ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నును చూశారా? ఇక్కడున్న పెన్ను అదే! జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీ యూని–బాల్ వన్ సిరీస్ బ్లాక్ జెల్ పెన్ను. ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. దీని సిరా లోపలి వినూత్నమైన వర్ణద్రవ్య కణాల కారణంగా ఈ పెన్నుతో కాగితంపై రాస్తున్నప్పుడు ఇది ఇతర బ్లాక్ జెల్ పెన్నుల కంటే రంగును మరింత నల్లగా కనిపించేలా చేస్తుంది.
ప్రస్తుతం ఈ పెన్నుకు సంబంధించిన వివరాలను కంపెనీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. చాలామంది ఈ పెన్నును కొనడానికి పోటీ పడుతున్నారు. కానీ ఇది ఇంకా మార్కెట్లో విడుదల కాలేదు. త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
(చదవండి: కథక్ నుంచి తీన్మార్ వరకు ఏదైనా..వారెవా! అనేలా ఇరగదీస్తాడు!)
Comments
Please login to add a commentAdd a comment