2021లో వాట్సాప్‌కు ఏ విదంగాను కలిసి రావడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకువచ్చి చిక్కుల్లో పడింది. ఆప్పటి నుంచి ఎన్ని కొత్త ప్రయత్నాలు చేసిన యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది. దీని ప్రధాన ప్రత్యర్థులైన టెలిగ్రాం, సిగ్నల్ యాప్ లు మాత్రం దూసుకెళ్తున్నాయి. 2021 జనవరిలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన నాన్-గేమింగ్ యాప్స్‌లో టెలిగ్రాం అన్నిటికంటే ముందంజలో ఉంది. ఈ విషయాన్నీ సెన్సార్ టవర్ అనే డేటా సంస్థ వెల్లడించింది.
టెలిగ్రాంను ఎక్కువ శాతం డౌన్‌లోడ్ చేసిన వారిలో 24 శాతం మంది భారతీయులు ఉన్నారు. ఈ మెసేజింగ్ యాప్ ను గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 6.3కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనిలో భారతదేశం నుంచే 1.5 కోట్ల మంది టెలిగ్రామ్ ను డౌన్‌లోడ్ చేశారు. టెలిగ్రాంను 2020 జనవరిలో డౌన్‌లోడ్ చేసుకున్న దానికంటే 3.8 రెట్లు ఎక్కువగా ఈసారి డౌన్‌లోడ్ చేసుకున్నారు. డౌన్‌లోడ్‌లలో ఆకస్మిక పెరుగుదల ప్రధాన కారణం వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలు అనే చెప్పుకోవాలి. వాట్సాప్ కొత్త విధానాలు వినియోగదారులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దింతో చాలా మంది టెలిగ్రామ్‌కు మారారు.
2వ స్థానంలో టిక్‌టాక్
ఇక డౌన్‌లోడ్ పరంగా టిక్‌టాక్ రెండవ స్థానంలో ఉండగా తర్వాత స్థానాలలో సిగ్నల్, ఫేస్‌బుక్ ఉన్నాయి. వాట్సాప్ మునుపటితో పీలిస్తే జనవరిలో మూడవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయింది. "టాప్ యాప్స్ వరల్డ్ వైడ్ ఫర్ జనవరి 2021 బై డౌన్లోడ్స్" అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో సెన్సార్ టవర్ ఈ విషయాన్ని తెలిపింది. టెలిగ్రాం డౌన్‌లోడ్లలో 24 శాతంతో భారత్ ప్రథమ స్థానంలో ఉండగా, 10 శాతం డౌన్‌లోడ్‌లతో ఇండోనేషియా రెండవ స్థానంలో ఉంది. మనదేశంలో టిక్‌టాక్ ను బ్యాన్ చేసినప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా డౌన్‌లోడ్ సంఖ్య 6.2కోట్లకు చేరుకుంది. దీనిలో 17 శాతం చైనా నుంచి కాగా 10శాతం మంది అమెరికా నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు.
చదవండి: లీకైన వన్‌ప్లస్ 9ప్రో ఫోటోలు
గెలాక్సీ ఎఫ్62 లాంచ్ తేదీ వచ్చేసింది!
Comments
Please login to add a commentAdd a comment