వడ పావ్ అమ్మబోతున్న రణబీర్! | Ranbir Kapoor to sell vada pav for a television show | Sakshi
Sakshi News home page

వడ పావ్ అమ్మబోతున్న రణబీర్!

Published Fri, Feb 7 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

వడ పావ్ అమ్మబోతున్న రణబీర్!

వడ పావ్ అమ్మబోతున్న రణబీర్!

 చాక్లెట్ బోయ్ రణబీర్ కపూర్ సేల్స్‌మన్ అవతారం ఎత్తబోతున్నారు. ముంబయ్‌లోని ఓ ప్రముఖ కాలేజీ దగ్గర వడ పావ్‌లు అమ్మబోతున్నారు. సాక్షాత్తు రణబీరే అమ్మబోతున్నాడు కాబట్టి, వడ పావ్‌లు హాట్ కేక్‌ల్లా అమ్ముడుపోతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకీ అవి అమ్మాల్సిన అవసరం రణబీర్‌కి ఎందుకొచ్చింది? అనేకదా మీ సందేహం. ఆ విషయానికే వస్తున్నాం. ముంబయ్‌లోని ఓ ట్రక్ డ్రైవర్ కూతురు బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోంది. చికిత్సకు నాలుగు లక్షల రూపాయలు కావల్సి ఉండగా, ఆమె తండ్రి లక్ష రూపాయలు సమకూర్చుకున్నాడు. మిగతా డబ్బు కోసం ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న అతనికి ఓ ప్రముఖ చానల్ సహాయం చేయాలనుకుంది. దీనికోసం రణబీర్ సహాయం తీసుకోవాలనుకుంది. తమ చానల్‌లో ప్రసారం కానున్న ఓ షోలో పాల్గొనాల్సిందిగా రణబీర్‌ని కోరారు సదరు చానల్‌వారు. బాలిక తండ్రి ట్రక్ డ్రైవర్ కాబట్టి, అదే గెటప్‌లో ఆ షోలో పాల్గొనాల్సిందిగా పేర్కొన్నారట.
 
  రణబీర్ పాల్గొంటే టీఆర్‌పీ రేటింగ్ బాగా రావడంతో పాటు ప్రకటనలు కూడా భారీగానే వస్తాయి. తద్వారా వచ్చే డబ్బుని ఆ ట్రక్ డ్రైవర్‌కి ఇవ్వాలనుకున్నారు. అయితే, అలా కాకుండా ఓ కాలేజ్ దగ్గర వడ పావ్‌లు అమ్ముతున్నట్లుగా కాన్సెప్ట్‌ని మార్చితే బాగుంటుందని, ఆ అమ్మకాల ద్వారా వచ్చే డబ్బుని కూడా బాలిక చికిత్సకు ఉపయోగించవచ్చని రణబీర్ అన్నారట. ఐడియా బాగుందంటూ దానికే ఓకే చెప్పారు చానల్‌వారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement