Follow
-
అడవికి అదే హీరో! మరి ఎదురుపడితే.. ఇలా చేస్తే సేఫ్‌గా బయటపడే ఛాన్స్
-
బ్యూటిప్స్: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు!
కొంతమంది స్కిన్ చాలా మెరిసిపోతుంది. మరి కొంతమందికి మాత్రం డ్రై స్కిన్, మొటిమలు, టాన్, పిగ్మంటేషన్, మచ్చలు, డల్ స్కిన్ వంటి సమస్యలు ఉంటాయి. వీటి వల్ల చాలా మంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పతారు. నలుగురిలోకి వెళ్ళలేరు. అయితే, విటమిన్ ఇ చర్మానికి సంబంధించిన అనేక సమస్యల్ని దూరం చేస్తుంది. మరి దీనిని ఎలా అప్లై చేయాలి. అప్లై చేస్తే ఏయే లాభాలు ఉన్నాయో తెలుసుకోండి. ఇలా చేయండి.. చర్మ సమస్యలకి విటమిన్ ఇ చక్కటి ఉపశమనం. ఇందుకోసం టీ స్పూన్ బొప్పాయి జ్యూస్, టీ స్పూన్ రోజ్ వాటర్‌ని తీసుకోవాలి. అందులోనే విటమిన్ ఇ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. స్కిన్ టోన్ పెరగడానికి: కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్‌ని అంతే పరిమాణంలో పెరుగు, గుడ్డుతో కలపండి. దీనిని బాగా మిక్స్ చేయండి. దీనిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయండి. తర్వాత శుభ్రం చేయండి. ముఖం మెరిసిపోతుంది. విటమిన్ ఈ ఆయిల్‌ని కలబందతో కలిపి కూడా వాడొచ్చు. దీనివల్ల ముఖం మెరిసిపోతుంది. కాంతిమంతంగా మారుతుంది. టీ స్పూన్ పరిమాణంలో గ్రీన్ టీ తీసుకోండి. అందులోనే తేనె కూడా వేయండి. తర్వాత కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్ వేయండి. వీటన్నింటిని కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. ఇవి చదవండి: చరిత్రను తిరగరాశారు.. రంగస్థలానికి కొత్త వెలుగు తెచ్చారు -
మనతో పాటు గోళ్ళు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే..
మన జీవితంలో.. ఎన్నోవాటిపై మనం ముఖ్యతను చూపుతాం. మరెన్నో వాటిపై లీనమైపోతూ ఉంటాం. ఒక్కసారైనా ఆరోగ్యాన్ని పట్టించుకుంటామా..! మరెందుకు దీనిపై అశ్రద్ధ. అలాగే మన శరీరంలోని చేతిగోళ్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా..? వాటి అందం, రంగు గురించి ఎప్పుడైనా చూడడంగానీ, గమనించడంగానీ చేశారా..! ఓసారి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ నిజాలు తెలుస్తాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం..! ఈ విధంగా.. గోళ్లు అందంగా ఉండాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. గోళ్లలో చీలికలు, పొడిబారిపోవడం కనిపిస్తే విటమిన్ లోపం ఉన్నట్లు అర్థం.. తెల్ల చుక్కలు కనిపిస్తే ఎప్పుడూ నెయిల్ పాలిష్ వేస్తుంటారని లేదా మీకు గోళ్లు కొరికే అలవాటుందని అర్థం చేసుకోవాలి. అడ్డంగా గీతలు, గాడి ఏర్పడినట్లు ఉంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, తీవ్రమైన జ్వరం బారిన పడినట్లు అర్థం. ఉబ్బెత్తుగా ఉండాల్సిన గోరు గుంట పడినట్లు పలుచగా మారితే అది ఐరన్లోపానికి గుర్తు. సమతుల ఆహారం తీసుకుంటూ, దేహం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా తగినంత నీటిని తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్/ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె వేసి వలయాకారంలో రుద్దుతూ ఉండాలి. అప్పుడు గోరు గులాబీరంగులో ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. ఇవి చదవండి: కుండలినీ యోగాతో అల్జీమర్స్‌కు చెక్: తాజా పరిశోధన -
మహేష్ బాబును ఫాలో అవుతున్న చిరంజీవి
-
చిరంజీవి దారిలో దూసుకుపోతున్న బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్
-
అల్లు అర్జున్ ను ఫాలో అవుతున్న మహేష్ బాబు & త్రివిక్రమ్
-
మహాత్ముని మార్గంలో " ర్యాగట్లపల్లి "
-
ఫేస్బుక్లో లైక్ బటన్ కనిపించదు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ యూజర్లకి సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు ఫేస్బుక్ పేజ్ లేవుట్‌లో కీలక మార్పులు చేయనుంది. దానితో పాటు పలు కొత్త ఫీచర్లని పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ఫేస్బుక్ తన పబ్లిక్ పేజీల 'లైక్ బటన్'ను తొలగించనుంది. వీటిని సాధారణంగా పబ్లిక్ ఫిగర్స్, ఆర్టిస్టులు, వివిధ బ్రాండ్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు 'లైక్ బటన్'ను తొలగించి దాని బదులు ఫాలో అనే బటన్ ద్వారా మీరు ఇష్టపడే పేజీకి సంబందించిన అప్డేట్స్ను పొందొచ్చు. ఇకనుంచి పేజీ ఫాలోవర్స్ ఆధారంగానే ఆ పేజీ ఎంత పాపులర్ అనేది నిర్దారించనున్నారు. ఒక పేజ్‌కు లైక్, ఫాలో అనే రెండు ఆప్షన్ లు ఉన్న కారణంగా సమస్య ఏర్పడుతుండటంతో ఫేస్బుక్ లైక్ బటన్ తొలగించనున్నట్లు తెలిపింది.(చదవండి: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక చుక్కలే!) -
టీడీపీ అభ్యర్థులైతే తూచ్
కావలి: కావలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. నిష్పక్షపాతంగా కోడ్‌ను అమలు చేయాల్సిన ఎన్నికల అధికారులు చూసీచూడనట్లుగా వ్యహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నా కోడ్ ఉల్లంఘనులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చామకూరు శ్రీధర్ సబ్‌కలెక్టర్‌గా చేరిన తర్వాత మొదటి ఎన్నికలు కావడంతో కింద స్థాయి సిబ్బందిపై ఆధారపడుతున్నారు. కింద స్థాయి సిబ్బందిలో టీడీపీకి అనుకూలంగా ఉన్న వారు మితిమీరిన జోక్యం చేసుకుంటూ ఆయన్ని తమ దారిలో తెచ్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సెంటర్ గురించి అన్ని రాజకీయ పార్టీలకు సమాచారాన్ని అందజేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారికి ఉంది. ఈ విషయాన్ని అభ్యర్థుల ‘హ్యాండ్‌బుక్ ఫిబ్రవరి– 2019’ పేజీ నంబర్ 130లో రూల్ నంబర్ 11.3.2లో వివరింగా పొందుపరిచారు. అయితే కావలి ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేదన్నట్లుగా వ్యహరించారు. ఎన్నికల అధికారి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో టీడీపీకి అనుకూలమైన వారి ద్వారానే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ వ్యవహారంలో ఎన్నికల అధికారి పాత్ర విమర్శలకు దారితీసింది. ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ మాన్యువల్‌లో పేజీ నంబర్ 29లో రూల్‌నంబర్ 4.4లో బీ5 ప్రకారం వ్యక్తిగత దూషణలు చేయకూడదు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర కావలిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ కావలి అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ దీనిపై నేటి వరకు ఎన్నికల అధికారి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ మాన్యువల్‌లో పేజీ నంబర్ 144లో రూల్ నంబర్ 22.4 ప్రకారం తాత్కాలిక పార్టీ కార్యాలయంలో ఫ్లెక్సీ సైజు 4 ..8 అడుగులలో మాత్రమే ఉండాలని పొందుపరిచారు. అయితే పట్టణంలోని ఎన్నికల అధికారి కార్యాలయానికి దగ్గరలో ఏర్పాటు చేసిన టీడీపీ తాత్కాలిక కార్యాలయం వద్ద 5..30 అడుగులతో ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించిన ఖర్చులు వివరాలను ఎన్నికల అధికారి పరిశీలించి అభ్యర్థి లెక్కల్లో నిర్ధిష్టంగా కనబరచాలి. కానీ ఇవేమీ జరగలేదు. ప్రయివేటు విద్యా సంస్థల్లో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని నిర్వహించకూడదు. కానీ టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావు, కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కావలిలోని పమిడి స్కూల్ ఆవరణలో భారీ సమావేశం నిర్వహించారు. ‘అభ్యర్థుల హ్యాండ్ బుక్–ఫిబ్రవరి–2019’ పేజీ నంబర్ 89,265లో ప్రయివేటు విద్యాసంస్థల్లో రాజీకీయ పార్టీలు ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టంగా పొందుపరిచి ఉన్నా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉద్యోగుల్లారా.. జర భద్రం..!
సాక్షి, నారాయణఖేడ్: ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో ప్రభుత్వోద్యోగులు తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవనే విషయాన్ని గుర్తించాలి. ఈ సమయంలో ప్రభుత్వోద్యోగులు రాజకీయ పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొనడం, నేతలను సత్కరించేందుకు అత్యుత్సాహం చూపుతుంటారు. ఇలాంటి వారికి ముకుతాడు వేసే దిశగా ఎన్నికల సంఘం 23(ఐ) నిబంధనను అమల్లోకి తెచ్చింది. 1949 సెప్టెంబర్ 17 నుంచి ఈ నిబంధన అమలులో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ నిబంధన ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. ఏదో ఒక పార్టీకి ఓటేయాలని, ఫలానా అభ్యర్థికి మద్దతివ్వాలని కొందరు బంధువులను, ఇతరులను ప్రభావితం చేస్తే, మరికొందరు సామాజిక మాధ్యమాల్లో అత్యుత్సాహం కొద్దీ పోస్టులు పెడుతుంటా రు. తెలిసీ తెలియక ఇలాంటి పనులు చేస్తే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. రాజకీయ నాయకుల మీద ఎంత అభిమానం ఉన్నా మనసులోనే దాచుకోవాలి తప్ప బహిర్గత పరిస్తే చర్యలు తీసుకుంటారన్న విషయాన్ని గుర్తించాలి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ జర భద్రంగా ఉండటం మంచిది. జెండాలు కడితే జరిమానా..! ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలను పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా పాటించాలి. ఏమాత్రం ఉల్లంఘించినా చర్యలు తప్పవు. ఇళ్లపై పార్టీ జెండాలు ఎగరేసినా, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టినా.. ఎన్నికల కోడ్ కారణంగా అధికారులు ఆ జెండాలను వచ్చి తొలగిస్తారు. తొలగించడమే కాక.. దానికయ్యే ఖర్చునూ వసూలు చేస్తారు. ఎన్నికల అధికారి ‘అనుమతి’ తీసుకుంటే అది ఏ పార్టీకి చెందిందో ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికలఖర్చు కిందకు వస్తుంది. ఎవరైనా తెలియకుండా జెండాలు, ఫ్లెక్సీలు కడితే సొంతంగా తొలగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అవకాశంఉంది. -
బార్లు, పబ్బులు నిబంధనలు పాటించాల్సిందే
హైదరాబాద్: బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలోని బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు/మేనేజర్లతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసాజ్ సెంటర్లు, పార్లర్లలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు జరగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మసాజ్ సెంటర్లు నిర్వహించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నియమ నిబంధనలను తప్పక పాటించాలని అన్నారు. మసాజ్ సెంటర్లను మసాజ్ సెంటర్లు గానే కొనసాగించాలని, వీటి ముసుగులో వ్యభిచారం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నేరమని తెలిపారు. స్పాలకు నిబంధనలు స్పాలలో తప్పనిసరిగా రిజిస్టర్ నిర్వహించాలన్నారు. ఇందులో స్పాలకు వచ్చే వారి పేరు, ఫోన్ నంబర్లను విధిగా నమోదు చేయాలన్నారు. స్పాలలో పడకల వాడకం అవసరం లేదన్నారు. సాధ్యమైనంత వరకూ క్రాస్ మసాజ్‌లకు అనుమతించవద్దని, 18 ఏళ్లకు తక్కువ ఉన్నవారిని అనుమతించొద్దని, సిసి కేమరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విజిటింగ్ వీసాలపై వచ్చిన ఇతర దేశాల వారిని స్పాలల్లో నియమించుకోవద్దన్నారు. స్పాలల్లో తలుపులు పారదర్శకంగా ఉండాలన్నారు. తలుపులకు ఎలాంటి బోల్టులను బిగించరాదన్నారు. వీలుంటే గాజు పార్టిషన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బార్లు, పబ్బులు, వైన్ షాపులకు నిబంధనలు బార్లు, పబ్బులు, వైన్ షాపుల యజమానులు కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్, లిక్కర్ లైసెన్స్, పోలీస్ లైసెన్స్‌లను తీసుకోవాలన్నారు. సమయపాలన పాటించాలని, రాత్రి 12 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలో షాపులను తెరిచి ఉంచొద్దని సూచించారు. పై నిబంధనలు అతిక్రమిస్తే మొదటిసారి సీపీ కార్యాలయానికి లేదా పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని, రెండోసారి అయితే 2, 3 రోజులు జైలు శిక్ష తప్పదని శాండిల్య హెచ్చరించారు. కేసుల నమోదుతోపాటు లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలు తీసుకున్నారు. వ్యాపారులు కనీస నైతికత పాటించాలని, సామాజిక హితాన్ని కొంతైనా పాటించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నగదు రహిత బదిలీ అమలు చేయాలి
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కాకినాడ సిటీ : నగదు రహిత బదిలీలను మీ–సేవా కేంద్రాల్లో అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. గురువారం జిల్లా శిక్షణ కేంద్రం ఆద్వర్యంలో మీ–సేవా ఆపరేటర్లకు వివిధ అంశాలపై శిక్షణ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు త్వరిత గతిన అందించేందుకు ఏర్పాటు చేసిన మీ–సేవా కేంద్రాల ద్వారా నిర్ణీత సమయంలో ఆయా సేవలను నిర్ధేశించిన రేట్లకే అందించాలన్నారు. నగదు రహిత సేవలకు సంబంధించి స్వైపింగ్ మెషీన్లు, యాప్‌లను వినియోగించాలన్నారు. ప్రభుత్వ సేవలను విస్తృతంగా ప్రజలకు అందించాలని, సర్వీసులు ఎక్కువైన తరువాత దుర్వినియోగానికి పాల్పడినా, నిర్ణయించిన చార్జీల కంటే ఎక్కువ వసూలు చేసినా జరిమానా విధింపు, విధుల నుంచి తొలగింపు వంటి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ శిక్షణలో పాల్గొన్న ఆపరేటర్లు అన్ని విషయాలు సమగ్రంగా నేర్చుకోవాలన్నారు. జిల్లా ట్రైనింగ్ కో ఆర్డినేటర్ ఎన్వీఎస్ సూరపురాజు, ఎన్ఐసీ డీఐవో ఉస్మాన్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు
-
ఆన్లైన్ ఫైలింగ్‌ను అనుసరించాలి
∙పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్యరాజ్ వరంగల్ సిటీ : వ్యాపార లావాదేవీలను ఆన్లైన్ ఫైలింగ్ చేయడం ద్వారా విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్యరాజ్ పారిశ్రామికవేత్తలకు సూచించారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో బుధవారం చాంబర్ సంయుక్త కార్యదర్శి కంది రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అప్లికేషన్’ అనే అంశంపై జిల్లాలోని పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్యరాజ్, ఆ శాఖ జా యింట్ డైరెక్టర్ సురేష్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఆన్లైన్ ఫైలింగ్ ద్వారా వ్యాపార సమాచారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చు లు గణనీయంగా తగ్గుతాయన్నారు. ఇందుకుగానూ ప్రభుత్వం కల్పించే అన్ని రకాల రాయితీలు పక్కాగా అందుతాయని ఉదాహరణ పూర్వకంగా వివరించారు. ఈసందర్భంగా కమిషనర్ మాణిక్యరాజ్‌కు తెలంగాణ కాటన్ మిల్లర్స్, ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు. 2005–10 ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా పాత జిన్నింగ్ మిల్లుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయనను కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇండస్ట్రియల్ సెంటర్ మేనేజర్ వై.హృషికేష్, తెలంగాణ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, చాంబర్ ప్రతినిధులు నాగమళ్ల పూర్ణచందర్, శ్రీమన్నారాయణ, రాజయ్యయాదవ్, రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్, ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, చింతలపెల్లి వీరారావు, నాగభూషణం, కూకట్ల సత్యనారాయణ, వేణుగోపాల్, అగర్వాల్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సురేం దర్, తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
ఏరువాక శాస్త్రవేత్త సుధాన్షు ఇంద్రవెల్లి : రైతులు వ్యవసాయ అధికారులు ఇచ్చే సూచనలను తప్పక పాటించి, సాగు చేసిన పంటల్లో అధిక దిగుబడి సాధించాలని ఏరువక శాస్త్రవేత్త సుధాన్షు అన్నారు. శుక్రవారం ఆయన ఇంద్రవెల్లి మండలంలోని రాంపూర్, గౌరాపూర్ గ్రామాల్లో పర్యటించారు. రైతులు సాగు చేసిన సోయా పంటను పరిశీలించారు. సోయా పంటకు సోకిన కాండం తొలుచు పురుగు నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ పురుగు నివారణకు రైతులు 2 ఎం.ఎల్. పినల్పాస్తో పాటు ఒక ఎం.ఎల్. నువాన్ ఒక లీటరు చొప్పున నీటిలో కలిపి స్ప్రే చేయాలని వివరించారు. వ్యవసాయ అధికారి జాదవ్ కైలాస్, రైతులు పాల్గొన్నారు. -
తప్పు చేసే అధికారం మాకు లేదు..
-
ఐశ్వర్య దారిలో కత్రినా
ఓ లుక్కేస్తారా! సీనియర్లు చెప్పిన సలహాలను ఆచరణలో పెట్టడం కంటే... సీనియర్లు ఆచరించి చూపించిన దారిలో నడవడమే సులభం. జస్ట్ ఫాలో అయి పోవడమే కదా మరి! కత్రినాకైఫ్ కూడా అదే పనిలో ఉంది. 68వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనడానికి ఆమె నల్లరంగు టాప్‌లెస్ గౌన్ ధరించింది. గతంలో ఐశ్వర్య కూడా ఇదే తరహాలో గోధుమరంగు దుస్తుల్లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్‌కార్పెట్ మీద నడిచింది. ‘జీవితం అందరికీ అన్నీ ఇవ్వదు. ఏదో పొందుతూ ఉంటాం, ఇంకేదో కోల్పోతూ ఉంటాం. లెక్కలు, కారణాలు, అర్థాలు... అంటూ జీవితానికేమీ పట్టవు. అదొక అంతులేని ప్రవాహంలా సాగుతూ ఉంటుందంతే!’ ఆమె పుస్తకం చదవడం అయిపోయింది. ఆఖరి వాక్యాలు మళ్లీ చదివి, పుస్తకం మూసి, చిన్నగా నిట్టూరుస్తూ బెడ్ మీద నుండి లేచి పెరటి వైపు కెళ్లింది. అక్కడ తను పెంచుతున్న పూలతోటలోని పూలు ఆమె రాకకోసమే ఎదురుచూస్తున్నాయి. సమయం మధ్యాహ్నం నుండి సాయంత్రంలోకి రూపం మార్చుకుంటోంది. పువ్వులను ఆమె సుకుమారంగా చూసుకుంటూ పాదులు సరిచేస్తోంది. ఇంతలో ఇంటివాకిట గేటు చప్పుడయ్యింది. ఆమెకు ఎవరొచ్చారో తెలుసు. గేటు తీసుకుని అతను నేరుగా పెరటివైపు వచ్చాడు. ఆమె ఇప్పుడెక్కడ ఉంటుందో అతనికీ తెలుసు. ‘‘ఏం చేస్తున్నారు?’’ అలవాటుగా ప్రశ్నించాడతను.‘‘కూర్చోండి’’ అంటూ ఆమె మొక్కలను సరిచేస్తోంది.ఆమెను చూస్తున్నాడతను. లేత ఆకుపచ్చరంగు చీర, వదులుగా అల్లిన నల్లని జడ, ఎరుపు, పసుపు కలిసిన మేని ఛాయతో తెల్లగా నవ్విందామె అతని వైపు చూసి, ఇంద్రధనుస్సులా. కొద్దిగా తత్తరపడ్డాడు ఆమె నవ్వు చూసి. మళ్లీ తేరుకుని... ‘‘నేనడిగిన విషయం...’’ అంటూ సూటిగా విషయంలోకొచ్చాడు. ‘‘సమయం కావాలన్నానుగా’’ ఆమె పువ్వుల వైపు చూస్తూ చెప్తోంది. ‘‘మీకోసం ఎంత సమయమైనా... నాకేం అభ్యంతరం లేదు’’ అన్నాడతను. ఆమె లేచి, ‘‘కాఫీ తాగుతారా?’’ అనడిగింది. తల ఊపాడతను. ఐదు నిమిషాల్లో కాఫీ కలుపుకొచ్చిందామె. ఒకటి అతనికిచ్చి తను ఒకటి తీసుకుంది. కాసేపు మాటల్లేవు. ఆమె కాఫీ కప్పు కింద పెడుతూ, ‘‘మీరు బాగా ఆలోచించారా?’’ అనడిగింది. ‘‘ఆలోచించడానికేం లేదు’’ అతని స్పష్టమైన సమాధానం. ‘‘అయితే, ఎప్పుడో ఒకసారి మీవాళ్లదగ్గరికెళ్దాం’’ అందామె. అతను సంతోషంగా లేచి నిలబడి, ‘‘మీ తోటలో ఒక పువ్వు కోసుకోవచ్చా?’’ అనడిగాడు. అలాగే అంటూ తలూపిందామె. అతను నెమ్మదిగా ఒక రోజాపువ్వు కోసి ఆమెకే ఇచ్చాడు. ‘‘తీస్కోండి, ఇదే తొలి కానుక’’ అన్నాడు. ఆమె నవ్వుతూ తీసుకుంది. ‘‘వస్తానండీ, మళ్లీ కలుస్తాను’’ అంటూ వెళ్లిపోయాడతను ఆనందంగా. అప్పుడే పూస్తున్న పువ్వుని మృదువుగా చూసుకుంటూ లోపలికెళ్లిందామె. ఆమె తోటలో సగం పువ్వులు వెలుతురులోను, సగం పువ్వులు నీడలోను ఉన్నాయి. ఆమె ఆ రాత్రి మిద్దెమీద నిలబడ్డప్పుడు వెన్నెలంతా తనకోసమే కురుస్తున్నట్లు అనిపించిందామెకి. నల్లని పూలున్న తెల్లని చీరతో ఆకాశానికి పోటీగా నిలబడిందామె. కానీ ఆ వెన్నెల పక్కన చీకటిలాగా గతం తాలూకు జ్ఞాపకాలు కమ్ముకుంటున్నాయి ఆమెని చేదుగా... ఆమెకిదివరకే పెళ్లయింది. కానీ అసలు జీవితం అంటూ ఏమీ చూడకుండానే పెళ్లయిన సరిగ్గా వారంలోపే ఆమె భర్త మరణించాడు. తన ఫ్రెండ్స్‌కి పెళ్లి పార్టీ ఇచ్చి వస్తూ, దారిలో కారు యాక్సిడెంట్లో మరణించాడు. తర్వాత అంతా మామూలే. తలా ఒక మాట అన్నారు, తలా ఒక దారి పట్టారు ఆమెని ఒంటరిని చేస్తూ. ఆమెకు మొన్నటివరకూ అమ్మ అయినా ఉండేది అండగా. కానీ ఆమె కూడా ఈ మధ్యే చనిపోయింది. ఇప్పుడామె పూర్తిగా ఒంటరి. అందుకే తను చేస్తున్న ఉద్యోగంలో అడిగి మరీ మారుమూల ప్రాంతానికి బదిలీ చేయించుకుని వచ్చేసింది.ఆమె అప్పటినుండి పుస్తకాల్లోన్నే ప్రపంచం చూస్తోంది. పువ్వులతోనే నేస్తంగా ఉంటోంది. ఆమె తోటలోని పువ్వులు మొగ్గలు తొడిగే సమయానికి ఆమెకి నిద్రపట్టింది. ఆమె తయారయ్యింది చక్కగా. వివేక్ వాళ్లింటికెళ్లాలిప్పుడు. వాళ్ల అమ్మగారు రమ్మన్నారు మాట్లాడ్డానికి. ఆమెకు మనసులో ఒకింత బెరుకుగానే ఉంది. బయల్దేరి వెళ్లింది. వివేక్ ఆమెకోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆమె వెళ్లగానే సాదరంగా ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టాడు. వివేక్ వాళ్ల అమ్మగారు వచ్చాక, పలకరింపులు, కాఫీలు, కొంత సమయం అయ్యాక, ‘‘అమ్మా నీ గురించి మావాడు అంతా చెప్పాడు. నాకు మొదట్లో కొంచెం ఇబ్బందనిపించిన మాట వాస్తవమే. కానీ నిన్ను చూసి, నీతో మాట్లాడాక, నా అనుమానాలు, అపార్థాలు తొలగిపోయాయి. మావాడి ఇష్టమే నా ఇష్టం. ఏదో ఒకసారి నీ ప్రమేయమే లేకుండా జరగరానిది జరిగిందని నీ జీవితాన్ని బలిచేసుకోకుండా నువ్వు కూడా మంచి నిర్ణయమే తీసుకున్నావు. మా ఇంట్లోకి రావటానికి ఇక నీకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంది వివేక్ వాళ్ల అమ్మగారు. ఆమె కళ్లల్లో సన్నటి నీటిపొర. ఇంకా ఇంత మంచివాళ్లు తన చుట్టూ ఉన్నందుకు. ఆమె వాళ్లమ్మగారి ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోయింది. ఆమె పెరట్లో సగం కాసిన పువ్వులు ఆమెకోసం ఎదురుచూస్తున్నాయి. ‘‘మన పెళ్లి జరగదు వివేక్‌గారూ’’ మళ్లీ గట్టిగా చెప్పిందామె. ‘‘అదే, ఎందుకని అడుగుతున్నాను’’ ఆవేశంగా ఉన్నాడతను. ‘‘అన్నింటికీ కారణాలు చెప్పలేను, కానీ జరగదంతే’’ గట్టిగా చెప్పిందామె. ‘‘అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సడన్‌గా కాదంటే నేనేం కావాలి, అసలిదంతా ఏమిటి?’’ గట్టిగానే అరుస్తూ అడుగుతున్నాడు వివేక్. ‘‘చూడండి వివేక్, నా రాత అంతే. నేనేదన్నా ఇష్టపడే లోపే నాకది దూరం అయిపోతుంది. అదీ మంచిదే, పూర్తిగా ఇష్టపడ్డాక పోతే బాధ మరింత ఎక్కువగా ఉంటుంది.’’ అవును, నేనేమీ మిమ్మల్ని చూడగానే ప్రేమించలేదు. నా జీవన ప్రయాణంలో మీరు కలిశారు. మంచివారు, కలిసి నడుద్దాం అనుకున్నాను. కానీ కుదరడం లేదు. అందుకే ఒంటరిగానే ముందుకెళ్దామనుకుంటున్నాను. మీరు కూడా నన్ను సులభంగానే మర్చిపోవచ్చు. ఎందుకంటే మనమేం చిన్నపిల్లలం కాదు కదా, పైగా ప్రేమికులం అంతకన్నా కాదు’’ ఒత్తి పలికింది ఆఖరి వాక్యాలు. అతను విసిగిపోయాడు. ‘‘అసలిదంతా ఎందుకు? ఒక్క సరైన కారణం చెప్పండి, ఈ పెళ్లి వద్దు అనటానికి. నేనే మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాను’’ వివేక్ కళ్లు, మాటలు ఎర్రబడ్డాయి. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆమె నెమ్మదిగా ‘‘వివేక్‌గారూ! నాకు మరొకరితో సంబంధం ఉంది’’గద్గద స్వరంతో చెప్పింది. ఆమె కళ్లల్లో నీళ్లు జలజలా రాలుతున్నాయి. ఆమె మాటల అబద్ధపు సాక్ష్యాలుగా. ‘‘మరి నాతో పెళ్లికి ఒప్పుకోవటం, మా ఇంటికి రావటం... ఇదంతా..’’ అతని గొంతు వణుకుతోంది. ‘‘ఆ తర్వాతే... అంతా జరిగింది. ఇక ఇంతకన్నా ఇప్పుడు ఏం చెప్పలేను. ప్లీజ్. వెళ్లిపోండి. దయచేసి మళ్లీ కనిపించకండి.’’ ఆమె మనసు, శరీరం అంతా దుఃఖంతో నింపుకుని లోపలికెళ్లిపోయింది. అతను ఆమె వెళ్లిన వైపు చూస్తూ నిలబడిపోయాడు అచేతనంగా. ఆమె తోటలో సగం పూసిన పూలు ఎందుకో వాడిపోయాయి. కాలం గడుస్తోంది. మనుషులు, వాళ్ల ఇష్టాలు, కష్టాలు, ఆలోచనలు, విలువలు ఇవేమీ పట్టనట్టుగా, కఠినంగా. మళ్లీ దాదాపు రెండేళ్ల వరకు వివేక్ కనపడలేదామెకు. నిజానికి ఆమే వివేక్కి దూరంగా తప్పించుకు తిరిగింది. ఆ రోజు ఆమె ఉంటున్న ఊరు నుండి కొద్ది దూరంలో ఉన్న నగరానికి వెళ్లిందామె నచ్చిన పుస్తకాలు కొనుక్కోవడానికి. పుస్తకాలు చూస్తుండగా ఎవరో పక్కన నిలబడ్డట్టు అనిపించి చటుక్కున అటు తిరిగి చూసిందామె. పక్కన వివేక్... ఆమె ఆశ్చర్యంతో అతన్ని చూస్తుండగా, ‘‘బావున్నారా?’’ అడిగాడు వివేక్ మర్యాదగా. ‘‘ఆ...’’ అంటూ తలూపిందామె. ‘‘బైదిబై ఈమె నా మిసెస్. పేరు కల్పన. అఫ్కోర్స్ తను నా మేనమామ కూతురే’’ అంటూ ఆమెకు కల్పనను పరిచయం చేశాడు. ఆమె నమస్కరించింది కల్పనకు. ముగ్గురికీ పరిచయాలయ్యాక, ఆ పక్కనే ఉన్న కాఫీ హోటల్లో కూర్చుని కాఫీ తాగారు మామూలు కబుర్లతో. కాఫీలయ్యాక, కల్పన, వివేక్ ముందు నడుస్తుండగా, ఆమె వెనకాలే వస్తోంది. వివేక్ గమనించకుండా కల్పన ఒక చిన్న కాగితాన్ని చుట్టి ఆమె మీదకు విసిరింది. అది తీసి చదివిందామె - ‘థాంక్యూ ఫర్ గివింగ్ బ్యాక్ మై లైఫ్ టు మి’ అని రాసుందందులో. ఆమె చిన్నగా నవ్వుకుంది అది చూసి. ఆ నవ్వులో తృప్తి ఉందో, వేదన ఉందో వెతకటం కష్టమే. అసలేం జరిగిందంటే... ఆమె వివేక్వాళ్ల అమ్మగారితో మాట్లాడి వచ్చిన రెండ్రోజులకు... ‘‘మీరేనా మా బావని పెళ్లిచేసుకోబోతున్నది’’ అంటూ సూటిగా దూసుకొచ్చింది కల్పన ఆమె ఇంట్లోకి. ‘‘అసలు మీరెవరు?’’ అడిగిందామె ఆశ్చర్యంగా. ‘‘నేను వివేక్ మరదలిని’’ అంది కల్పన. ‘‘ఓహ్! అయామ్ సారీ. నాకు తెలీదు, కూర్చోండి’’ అందామె. ‘‘మీతో ఒక విషయం మాట్లాడాలి’’ పూర్తిగా ఒక నిర్ధారణతో మాట్లాడుతోంది కల్పన. ‘‘చెప్పండి.’’ ‘‘నేను మా బావని ప్రేమిస్తున్నాను. ఎంతగా అంటే ప్రాణం పెట్టేంతగా.’’ ఆశ్చర్యంగా చూసిందామె. ‘‘అవునండీ, నాకు మా బావంటే చిన్నప్పటినుండీ ఇష్టం. చాలా ఇష్టపడ్డాను. కానీ తన అభిప్రాయమే సరిగ్గా తెలుసుకోలేకపోయాను. ఇదిగో ఇప్పుడు మీరంటే ఇష్టపడుతున్నాడని తెలిసింది. అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను’’ అంది కల్పన. ‘‘ఏం మాట్లాడాలి?’’ ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదామె. కల్పన ఒక్క క్షణం ఆగి చెప్పనారంభించింది. ‘‘మీకిదివరకే పెళ్లయింది. కానీ దురదృష్టవశాత్తూ ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు మీకు జీవితాన్నిస్తానంటూ మా బావ వచ్చాడు. నా మాట ఒకటి శ్రద్ధగా వినండి.’’ ఆమె వింటోది. ‘‘మీ చెదిరిన జీవితానికి ఆసరాగా ఒక తోడు కావాలి మీకు. నిజమే. అది మా బావ కావొచ్చు. మరొకరు కావొచ్చు. తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని ఇష్టపడి, అర్థం చేసుకునే వ్యక్తి కావాలి మీకు. అంతే. కానీ నా విషయం అలా కాదు, నా బలం, బలహీనత అన్నీ మా బావే నాకు. నా సర్వస్వం అతనే. మీరు మా బావని వదులుకుంటే ఒక మంచి మనిషిని దూరం చేసుకుంటారు అంతే, మరేమీ కాదు. ఎందుకంటే మీరేం ప్రేమికులు కాదు కదా! కానీ నేను మా బావని వదులుకుంటే నన్ను నేను పూర్తిగా కోల్పోయినట్లే. నేనున్నా లేనట్లే. మీరు మా బావని మర్చిపోవాలంటే కొన్ని జ్ఞాపకాలు వదులుకుంటే చాలు. నేను మర్చిపోవాలంటే నా జీవితాన్నే వదులుకోవాలి’’ కల్పన కళ్లల్లో కన్నీళ్లు. ‘‘అయితే ఇప్పుడేమంటావ్?’’ అడిగిందామె కల్పన దగ్గరికొస్తూ. ‘‘నా జీవితాన్ని నాకివ్వండి’’ అంటూ ఆమె చేతులు గట్టిగా పట్టుకుంది కల్పన. ఆమె కల్పన చేతుల్ని గట్టిగా నొక్కింది అభయమిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఆమె నగరంలో వివేక్ వాళ్లని కలిసి ఇంటికొచ్చాక, అన్యమనస్కంగా పనులు చేసుకుంటోంది. ఇంతలో ఆమె సెల్‌కి ఏదో మెసేజ్ వచ్చినట్లుంటే యథాలాపంగా చూసింది. అందులో ‘‘నిండు జీవితం అంటూ ఏమీ ఉండదు. ఉండే జీవితంలోని గుర్తులు, జ్ఞాపకాలు మన వెంట తీపిగా, చేదుగా వస్తూనే ఉంటాయి. అవి మనసుకు తీసుకోవడం, తీసుకోకపోవడం మన ఇష్టం. అవి మీకు బాగా తెలుసు. అందుకే ఏదైనా తీసుకోగలరు, ఏదైనా వదులుకోగలరు. మీ వ్యక్తిత్వానికి మరొకసారి జోహార్లు. అయినా ఒక చిన్న సలహా. మీరు మళ్లీ మళ్లీ మరో కల్పనను ఉద్ధరించే పని మాత్రం పెట్టుకోకండి. ఒక్క వివేక్ చాలు బలి కావడానికి. అందరూ మీలాగా ఉండలేరు. టేక్ కేర్ సంధ్యగారూ..’’ అది వివేక్ నుండి వచ్చిన మెసేజ్. అది చదివిన ఆమెకు వివేక్కి అంతా తెలిసిందని అర్థమైంది. ఆమె మెసేజ్ చదువుతూ పెరటివైపు వెళ్లింది. అక్కడ ఆమె పూలతోటంతా చీకటి కప్పుకుని రోదిస్తోందో, విశ్రమిస్తోందో తెలియటం లేదు. ‘‘మీకిదివరకే పెళ్లయింది. కానీ దురదృష్టవశాత్తూ ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు మీకు జీవితాన్నిస్తానంటూ మా బావ వచ్చాడు. నా మాట ఒకటి శ్రద్ధగా వినండి’’ అంటూ చెప్పుకుపోతోంది కల్పన.