gunissbook record
-
‘సింగం ఎగేన్’ టీమ్‌తో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఒకే ఆర్డర్లో ఏకంగా 11,000 వడాపావ్‌ను డెలివరీ చేసి ఈ రికార్డ్ నెలకొల్పింది. ఈ ఘనత సాధించేందుకు ‘సింగం ఎగేన్’ సినిమా బృందంతోపాటు ‘రాబిన్‌హుడ్ ఆర్మీ’ అనే ఎన్జీఓతో కలిసి పని చేసినట్లు అధికారులు తెలిపారు.స్విగ్గీ ఇటీవల భారీ ఆర్డర్ల కోసం ప్రారంభించిన ‘స్విగ్గీ ఎక్స్ఎల్’ సదుపాయంతో ఈ డెలివరీలు అందించినట్లు చెప్పారు. ఇందుకోసం ‘సింగం ఎగేన్’ ఫేమ్ అజయ్ దేవగన్, ఆ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టితో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ముంబైలోని ఎంఎం మిఠాయివాలా తయారు చేసిన వడా పావ్లను ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ ఎన్జీఓ సాయంతో బాంద్రా, జుహు, అంధేరీ ఈస్ట్, మలాడ్, బోరివాలిలోని పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. విలే పార్లేలోని ఎయిర్పోర్ట్ హైస్కూల్, జూనియర్ కాలేజీలో ఈ ఈవెంట్ ప్రారంభమైంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవలకు డేట్ ఫిక్స్ఈ సందర్భంగా స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ మాట్లాడుతూ..‘గడిచిన పదేళ్లలో స్విగ్గీ ముంబైతోపాటు ఇతర నగరాల్లో మిలియన్ల కొద్దీ వడా పావ్లను డెలివరీ చేసింది. కానీ గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం డెలివరీ చేసిన ఈ వడాపావ్ చాలా ప్రత్యేకమైంది. ఈమేరకు సింగం ఎగేన్ సినిమా టీమ్‌తోపాటు రాబిన్‌హుడ్ ఆర్మీతో జట్టుకట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ డెలివరీకి స్విగ్గీ ఎక్స్ఎల్ ఎంతో ఉపయోగపడింది’ అన్నారు. -
ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నును చూశారా!
ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నును చూశారా? ఇక్కడున్న పెన్ను అదే! జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీ యూని–బాల్ వన్ సిరీస్ బ్లాక్ జెల్ పెన్ను. ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. దీని సిరా లోపలి వినూత్నమైన వర్ణద్రవ్య కణాల కారణంగా ఈ పెన్నుతో కాగితంపై రాస్తున్నప్పుడు ఇది ఇతర బ్లాక్ జెల్ పెన్నుల కంటే రంగును మరింత నల్లగా కనిపించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ పెన్నుకు సంబంధించిన వివరాలను కంపెనీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. చాలామంది ఈ పెన్నును కొనడానికి పోటీ పడుతున్నారు. కానీ ఇది ఇంకా మార్కెట్లో విడుదల కాలేదు. త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. (చదవండి: కథక్ నుంచి తీన్మార్ వరకు ఏదైనా..వారెవా! అనేలా ఇరగదీస్తాడు!) -
గిన్నిస్ పెళ్లిళ్లు
జైపూర్: రాజస్తాన్ పెళ్లిళ్లలో రికార్డు సాధించింది. కేవలం 12 గంటల్లో 2 వేలకు పైగా జంటలకు ముడిపెట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. బారన్లో ఈ సామూహిక వివాహ కార్యక్రమం మే 26న జరిగినట్టుగా గిన్నిస్ వరల్డ్ బుక్ అధికారులు వెల్లడించారు. శ్రీ మహవీర్ గోశాల కళ్యాణ్ సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా కార్యక్రమంలో హిందువులు, ముస్లిం జంటలు కూడా ఒక్కటయ్యారు. 2013లో 24 గంటల్లో 963 పెళ్లిళ్లు జరిపి యెమన్ పేరిట ఉన్న ఈ రికార్డుని బద్దలు కొడుతూ కేవలం 12 గంటల్లోనే 2,413 మంది జంటలకి వివాహం జరిపించారు. అప్పటికప్పుడు ఈ పెళ్లిళ్లను అధికారికంగా రిజిస్టర్ కూడా చేయించారు. -
తండ్రి అడుగుల్లో తనయి.. మొదటి గురువు ఆయనే.. ఆరేళ్లకే
సాక్షి, నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆ చిన్నారికి పట్టుమని 11 ఏళ్లు. అయినా కూచిపూడి నాట్యకళాకారిణిగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిలో ప్రదర్శనలు. గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించింది. చిన్నారి నృత్య, అభినయానికి పలువరి ప్రసంశలు కూడా అందుకుంది నెల్లూరుకు చెందిన నృత్యకారిణి విజయ హరిణి. తండ్రి అడుగుల్లో అడుగులువేసి.... మద్దులూరి సురేష్, అలేఖ్య దంపతులు నెల్లూరు రామలింగాపురం వాసులు. సురేష్ వెస్ట్రన్ డ్యాన్సర్‌గా రాణించి సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా స్థిరపడ్డాడు. తండ్రి డ్యాన్సును చిన్నప్పటి నుంచి చూసిన హరిణికి డ్యాన్స్ పట్ల ఆసక్తి పెరిగింది. అది గమనించిన తండ్రి తానే కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుని తనయికి నేర్పాడు. తొలి గురువుగా తాను చేసి ప్రయత్నం ఫలించింది. అతి తక్కువ సమయంలోనే హరిణి నృత్యకళాకారిణిగా ఎదిగింది. తండ్రి తనయుల నృత్య ప్రదర్శన, గిన్నీస్ బుక్‌లో స్థానం నవరసాలను అభినయిస్తూ, కూచిపూడి నృత్యంలో వివిధ అంశాలపై నృత్య రూపకాలతో తన ప్రతిభను చాటింది. పిల్లలు తల్లిదండ్రుల ఇష్టాలకు అనుగుణంగా ఎదిగితే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందోనని ఈ తండ్రి కూతుళ్లు తమ నృత్యంతోనే జవాబిచ్చారు. తండ్రి కూతుళ్ల బంధాన్ని నృత్యం మరింత పెనవేసింది. దీంతో విజయ హరిణి కూచిపూడి నృత్యకారిణిగా రాణిస్తుంది. విజయానికి తొలి అడుగు ఇంటి నుండే ప్రారంభమై దేశవ్యాప్తమైంది. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వాలని ఆ చిన్నారి ఆకాంక్ష. కాళికామాత అభినయంలో హరిణి హరిణి నృత్య ప్రస్థానం ఇలా... – 2016లో ఆరేళ్ల వయసులో నెల్లూరు టౌన్ హాలులో మొదటి ప్రదర్శనతో నృత్య కిషోర్ అవార్డును అందుకుంది. – 2018లో తిరుపతిలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జాతీయ పోటీల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. – 2018లో లేపాక్షిలో జరిగిన ఉత్సవాల్లో తెలుగు బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం దక్కించుకుంది. – 2019లో హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో నృత్య తరంగిణి అవార్డును మాజీ గవర్నర్ రోశయ్య చేతులమీదుగా అందుకుంది. – 2019లో నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. – 2020లో చెన్నైలో త్యాగయ్య టీవీ ఆధ్వర్యంలో లార్జెస్ట్ కూచిపూడి లెవెన్‌లో తన తండ్రి సురేష్‌తో పాటు పాల్గొని గిన్నీస్బుక్ఆఫ్వరల్డ్ రికార్డులో స్థానం సాధించింది. – ప్రతి ఏడాది షిర్డీలో బాబా ఉత్సవాల్లో బాబా సమాధి వద్ద క్రమం తప్పని నృత్య ప్రదర్శన. హరిణి నృత్య ప్రదర్శన -
30 ఏళ్లుగా పెంచుకున్న గోళ్లను ఆ కారణంగా కట్ చేయించుకుంది..
వాషింగ్టన్: అమెరికాలోని హ్యూస్టన్ నగరానికి చెందిన అయన్నా విలియమ్స్ అనే మహిళ.. తన చేతి వేళ్ల గోళ్లను 30 సంవత్సరాలుగా పెంచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె 2017లో అత్యంత పొడవైన చేతి వేళ్ల గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది. అయితే గత కొంతకాలంగా తన పొడవాటి గోళ్లతో ఇబ్బందులు పడుతున్న ఆమె.. వాటిని కత్తరించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు ఆమె వైద్యుల సమక్షంలో గోళ్లను తొలిగించుకుంది. ఆమె గోళ్లను చివరి సారిగా కొలిచినప్పుడు వాటి పొడవు 733.55 సెంటీమీటర్లుగా నమోదైంది. ఆమె తన రెండు చేతుల గోళ్లను పాలిష్ చేసుకోవడానికి రెండు సీసాల నెయిల్ పాలిష్ అవసరమయ్యేది. ఇందుకు గాను ఆమెకు దాదాపు 20 గంటల సమయం పట్టేది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) కాగా, గత కొంతకాలంగా రోజువారీ పనులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఆమె టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్ చర్మవ్యాధుల ఆసుపత్రిని సంప్రదించింది. నిపుణుల సమక్షంలో ఆమె తన గోళ్లను కత్తిరించుకుంది. తొలగించే సమయంలో గోళ్ల పొడవు 24 అడుగుల 7 అంగుళాలుగా తేలింది. అయితే గోళ్లు తొలగించిన తర్వాత ఆమె సంతోషంగా పనులు చేసుకోగలుగుతున్నానంటోంది. వంట చేయడం, పాత్రలు కడగటం, మంచంపై దుప్పట్లు పరచడం వంటి పనులను చిటికెలో చేసుకోగలుగుతున్నానంటూ తెగ సంబరపడిపోతుంది. -
హనుమాన్ చాలీసా మహాయజ్ఞం
గుంటూరు: తెనాలి మండల కేంద్రంలో హనుమాన్ చాలీసా మహా యజ్ఞం శనివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరగనుంది. బుర్రుపాలెం రోడ్డులోని 50ఎకరాల స్థలంలో ఈ యజ్ఞం జరుగుతోంది. దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో 1లక్షా 11వేల మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని నమోదు చేసుకునేందుకు గిన్నిస్ బుక్ రికార్డు ప్రతినిధులు ఇప్పటికే తెనాలి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులు ఒక్కొక్కరితో 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయిస్తారు. యజ ్ఞప్రాంగణంలో 50 అడుగుల ఎతైన ధ్యాన మారుతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ యజ్ఞంలో పాల్గొనేందుకు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గవర్నర్లు నర్సింహన్, కె. రోశయ్యలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు. (తెనాలి)