CBDT Chairman
-
కొత్త పన్ను విధానంలోనే 66% రిటర్నులు
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయగా, 66 శాతం మంది నూతన విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది నూతన విధానాన్నే ఎంపిక చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పన్నుల ప్రక్రియను సులభతరం చేయడంపై ప్రభుత్వం, సీబీడీటీ దృష్టి సారించినట్టు చెప్పారు. ఎంత సులభంగా పన్ను విధానం మారితే, అంత ఎక్కువ మంది పన్ను నిబంధనలు పాటించేందుకు ముందుకు వస్తార న్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు నిదర్శనం గతేడాది ఇదే సమయానికి దాఖలైన రిటర్నులతో పోలిస్తే, ఈ ఏడాది మరింత పెరిగినట్టు చెప్పారు. గతేడాది జూలై 25 నాటికి 4 కోట్ల రిటర్నులు దాఖ లు కాగా, ఈ ఏడాది జూలై 22కే దీన్ని అధిగమించినట్టు తెలిపారు. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.5 కోట్ల రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. పాత పన్ను విధానం రద్దు ఎప్పుడు? మెజారిటీ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంపిక చేసుకున్నందున పాత విధానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు రవి అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఇది మార్పు దశలో ఉంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఏ విధానానికి మెరుగైన ఆమోదం లభిస్తుందో చూసిన తర్వాత దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’’అని చెప్పారు. ఇండెక్సేషన్ తొలగింపు రియలీ్టకి మంచిదేరియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించడమనేది మంచిదేనని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగ్రవాల్ తెలిపారు. కేవలం లెక్కల కోణంలో చూడకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గత పదేళ్లుగా పెరిగిన రియల్టీ ధరలు, ఇండెక్సేషన్ సంబంధ ప్రయోజనాలను పరిశీలిస్తే సరళతరమైన కొత్త విధానంలో పన్నులపరమైన బాదరబందీ తక్కువగా ఉంటుందని అగ్రవాల్ చెప్పారు. తాజా బడ్జెట్లో రియల్టీ రంగంలో ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగిస్తూ దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నులను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రాపర్టీ కొనుగోలు విలువను ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచుకుంటూ, అంతిమంగా విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఇండెక్సేషన్ ఉపయోగపడుతోంది. కొత్త మార్పులతో గృహాలను విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై పన్ను భారం పెరిగిపోతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రవి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతరాయాల్లేకుండా చర్యలుఇన్ఫోసిస్, ఐబీఎం, హిటాచీ సంస్థలతో కలసి ఐటీ పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రవి అగర్వాల్ తెలిపారు. వెబ్సైట్ చక్కగా పనిచేస్తుందన్న భరోసా ఇచ్చారు. బడ్జెట్ రోజునే (23న) 22 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపారు. పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రావచ్చని రవి అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. -
నూతన విధానమే ఎంపిక

ఎన్నికల వేళ భారీగా సొత్తు సీజ్: సీబీడీటీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ పన్ను విభాగం సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్)తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో 2019లో జరిగిన లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా బుధవారం తెలిపారు. సోదా, నిఘా చర్యలను ఎన్నికల కమిషన్ సమన్వయంతో చేపడుతున్నామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలున్న రాజస్తాన్‌లో పట్టుబడిన అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి తదితరాల మొత్తం విలువ మూడింతలయిందన్నారు. 2021లో సీజ్ చేసిన మొత్తం సొత్తు విలువ రూ.322 కోట్లు కాగా, 2022లో అది రూ.322 కోట్లకు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1,021 కోట్లకు పెరిగిందని గుప్తా పేర్కొన్నారు. -
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఛైర్మన్‌గా నితిన్ గుప్తా నియామకం!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఛైర్మన్‌గా ఐఆర్ఎస్ నితిన్ గుప్తా నియమితులయ్యారు. కేంద్ర యూనియన్ కేబినెట్ నితిన్ గుప్తాను నియమిస్తూ ఖరారు చేసింది. The Government of India has appointed IRS Nitin Gupta as chairman of the Central Board of Direct Taxes (CBDT). pic.twitter.com/p073ixjXHi — ANI (@ANI) June 27, 2022 కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయించిన తేదీ నుంచి గుప్తా సీబీడీటీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర రెవెన్యూ శాఖ నియామకాల కమిటీ సెక్రటేరియట్ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్లో తెలిపింది. కాగా, ప్రస్తుతం గుప్తా సీబీడీటీ విభాగంలో ఇన్వెస్టిగేషన్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
సంపన్నులపై ‘కరోనా’ పన్ను!
కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా ఆదాయాన్ని పెంచుకు నేందుకు అధిక సంపద కలిగిన వారిపై 40% పన్ను, విదేశీ కంపెనీలపై అధిక లెవీ విధించాలంటూ కేంద్రానికి కొందరు సీనియర్ అధికారులు సూచించడం సంచలనంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ‘ఫోర్స్’ పేరుతో ఒక నివేదికను సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీకి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సమర్పించింది. రూ.కోటికి పైగా ఆదాయం కలిగిన వారిపై ప్రస్తుతం 30% పన్ను రేటు అమల్లో ఉండగా దీనిని 40% చేయాలని కోరింది. రూ.5 కోట్లు పైబడి ఆదాయాన్ని ఆర్జించే వారిపై తిరిగి సంపద పన్ను ప్రవేశపెట్టాలని సూచించింది. 3–6 నెలల కాలానికి ఈ సూచనలు చేసింది. అయితే ఈ నివేదికను ప్రభుత్వ అధికారిక అభిప్రాయంగా పరిగణించరాదని సీబీడీటీ స్పష్టం చేసింది. అధికారికంగా ఎవరూ చెప్పకుండానే దీన్ని తమంత తాముగా రూపొందించిన 50 మంది ఐఆర్ఎస్ అధికారులపై విచారణ చేపడుతున్నట్లు పేర్కొంది. -
ఇలా చేయకపోతే.. మీ పాన్ రద్దు
న్యూఢిల్లీ : మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తారా? పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేశారా. చేయకపోతే త్వరపడండి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలులో పాన్‌కార్డు, ఆధార్ లింకుచేయకపోతే పాన్‌కార్డు రద్దయ్యే ప్రమాదం ఉంది. ఇన్‌కం టాక్స్ రిటర్నలతో అను సంధానం కాని ప్యాన్లను రద్దుచేస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఛైర్మన్ సుశీల్ చంద్ర తాజాగా వెల్లడించారు. ఆధార్, పాన్‌కార్డు నంబర్ల లింకింగ్‌కు గడువు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో సిబిడిటి ఛైర్మన్ ఈ హెచ్చరిక చేశారు. బయోమెట్రిక్ ఐడి ఆధార్‌ను పాన్‌కార్డుతో తక్షణమే లింక్‌చేయాలని సిబిడిటి ఛైర్మన్ తెలిపారు. అసోచామ్ సదస్సులో పాల్గొన్న సుశీల్‌చంద్ర పాన్ ఆధార్ లింకింగ్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఐటిశాఖ ఇప్పటివరకూ 42 కోట్ల పాన్ నెంబర్లను జారీచేయగా, వీటిలో 23 కోట్ల పాన్‌కార్డులు మాత్రమే లింక్ అయ్యాయని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చే మార్చి 31వ తేదీలోపు లింక్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆధార్‌ను పాన్‌కార్డుతో లింక్చేస్తే పాన్‌కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇలా చేయడం వల్ల సంక్షేమపథకాలు అర్హులైన వ్యక్తులకు అందుతున్నాయా లేదా అన్నది కూడా తెలుసుకునే వీలుంటుందన్నారు. కాగా సుప్రీంకోర్టు ఆదాయపు పన్ను రిటర్నుల్లో విధిగా ఆధార్‌ను పాన్‌తో లింక్‌చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకు ఖాతాలు, మొబైల్ సేవలకు పాన్ లింకింగ్ తప్పనిసరి కాదు. -
‘ఆ 3 లక్షల కోట్లపై ఆరా తీయండి’
సాక్షి, ముంబై: నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు చేరిన సొమ్ములో సరైన వివరణ లేని రూ.3 లక్షల కోట్ల విలువైన డిపాజిట్లను టార్గెట్ చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఆదాయ పన్ను అధికారులకు సూచించింది. ఆ సొమ్ముపై పన్ను వసూలు చేయాలని సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్ర ఐటీ సీనియర్ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోరారు. నోట్ల రద్దు అనంతరం భారీగా డబ్బులు డిపాజిట్ చేసిన వారు దానిపై సరైన వివరణ ఇవ్వకుంటే ఆ మొత్తంపై 60 శాతం వరకూ పన్ను, జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రక్రియలో ప్రతి కేసును కూలంకషంగా పరిశీలించడం ఆదాయ పన్ను శాఖకు తలకు మించిన భారంతో పాటు ఎంతో సమయం వెచ్చించాల్సి ఉంది. అయితే ఈ ఖాతాలపై సత్వరమే నిగ్గుతేల్చాలని, పన్ను వసూలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. నిస్తేజంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడంతో పాటు నోట్ల రద్దు విఫలమైందన్న విపక్షాల నోరు మూయించేందుకూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ మొత్తాలకు సంబంధించి ఇప్పటికే ఆదాయ పన్ను అధికారులు అనుమానితులకు నోటీసులు జారీ చేశారు. వీటికి ఆయా ఖాతాదారుల నుంచి వివరణలు అందాకే ఐటీ శాఖ తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రక్రియపై పన్ను అధికారులు అత్యంత వేగంగా చర్యలు చేపడితేనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడి మెరుగవుతుందని, సిబ్బంది కొరత ఈ క్రమంలో ఆదాయ పన్ను శాఖకు అవరోధంగా ముందుకొస్తోందని ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. -
4.17 లక్షల కోట్లు.. అనుమానాస్పదం
నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లపై సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర • 18 లక్షల మంది అకౌంట్ల పరిశీలన... న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తరువాత దాదాపు 18 లక్షల మంది సుమారు రూ.4.17 లక్షల కోట్ల అనుమానాస్పద డిపాజిట్లు చేసినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర గురువారం నాడు తెలిపారు. ‘‘ఆదాయపు పన్ను శాఖ వద్ద ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం... సంబంధిత వ్యక్తుల్లో 13 లక్షల మందికి నేడు ఈమెయిల్, ఎస్ఎంఎస్ ప్రశ్నలను పంపడం జరిగింది. మిగిలిన 5 లక్షల మందికి శుక్రవారం ప్రశ్నలను పంపుతాం’’ అని బడ్జెట్ సెమినార్ అనంతర విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. పైన పేర్కొన్న 18 లక్షల మంది డేటానే కాకుండా, మరో 10 లక్షల మంది డేటానూ ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. సీబీడీటీ స్వచ్ఛ ధన్ అభియాన్ (ఆపరేషన్ క్లీన్ మనీ) కింద వీరందరి డేటాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. పన్నుల ఎగవేతదారులను గుర్తించి, వారిపై చర్యలకు సీబీడీటీ తగిన చర్యలను అన్నింటినీ తీసుకుంటుందని అన్నారు. అనుమానాస్పద డిపాజిట్లకు సంబంధించి సీబీడీటీ నుంచి ఈ–మెయిల్స్ అందుకున్నవారు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఈ వారం మొదట్లోనే చైర్మన్ చంద్ర స్పష్టం చేశారు. వీరందరూ తమ ఆదాయాలకు, డిపాజిట్లకు సంబంధించి లెక్కలు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. మార్చి నాటికి రిటర్న్స్ సమర్పించాల్సిందే! పన్ను అసెస్మెంట్లను త్వరితం చేయాల్సిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. దీనిప్రకారం, అసెస్మెంట్ ఇయర్లో మార్చి ముగిసేనాటికి పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా అన్ని ఐటీ రిటర్న్స్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఐటీ రిటర్న్స్, రివైజ్డ్ రిటర్న్స్ ప్రక్రియ మొత్తం మార్చినాటికి పూర్తవ్వాలని ఫైనాన్స్ బిల్లు 2017కు సంబంధించి ఒక మెమోరాండంలలో రెవెన్యూ శాఖ పేర్కొంది. రిటర్న్స్ ఫైలింగ్‌లో ఆలస్యం అయితే, ఇందుకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించింది. ఆదాయం రూ. 5 లక్షల లోపు అయితే ఈ ఫీజు రూ.1,000గా ఉంది. ఆపైన రూ.5,000గా ఉంది. జూలై తరువాత, డిసెంబర్ లోపు అయితే ఈ మొత్తం ఫీజు చెల్లించాలి. ఫైలింగ్ డిసెంబర్ దాటితే రూ.10,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పదేళ్ల పాత కేసులపైనా ఐటీ దృష్టి నల్లకుబేరులు, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం తాజాగా ఆదాయ పన్ను చట్టంలో తాజాగా సవరణలు చేసింది. దీని ప్రకారం లెక్కల్లో చూపని ఆస్తులు, డిపాజిట్లు రూ. 50 లక్షలపైగా విలువ చేసేవి.. ఐటీ సోదాల్లో బైటపడిన పక్షంలో అధికారులు పదేళ్ల క్రితం నాటి ఐటీ రిటర్న్‌లను కూడా పునఃపరిశీలించవచ్చు. ఇప్పటిదాకా ఆరేళ్ల దాకా మాత్రమే ఉండగా.. దీన్ని పదేళ్లకు పొడిగించినట్లు సుశీల్ చంద్ర తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఇందుకు సంబంధించిన సవరణ అమల్లోకి రానుంది. దీంతో అసెస్సీకి సంబంధించి 2007 నాటి ఖాతాలను కూడా అధికారులు పరిశీలించి, నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్లో మీ ఖాతాలు సరిచూసుకోండి న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులను గుర్తించడానికి నవంబర్ 8 నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సేకరించిన సమాచారాన్ని.. తమ వద్ద ఉన్న సమాచారంతో ఐటీ శాఖ సరిచూస్తోంది. ఇందులో భాగంగా పన్ను చెల్లింపుదారులు నోట్ల రద్దు తర్వాత తమ ఖాతాల్లో నగదు జమల మొత్తాన్ని ఆన్లైన్లో సరిచూసుకోవాలని, ఒకవేళ తేడాలుంటే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించింది. ఖాతాదారుల ఇబ్బందులు తొలగించడానికి, అలాగే వారికి సహాయం చేయడానికి ఐటీ శాఖ యూజర్ గైడ్‌ను అందుబాటులో ఉంచింది. ఖాతాల్లో నగదు జమల సమాచారాన్ని incometaxindiaefiling. gov. in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పాన్ నంబర్‌తో దీనిని సరిచూసుకోవచ్చని తెలిపింది. వెబ్‌సైట్‌లోని ‘కాంప్లియన్స్’ విభాగంలోని ‘2016 క్యాష్ ట్రాన్సాక్షన్స్’ లింక్‌లో గతేడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకూ చేసిన లావాదేవీల సమాచారం ఉంచింది. తన ఖాతా నంబర్ పాన్‌కు సంబంధించినది అని పన్ను చెల్లింపుదారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతా కనుక పాన్‌కు సంబంధించినది కాకపోతే సంబంధిత ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆదాయపన్ను కార్యాలయానికి వెళ్లకుండానే నగదు జమ వివరాలను వెబ్సైట్లోనే వివరించేలా ఆ శాఖ చర్యలు తీసుకుంది.