వాషింగ్టన్: అమెరికాలోని హ్యూస్టన్ నగరానికి చెందిన అయన్నా విలియమ్స్ అనే మహిళ.. తన చేతి వేళ్ల గోళ్లను 30 సంవత్సరాలుగా పెంచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె 2017లో అత్యంత పొడవైన చేతి వేళ్ల గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది. అయితే గత కొంతకాలంగా తన పొడవాటి గోళ్లతో ఇబ్బందులు పడుతున్న ఆమె.. వాటిని కత్తరించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు ఆమె వైద్యుల సమక్షంలో గోళ్లను తొలిగించుకుంది. ఆమె గోళ్లను చివరి సారిగా కొలిచినప్పుడు వాటి పొడవు 733.55 సెంటీమీటర్లుగా నమోదైంది. ఆమె తన రెండు చేతుల గోళ్లను పాలిష్ చేసుకోవడానికి రెండు సీసాల నెయిల్ పాలిష్ అవసరమయ్యేది. ఇందుకు గాను ఆమెకు దాదాపు 20 గంటల సమయం పట్టేది.
కాగా, గత కొంతకాలంగా రోజువారీ పనులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఆమె టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్ చర్మవ్యాధుల ఆసుపత్రిని సంప్రదించింది. నిపుణుల సమక్షంలో ఆమె తన గోళ్లను కత్తిరించుకుంది. తొలగించే సమయంలో గోళ్ల పొడవు 24 అడుగుల 7 అంగుళాలుగా తేలింది. అయితే గోళ్లు తొలగించిన తర్వాత ఆమె సంతోషంగా పనులు చేసుకోగలుగుతున్నానంటోంది. వంట చేయడం, పాత్రలు కడగటం, మంచంపై దుప్పట్లు పరచడం వంటి పనులను చిటికెలో చేసుకోగలుగుతున్నానంటూ తెగ సంబరపడిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment