ఆన్‌లైన్‌ ఫైలింగ్‌ను అనుసరించాలి | Online Filing follow | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ఫైలింగ్‌ను అనుసరించాలి

Published Thu, Aug 25 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

ఆన్‌లైన్‌ ఫైలింగ్‌ను అనుసరించాలి

ఆన్‌లైన్‌ ఫైలింగ్‌ను అనుసరించాలి

  • ∙పరిశ్రమల శాఖ కమిషనర్‌ మాణిక్యరాజ్‌
  • వరంగల్‌ సిటీ : వ్యాపార లావాదేవీలను ఆన్‌లైన్‌ ఫైలింగ్‌ చేయడం ద్వారా విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పరిశ్రమల శాఖ కమిషనర్‌ మాణిక్యరాజ్‌ పారిశ్రామికవేత్తలకు సూచించారు. వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో బుధవారం చాంబర్‌ సంయుక్త కార్యదర్శి కంది రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘ఆన్‌లైన్‌ ఫైలింగ్‌ ఆఫ్‌ ఇన్‌సెంటివ్స్‌ అప్లికేషన్‌’ అనే అంశంపై జిల్లాలోని పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి పరిశ్రమల శాఖ కమిషనర్‌ మాణిక్యరాజ్, ఆ శాఖ జా యింట్‌ డైరెక్టర్‌ సురేష్‌ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఆన్‌లైన్‌ ఫైలింగ్‌ ద్వారా వ్యాపార సమాచారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చు లు గణనీయంగా తగ్గుతాయన్నారు. ఇందుకుగానూ ప్రభుత్వం కల్పించే అన్ని రకాల రాయితీలు పక్కాగా అందుతాయని ఉదాహరణ పూర్వకంగా వివరించారు.
     
    ఈసందర్భంగా కమిషనర్‌ మాణిక్యరాజ్‌కు తెలంగాణ కాటన్‌ మిల్లర్స్, ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌ రెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు. 2005–10 ఇండస్ట్రియల్‌ పాలసీ ద్వారా పాత జిన్నింగ్‌ మిల్లుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయనను కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇండస్ట్రియల్‌ సెంటర్‌ మేనేజర్‌ వై.హృషికేష్, తెలంగాణ కాటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, చాంబర్‌ ప్రతినిధులు నాగమళ్ల పూర్ణచందర్, శ్రీమన్నారాయణ, రాజయ్యయాదవ్, రైస్‌ మిల్లర్స్‌ అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్, ఎర్రబెల్లి వెంకటేశ్వర్‌రావు, చింతలపెల్లి వీరారావు, నాగభూషణం, కూకట్ల సత్యనారాయణ, వేణుగోపాల్, అగర్వాల్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సురేం దర్, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement