vada paav
-
‘సింగం ఎగేన్’ టీమ్‌తో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఒకే ఆర్డర్లో ఏకంగా 11,000 వడాపావ్‌ను డెలివరీ చేసి ఈ రికార్డ్ నెలకొల్పింది. ఈ ఘనత సాధించేందుకు ‘సింగం ఎగేన్’ సినిమా బృందంతోపాటు ‘రాబిన్‌హుడ్ ఆర్మీ’ అనే ఎన్జీఓతో కలిసి పని చేసినట్లు అధికారులు తెలిపారు.స్విగ్గీ ఇటీవల భారీ ఆర్డర్ల కోసం ప్రారంభించిన ‘స్విగ్గీ ఎక్స్ఎల్’ సదుపాయంతో ఈ డెలివరీలు అందించినట్లు చెప్పారు. ఇందుకోసం ‘సింగం ఎగేన్’ ఫేమ్ అజయ్ దేవగన్, ఆ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టితో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ముంబైలోని ఎంఎం మిఠాయివాలా తయారు చేసిన వడా పావ్లను ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ ఎన్జీఓ సాయంతో బాంద్రా, జుహు, అంధేరీ ఈస్ట్, మలాడ్, బోరివాలిలోని పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. విలే పార్లేలోని ఎయిర్పోర్ట్ హైస్కూల్, జూనియర్ కాలేజీలో ఈ ఈవెంట్ ప్రారంభమైంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవలకు డేట్ ఫిక్స్ఈ సందర్భంగా స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ మాట్లాడుతూ..‘గడిచిన పదేళ్లలో స్విగ్గీ ముంబైతోపాటు ఇతర నగరాల్లో మిలియన్ల కొద్దీ వడా పావ్లను డెలివరీ చేసింది. కానీ గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం డెలివరీ చేసిన ఈ వడాపావ్ చాలా ప్రత్యేకమైంది. ఈమేరకు సింగం ఎగేన్ సినిమా టీమ్‌తోపాటు రాబిన్‌హుడ్ ఆర్మీతో జట్టుకట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ డెలివరీకి స్విగ్గీ ఎక్స్ఎల్ ఎంతో ఉపయోగపడింది’ అన్నారు. -
కొంపముంచిన వడాపావ్.. వీడియో వైరల్
పుణె: పూణెలో జరిగిన పట్టపగలు దోపిడీలో వృద్ధ దంపతులు రూ. 5 లక్షల విలువైన నగలను పోగొట్టుకున్నారు. భార్యాభర్తలు బ్యాంకు నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఓ దుకాణంలో వడాపావ్ తినేందుకు ఆగారు. ఆ దంపతులు స్కూటర్‌ను రోడ్డు పక్కన నిలిపారు. ఆ వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ కోసం షాపులోకి వెళ్లగా, ఆ మహిళ స్కూటర్ దగ్గర వేచి ఉంది. కాసేపటి తర్వాత, బైక్‌పై ముఖానికి మాస్క్‌తో ఒక వ్యక్తి స్కూటర్ దగ్గర ఆపాడు, రోడ్డుపై ఏదో పడిపోయినట్లుగా ఆ మహిళ దృష్టి మళ్లించి అక్కడ నుంచి వెళ్లిపోయాడుదానికోసం వంగి వెతుకుతుండగా.. స్కూటర్ ముందు భాగంలో ఉన్న బ్యాగ్‌ను తీసుకొని మరో వ్యక్తి పరారయ్యాడు. దీన్ని గమనించిన ఆ మహిళ కేకలు వేస్తూ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వెనకే పరుగులు తీసింది.ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బ్యాగులో రూ. 5 లక్షల విలువైన ఆభరణాలు, సెల్ఫోన్లు కూడా అందులోనే ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.In Pune, a couple’s gold jewellery valued at ₹4.95 lakh was stolen while they paused to buy vada pav after retrieving it from a bank. The theft occurred on Thursday outside Rohit Vadewale's shop in ShewalewadiReported by: Laxman MoreVideo Editor: Dhiraj Powar#PuneTheft… pic.twitter.com/JfXj1uuiU7— Pune Mirror (@ThePuneMirror) August 30, 2024 -
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
హైదరాబాద్ కుమారాంటీ తరహాలో సంచలనం రేపిన వడా పావ్ గర్ల్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఖరీదైన కారుతో కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. లగ్జరీ, దాదాపు కోటి రూపాయల అద్భుతమైన ఫోర్డ్ మస్టాంగ్లో వడా పావ్ అమ్ముతూ కనిపించిన వీడియో వైరల్‌గా మారింది.ఢిల్లీకి చెందిన "వడా పావ్ గర్ల్" చంద్రికా దీక్షిత్ మంగోల్‌పురి ప్రాంతంలో ఒక ఫాస్ట్ ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తుంది. రోజూ వందల మందికి వడ పావ్‌ను విక్రయిస్తుంది. అలా వడా పావ్ గర్ల్‌గా బాగా ఫేమస్ అయింది. ఇన్‌స్టాలో 31 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.తాజాగా ఫోర్డ్ ముస్టాంగ్ కారులో వడాపావ్ అమ్ముతానంటూ ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "వడ పావ్ అమ్మాయి ముస్తాంగ్ కారులో వడా పావ్ అమ్మడం ప్రారంభించింది." అని ప్రకటించింది. అంతేకాదు వెయట్ చేయండి.. వడాపావ్‌తో పాటు త్వరలో ఒక పెద్ద ప్రకటన రాబోతోంది అని కామెంట్ చేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారంతా చప్పట్ల మోత మోగించారు. అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేసింది. భారత మార్కెట్లో ఈ కారులే టెస్ట్ వెర్షన్ ధర సుమారు 75 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. View this post on Instagram A post shared by Chandrika Gera Dixit official (@chandrika.dixit) కాగా ఇటీవల తనను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఒకవీడియో వైరల్ అయింది. అయితే ఆమెను అరెస్ట్ చేయలేదని ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోలో, ముస్తాంగ్ కారు నుండి బయటికి రావడం, సరికొత్త ఐఫోన్, ఐవాచ్, ఎయిర్పాడ్లను కొనుగోలు చేయడానికి దుకాణంలోకి వెళ్లిన రీల్స్ చేసింది. అలాగే పోర్స్చేతో సహా ఖరీదైన కార్లతో పోజులిచ్చింది. -
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
వడపావ్ అమ్ముతున్న యువతిని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను పోలీసులు ఖండించారు. వడాపావ్ గర్ల్‌గా ఫేమస్ అయిన చంద్రిక దీక్షిత్‌ను అరెస్టు చేయలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేగాక ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు.చంద్రిక దీక్షిత్ అనే యువతి కొంతకాలంగా ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో వడపామ్ ఫుడ్ స్టాల్ నడిపిస్తోంది. రాను రాను ఆమె ‘వడపామ్ గర్ల్’గా పేరొందింది. ఆమెకు ఇన్‌స్టాలో 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఈ యువతి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. స్టాల్ దగ్గర యువతి విందు ఏర్పాటు చేయగా.. స్థానికులతో వివాదం జరిగినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. స్టాల్‌ను తొలగించాలని ఆదేశించిన మున్సిపల్ అధికారులతో ఆమె గొడవకు దిగింది. ఆ వీడియో వైరల్ అయ్యింది.అయితే, చంద్రిక ఫుడ్ స్టాల్‌ను స్థానిక మున్సిపాలిటీ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం వల్ల ఆమె స్టాల్ వద్దకు జనాలు భారీగా వస్తున్నారని. దీని వల్ల స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న చుట్టుపక్కల వారు తమకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో పోలీస్ సిబ్బంది వెళ్లి ప్రశ్నించగా ఆమె దురుసుగా ప్రవర్తించిందని, ఈ నేపథ్యంలో ఆ ఫుడ్ స్టాల్ ను సీజ్ చేసి, ఆమెను పోలీస్ స్టేషన్ తరలించినట్లు పేర్కొన్నారు. అయితే, ఆమెను అరెస్ట్ చేయలేదని, తనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు. -
ది గ్రేట్ వడా పావ్ వార్
దిల్లీ ‘వైరల్ వడా పావ్ గర్ల్’గా పాపులర్ అయిన చంద్రికా గెరా దీక్షిత్ తాజాగా తన ఫుడ్ కార్ట్ సార్టప్తో రాత్రికి రాత్రి సెన్సేషన్‌గా మారింది. దీక్షిత్ పాపులారిటీ మాట ఎలా ఉన్నా ఆమెకు పోటీదారులు పెరిగారు. దీక్షిత్ ఫుడ్ కార్ట్ చుట్టుపక్కల పోటీదారులు వడా పావ్ బండ్లను ఏర్పాటు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ‘పాపులారిటీనే కొంప ముంచిందా!’ లాంటి హెడ్‌లైన్స్ నెటిజనుల నుంచి లైన్ కట్టాయి. ‘నిన్న నేను రానందున తన బండిని ఉంచానని ఆంటీ చెప్పింది. ఈరోజు కూడా ఇక్కడే పెట్టింది. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకోవడం సమంజసమా!’ అని తన ఆవేదనను వెళ్లగక్కింది దీక్షిత్. ఫుడ్ వ్లాగర్ పూడీ మానేహా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోటీదారు ఆంటీ ‘ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా పని నేను చేసుకుపోతున్నాను’ అని ఎర్రటి ఎండల్లో కూల్‌గా బదులిచ్చింది. ‘బండి ఎవరు పెట్టారనేది కాదు... రుచి ముఖ్యం’ అని కూడా సెలవిచ్చింది. -
'కుమారి ఆంటీ' లాంటి ఇన్సిడెంట్..మరీ ఇదేమవుతుందో..!
హైదరాబాద్‌లో రెండు లిఫర్లు ఎక్స్ట్రా అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యిన స్ట్రీ ఫుడ్ వ్యాపారి కుమారీ ఆంటీ పేరు తెలియని వారు ఉండరని చెప్పొచ్చు. అంతలా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వీడియోలు వచ్చాయి. అయితే ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడుతుందని ఆమె షాపు తీసేయాలంటూ.. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా ఆమె పేరు వార్తల్లో నిలిచిపోయింది. దీంతో కుమారీ ఆంటీ నా పొట్టమీద కొట్టొద్దని విలపించటం, మరోవైపు సోషల్ మీడీయా ఆమెపై పలు సింపతీ కథనాలతో ఊదరగొట్టడంతో దెబ్బకి అధికారులే బిజినెస్ చేసుకోమని వదలిలేయడం చకచక జరిగిపోయాయి. చెప్పాలంటే ఈ ఘటన ఓ సెన్సెషన్లా మారీ కుమారీ ఆంటీ పేరు మారుమ్రోగిపోయింది. అచ్చం అలాంటి ఇన్సిడెంటే వడాపావ్ గర్ల్‌కి ఎదురయ్యింది. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలో వడపావ్ చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. అయితే ఢిల్లీ రోడ్లలో వడపావ్ గర్ల్‌గా చంద్రికా గేరా దీక్షిత్ ఎంతో ఫేమస్. ఆమె తయారు చేసే వడపావ్ చాలా మంచి ప్రజాధరణ ఉంది.దీంతో ఆమె స్టాల్ జనాలతో కిటకిటలాడిపోతుంది. ఆమె వద్ద తినాంటే గంటల తరబడి వెయిట్ చేసి ఉండాల్సిందే. అంత క్రేజ్ ఆమె చేసే వడపావ్కి. అందుకు సంబంధించిన సోషల్ మీడియా వీడియోల కథనాలే నిదర్శనం. ఇక ఈ చంద్రిక ఇంతలా ఫేమస్ కావడానికి ఆమె గతంలో హల్దీ రామ్‌లో ఉద్యోగం చేయడం. ఆమె సొంతంగా బిజినెస్ చేయాలనే ఆసక్తితో ఇలా స్ట్రీట్ వడపావ్ ఫుడ్ వ్యాపారం ప్రారంభించింది. బీటెక్ పానీపూరి వాలీ తర్వాత ఈ చంద్రికాదే ఇంతలా ఫేమస్ అయ్యింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఆమె ఏడుస్తూ ఫోన్మాటడుతూ.. మరోవైపు కస్టమర్లకు సర్వ్ చేస్తోంది. ఆమె తన వ్యాపారానికి సంబంధించిన ఏదో సమస్య ఎదుర్కొన్నట్లు సమాచారం. ఢిల్లో మున్సిపల్ కార్పిరేషన్ అధికారులు ఫుడ్‌స్టాల్ మూసి వేయాలని చంద్రికాపై ఒత్తడి తెస్తున్నారట. గతంలో పర్మిషన్ కోసం రూ. 30 వేలు చెల్లించిందట. అయితే అధికారులు ఇంకా డబ్బు ఇవ్వాలని లేదంటే బిజినెస్ క్లోజ్ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఆమె వీడియోలో పేర్కొంది. అయితే తనను ఎవరు బెదిరిస్తున్నారనే వివరాలు చెప్పలేదు. ఈ వీడియోను ఓ కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.ఈ వీడియోని చూసిన నెటిజన్లు బిజినెస్ నడపాలంటే మున్సిపాలిటీ నిబంధనలు పాటించాల్సిందేనని ఒకరు, లైసెన్స్ లేకుండా స్టాల్ ఎలా నడుపుతారని మరోకరు ప్రశ్నిస్తూ.. పోస్టులు పెట్టారు. ఏదీఏమైన చంద్రికా ఏడవడానికి కారణం ఇదేనా లేక మరేదైనా సమస్య అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. కానీ చూడటానికి కుమారీ ఆంటీ లాంటి కథని తలపిస్తోంది. #chandrikavadapav#Delhi pic.twitter.com/F1aiMmpz2u — viral videos (@video71692) March 14, 2024 (చదవండి: వీధుల్లో కూరగాయలు అమ్మినట్లు మ్యాగీని అమ్మేస్తున్నాడు!) -
బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు!
ప్రపంచంలోనే అత్యుత్తమ శాండ్‌విచ్‌గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌కి చోటు దక్కింది. టాప్ 20 బెస్ట్ శాండ్విచ్లో ఈ భారతీయ వంటకం ఒకటిగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని అత్యుత్తమ శాండ్విచ్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతీయ స్ట్రీట్ ఫుడ్ అయిన వడ పావ్క చోటు దక్కింది. ఆ జాబితాలో ఈ రెసిపీ 19వ స్థానంలో నిలవడం విశేషం. టేస్ట్ అట్లాస్ ప్రకారం..ఈ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్ తయారీ ముంబైలోని ఓ వీధి వ్యాపారి నుంచి మొదలయ్యిందని పేర్కొంది. 1960-1970లలో దాదర్ రైలు స్టేషన్ సమీపంలో పనిచేసిన ఆశోక్ వైద్య అనే వీధి వ్యాపారీ ఈ వంటకాన్ని తయారు చేసినట్లు వెల్లడించింది. ఆయన అక్కడ పనిచేసే కార్మికుల ఆకలి తీర్చేలా మంచి వంటకాన్ని తయరు చేయాలని, అలాగే అది సులభంగా త్వరిగతిన చేయగలిగేలా ఉండాలని అనుకున్నారట. అప్పుడే ఈ రుచికరమైన వడాపావ్‌ని తయారు చేసినట్లు తెలిపింది. అలాఅలా ఇది వీధి స్టాల్స్ నుంచి ప్రుమఖ రెస్టారెంట్ల వరకు ప్రతి చోటా తయారయ్యే మంచి రుచికరమైన చిరుతిండిగా పేరుగాంచింది. ఈ జాబితాలో థంబిక్ డోనర్, బన్హమీ, షోర్మా వంటి చిరుతిండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి జాబితాను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది టేస్టీ అట్లాస్. అలాగే ఇటీవల టేస్టీ అట్లాస్ విడుదల చేసి అత్యుతమ కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: మన దేశంలోని టాప్ మహిళా చెఫ్‌లు వీరే!) -
‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్
భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ముంబైలో సందడి చేశారు. ఏప్రిల్ 18న యాపిల్ తన మొదటి స్టోర్‌ను ముంబైలో, ఏప్రిల్ 20న ఢిల్లీలో రెండో స్టోర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్లో భారతీయులు అమితంగా ఇష్టపడే వడపావ్‌ను బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి యాపిల్ సీఈవో టిమ్‌కుక్ రుచి చూశారు. వడపావ్ చాలా బాగుంది అంటూ ఆ ఫోటోల్ని ట్వీట్ చేశారు. Thanks @madhuridixit for introducing me to my very first Vada Pav — it was delicious! https://t.co/Th40jqAEGa — Tim Cook (@tim_cook) April 17, 2023 నటి మాధురీ దీక్షిత్ టిమ్ కుక్‌తో కలిసి వడ పావ్ తింటున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు. “ముంబైకి వడ పావ్ కంటే మెరుగైన స్వాగతం గురించి ఆలోచించలేను!” అని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Can’t think of a better welcome to Mumbai than Vada Pav! pic.twitter.com/ZA7TuDfUrv — Madhuri Dixit Nene (@MadhuriDixit) April 17, 2023 -
ప్రపంచ టేస్టీ శాండ్‌విచ్‌లలో భారతీయ వంటకానికి చోటు.. ఏదో తెలుసా!
ఇరవై ఏళ్ల కిందట స్ట్రీట్ ఫుడ్లపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అప్పట్లో బయట తినాలంటే రెస్టారెంట్, హోటల్స్వైపే మొగ్గు చూపేవాళ్లు. అయితే మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుత రోజుల్లో నగరవాసులు ఉరుకుల పరుగుల మధ్య బిజీబిజీగా గడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో స్ట్రీట్ ఫుడ్‌కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. తాజాగా భారత స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేక చిరుతిండి ఉండడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా, మహారాష్ట్రలోని ప్రసిద్ధ స్నాక్స్‌లో ఒకటైన వడ పావ్ ఇప్పుడు టేస్ట్ అట్లాస్ ద్వారా ప్రపంచంలోని 13వ అత్యుత్తమ శాండ్‌విచ్‌గా ర్యాంక్ పొందింది. ఈ ర్యాంకింగ్‌ను టేస్ట్ అట్లాస్ ట్విట్టర్ పోస్ట్ ద్వారా షేర్ చేసింది. టేస్ట్ అట్లాస్ ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 వంటకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. అందులో మొదటిది టోంబిక్ అయితే, జాబితాలో చివరిది టోర్టా అహోగడాగా. ఇందులో భారతీయ స్ట్రీడ్ పుడ్ అయిన వడా పావ్ 13 స్థానంలో నిలవగా, ఈ వంటకానికి 4.4 రేటింగ్ లభించింది. ఇంతలో, భారతీయ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వడ పావ్ గురించి వివరిస్తూ, టేస్ట్ అట్లాస్ తన వెబ్సైట్లో ఇలా రాసుకొచ్చింది. "ఈ ప్రసిద్ధ చిరుతిండిని 1960 నుంచి 1970 లలో దాదర్ రైలు స్టేషన్‌కు సమీపంలో పనిచేసిన స్ట్రీట్ వెండర్ (వీధి వ్యాపారి) అశోక్ వైద్య కనుగొన్నట్లు సమాచారం. అతను ఆకలితో ఉన్న సిబ్బందికి ఆహారం అందించేందుకు ఈ వంటకాన్ని కనుగొన్నాడు. ముందుగా అశోక్ తన వంటకంలో ఏం ఉండాలో నిర్ణయుంచుకుని.. అందులో తక్కువ ధర, రుచి, సులభంగా రవాణా చేయడం వంటివి పరిగణలోకి తీసుకుని ఈ వడ పావ్‌ను కనుగొన్నట్లు పేర్కొంది. చట్నీతో తింటే సూపర్ కాలక్రమేణా వడపావ్‌కు ప్రజాదరణ కూడా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వడపావ్‌కు వచ్చిన రేటింగ్‌పై చాలా మంది నెటిజన్లు సంతోషంగా లేరు. ఈ చిరుతిండిని నంబర్ వన్‌గా లిస్ట్ చేసి ఉండాలని అభిప్రాయపడుతున్నారు. వడ పావ్ అంటే ప్రాణం అని ఒక యూజర్ కామెంట్ చేయగా, చట్నీతో కూడిన మరొక వడ పావ్ కాంబినేషన్ టేస్ట్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
గోల్డ్ వడపావ్‌ను చూశారా? ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
వడ పావ్.. ఈ మాట వినిగానే ఠక్కున గుర్తొచ్చేది ముంబై నగరం. వడ పావ్లకు ముంబై పెట్టింది పేరు. అక్కడి ప్రజలకు ఈ స్ట్రీట్‌ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే వడ పావ్ పేరుతో దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. దుబాయ్‌లోని కరమాలో ఉన్న భారతీయులకు సేవలు అందించడంలో ప్రసిద్ధి చెందిన ఓ పావో అనే సంస్థ స్పెషల్‌గా గోల్డ్ వడపావ్ వంటకాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే తొలిసారి 22 క్యారెట్ల గోల్డ్ వడ పావ్‌ను ప్రారంభిస్తున్నట్లు సెప్టెంబర్ 1న తమ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఈ గోల్డ్ వడ పావ్‌ను మొత్తం ఛీజ్, బట్టర్‌తో ఫిల్ చేస్తారు. తరువాత బంగారం రంగులో ఉండే పిండిలో ముంచి తీసి నూనెలో వేయించి ఇస్తారు. దీంతో అచ్చం బంగారంలా కనిపిస్తుంది. దీన్ని ఓ చెక్క డబ్బాలో పెట్టి ఇస్తారు. ఈ వడాపావ్‌తో పాటు స్వీట్ పొటాటో ఫ్రైస్, పుదీనా లేమనేడ్ని కూడా ఇస్తారు. ఇంత అద్భుతంగా తయారు చేసి అందించడంతో ఈ వడపావ్ భోజన ప్రియులను ఎంతగానే ఆకట్టుకుంటోంది. చదవండి: ఢిల్లీకి నయాగరా వాటర్ ఫాల్స్ వచ్చిందిరోయ్.. వైరల్ వీడియో అయితే ఈ గోల్డ్ వడ పావ్ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. దీని ధర 99 దిర్హామ్ అంటే మన కరెన్సీలో సుమారు రూ. 2 వేలు అన్నమాట. మరి ఇంత ఖరీదైన, ఢిఫరెంట్ వడాపావ్‌ను సాధారణంగా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తే ఏం విలువుంటుంది? అందుకే ప్రజంటేషన్లో ఏమాత్రం తీసిపోకుండా 22 క్యారెట్ల బంగారం వడాపావ్ రేంజ్‌లోనే ప్రజంటేషన్ కూడా ఉంది. చదవండి:అద్భుత ఫోటో షూట్..విషయం తెలిస్తే కన్నీళ్లొస్తాయ్! View this post on Instagram A post shared by O’Pao (@opaodxb) -
వైరల్: ఎప్పుడైనా ఎగిరే వడాపావ్ తిన్నారా?!
ముంబై: మీరు ఎగిరే దోశెను చూసుంటారు. కానీ ఎగిరే వడాపావ్‌ను చూసుంటారా? చూడకపోతే ఇది మీ కోసమే! మహారాష్ట్రలోని ముంబైకి చెందిన రఘు అనే వ్యక్తి టిఫిన్ బండి నడుపుతున్నాడు. అయితే అతడు తను చేసేది ఎంత రుచికరంగా ఉండాలనుకుంటాడో చేసే విధానం కూడా అంతే ఆసక్తికరంగా ఉండాలనుకున్నాడు. అందుకని జనాలను ఆకర్షించేందుకు తనకంటూ ఓ స్టైల్ ఏర్పరుచుకున్నాడు. ఓ చేత్తో వడను గాల్లోకి ఎగరేస్తూ మరో చేత్తో వాటిని అందుకుని పెనం మీద వేస్తున్నాడు. ఇదేదో కొత్తగా ఉండటంతో ఫుడ్ లవర్స్ అతడి బండి దగ్గరకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈ ఎగిరే వడాపావ్‌కు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు రున్నర లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించగా పలువురు నెటిజన్లు అతడి టాలెంట్‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అతడు కేవలం వడాపావ్ మాత్రమే కాకుండా దోశ, ఇడ్లీవడా వంటి ఇతర టిఫిన్స్ కూడా చేస్తాడట. మరి మీరూ అతగాడి చేతివంటను రుచి చూడాలంటే ముంబైలోని బోర బజార్ స్ట్రీట్‌కు వెళ్లాల్సిందే! చదవండి: పులికి చుక్కలు చూపించిన కోతి.. వీడియో వైరల్ వైరల్: కాకి తెలివికి మెచ్చుకోవాల్సిందే! -
ట్రాఫిక్ జామ్.. నెలకు రూ.2లక్షల ఆదాయం
మనం ఎప్పుడైనా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే ఏం చేస్తాం.. ఆలస్యం అవుతుందని సణుగుతూ అక్కడినుంచి తప్పించుకునేందుకు వేరే రూటు ఉందేమోనని వెతుకుతాం. కొందరైతే ఎటూ వెళ్లలేని పరిస్థితిలో అక్కడే ఉండి చిరాకుపడుతూ ఉంటారు. కానీ థానేకు చెందిన గౌరవ్ లోండే ఒకసారి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయినప్పుడు ఒక మంచి బిజినెస్ ఐడియాను ఆలోచించి.. నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఓ రోజు గౌరవ్ ముంబై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో నాలుగు గంటలపాటు ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వచ్చింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆ సమయంలో అటుగా వేయించిన బఠానీలు విక్రయిస్తున్న వ్యకిని గౌరవ్ చూశాడు. అదిచూసిన గౌరవ్‌కు ఓ ఆలోచన వచ్చింది. బఠానీలు అమ్మినట్టే ట్రాఫిక్‌జామ్‌లో వడా పావ్ అమ్మితే ఎలా ఉంటుంది? అనే ఐడియా తట్టింది తనకు. అనుకున్నదే తడవుగా తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి 2019 జులైలో ‘ట్రాఫిక్ వడా పావ్’ బిజినెస్‌ను ప్రారంభించాడు. నాణ్యతే గాకుండా ఫ్రెష్‌గా టేస్టీగా ఉండే వడా పావ్ ప్యాకెట్‌తోపాటు ఒక చిన్న వాటర్ బాటిల్‌ను కూడా దానికి జతచేసి అమ్మడం ప్రారభించాడు. వడాపావ్ ప్యాకెట్ ధరను రూ.20లుగా నిర్ణయించి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సాయంకాల సమయంలో 5 గంటల నుంచి 10 గంటల మధ్య వడాపావ్‌ను విక్రయించడం ద్వారా నెలకు 2 రూ లక్షల వరకు సంపాదిస్తున్నాడు. (చదవండి: ట్రాఫిక్‌లో 40 గంటలు నరకయాతన..!) ‘‘2009లో నేను పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడిని. సాయంత్రం 5:30 నుంచి 6 గంటలలోపు నా వర్క్ పూర్తయ్యేది. అప్పుడు అక్కడ నుంచి ఇంటికి రావడానికి ఒక గంట సమయం పట్టేది. ఈ క్రమంలో ఎన్నోసార్లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయేవాడ్ని. ఆ సమయంలో నాకు విపరీతం గా ఆకలి వేసేది. తినడానికి ఏమీ ఉండేది కాదు. 10 ఏళ్ల తరువాత 2019లో ట్రాఫిక్ వడా పావ్ పెట్టడానికి ఈ అనుభవం కూడా ఒక ప్రేరణ అని 30 ఏళ్ల గౌరవ్ చెప్పాడు. ఇంట్లో అమ్మచేసే వడాపావ్ చాలా రుచిగా ఉంటుంది. ఆ వడాపావ్నే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అమ్మితే క్లిక్ అవుతుందనిపించింది. అందుకే ఐడియా రాగానే ధైర్యంగా ముందుకుసాగానని గౌరవ్ చెప్పాడు. గౌరవ్ అమ్మ 52 ఏళ్ల రంజన మాట్లాడుతూ.. స్థిరంగా... నెలకు రూ. 35,000 వచ్చే ఉద్యోగాన్ని మానేయడం సరైన నిర్ణయం కాదనిపించింది. పైగా ఇప్పటికే చాలామంది వడాపావ్ బిజినెస్ చేస్తున్నారు. మేము ఈ పోటీలో నెగ్గుకు రాగలమా..? అనిపించింది కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి వ్యాపారం ప్రారంభించేందుకు సాయం చేశాను. మొదట్లో నేను వడాపావ్ తయారు చేసి ఇస్తే గౌరవ్ భార్య వాటిని ప్యాక్ చేయడంలో సాయం చేసేది. మొదటి రోజు గౌరవ్ 50 వడాపావ్‌లను అమ్మడానికి ట్రాఫిక్ జంక్షన్ల్ వద్దకు వెళ్లాడు. ఎవరూ కొనలేదు. ఇది ఇలానే మరో ఐదు రోజులపాటు కొనసాగింది. ఆ తరువాత గౌరవ్ తన మిత్రుల సాయంతో వడాపావ్‌లను అమ్మడం మొదలు పెట్టాడు. ఆ తరువాతి వారం గౌరవ్ ఫోన్ చేసి ఇంకొన్ని వడాపావ్‌లు తయారు చేసి ఇవ్వమన్నాడు. అలా ఆ ఒక్కరోజే 100 వడాపావ్‌లను అమ్మాము. అప్పటినుంచి ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బిజినెస్ అలా ముందుకు సాగిపోతోంది. ప్రస్తుతం రోజుకి 800 వడాపావ్‌లు అమ్మడం ద్వారా నెలకు రూ.2 లక్షలు ఆర్జిస్తున్నట్లు సంతోషంతో చెప్పారు. (చదవండి: గూగుల్‌నే ఫూల్ చేశాడు!) ఐడియాలు... అందరికీ వస్తాయి. అయితే వాటిని అమలు చేయడంలోనే ఉంది అసలు కిటుకు. గౌరవ్‌కి ఐడియా వచ్చింది... దానిని ఆచరణలో పెట్టాడు. మొదట్లో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. ఆ తర్వాత నిలదొక్కుకున్నాడు. కాస్త వ్యాపారం పుంజుకున్నాక గౌరవ్ ఒక షాపును అద్దెకు తీసుకుని, రూ.6000 వేతనంతో 8 మంది డెలివరీ బాయ్స్‌ను నియమించుకున్నాడు. వీళ్లంతా ఒక యూనిఫామ్ వేసుకుని వడాపావ్‌ను విక్రయిస్తున్నారు. సంకల్పం గట్టిదైతే సాధ్యం కానిది ఏది లేదని గౌరవ్ సక్సెస్ స్టోరీ మనకు చెప్పకనే చెబుతోంది. – పోకల విజయ దిలీప్ -
వడా పావ్ ఎలా తినాలంటే?
దేశ ఆర్థిక రాజధాని ముంబై పేరు చెప్పగానే ఆహార ప్రియులకు మొదటగా గుర్తొచ్చేది ‘వడా పావ్’. పేదాగొప్ప తేడాలను చెరిపేసే ఈ స్కాక్కు మరాఠ ప్రజలు పట్టం కడతారు. అయితే శుక్రవారం ముంబై వీధుల్లో టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేకు వడా పావ్ తింటుంటే అతడికి ఓ సందేహం కలిగింది. దీంతో తన సందేహాన్ని నివృతి చేసుకునేందుక వెంటనే తన అధికారిక ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘మీకు వడా పావ్ ఎలా తినడం ఇష్టం.. 1, చాయ్‌తో వడా పావ్, 2. చట్నీతో వడా పావ్, 3. కేవలం వడా పావ్’అంటూ తన మనసులోని సందేహాన్ని ట్వీట్ రూపంలో భయటపెట్టాడు. అయితే రహానే అడిగిన ప్రశ్నకు ఫ్యాన్స్ వినూత్నంగా సమాధానం ఇచ్చారు. అయితే రహానే ట్వీట్‌కు మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యాడు. ‘నాకు వడా పావ్ని ఎర్ర చట్నీతో కాస్త గ్రీన్ చట్నీ, ఇంకాస్త చింతపండు చట్నీతో తినడం చాలా ఇష్టం’ అని సచిన్ రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సచిన్ మంచి భోజనప్రియడు మాత్రమే కాకుండా సూపర్ చెఫ్ అన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన వంటకాలను ఎలా వండాలో తెలుసుకొని నేర్చుకుని వండి అతడి సన్నిహితులకు రుచి చూపిస్తాడు. ఇక గతంలో ఓ మరాఠ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘నేను, నా కొడుకు(అర్జున్) శివాజీ పార్క్ జింఖానా వద్ద వడా పావ్ తింటాం. ఈ స్నాక్‌కి ధీటైన వస్తువు మరొకటి లేదు’ అని సచిన్ పేర్కొన్న సంగతి విదితమే. I like my Vada Pav with red chutney, very little green chutney & some imli chutney to make the combination even better👍 — Sachin Tendulkar (@sachin_rt) January 10, 2020 -
కింగ్ వడా పావ్
మెక్ డొనాల్డ్, డోమినోస్...అమెరికా టు ఇండియా...అబ్బో... అంటూ లొట్టలేస్తున్నశబ్దాలు వినిపించాయి.ఆ శబ్దాలు ధీరజ్‌కి కూడావినిపించాయి.తను కూడా లొట్టలువేయించాలనుకున్నాడు...తన మెదడుకు పదును పెట్టాడు.ముంబైలోని వడాపావ్పరిమాణం పెంచాడు.జంబో కింగ్‌ను ప్రారంభించాడు.అందరినీ ఆకట్టుకున్నాడు.ముంబైకి చెందిన ధీరజ్ గుప్తా...అతడు తన విజయం కోసం వేసినఅడుగులే ఈ నాటి ఫుడ్ ప్రింట్స్... రెండు దశాబ్దాల క్రితం అంటే 1998లో ముంబైలో ఎంబిఏ పూర్తి చేసిన ధీరజ్ గుప్తా సొంతంగా ఒక వ్యాపార సంస్థను స్థాపించాలనుకున్నాడు. ముందుగా స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టాలనుకున్నాడు. అందుకోసం చాలా కృషి చేశాడు. శ్రమకు తగ్గ ఫలితం లభించలేదు. రెండు సంవత్సరాల కాలంలో గుప్తా సుమారు 50 లక్షల సొమ్ము పోగొట్టుకున్నాడు. దురదృష్టమేమిటంటే, చేబదులు అడిగి తీసుకుని పెట్టుబడిగా పెట్టిన సొమ్ము ఇది. స్వీట్స్ వ్యాపారం గుప్తా జీవితంలో తీపి జ్ఞాపకాలను కాదు, పచ్చి వగరు చేదులను కలగలిపిన అనుభవాలను మిగిల్చింది. కొత్త రుచులు... ప్రతి పరాజయం విజయానికి మెట్టు కావాలనుకున్నాడు. ఈ రెండు సంవత్సరాల కాలం తన దృష్టిని మెక్‌డొనాల్డ్, డొమినోస్ సంస్థలు అమ్మే పిజ్జాలు, బర్గర్ల మీద కేంద్రీకరించాడు. ఇప్పుడు అందరికీ కొత్త రుచుల మీద మనసు మళ్లిందని అర్థం చేసుకున్నాడు. తన స్వీట్స్ బిజినెస్‌కు స్వస్తి పలికి, కొత్త రుచుల బాటలో అడుగులు ప్రారంభించాడు. విదేశాల నుంచి దిగుమతైన బర్గర్లు, పిజ్జాలకు బదులుగా స్థానిక వడాపావ్‌ను పాపులర్ చేయాలనుకున్నాడు. అప్పటికే మహారాష్ట్ర వీధులలో బాగా పాపులర్ అయిన వడాపావ్‌ను వీధినుంచి స్టార్ స్థాయికి తీసుకురావాలనుకున్నాడు. తన ఖరీదైన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి రెండు లక్షల రూపాయలు అప్పు చేసి, తన వడాపావ్‌కు ‘జంబో కింగ్’ అని పేరు పెట్టాడు. ఆ పేరున రిటైల్ చైన్ మార్కెట్ ప్రారంభించాడు. లాభాలతో ప్రారంభం... ముంబై మలాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో 200 చదరపు అడుగుల స్థలంలో 2001, ఆగస్టు 23న మొట్టమొదటి జంబో కింగ్ ఔట్లెట్ ప్రారంభమైంది. వడపావ్ సైజును 20 శాతం పెంచి, కంటికి ఇంపుగా కనిపించేలా తయారుచేసి, అమ్మకానికి సిద్ధం చేశాడు. ధీరజ్ గుప్తా ఆలోచన, శ్రమలకు ఫలితంగా మొట్టమొదటి రోజునే ఐదు వేల రూపాయల సరుకు అమ్మగలిగాడు. ఆ సంవత్సరం 40 లక్షల లాభం సంపాదించినా, మరో ఔట్లెట్ ప్రారంభించడానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2003లో మరో ఔట్లెట్ ప్రారంభమై, 2005 నాటికి ఐదు ఔట్లెట్ల స్థాయికి ఎదిగింది. మరింత ఎదగాలనుకున్నాడు. పరిశుభ్రత, ప్యాకింగ్ విషయాలలో జాగ్రత్త వహించాడు. జంబో కింగ్‌కు వచ్చి వడాపావ్ తిన్న వారంతా వాహ్! క్యా టేస్ట్ హై!! అంటూ ఇరుగుపొరుగువారిని కూడా రుచి చూసేలా చేశారు. పైసా ఖర్చు లేకుండా జంబో కింగ్‌కి ప్రచారం వచ్చేసింది. వారిని చూసి... 2006 నాటికి 100 మెక్‌డొనాల్డ్ స్టోర్లు దేశవ్యాప్తంగా విస్తరించడం చూసిన ధీరజ్ గుప్తా తాను కూడా ముంబై నుంచి బయటకు అడుగులు వేయాలనుకున్నాడు. తన కల సాకారం కావడానికి చాలా కాలం పట్టింది. 2007 నాటికి తన కల ఫలించింది. ఒక మల్టీ నేషనల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ జంబో కింగ్‌ను మార్కెటింగ్ చేయడానికి అంగీకరించింది. దాంతో గుప్తాకు బాలారిష్టాలన్నీ తొలగినట్లయింది. అన్ని నగరాలకు జంబో కింగ్ ఫ్రాంచైజ్ ఇచ్చేశారు గుప్తా. ఇప్పుడు జంబో కింగ్ 12 మహానగరాలకు వ్యాపించింది. వంద స్టోర్లు తెరుచుకున్నాయి. మరిన్ని నగరాలకు విస్తరించడానికి సన్నద్ధమవుతున్నారు గుప్తా. వడ పావ్ స్టాల్స్‌ని ఏటిఎంలలాగ దేశమంతా అందుబాటులోకి తీసుకు రావడమే గుప్తా కోరిక. ప్రతి ఫ్రాంచైన్ ఓనర్ ఒక పెద్ద వ్యాపారవేత్త అవుతున్నాడు. ప్రతి స్టోర్ విజయవంతంగా నడుస్తోంది. అందువల్ల జంబో కింగ్ కూడా వృద్ధిలోకి వస్తోంది. లాభాలతో ప్రయాణిస్తున్న జంబో కింగ్ ఇప్పుడు ఏడాదికి 35 శాతం నికర లాభంతో నడుస్తోంది. సైజులో మార్పు తెచ్చాడు. తన జీవితాన్నే మార్చేసుకున్నాడు ధీరజ్ గుప్తా. నాణ్యతప్రమాణాలు పాటిçస్తున్నారా లేదా, వినియోగదారులు తృప్తిగా ఉన్నారా లేదా అనే అంశం మీద ఆడిట్ చేస్తుంటాను. ఇందుకోసం కొందరు యువకులను నియోగించాను. వారు ఒక సాధారణ కస్టమర్లాగ స్టాల్‌కి వెళ్లి, పరీక్షిస్తుంటారు. ఇలా చేయడానికి ఒక్కో స్టోర్‌కి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. ఏ స్టోర్‌కి సంబంధించి నెగిటివ్ రిపోర్టు వచ్చినా, ఆ స్టోర్ మీద తగు చర్యలు తీసుకుంటాను. 100వ ఔట్లెట్ ప్రారంభించేనాటికి మా టర్నోవర్ 50 కోట్లకు ఎదగాలని కోరుకుంటున్నాను.– ధీరజ్ గుప్తా, జంబో కింగ్, ముంబై -
‘అభిషేక్ నటించడం మాని వడపావ్ అమ్ముకో’
బాలీవుడ్లో నెటిజన్ల చేతిలో తరచుగా ట్రోలింగ్‌కు గురయ్యే నటుడు ఎవరైనా ఉన్నారంటే అదిఅభిషేక్ బచ్చనే. గత కొంత కాలంగా అభిషేక్ కెరీర్లో సరైన హిట్లు లేవు. ఈ మధ్యే ఆయన నటించిన ‘మన్మర్జియా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం కూడా అభిమానులను నిరాశ పర్చడంతో నెటిజన్లు అభిని విమర్శిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇలా కామెంట్ చేసిన వారిలో హర్షవర్ధన్ కాలే అనే వైద్యుడు కూడా ఉన్నాడు. హర్షవర్ధన్ అభిని అవమానిస్తూ ‘‘మన్మర్జియా’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎంత మంచి సినిమా అయినా సరే.. దానిలో అభిషేక్ బచ్చన్ నటిస్తే ఫ్లాప్ అవుతుంది. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. హిట్ సినిమాను.. ఫ్లాప్ చేసే టాలెంట్ అందరికీ ఉండదు. బంధుప్రీతికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అభిషేక్‌తో పాటు ఇతర స్టార్‌కిడ్స్ నటించడం మానేసి వడాపావ్ వ్యాపారం చేసుకోవాలి’ అంటూ ట్విటర్లో ఓ మెసేజ్ పెట్టాడు. అంతేకాక ‘స్త్రీ’ సినిమా మంచి విజయం సాధించింది. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది ప్రతిభ ముఖ్యమని’ అంటూ హర్షవర్ధన్ ట్వీట్ చేశాడు. #Manmarziyaan tanked at box-office, once again proving @juniorbachchan to be legend with amazing ability to make good film a flop! Kudos to his abilities, not many have it! It time to end #nepotism and for #StarKids to start #Vadapav stall..lol! #Stree proves #TalentCounts!! pic.twitter.com/mFdJTZ0ERA — drharshavardhankale (@DrHarshKale) September 25, 2018 అయితే సదరు వైద్యుడు చేసిన కామెంట్స్‌కి జూనియర్ బచ్చన్ తనదైన శైలీలో సమాధానం చెప్పాడు. ‘డాక్టర్ లాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మీరు అన్ని విషయాల గురించి తెలుసుకుని మాట్లాడితే మంచింది. ముందు మీరు బాక్సాఫీస్ లెక్కలు, నిజానిజాలు తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి. మీ దగ్గరకు వచ్చే పేషంట్సతో కూడా ఇలానే ప్రవర్తిస్తారా’ అంటూ అభి ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ల పరంపర ఇంతటితో ఆగలేదు. అభి ట్వీట్‌కు హర్షవర్ధన్ ప్రతిస్పందిస్తూ..‘మీరు ఇలాగే ఆశిస్తూ ఉండండి జూనియర్ బచ్చన్. ఇలా ట్వీట్ చేయడానికి నేనేం సిగ్గు పడటం లేదు. వరుసగా 16 ఫ్లాప్స్ ఇచ్చిన యాక్టర్లు సిగ్గుపడాలి. ఇండస్ట్రీలో బంధుప్రీతి రాజ్యమేలుతోంది కదా.. మీరు మంచి మనిషే కావచ్చు. కానీ భయంకరమైన యాక్టర్’ అంటూ రిట్వీట్ చేశాడు. With all due respect kind sir, I would expect an esteemed doctor such as yourself to study all the facts and figures before proclaiming anything. I certainly hope you do so with your patients. Learn the economics of the film before you tweet something that will embarrass you. 🙏 — Abhishek Bachchan (@juniorbachchan) September 26, 2018 అతని ట్వీట్స్‌కు అభిషేక్ స్పందిస్తూ.. ‘వడా పావ్ వ్యాపారం పెట్టుకోవడం చాలా గౌరవప్రదమైన అంశం. దానిని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఇతర వృత్తులను కించపరచకండి. ఎవరికి వారు తమ రంగాల్లో బాగానే రాణిస్తున్నారు. మీరు అన్నట్లు ‘స్త్రీ’ చిత్రం మంచి విజయం అందుకుంది. కానీ ఆ సినిమాలోనూ ఓ స్టార్ కిడ్(శ్రద్ధా కపూర్) ఉన్నారని మరచిపోకండి. సినిమాలను.. మమ్మల్ని విశ్లేషించడం మానేసి మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి’ అంటూ అభి ట్వీట్ చేశారు. And for your kind information ( and I'm sure all vada pav stall owners will agree) there is great dignity in owning and running a vada pav stall. It's called dignity of labour. Try not to be so patronising about another professional. We are all doing our best. — Abhishek Bachchan (@juniorbachchan) September 26, 2018 -
వడ బండి
అంతా గడబిడగా ఉంది... మబ్బు జాడ తెలియకుంది. వడగాడ్పుల దాడి ఉంది.మరి విరుగుడు? మూడ్ పాడు చేసుకోకండి... బాండిలి వేడి చేయండి.వడ కాల్చితే వాన వస్తుంది... రుచి తాకితే మబ్బు కమ్ముతుంది. లొట్టలే మెరుపులు. తేన్పులే ఉరుములు. మిరియం వడ కావలసినవి: పొట్టు మినప్పప్పు – పావు కిలో; చాయమినప్పప్పు – పావు కిలో; మిరియాలు – అర టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉప్పు – తగినంత తయారీ:∙పొట్టు మినప్పప్పు, చాయ మినప్పప్పుల్ని విడివిడిగా నానబెట్టి, నీరు వడ కట్టేయాలి. ∙ఉప్పు, ఇంగువ జత చేసి మిక్సీలో వేసి గారెల పిండి మాదిరిగా పిండి గట్టిగా వచ్చేలా మిక్సీ పట్టాలి. ∙ఈ పిండిలో విడిగా ఉన్న మినప్పప్పు, మిరియాల పొడి (కచ్చాపచ్చాగా దంచాలి) వేసి బాగా కలపాలి. ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పిండిని వడల మాదిరిగా ఒత్తుకుత్తుకోవాలి. అలా ఒత్తినవాటిని నూనెలో వేసి దోరగా వేయించాలి. ∙ఇవి కరకరలాడుతూ నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. అలసంద పాలక్ వడలు కావాల్సినవి: అలసందలు – ఒకటిన్నర కప్పులు; పాల కూర తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉప్పు – తగినంత తయారీ: ∙అల్సందులకు తగినన్ని నీళ్లు జత చేసి సుమారు 8 గంటలపాటు నానబెట్టి నీరు ఒంపేయాలి. ∙కొద్దిగా నీరు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ∙వెడల్పాటి పాత్రలో అల్సందుల పిండి, పాలకూర తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీద తరుగు, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలపాలి. ∙బాణలిలో నూనె కాగాక పిండిని వడల మాదిరిగా ఒత్తుకుని నూనెలో వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. బ్రెడ్ వడ కావలసినవి: బ్రెడ్ స్లయిసెస్ – 5; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – టీ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; మిరియాల పొడి – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – కొద్దిగా; పెరుగు – పావు కప్పు; బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు; బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙బ్రెడ్ స్లయిసెస్‌ను చిన్న చిన్న ముక్కలు చేసి, మిక్సీలో వేసి మెత్తగా పొడిలా వచ్చేలా చేయాలి. ∙ఒక పాత్రలో బ్రెడ్ పొడి, ఉల్లి తరుగు, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర వేసి మెత్తగా చేయాలి. మిరియాల పొడి, జీలకర్ర, ఇంగువ కూడా జత చేయాలి. ∙బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, తాజా పెరుగు, ఉప్పు జత చేసి మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ∙మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే, కొద్దిగా నీళ్లు జత చేయాలి. ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని వడల మాదిరిగా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. రైస్ వడలు కావలసినవి: వెల్లుల్లి – 4 రెబ్బలు; అల్లం ముక్క – చిన్నది; పంచదార – 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు – టీ స్పూను; సోయా సాస్ – 2 టీ స్పూన్లు; చిల్లీ సాస్ – ఒక టీ స్పూను; వెనిగర్ – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – గుప్పెడు; అన్నం – 2 కప్పులు (అన్నాన్ని ఫోర్క్‌తో చిదమాలి); పల్లీ పప్పుల ముక్కలు – ముప్పావుకప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉప్పు – తగినంత తయారీ: ∙అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పంచదార, పచ్చి మిర్చి తరుగులను మిక్సీలో వేసి మెత్తగా పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. ∙సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, కొత్తిమీర జత చేయాలి. ∙ఈ మిశ్రమానికి చిదిమిన అన్నం జత చేసి బాగా కలపాలి. ∙చేతులకి కొద్దిగా నూనె పూసుకుని అన్నం మిశ్రమాన్ని వడల మాదిరిగా ఒత్తాలి. ∙బాణలిలో నూనె కాగాక, ఒత్తుకున్న ఒక్కో వడను పల్లీల పొడిలో దొర్లించి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టిష్యూ మీదకు తీసుకోవాలి. సొరకాయ సెనగల వడలు కావలసినవి: సొరకాయ – 1 (చిన్నది); నానబెట్టిన సెనగలు – 200 గ్రా; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – టేబుల్ స్పూను; పచ్చిమిర్చి తురుము – 2 టీ స్పూన్లు; జీలకర్ర – టీ స్పూను; నూనె – వేయించడానికి సరిపడా; ఉప్పు – తగినంత; తయారీ: సొరకాయ తొక్కు తీసి సన్నగా తురమాలి. నానబెట్టిన సెనగలకు ఉప్పు జోడించి మెత్తగా రుబ్బాలి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లి పాయ, అల్లం తురుము, పచ్చి మిర్చి తురుము, జీలకర్ర, సొరకాయ తురుము వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించాలి. బాణలిలో నూన పోసి కాగాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేసి వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. రాగి మసాలా వడలు కావలసినవి: రాగి పిండి – 2 కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; ఉల్లి తరుగు – 4 స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – తగినంత; పుదీనా – ఒక కట్ట; ధనియాల పొడి – 2 చెంచాలు; ఉప్పు – తగినంత; కారం – తగినంత; నూనె – తగినంత తయారీ: ఒక గిన్నె తీసుకుని అందులో పైన చెప్పిన పదార్థాలన్నీ (నూనె మినహా) వేసి కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి. స్టౌమీద బాణలిలో నూనె కాగాక పిండిని వడల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి.రుచితో పాటు ఆరోగ్యం కూడా. సాబుదానా దహీ వడ కావలసినవి: పెరుగు – 2 కప్పులు; సగ్గు బియ్యం – కప్పు; బియ్యప్పిండి – కప్పు; పసుపు – టీ స్పూను; ఉల్లిపాయలు – రెండు; కొత్తిమీర – ఒక కట్ట; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చి మిర్చి – 4; జీలకర్ర – చిటికెడు; నూనె – పావు కేజీ; ఉప్పు – తగినంత తయారీ ∙సగ్గుబియ్యాన్ని పెరుగులో రెండు గంటలపాటు నానబెట్టాలి. ∙బియ్యప్పిండిని నానబెట్టిన సగ్గుబియ్యానికి జత చేసి వడల పిండి మాదిరిగా కలుపుకోవాలి. ∙ఈ మిశ్రమంలో నూనె మినహా మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. -
వడ పావ్ అమ్మబోతున్న రణబీర్!
చాక్లెట్ బోయ్ రణబీర్ కపూర్ సేల్స్‌మన్ అవతారం ఎత్తబోతున్నారు. ముంబయ్‌లోని ఓ ప్రముఖ కాలేజీ దగ్గర వడ పావ్‌లు అమ్మబోతున్నారు. సాక్షాత్తు రణబీరే అమ్మబోతున్నాడు కాబట్టి, వడ పావ్‌లు హాట్ కేక్‌ల్లా అమ్ముడుపోతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకీ అవి అమ్మాల్సిన అవసరం రణబీర్‌కి ఎందుకొచ్చింది? అనేకదా మీ సందేహం. ఆ విషయానికే వస్తున్నాం. ముంబయ్‌లోని ఓ ట్రక్ డ్రైవర్ కూతురు బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోంది. చికిత్సకు నాలుగు లక్షల రూపాయలు కావల్సి ఉండగా, ఆమె తండ్రి లక్ష రూపాయలు సమకూర్చుకున్నాడు. మిగతా డబ్బు కోసం ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న అతనికి ఓ ప్రముఖ చానల్ సహాయం చేయాలనుకుంది. దీనికోసం రణబీర్ సహాయం తీసుకోవాలనుకుంది. తమ చానల్లో ప్రసారం కానున్న ఓ షోలో పాల్గొనాల్సిందిగా రణబీర్‌ని కోరారు సదరు చానల్‌వారు. బాలిక తండ్రి ట్రక్ డ్రైవర్ కాబట్టి, అదే గెటప్‌లో ఆ షోలో పాల్గొనాల్సిందిగా పేర్కొన్నారట. రణబీర్ పాల్గొంటే టీఆర్పీ రేటింగ్ బాగా రావడంతో పాటు ప్రకటనలు కూడా భారీగానే వస్తాయి. తద్వారా వచ్చే డబ్బుని ఆ ట్రక్ డ్రైవర్‌కి ఇవ్వాలనుకున్నారు. అయితే, అలా కాకుండా ఓ కాలేజ్ దగ్గర వడ పావ్‌లు అమ్ముతున్నట్లుగా కాన్సెప్ట్‌ని మార్చితే బాగుంటుందని, ఆ అమ్మకాల ద్వారా వచ్చే డబ్బుని కూడా బాలిక చికిత్సకు ఉపయోగించవచ్చని రణబీర్ అన్నారట. ఐడియా బాగుందంటూ దానికే ఓకే చెప్పారు చానల్‌వారు