
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్లకి సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు ఫేస్‌బుక్ పేజ్ లేవుట్‌లో కీలక మార్పులు చేయనుంది. దానితో పాటు పలు కొత్త ఫీచర్లని పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ఫేస్‌బుక్ తన పబ్లిక్ పేజీల 'లైక్ బటన్'ను తొలగించనుంది. వీటిని సాధారణంగా పబ్లిక్ ఫిగర్స్, ఆర్టిస్టులు, వివిధ బ్రాండ్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు 'లైక్ బటన్'ను తొలగించి దాని బదులు ఫాలో అనే బటన్ ద్వారా మీరు ఇష్టపడే పేజీకి సంబందించిన అప్‌డేట్స్‌ను పొందొచ్చు. ఇకనుంచి పేజీ ఫాలోవర్స్ ఆధారంగానే ఆ పేజీ ఎంత పాపులర్ అనేది నిర్దారించనున్నారు. ఒక పేజ్‌కు లైక్, ఫాలో అనే రెండు ఆప్షన్ లు ఉన్న కారణంగా సమస్య ఏర్పడుతుండటంతో ఫేస్‌బుక్ లైక్ బటన్ తొలగించనున్నట్లు తెలిపింది.(చదవండి: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక చుక్కలే!)
Comments
Please login to add a commentAdd a comment