ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఒకే ఆర్డర్‌లో ఏకంగా 11,000 వడాపావ్‌ను డెలివరీ చేసి ఈ రికార్డ్ నెలకొల్పింది. ఈ ఘనత సాధించేందుకు ‘సింగం ఎగేన్’ సినిమా బృందంతోపాటు ‘రాబిన్‌హుడ్ ఆర్మీ’ అనే ఎన్‌జీఓతో కలిసి పని చేసినట్లు అధికారులు తెలిపారు.
స్విగ్గీ ఇటీవల భారీ ఆర్డర్ల కోసం ప్రారంభించిన ‘స్విగ్గీ ఎక్స్‌ఎల్’ సదుపాయంతో ఈ డెలివరీలు అందించినట్లు చెప్పారు. ఇందుకోసం ‘సింగం ఎగేన్’ ఫేమ్ అజయ్ దేవగన్, ఆ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టితో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ముంబైలోని ఎంఎం మిఠాయివాలా తయారు చేసిన వడా పావ్‌లను ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ ఎన్‌జీఓ సాయంతో బాంద్రా, జుహు, అంధేరీ ఈస్ట్, మలాడ్, బోరివాలిలోని పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. విలే పార్లేలోని ఎయిర్‌పోర్ట్ హైస్కూల్, జూనియర్ కాలేజీలో ఈ ఈవెంట్ ప్రారంభమైంది.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ నెట్‌వర్క్ సేవలకు డేట్ ఫిక్స్
ఈ సందర్భంగా స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ మాట్లాడుతూ..‘గడిచిన పదేళ్లలో స్విగ్గీ ముంబైతోపాటు ఇతర నగరాల్లో మిలియన్ల కొద్దీ వడా పావ్‌లను డెలివరీ చేసింది. కానీ గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం డెలివరీ చేసిన ఈ వడాపావ్ చాలా ప్రత్యేకమైంది. ఈమేరకు సింగం ఎగేన్ సినిమా టీమ్‌తోపాటు రాబిన్‌హుడ్ ఆర్మీతో జట్టుకట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ డెలివరీకి స్విగ్గీ ఎక్స్‌ఎల్ ఎంతో ఉపయోగపడింది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment