delhi Hicourt
-
డోల్మా ఆంటీతోనే మజాకులా? ఎవరీ డోల్మా? ఏమా కథ?
ఢిల్లీకి చెందిన డోల్మా ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ట్రేడ్‌మార్క్ వివాదంలో డోల్మా ఆంటీకి ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ‘‘డోల్మా ఆంటీ మోమోస్" ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. ఇంతకీ ఎవరీ డోల్మా అంటీ... తెలుసుకుందాం రండి! దేశ రాజధాని నగరం ఢిల్లీలో డోల్మా ఆంటీ మోమో బాగా పాపులర్. ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్ ప్రాంతంలో డోల్మా ఆంటీ మోమోస్ కోసం ఆహార ప్రియులు బారులు తీరతారు. కేవలం స్థానికులు మాత్రమే కాదు అక్కడికి వచ్చిన వారంతా ఒక్కసారి డోల్మా ఆంటీ మోమోస్ టేస్ట్ చేస్తే.. ఆహా..ఏమి రుచి.. తినరా మళ్లీ...మళ్లీ అంటారు. అలా ఈ మోమోలు బాగా పాపులర్ అయ్యాయి. లజ్‌పత్ నగర్‌కి వెళ్లి డోల్మా ఆంటీ మోమోలు తినకపోతే ఎలా? అనుకునేంతగా పేరు సంపాదించుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మొహమ్మద్ అక్రం ఖాన్ ‘డోల్మా ఆంటీ మోమో’ పేరుతో 2018లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన డోల్మా ట్సేరింగ్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. డోల్మా 1994లో లజ్‌పత్ నగర్లో మొట్టమొదటి మోమో స్టాల్‌ను ప్రారంభించిందన్న వాదనను సమర్థించింది. దీంతో ఢిల్లీ హైకోర్ట్ మొహమ్మద్ అక్రం ఖాన్ ట్రేడ్‌మార్క్ చెల్లదని తీర్పునిచ్చింది. 30 ఏండ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న డోల్మా కూడా 2023లో తన మోమోలకు ట్రేడ్‌మార్క్ తీసుకోవడం విశేషం. కాగా డోల్మా ట్సేరింగ్ కుటుంబం 1950లో బౌద్ధ గురువు దలైలామా తోపాటు టిబెట్ నుంచి భారత్ తరలి వచ్చిందట. బతుకు దెరువు కోసం టిబెట్‌కు చెందిన స్ట్రీట్ ఫుడ్‌ను ఢిల్లీవాసులకు రుచి చూపించింది. 1994లో లజ్‌పత్‌నగర్‌లో తొలి మోమో స్టాల్ ప్రారంభించింది. 90వ దశకంలో అంతగా ఆదరన లభించలేదు. అయితే ఎట్టకేలకు ఢిల్లీ ప్రజల పల్స్ పట్టేసిందిడోల్మా. స్థానిక టేస్ట్‌కు అనుగుణంగా మోమోలకు స్పైసీ మసాలా చట్నీ జోడించి విక్రయించడం మొదలు పెట్టింది. అంతే...అప్పటినుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు. రూ.15 కి ఆరు మోమోల ప్లేట్‌తో ప్రారంభించి, ఇపుడు 8 మోమోలు రూ. 60కి విక్రయిస్తోంది. లజ్‌పత్ నగర్‌లోని ప్రధాన స్టాల్‌తో పాటు, డోల్మా ఆంటీకి మరో రెండు చోట్ల మోమోస్ స్టాల్స్ ఉన్నాయి. -
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు భారీ షాక్!
భారత్ లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు భారీ షాక్ తగిలింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఇంటర్‌డిజిటల్‌కు పెండింగ్‌లో ఉన్న మొత్తం రాయల్టీలను మూడు నెలల్లో చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో సదరు చైనా సంస్థల ఫోన్ అమ్మకుండా కోర్టును ఆశ్రయించొచ్చుని తెలిపింది. ఫిబ్రవరి 21న జారీ చేసిన ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వుల్లో.. ఒప్పో ఇంటర్‌డిజిటల్‌కు సంబంధిత మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే కోర్టు ఆదేశాల్ని భేఖాతరు చేసినందుకు భారత్‌లో ఒప్పోతో పాటు ఇతర చైనా ఫోన్ లు అమ్మకాలు జరగకుండా ఇంటర్ డిజిటల్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ కోసం నమోదు చేసుకునేందుకు అర్హత ఉందని సూచించింది. స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇంటర్ డిజిటల్ సంస్థకు ఎంత మొత్తంలో చెల్లించాల్సి ఉందనే అంశంపై స్పష్టతలేదు. అయితే ఆమొత్తాన్ని, అందుకు అయ్యే వడ్డీని బ్యాంక్ అకౌంట్ లలో జమచేయాలని, ఈ కేసు విచారణను 2024 చివరి నాటికి పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది. కేసు దేనికి సంబంధించింది? తమ హ్యాండ్సెట్లలో సెల్యులార్ టెక్నాలజీ (3జీ, 4జీ,5జీ), వీడియో కోడింగ్ టెక్నాలజీ వినియోగంపై ఒప్పో,రియల్ మీ, వన్ ప్లస్ బ్రాండ్లకు వ్యతిరేకంగా ఇంటర్ డిజిటల్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు ప్రకారం.. ఇంటర్డిజిటల్ తన సాంకేతికతను ఉపయోగించడం కోసం న్యాయమైన, సహేతుకమైన, వివక్షత లేని (FRAND)నిబంధనలపై లైసెన్స్ ఒప్పందం కోసం ఒప్పో గ్రూప్‌తో కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుపుతోంది. చర్చలు విఫలం కావడంతో డిసెంబర్ 2021లో యూకే, జర్మనీ, భారత్ తో పాటు ఇతర దేశాల్లో స్మార్ట్ ఫోన్ కంపెనీలకు వ్యతిరేకంగా వాజ్యం దాఖలు చేసింది. ఆ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు తాజాగా తన తీర్పును వెలువరించింది. ఒప్పో వర్సెస్ నోకియా జూలై 2023లో ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య బెంచ్ మొబైల్ ఫోన్ తయారీదారు ఒప్పో తన ఫోన్లలో నోకియా సాంకేతికతను అవసరమైన అనుమతి లేకుండా ఉపయోగించినందుకు, నాలుగు వారాల్లోగా దాని భారతదేశ విక్రయాలలో 23 శాతం డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సైతం సమర్ధించింది. కోర్టు తీర్పుతో దిగివచ్చిన ఒప్పో.. నోకియాకు చెల్లించింది. ఆపై సాంకేతిక వినియోగం విషయంలో ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనవరాలు!
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్‌ల ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. తన ఆరోగ్యంపై తప్పులు కథనాలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ అంశంపై నేడు(ఏప్రిల్ 20) హైకోర్టులు విచారణ జరిగింది. 11 ఏళ్ల వయసు ఉన్న ఆరాధ్యపై కొన్ని యూట్యూబ్ చానళ్లు తరచూ తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. తన కూతురుపై వచ్చిన తప్పుడు కథనాలపై గతంలో అభిషేక్ మీడియా ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రెటీల పిల్లలను ట్రోల్స్ చేయడం సరికాదని, అలాంటి వారిని క్షమించొద్దని అన్నారు. అయినా కూడా ట్రోల్స్ తగ్గలేదు. దీంతో ఆరాధ్య నేరుగా హైకోర్టుని ఆశ్రయించింది. ఆరాధ్య ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయకుండా యూట్యూబ్ చానళ్లను న్యాయస్థానం నిషేదించినట్లు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 6న ఆరాధ్య జన్మించింది. -
కొత్త ఐటీ చట్టాలపై కోర్టుకెక్కిన వాట్సాప్, ఫేస్బుక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను సవాల్ చేస్తూ మెసేజింగ్ యాప్ వాట్సాప్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హై కోర్టు పిటిషినర్ల అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరింది. ఆ వివరాలు కావాలి ఇటీవల భారత ప్రభుత్వం సోషల్ మీడియా నియంత్రణకు కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చింది. అందులోని నిబంధనల ప్రకారం ఏదైనా సమాచారం సోషల్ మీడియా లేదా మెస్సేజింగ్ యాప్‌లలో వచ్చినప్పుడు.. మొట్ట మొదట ఆ మేసేజ్ ఎక్కడ నుంచి వచ్చిందనే వివరాలను కేంద్రానికి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్ అందివ్వాల్సి ఉంటుంది. అయితే ఇలా చేయడం రాజ్యంస స్ఫూర్తికి విరుద్ధమంటున్నాయి ఫేస్బుక్, వాట్సప్‌లు. రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం తమ ఖాతాదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని తమకు ఇవ్వమని ప్రభుత్వం కోరడం రాజ్యంగ స్ఫూర్తికి ఇది విరుద్ధమంటున్నాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తాము ఖాతాదారులకు హామీ ఇచ్చామని,. దాన్ని ఉల్లంఘించలేమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. విచారణ వాయిదా ఫేస్బుక్, వాట్సప్‌లు లెవనెత్తుతున్న అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు కోరింది. అయితే ఈ కేసు వాదిస్తున్న ప్రధాన న్యాయవాది ప్రస్తుతం అందుబాటులో లేనందున విచారణ కొద్ది కాలం వాయిదా వేయాలని కోర్టును కేంద్రం కోరింది. దీంతో ఈ కేసు విచారణను ఆక్టోబరు 22కి కోర్టు వాయిదా వేసింది. చదవండి : Black Holes: విశ్వంలో మొట్టమొదటిసారి.. మూడు భారీ బ్లాక్‌హోల్స్ విలీనం! -
నా పరువు తీస్తున్నారు!
న్యూఢిల్లీ: రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో తన పేరును అనవసరంగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీన్ని నిలిపివేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రకుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం వైఖరి వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తమ వైఖరిని చెప్పాలని పిటిషన్ విచారించిన జస్టిస్ నవీన్ చావ్లా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు, ప్రసారభారతికి, ప్రెస్ కౌన్సిల్‌కు, న్యూస్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేశారు. రకుల్ పిటిషన్‌ను ఫిర్యాదుగా స్వీకరించి ఈ నాలుగు సంస్థలు ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేశారు. డ్రగ్స్ కేసులో విచారణ వేళ సంబంధిత ఆఫీసర్లకన్నా ముందే మీడియాకు కొన్ని అంశాలు లీకవుతున్నాయని, దీనిపై విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. ముందుగా ఫిర్యాదు చేయాల్సింది.. కేసులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపించారు. రకుల్ కోరుకున్నట్లు ఇంజంక్షన్ లేదా బ్లాంకెట్ బ్యాన్ లాంటి ఆదేశాలివ్వద్దని కోరారు. కోర్టుకు వచ్చేముందు ఆమె ప్రభుత్వానికి కానీ సంబంధిత అథార్టీకి కానీ ఫిర్యాదు చేయలేదని, ఏదో ఒక్క మీడియా హౌస్ లేదా చానల్‌ను ప్రత్యేకంగా ఆమె పేర్కొనలేదని చెప్పారు. దీనిపై రకుల్ న్యాయవాది స్పందిస్తూ రకుల్ పేరు తాను చెప్పలేదని రియా చక్రవర్తి వివ రించినా మీడియా రిపోర్టులు రకుల్‌ను డ్రగ్స్ కేసుతో లింక్ చేసే రాస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతుండడంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే సమయం లేక నేరుగా కోర్టును ఆశ్రయించామని చెప్పారు. -
చిదంబరం పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ పిటిషన్‌తోపాటు ఇదే కేసులో దిగువ కోర్టు తనపై అరెస్టు వారెంట్ జారీ చేయడం, సోమవారం వరకు సీబీఐ కస్టడీకి పంపాలంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై కోర్టు బెంచ్ విచారణ జరపనుంది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన తన పిటిషన్‌ను జూలై 20, 21వ తేదీల్లో సుప్రీంకోర్టు విచారించక పోవడం వల్లే ఆగస్టు 21వ తేదీన అరెస్టయ్యానని చిదంబరం తెలిపారు. ఈ చర్యల రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మనీలాండరింగ్ కేసులో సోమవారం వరకు చిదంబరంను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తూ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈడీని ఆదేశించిన విషయం తెలిసిందే. చిదంబరం పిటిషన్లపై సమాధానం ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం ఈడీని కూడా ఇప్పటికే ఆదేశించింది. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ..దీని వెనుక భారీ మనీలాండరింగ్ కుట్రకోణం ఉందని తెలిపారు. -
దర్శకుడికి ఊరట: రేప్ కేసులో శిక్ష కొట్టివేత
న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం ‘పీప్లీ లైవ్’ కో–డైరెక్టర్ మహ్మూద్ ఫరూఖీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 2015లో ఓ అమెరికా పరిశోధకురాలి(30)పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను కొట్టివేసింది. అలాగే రూ.50 వేల జరిమానానూ రద్దు చేసింది. బాధితురాలి వాంగ్మూలం విశ్వసనీయంగా లేదన్న జడ్జి జస్టిస్ అశుతోష్ కుమార్ ఫరూఖీపై నమోదైన అభియోగాలను సంశయలాభం కింద కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహిళల ప్రవర్తన ప్రకారం భాగస్వామితో అస్పష్టంగా శృంగా రం వద్దు అంటే దానర్థం కావాలని కూడా కావచ్చు. లైంగిక చర్యలో మహిళలు వద్దు అనడం, సంకోచం, అయిష్టత చూపడం వంటివి వారి అంగీకారానికి సూచన కాదు. మహిళలు నిశ్చయాత్మకంగా, స్పష్టంగా తమ సమ్మతి తెలిపినప్పుడే వారు అంగీకరించినట్లు. ఇద్దరూ ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నప్పుడు, విద్యావంతులైనప్పుడు, గతంలో శారీరక సంబంధం కలిగి ఉన్నప్పుడు.. లైంగిక చర్యకు మహిళ వద్దు అని అస్పష్టం గా చెబితే దానిని అసమ్మతిగా పరిగణించడం చాలా కష్టమవుతుంది. లైంగిక చర్యల్లో పాల్గొనే మహిళల్లో చాలామంది చేతల ద్వారానే తమ సమ్మతిని తెలియజేస్తారని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఫిర్యాదిపై లైంగికదాడి జరిగిందా? ఒకవేళ నిజంగా జరిగితే ఆమె అంగీకారం లేకుండానే జరిగిందా? తనతో శృంగారం ఫిర్యాదికి ఇష్టం లేదని నిందితుడికి స్పష్టంగా అర్థమైందా? అన్న విషయాల్లో వాస్తవాలు ఇద్దరికే తెలుసు’ అని తీర్పులో జస్టిస్ కుమార్ పేర్కొన్నారు. -
'అలా వసూలు చేస్తుంటే ఏం చేస్తున్నారు?'
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలు రకాల ట్యాక్సీలు ఇబ్బడి ముబ్బడిగా ఛార్జీలను వసూలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉబర్, వోలా వంటి ట్యాక్సీలు ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు వసూలు చేస్తుంటే అలా చేయకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరాలు అందజేయాలంటూ నోటీసుల్లో పేర్కొంటూ విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. -
నిర్భయ డాక్యుమెంటరీపై ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ:ఇండియాస్ డాటర్స్(భారత పుత్రిక) పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. కాగా ఆ ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లను అధికారులు పేర్కొనలేదు. గురువారం ఆ వివాదాస్పద డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎత్తివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. బ్యాన్ ఎత్తివేయాలంటూ దాఖలైన పిల్ ను జస్టిస్ బీడీ అహ్మద్ , జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేస్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కనుక నిషేధం సరైనదే అని కోర్టు తెలిపింది. దీనిపై తదుపరి విచారణ బుధవారం ఉంటుందని పేర్కొంది.