'కుమారి ఆంటీ' లాంటి ఇన్సిడెంట్‌..మరీ ఇదేమవుతుందో..! | Delhi's Viral Vada Pav Girl Breaks Down In Tears Goes Viral | Sakshi
Sakshi News home page

'కుమారి ఆంటీ' లాంటి ఇన్సిడెంట్‌..మరీ ఇదేమవుతుందో..!

Published Fri, Mar 15 2024 4:00 PM | Last Updated on Fri, Mar 15 2024 4:53 PM

Delhis Viral Vada Pav Girl Breaks Down In Tears Goes Viral - Sakshi

హైదరాబాద్‌లో రెండు లిఫర్‌లు ఎక్స్‌ట్రా అనే డైలాగ్‌తో ఫేమస్‌ అయ్యిన ‍స్ట్రీ ఫుడ్‌ వ్యాపారి కుమారీ ఆంటీ పేరు తెలియని వారు ఉండరని చెప్పొచ్చు. అంతలా సోషల్‌ మీడియాలో ఆమెకు సంబంధించిన వీడియోలు వచ్చాయి. అయితే ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడుతుందని ఆమె షాపు తీసేయాలంటూ.. ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా ఆమె పేరు వార్తల్లో నిలిచిపోయింది. దీంతో కుమారీ ఆంటీ నా పొట్టమీద కొట్టొద్దని విలపించటం, మరోవైపు సోషల్‌ మీడీయా ఆమెపై పలు సింపతీ కథనాలతో ఊదరగొట్టడంతో దెబ్బకి అధికారులే బిజినెస్‌ చేసుకోమని వదలిలేయడం చకచక జరిగిపోయాయి. చెప్పాలంటే ఈ ఘటన ఓ సెన్సెషన్‌లా మారీ కుమారీ ఆంటీ పేరు మారుమ్రోగిపోయింది. అచ్చం అలాంటి ఇన్సిడెంటే వడాపావ్‌ గర్ల్‌కి ఎదురయ్యింది. 

వివరాల్లోకెళ్తే..ఢిల్లీలో వడపావ్ చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. అయితే ఢిల్లీ రోడ్లలో వడపావ్ గర్ల్‌‌గా చంద్రికా గేరా దీక్షిత్ ఎంతో ఫేమస్. ఆమె తయారు చేసే వడపావ్ చాలా మంచి  ప్రజాధరణ ఉంది.దీంతో ఆమె స్టాల్‌ జనాలతో కిటకిటలాడిపోతుంది. ఆమె వద్ద తినాంటే గంటల తరబడి వెయిట్‌ చేసి ఉండాల్సిందే. అంత క్రేజ్‌ ఆమె చేసే వడపావ్‌కి. అందుకు సంబంధించిన సోషల్‌ మీడియా వీడియోల కథనాలే నిదర్శనం. ఇక ఈ చంద్రిక ఇంతలా ఫేమస్‌ కావడానికి ఆమె గతంలో హల్దీ రామ్‌లో ఉద్యోగం చేయడం. ఆమె సొంతంగా బిజినెస్ చేయాలనే ఆసక్తితో ఇలా స్ట్రీట్‌ వడపావ్ ఫుడ్ వ్యాపారం ప్రారంభించింది.

బీటెక్‌ పానీపూరి వాలీ తర్వాత ఈ చంద్రికాదే ఇంతలా ఫేమస్‌ అయ్యింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఆమె ఏడుస్తూ ఫోన్‌మాట​డుతూ.. మరోవైపు కస్టమర్లకు సర్వ్‌ చేస్తోంది. ఆమె తన వ్యాపారానికి సంబంధించిన ఏదో సమస్య ఎదుర్కొన్నట్లు సమాచారం. ఢిల్లో మున్సిపల్ కార్పిరేషన్ అధికారులు ఫుడ్‌స్టాల్ మూసి వేయాలని చంద్రికాపై ఒత్తడి తెస్తున్నారట.

గతంలో పర్మిషన్‌ కోసం రూ. 30 వేలు చెల్లించిందట. అయితే అధికారులు ఇంకా డబ్బు ఇవ్వాలని లేదంటే బిజినెస్‌ క్లోజ్‌ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఆమె వీడియోలో పేర్కొంది. అయితే తనను ఎవరు బెదిరిస్తున్నారనే వివరాలు చెప్పలేదు. ఈ వీడియోను ఓ కస్టమర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.ఈ వీడియోని చూసిన నెటిజన్లు బిజినెస్‌ నడపాలంటే మున్సిపాలిటీ నిబంధనలు పాటించాల్సిందేనని ఒకరు, లైసెన్స్‌ లేకుండా స్టాల్‌ ఎలా నడుపుతారని మరోకరు ప్రశ్నిస్తూ.. పోస్టులు పెట్టారు. ఏదీఏమైన చంద్రికా ఏడవడానికి కారణం ఇదేనా లేక మరేదైనా సమస్య అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. కానీ చూడటానికి కుమారీ ఆంటీ లాంటి కథని తలపిస్తోంది. 

(చదవండి: వీధుల్లో కూరగాయలు అమ్మినట్లు మ్యాగీని అమ్మేస్తున్నాడు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement