బీబీసీ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీ పెను వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లోకి ఐటీ అధికారులు సడెన్ ఎంట్రీ ఇచ్చారు. సోదాలు నిర్వహించి..ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లను తీసుకువెళ్లడమే కాకుండా కార్యాలయంలోని డెస్క్‌టాప్‌లను కూడా తనిఖీ చేశారు. ఐతే ఆదాయపు శాఖ మాత్రం పన్నుల అవకతవకల ఆరోపణలపై సర్వే చేస్తున్నమని, సోదాలు కాదని పేర్కొంది.
కార్యాలయం లావాదేవీలకు సంబంధించి బ్యాలెన్స్ షీట్లు, ఖాతాల వివరాలను ఇవ్వాల్సిందిగా బీబీసీ ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్‌ని కోరినట్లు ఆదాయపు శాఖ వర్గాలు తెలిపాయి. ఈ తనిఖీలు ముగిసిన తర్వాతే ఉద్యోగులను కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు ఐటీ అధికారలు అనుమతించినటట్లు సమాచారం. కాగా, బీబీసీ ఈ ఘటనపై స్పందిస్తూ.."ఆదాయపు శాఖ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం.
మా ఉద్యోగులందరూ క్షేమంగానే ఉన్నారు. బీబీసి వారికి అన్నివిధాలుగా సహకరిస్తుంది. ఈ వివాదం తొందరలోనే ముగిసిపోతుందని ఆశిస్తున్నా." అని తెలిపింది. ఇదిలా ఉండగా..గత నెలలో బీబీసీ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన 2002 గుజరాత్ అల్లర్లుపై ఒక డాక్యుమెంటరీ తీసింది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించిడమే గాక వలవాద విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది కూడా.
(చదవండి: పార్లమెంట్‌లో ఒక ప్రధాని ఇలా అంగీకరించడం ప్రపథమం! సీఎం స్టాలిన్ సెటైర్లు)
Comments
Please login to add a commentAdd a comment