మన జీవితంలో.. ఎన్నోవాటిపై మనం ముఖ్యతను చూపుతాం. మరెన్నో వాటిపై లీనమైపోతూ ఉంటాం. ఒక్కసారైనా ఆరోగ్యాన్ని పట్టించుకుంటామా..! మరెందుకు దీనిపై అశ్రద్ధ. అలాగే మన శరీరంలోని చేతిగోళ్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా..? వాటి అందం, రంగు గురించి ఎప్పుడైనా చూడడంగానీ, గమనించడంగానీ చేశారా..! ఓసారి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ నిజాలు తెలుస్తాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం..!
ఈ విధంగా..
- గోళ్లు అందంగా ఉండాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. గోళ్లలో చీలికలు, పొడిబారిపోవడం కనిపిస్తే విటమిన్ లోపం ఉన్నట్లు అర్థం.. తెల్ల చుక్కలు కనిపిస్తే ఎప్పుడూ నెయిల్ పాలిష్ వేస్తుంటారని లేదా మీకు గోళ్లు కొరికే అలవాటుందని అర్థం చేసుకోవాలి.
- అడ్డంగా గీతలు, గాడి ఏర్పడినట్లు ఉంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, తీవ్రమైన జ్వరం బారిన పడినట్లు అర్థం. ఉబ్బెత్తుగా ఉండాల్సిన గోరు గుంట పడినట్లు పలుచగా మారితే అది ఐరన్‌లోపానికి గుర్తు.
- సమతుల ఆహారం తీసుకుంటూ, దేహం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా తగినంత నీటిని తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్/ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె వేసి వలయాకారంలో రుద్దుతూ ఉండాలి. అప్పుడు గోరు గులాబీరంగులో ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.
ఇవి చదవండి: కుండలినీ యోగాతో అల్జీమర్స్‌కు చెక్: తాజా పరిశోధన
Comments
Please login to add a commentAdd a comment