
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు రాజకీయంగా సంచలనంగా మారింది. కాగా, ఐటీ దాడుల సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి రైడ్‌ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతమంది సీఆర్‌పీఎఫ్ బలగాలను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. మేము దొంగలమా? ఇంత అరాచకమా? అంటూ కామెంట్స్ చేశారు.
ఇక, దాడుల నేపథ్యంలో తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో ఐటీ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు. ఇక, నోటీసులు ఇచ్చిన వారిలో మల్లారెడ్డి సోదరులు, కుమారులు, అల్లుడు, సన్నిహితులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. మరోవైపు.. ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే విద్యా సంస్థల్లో(ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ) డొనేషన్లపై ఐటీ అధికారులు ఆరా తీయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment