
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ పన్ను విభాగం సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్)తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో 2019లో జరిగిన లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా బుధవారం తెలిపారు.
సోదా, నిఘా చర్యలను ఎన్నికల కమిషన్ సమన్వయంతో చేపడుతున్నామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలున్న రాజస్తాన్‌లో పట్టుబడిన అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి తదితరాల మొత్తం విలువ మూడింతలయిందన్నారు. 2021లో సీజ్ చేసిన మొత్తం సొత్తు విలువ రూ.322 కోట్లు కాగా, 2022లో అది రూ.322 కోట్లకు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1,021 కోట్లకు పెరిగిందని గుప్తా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment