bbc document
-
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు..ఇది కేవలం సర్వేనే!
బీబీసీ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీ పెను వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లోకి ఐటీ అధికారులు సడెన్ ఎంట్రీ ఇచ్చారు. సోదాలు నిర్వహించి..ఉద్యోగుల ల్యాప్టాప్లు, ఫోన్లను తీసుకువెళ్లడమే కాకుండా కార్యాలయంలోని డెస్క్టాప్లను కూడా తనిఖీ చేశారు. ఐతే ఆదాయపు శాఖ మాత్రం పన్నుల అవకతవకల ఆరోపణలపై సర్వే చేస్తున్నమని, సోదాలు కాదని పేర్కొంది. కార్యాలయం లావాదేవీలకు సంబంధించి బ్యాలెన్స్ షీట్లు, ఖాతాల వివరాలను ఇవ్వాల్సిందిగా బీబీసీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ని కోరినట్లు ఆదాయపు శాఖ వర్గాలు తెలిపాయి. ఈ తనిఖీలు ముగిసిన తర్వాతే ఉద్యోగులను కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు ఐటీ అధికారలు అనుమతించినటట్లు సమాచారం. కాగా, బీబీసీ ఈ ఘటనపై స్పందిస్తూ.."ఆదాయపు శాఖ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. మా ఉద్యోగులందరూ క్షేమంగానే ఉన్నారు. బీబీసి వారికి అన్నివిధాలుగా సహకరిస్తుంది. ఈ వివాదం తొందరలోనే ముగిసిపోతుందని ఆశిస్తున్నా." అని తెలిపింది. ఇదిలా ఉండగా..గత నెలలో బీబీసీ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన 2002 గుజరాత్ అల్లర్లుపై ఒక డాక్యుమెంటరీ తీసింది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించిడమే గాక వలవాద విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది కూడా. (చదవండి: పార్లమెంట్లో ఒక ప్రధాని ఇలా అంగీకరించడం ప్రపథమం! సీఎం స్టాలిన్ సెటైర్లు) -
Hyderabad: హెచ్సీయూలో బీబీసీ నిషేధిత డాక్యుమెంటరీ ప్రదర్శన..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శన చర్చనీయాంశంగా మారింది. హెచ్సీయూలో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఇటీవల రెండు సంఘాలు కలిసి ప్రదర్శించినట్లు తెలిసింది. 2002 గోద్రా అల్లర్లు, రామమందిర నిర్మాణ ఘర్షణపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించగా దానిపై భారతదేశంలో నిషేధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీని ప్రదర్శించిన, తిలకించిన వారిపై చర్యలు తీసుకోవాలని యూనివర్సి'rటీ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. దేశంలో మళ్లి అల్లర్లు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఈ డాక్యుమెంటరీపై ఎలాంటి నిషేధం లేదని, సెన్సార్ మాత్రమే చేశారని, బీబీసీ నుంచి అనుమతి పొంది ప్రదర్శించుకోవచ్చని కొందరు వాదిస్తున్నట్లు తెలిసింది. అధికారికంగా ఫిర్యాదు రానిదే దీనిపై విచారణ చేయడం, కేసులు నమోదు చేయడం ఉండదని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది. -
నిర్భయ డాక్యుమెంటరీపై ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ:ఇండియాస్ డాటర్స్(భారత పుత్రిక) పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. కాగా ఆ ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లను అధికారులు పేర్కొనలేదు. గురువారం ఆ వివాదాస్పద డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎత్తివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. బ్యాన్ ఎత్తివేయాలంటూ దాఖలైన పిల్ ను జస్టిస్ బీడీ అహ్మద్ , జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేస్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కనుక నిషేధం సరైనదే అని కోర్టు తెలిపింది. దీనిపై తదుపరి విచారణ బుధవారం ఉంటుందని పేర్కొంది.