ఢిల్లీకి చెందిన డోల్మా ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ట్రేడ్‌మార్క్ వివాదంలో డోల్మా ఆంటీకి ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ‘‘డోల్మా ఆంటీ మోమోస్" ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. ఇంతకీ ఎవరీ డోల్మా అంటీ... తెలుసుకుందాం రండి!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో డోల్మా ఆంటీ మోమో బాగా పాపులర్. ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్ ప్రాంతంలో డోల్మా ఆంటీ మోమోస్ కోసం ఆహార ప్రియులు బారులు తీరతారు. కేవలం స్థానికులు మాత్రమే కాదు అక్కడికి వచ్చిన వారంతా ఒక్కసారి డోల్మా ఆంటీ మోమోస్ టేస్ట్ చేస్తే.. ఆహా..ఏమి రుచి.. తినరా మళ్లీ...మళ్లీ అంటారు. అలా ఈ మోమోలు బాగా పాపులర్ అయ్యాయి. లజ్‌పత్ నగర్‌కి వెళ్లి డోల్మా ఆంటీ మోమోలు తినకపోతే ఎలా? అనుకునేంతగా పేరు సంపాదించుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మొహమ్మద్ అక్రం ఖాన్ ‘డోల్మా ఆంటీ మోమో’ పేరుతో 2018లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన డోల్మా ట్సేరింగ్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. డోల్మా 1994లో లజ్‌పత్ నగర్‌లో మొట్టమొదటి మోమో స్టాల్‌ను ప్రారంభించిందన్న వాదనను సమర్థించింది. దీంతో ఢిల్లీ హైకోర్ట్ మొహమ్మద్ అక్రం ఖాన్ ట్రేడ్‌మార్క్ చెల్లదని తీర్పునిచ్చింది. 30 ఏండ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న డోల్మా కూడా 2023లో తన మోమోలకు ట్రేడ్‌మార్క్ తీసుకోవడం విశేషం.
కాగా డోల్మా ట్సేరింగ్ కుటుంబం 1950లో బౌద్ధ గురువు దలైలామా తోపాటు టిబెట్ నుంచి భారత్ తరలి వచ్చిందట. బతుకు దెరువు కోసం టిబెట్‌కు చెందిన స్ట్రీట్ ఫుడ్‌ను ఢిల్లీవాసులకు రుచి చూపించింది. 1994లో లజ్‌పత్‌నగర్‌లో తొలి మోమో స్టాల్ ప్రారంభించింది. 90వ దశకంలో అంతగా ఆదరన లభించలేదు. అయితే ఎట్టకేలకు ఢిల్లీ ప్రజల పల్స్ పట్టేసిందిడోల్మా. స్థానిక టేస్ట్‌కు అనుగుణంగా మోమోలకు స్పైసీ మసాలా చట్నీ జోడించి విక్రయించడం మొదలు పెట్టింది. అంతే...అప్పటినుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు. రూ.15 కి ఆరు మోమోల ప్లేట్‌తో ప్రారంభించి, ఇపుడు 8 మోమోలు రూ. 60కి విక్రయిస్తోంది. లజ్‌పత్ నగర్‌లోని ప్రధాన స్టాల్‌తో పాటు, డోల్మా ఆంటీకి మరో రెండు చోట్ల మోమోస్ స్టాల్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment