాగా ఈ ఐటీ సోదాలపై విక్టరీ వెంకటేశ్ (Daggubati Venkatesh) స్పందించారు. మొదట ఈ ప్రశ్న ఎదురవగానే.. అవునా? నిజమా? అంటూ ఆశ్చర్యపోతున్నట్లు నటించారు. ఆ తర్వాత అన్నీ బానే జరిగిపోతాయన్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నామని మేము టైటిల్ పెట్టాం కదా.. వాళ్లు కూడా మేమూ సంక్రాంతికి వస్తున్నామని వచ్చారని చమత్కరించారు.
ఇది సాధారణమే
దిల్ రాజుపైనే కాదు, చాలామంది ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నారు. రెండేళ్లకోసారి ఐడీ రైడ్స్ జరగడం సర్వసాధారణమేనని పేర్కొన్నారు. తన ఇంట్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగలేవన్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటివరకు రూ.230 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment