న్యూఢిల్లీ:ఇండియాస్ డాటర్స్(భారత పుత్రిక) పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. కాగా ఆ ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లను అధికారులు పేర్కొనలేదు. గురువారం ఆ వివాదాస్పద డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎత్తివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. బ్యాన్ ఎత్తివేయాలంటూ దాఖలైన పిల్ ను జస్టిస్ బీడీ అహ్మద్ , జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేస్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కనుక నిషేధం సరైనదే అని కోర్టు తెలిపింది. దీనిపై తదుపరి విచారణ బుధవారం ఉంటుందని పేర్కొంది.