వాట్సాప్ గత కొద్దీ రోజుల క్రితం కొత్తగా ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే కొత్తగా తీసుకువచ్చిన ప్రైవసీ నిబంధనలను అంగీకరించకపోతే ఫిబ్రవరి 8నుంచి వారి మొబైల్ ఫోన్స్ లలో వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి వాట్సాప్ సేవలపై ప్రపంచ వ్యాప్తంగా అనేక రూమర్లు వస్తున్నాయి. వాట్సాప్ యూజర్ల డేటాను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తో షేర్ చేసుకోనున్నట్లు కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. (చదవండి: వాట్సాప్, ఫేస్‌బుక్‌లను నిషేధించండి)
తాజాగా వాట్సాప్ ఈ రూమర్లపై స్పందించింది. వ్యక్తిగత ఖాతాల యొక్క డేటాను ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఇతర వాటి కోసం ఉపయోగించదు అని పేర్కొంది. "యూజర్ల పంపిన మెసేజ్ లకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న కారణంగా తన వినియోగదారుల సందేశాలను చదవలేమని, కాల్‌లను వినలేమని" వాట్సాప్ నొక్కి చెప్పింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ మీ వ్యక్తిగత సందేశాలకు ఎటువంటి ఆటంకం కలిగించదని సంస్థ పేర్కొంది. అయితే ఈ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు కేవలం వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ కు మాత్రమే వర్తిస్తుంది అని సంస్థ పేర్కొంది.
We want to address some rumors and be 100% clear we continue to protect your private messages with end-to-end encryption. pic.twitter.com/6qDnzQ98MP
— WhatsApp (@WhatsApp) January 12, 2021
వారికీ మాత్రమే ప్రైవసీ నిబంధనలు..
వాట్సాప్ బిజినెస్ సేవలను మరింత మెరుగు పరచడం కోసం, వ్యాపార సంస్థలకు తమ ఖాతాదారులతో వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం కోసం ఫేస్‌బుక్ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలకు మరింత ప్రయోజనం కల్పించడం కోసం వాట్సాప్ లో రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్, మీ లొకేషన్, డివైజ్ మోడల్, ఐపీ అడ్రస్ వంటి వివరాలను సేకరించి ఆయా వ్యాపార సంస్థలు మనకు సేవలు అందించడం కోసం స్టోర్ చేసుకునే అవకాశాన్ని ఫేస్‌బుక్ కల్పించబోతోంది. వాట్సాప్ బిజినెస్ లో నేరుగా వినియోగదారులు ప్రోడక్టులను, సర్వీసులకి ఆర్డర్ చేసి పేమెంట్ చేసే అవకాశం కూడా రాబోతోంది కాబట్టి, వాట్సప్ పేమెంట్స్ లావాదేవీ వివరాలను కూడా ఆయా వ్యాపార సంస్థలు రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకునే వెసులుబాటుని ఫేస్‌బుక్ కల్పిస్తూ దానికి మన ఆమోదాన్ని కోరుతూ ప్రైవసీ పాలసీ ముందుపెట్టింది.
సిగ్నల్ యాప్ వాట్సాప్ కంటే ఎందుకు భిన్నం?
వాట్సాప్ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన వెంటనే చాలా మంది ఇతర యాప్ల వైపు మొగ్గు చూపారు. ఆ సమయంలో ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ " సిగ్నల్ వాడండి" అని ట్విటర్ లో ఒక ట్విట్ చేసాడు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా సిగ్నల్ డౌన్లొడ్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దింట్లో కూడా వాట్సాప్ మాదిరిగానే ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ ఉండటం విశేషం.(చదవండి: మీ స్నేహితులను సిగ్నల్‌కు ఆహ్వానించండి ఇలా..?)
సిగ్నల్ మెసెంజర్‌ను మోక్సీ మార్లిన్‌స్పైక్, బ్రియాన్ ఆక్టన్ 2018లో స్థాపించారు. స్పష్టంగా చెప్పాలంటే బ్రియాన్ ఆక్టన్ వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు కూడా. సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లకు వాట్సాప్ ను 2014లో కొనుగోలు చేసింది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మరియు సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ మెసేజింగ్ యాప్ ద్వారా డబ్బు సంపాదించాలని అనుకున్నప్పుడు సోషల్ మీడియా సంస్థ నుంచి నిష్క్రమించాలని యాక్టన్ నిర్ణయించుకున్నాడు. సంస్థను విడిచిపెట్టిన వెంటనే బ్రియాన్ ఆక్టన్ ఓపెన్ విస్పర్ సిస్టమ్స్ యొక్క మోక్సీ మార్లిన్‌స్పైక్‌తో జతకట్టి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ సిగ్నల్‌తో పాటు సిగ్నల్ ఫౌండేషన్‌ను 2018లో ఏర్పాటు చేసాడు.
You can make an app used by many millions of people that has no data...Cool chart by @forbes & @UKZak 🙈🙊🙉 https://t.co/gWFqyIeoZ3 pic.twitter.com/Unngddaq5M
— Signal (@signalapp) January 5, 2021
సిగ్నల్ యొక్క యొక్క ముఖ్య లక్ష్యం తన వినియోగదారులకు అత్యంత సురక్షితమైన మెసెంజర్ యాప్ ను అందించడం. వాస్తవానికి చెప్పాలంటే, ప్రస్తుతం సిగ్నల్ యొక్క ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్‌ను వాట్సాప్ ఉపయోగిస్తుంది. సిగ్నల్ ద్వారా పంపిన సందేశాలు రహస్యంగా ఉంచబడుతాయి. అనగా తన మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో ప్రైవేట్ సందేశాలను, మీడియాను సిగ్నల్ సర్వర్‌లో నిల్వ చేయదు. వాట్సాప్ కూడా సందేశాల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కూడా అందిస్తుంది. కానీ, ఇది ఐపీ అడ్రస్, గ్రూప్ వివరాలు, స్టేటస్ వంటి ఇతర ప్రైవేట్ సమాచారాన్ని యాక్సెస్ చేస్తుంది. సంస్థ క్లౌడ్‌లో నిల్వ చేసిన సందేశాలను కూడా గుప్తీకరించదు(ఎన్క్రిప్షన్). ఇంకో మెసెంజర్ యాప్ టెలిగ్రామ్ కూడా యూజర్ యొక్క కాంటాక్ట్ నంబర్ మరియు యూజర్ ఐడీని నిల్వ చేస్తుంది. అయితే, డివైజ్ ఆఫ్‌లైన్‌లో ఉంటే సందేశాలు పంపబడే వరకు సిగ్నల్ కొన్ని దాని సర్వర్‌లో దాని సందేశాలను నిల్వ చేస్తుంది. సిగ్నల్ రిజిస్ట్రేషన్ లాక్ కోసం పిన్ను సెట్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. ఇది వినియోగదారులకు ప్రైవేట్ ప్రొఫైల్ సమాచారాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఒక వినియోగదారు పరికరాన్ని కోల్పోతే లేదా క్రొత్తదానికి మారిన ప్రొఫైల్, సెట్టింగులు, కాంటాక్ట్స్ ను తిరిగి పొందడానికి ఈ లాక్ పిన్ ఉపయోగపడుతుంది. మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే, వాట్సాప్ మాదిరిగా కాకుండా సిగ్నల్ పెద్ద టెక్నాలజీ సంస్థ యాజమాన్యంలో లేదు.
యూజర్ ప్రైవసీ మాట ఏమిటి?
వాట్సాప్ మాదిరిగా కాకుండా సిగ్నల్ డేటాలో నిల్వ చేయబడేది కేవలం ఫోన్ నంబర్ మాత్రమే. సందేశాలను రక్షించడంతో పాటు, సిగ్నల్ మెటాడేటా యొక్క సమాచారాన్ని దాచిపెడుతుంది. దింతో ఎవరు ఎవరికి సందేశం పంపిస్తున్నారో తెలియదు. వినియోగదారులు అజ్ఞాత కీబోర్డ్ మోడ్‌ను అందించడంతో పాటు యాప్ లో స్క్రీన్షాట్‌లను బ్లాక్ చేయవచ్చు. ఇటీవల, యాప్ లో ఫోటోలను పంపే ముందు ముఖాలను బ్లర్ చేయడానికి కొత్తగా ఒక ఫీచర్ ను కూడా తీసుకొచ్చింది. అలాగే దీని కాంటాక్ట్ లిస్ట్ లో మొబైల్ నెంబర్ కనిపించకుండా చేయొచ్చు కూడా. ప్రస్తుతం ఈ యాప్ గ్రాంట్లు, విరాళాల ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు మొబైలలో సిగ్నల్ యాప్ అందుబాటులో ఉంది. వినియోగదారులు డెస్క్‌టాప్ ద్వారా కూడా దీనిని యాక్సెస్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment