Signal App
-
ఫేస్బుక్ డౌన్.. వారికి మాత్రం పండుగే పండుగ!
రెండు రోజుల క్రితం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమయంలో అమెరికాకు చెందిన ఫోటో మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ వినియోగం ఒకేసారి 23 శాతం పెరిగింది. ఫేస్బుక్లో ఈ అంతరాయం కారణంగా సుమారు 2.7 బిలియన్ వినియోగదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. ఫేస్బుక్ యాజమాన్యంలోని యాప్స్ లో అంతరాయం కలగడంతో సిగ్నల్, టెలిగ్రామ్, టిక్ టాక్, ట్విట్టర్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లను యూజర్లు ఎక్కువగా వినియోగించారు. దీంతో ఇతర యాప్స్ వినియోగం భారీగా పెరిగింది. టెలిగ్రామ్ వినియోగం 18 శాతం, సిగ్నల్ యాప్ వినియోగం 15 శాతం పెరిగినట్లు ఆ సంస్థలు నివేదించాయి. అక్టోబర్ 4(సోమవారం) ఫేస్బుక్లో అంతరాయం ఏర్పడిన సమయంలో 70 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ ను వినియోగించారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ సేవలు అన్ని గంటల సేపు నిలిచిపోవడానికి అంతర్గతంగా నెలకొన్న కమ్యూనికేషన్ టూల్స్‌లో లోపాలే కారణమని వెల్లడైంది. కన్ఫిగరేషన్ మార్పుల్లో తలెత్తిన లోపాల వల్ల సర్వీసులకి అంతరాయం ఏర్పడింది ఆ సంస్థ ఇంజినీర్ల బృందం తన బ్లాగ్‌లో వెల్లడించింది. (చదవండి: గూగుల్ నుంచి ‘స్నోకోన్’, దాని వెనుక చరిత్ర ఏంటో తెలుసా?) -
దేశంలో వాట్సప్ బ్యాన్ కానుందా?
కేంద్ర ప్రభుత్వం నిన్న(ఫిబ్రవరి 25) డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరుతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 అనే కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధనలు అమలైతే ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు చిక్కులు తప్పవని నిపుణులు భావిస్తున్నారు. ఈ నూతన నిబంధనల ప్రకారం వివాదాస్పద మెసేజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు వాటి మూలాలను వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం వంటి ఇతర మెసేజింగ్ సంస్థలు తప్పని సరిగా పాటించాలి. ఈ కొత్త నిబంధనల వల్ల మెసేజ్‌లకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత ఉందని చెబుతున్న వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం వంటి సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజా నిబంధనల ప్రకారం వివాదాస్పద మెసేజ్ మొదటి ఎవరి నుంచి వచ్చిందో కచ్చితంగా తెలియజేయాలి. అలాగే ఓ ట్వీట్ లేదా మెసేజ్ భారత్ నుంచి పోస్ట్ కాలేదని వెల్లడైతే.. అప్పుడు భారత్‌లో దాన్ని ముందుగా ఎవరు రిసీవ్ చేసుకున్నారో సదరు యాప్ తప్పనిసరిగా వెల్లడించాలని నూతన ఐటీ నిబంధనలను ప్రకటిస్తూ కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. గతంలో ఓ మెసేజ్ మూలాలను వెల్లడించాలని వాట్సాప్‌ను ప్రభుత్వం కోరగా ఇది తమ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రతకు విరుద్ధమని మెసేజింగ్ యాప్ ఆ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది. ఇక నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్ విధిగా ప్రభుత్వం అడిగిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేల ఈ కొత్త నిబంధనలు పాటించకపోతే వాట్సాప్‌తో పాటు ఇతర మెసేజింగ్ సంస్థలను బ్యాన్ చేసే అవకాశం ఉంది. చదవండి: గూగుల్ మెసేజిస్ లో అదిరిపోయే ఫీచర్ ఏడు స్క్రీన్ల ల్యాప్‌టాప్‌ను చూశారా! -
వాట్సాప్‌ను వెనక్కి నెట్టేసిన టెలిగ్రాం
2021లో వాట్సాప్‌కు ఏ విదంగాను కలిసి రావడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకువచ్చి చిక్కుల్లో పడింది. ఆప్పటి నుంచి ఎన్ని కొత్త ప్రయత్నాలు చేసిన యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది. దీని ప్రధాన ప్రత్యర్థులైన టెలిగ్రాం, సిగ్నల్ యాప్ లు మాత్రం దూసుకెళ్తున్నాయి. 2021 జనవరిలో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన నాన్-గేమింగ్ యాప్స్‌లో టెలిగ్రాం అన్నిటికంటే ముందంజలో ఉంది. ఈ విషయాన్నీ సెన్సార్ టవర్ అనే డేటా సంస్థ వెల్లడించింది. టెలిగ్రాంను ఎక్కువ శాతం డౌన్లోడ్ చేసిన వారిలో 24 శాతం మంది భారతీయులు ఉన్నారు. ఈ మెసేజింగ్ యాప్ ను గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 6.3కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిలో భారతదేశం నుంచే 1.5 కోట్ల మంది టెలిగ్రామ్ ను డౌన్లోడ్ చేశారు. టెలిగ్రాంను 2020 జనవరిలో డౌన్లోడ్ చేసుకున్న దానికంటే 3.8 రెట్లు ఎక్కువగా ఈసారి డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్లలో ఆకస్మిక పెరుగుదల ప్రధాన కారణం వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలు అనే చెప్పుకోవాలి. వాట్సాప్ కొత్త విధానాలు వినియోగదారులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దింతో చాలా మంది టెలిగ్రామ్‌కు మారారు. 2వ స్థానంలో టిక్‌టాక్ ఇక డౌన్లోడ్ పరంగా టిక్‌టాక్ రెండవ స్థానంలో ఉండగా తర్వాత స్థానాలలో సిగ్నల్, ఫేస్బుక్ ఉన్నాయి. వాట్సాప్ మునుపటితో పీలిస్తే జనవరిలో మూడవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయింది. "టాప్ యాప్స్ వరల్డ్ వైడ్ ఫర్ జనవరి 2021 బై డౌన్లోడ్స్" అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో సెన్సార్ టవర్ ఈ విషయాన్ని తెలిపింది. టెలిగ్రాం డౌన్లోడ్లలో 24 శాతంతో భారత్ ప్రథమ స్థానంలో ఉండగా, 10 శాతం డౌన్లోడ్లతో ఇండోనేషియా రెండవ స్థానంలో ఉంది. మనదేశంలో టిక్‌టాక్ ను బ్యాన్ చేసినప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా డౌన్లోడ్ సంఖ్య 6.2కోట్లకు చేరుకుంది. దీనిలో 17 శాతం చైనా నుంచి కాగా 10శాతం మంది అమెరికా నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. చదవండి: లీకైన వన్‌ప్లస్ 9ప్రో ఫోటోలు గెలాక్సీ ఎఫ్62 లాంచ్ తేదీ వచ్చేసింది! -
వాట్సాప్ చాట్స్ టెలిగ్రాంలోకి
వాట్సాప్ కొత్త ప్రైవసీ నిబంధనలు తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 2 కోట్ల మంది యూజర్లు వాట్సాప్ ని డిలీట్ చేసి ఇతర మెసేజింగ్ యాప్‌లను వాడటం మొదలుపెట్టారు. అన్నిటికంటే ఎక్కువగా టెలిగ్రామ్, సిగ్నల్ మెసేజింగ్ యాప్‌లను వాడుతున్నారు. ఇలా ఇతర యాప్‌లను వాడుతున్న వారు తమ పూర్వ వాట్సాప్ చాట్ లను ఇంపోర్ట్ చేసుకోవడంలో కొంచం అసహనానికి గురిఅవుతున్నారు. అయితే తాజాగా టెలిగ్రామ్ కొత్తగా తన యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకోని వచ్చింది. (చదవండి: మ్యూజిక్ ప్రియుల కోసం సరికొత్త టెక్నాలజీ..!!) ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ చాట్లను కూడా టెలిగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చాట్ హిస్టరీతో పాటు వీడియోలు, డాక్యుమెంట్లు వంటి ఇతర మీడియా కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. కేవలం వాట్సాప్ నుంచే కాకుండా లైన్, కకావో టాక్ వంటి ఇతర యాప్‌ల చాటింగ్‌ను కూడా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇది వ్యక్తిగతమైన చాటింగ్‌తో పాటు గ్రూప్ చాటింగ్‌కు కూడా వర్తించనుంది. దీనికోసం యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసాక మీకు అక్కడ ఎక్స్పోర్ట్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు విత్ మీడియా, విత్ అవుట్ మీడియా అనే ఆప్షన్ లు కనిపిస్తాయి. మీరు విత్ మీడియా ఎంచుకుంటే మీకు అదనంగా స్టోరేజ్ స్పేస్ ఖర్చవుతుంది. ఇలా ఎక్స్పోర్ట్ చేస్తే ఈరోజు వరకు ఉన్న చాటింగ్ కూడా టెలిగ్రాంలోకి వచ్చేస్తుంది. వారు ఎప్పుడు పంపారో అదే టైం స్టాంప్‌తో మెసేజ్‌లు టెలిగ్రాంలోకి ఇంపోర్ట్ అవుతాయి. -
వాట్సాప్ పేకు గట్టి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: వాట్సాప్ ఈ ఏడాది మొదట్లో కొత్త ప్రైవసీ నిబందనలను తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. చాలా మంది వాట్సాప్ యూజర్లు ప్రత్యామ్నాయ యాప్‌లైన సిగ్నల్, టెలిగ్రామ్‌ల వైపు వెళ్లారు. అసలు ఈ కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఎంత మంది భారతీయులు వాట్సాప్‌ను తొలగించారో తెలుసుకోవడానికి లోకల్ సర్కిల్స్ ఓ సర్వే చేసింది. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.(చదవండి: రిలయన్స్ జియోకు ఎయిర్టెల్ షాక్) తాజా సర్వేలో 5 శాతం మంది భారతీయులు ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిసింది. ఇప్పటికే కొత్త సోషల్ మెసేజింగ్ యాప్‌లను వాడుతున్నట్లు తెలిపారు, వాట్సాప్‌ను కూడా తొలగించారని చెప్పారు. ఇండియాలో మొత్తం వాట్సాప్ యూజర్ల సంఖ్య 40 కోట్లు కాగా.. ఈ లెక్కన సుమారు 2 కోట్ల మంది తమ వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేశారని భావించవచ్చు. సర్వేలో పాల్గొన్న వారిలో 22 శాతం మంది ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నామని, వాట్సాప్ వాడకాన్ని తగ్గించినట్లు పేర్కొన్నారు. 67 శాతం మంది భారతీయులు ఇప్పటికీ వాట్సాప్‌ను వాడుతునట్లు సర్వేలో తేలింది. 5 శాతం మంది మాత్రమే వాట్సప్ ను తొలగించినట్లు సర్వేలో వెల్లడైంది. వాట్సాప్ పేకు గట్టి దెబ్బ ఈ సర్వేలో భారతదేశంలోని 232 జిల్లాల్లోని 17,000 మంది పౌరుల పాల్గొన్నారు. దీనిలో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారు. ఫేస్బుక్ భారతదేశంలో అతిపెద్ద యూజర్ బేస్ కలిగి ఉంది. వాట్సాప్ ను 40కోట్ల మంది వినియోగిస్తున్నారు. వాట్సాప్ మెసేజింగ్ యాప్ కంటే వాట్సాప్ పేకు ఈ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల గట్టి ఎదురుదెబ్బ తగిలేలాగా కనిపిస్తోంది. వాట్సాప్ డేటాను ఫేస్బుక్, ఇతర థర్డ్ పార్టీలతో పంచుకుంటే.. తాము "వాట్సాప్ పే"ను వాడబోమని సర్వేలో పాల్గొన్న 92 శాతం మంది తేల్చి చెప్పడం విశేషం. అలాగే 79 శాతం మంది తాము వాట్సాప్ బిజినెస్‌ను ఉపయోగించమని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఇప్పటికే 55 శాతం మంది వాట్సాప్ ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. -
వాట్సాప్, సిగ్నల్ కు ప్రధాన తేడా ఏంటి?
వాట్సాప్ గత కొద్దీ రోజుల క్రితం కొత్తగా ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే కొత్తగా తీసుకువచ్చిన ప్రైవసీ నిబంధనలను అంగీకరించకపోతే ఫిబ్రవరి 8నుంచి వారి మొబైల్ ఫోన్స్ లలో వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి వాట్సాప్ సేవలపై ప్రపంచ వ్యాప్తంగా అనేక రూమర్లు వస్తున్నాయి. వాట్సాప్ యూజర్ల డేటాను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తో షేర్ చేసుకోనున్నట్లు కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. (చదవండి: వాట్సాప్, ఫేస్‌బుక్‌లను నిషేధించండి) తాజాగా వాట్సాప్ ఈ రూమర్లపై స్పందించింది. వ్యక్తిగత ఖాతాల యొక్క డేటాను ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఇతర వాటి కోసం ఉపయోగించదు అని పేర్కొంది. "యూజర్ల పంపిన మెసేజ్ లకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న కారణంగా తన వినియోగదారుల సందేశాలను చదవలేమని, కాల్‌లను వినలేమని" వాట్సాప్ నొక్కి చెప్పింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ మీ వ్యక్తిగత సందేశాలకు ఎటువంటి ఆటంకం కలిగించదని సంస్థ పేర్కొంది. అయితే ఈ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు కేవలం వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ కు మాత్రమే వర్తిస్తుంది అని సంస్థ పేర్కొంది. We want to address some rumors and be 100% clear we continue to protect your private messages with end-to-end encryption. pic.twitter.com/6qDnzQ98MP — WhatsApp (@WhatsApp) January 12, 2021 వారికీ మాత్రమే ప్రైవసీ నిబంధనలు.. వాట్సాప్ బిజినెస్ సేవలను మరింత మెరుగు పరచడం కోసం, వ్యాపార సంస్థలకు తమ ఖాతాదారులతో వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం కోసం ఫేస్బుక్ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలకు మరింత ప్రయోజనం కల్పించడం కోసం వాట్సాప్ లో రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్, మీ లొకేషన్, డివైజ్ మోడల్, ఐపీ అడ్రస్ వంటి వివరాలను సేకరించి ఆయా వ్యాపార సంస్థలు మనకు సేవలు అందించడం కోసం స్టోర్ చేసుకునే అవకాశాన్ని ఫేస్బుక్ కల్పించబోతోంది. వాట్సాప్ బిజినెస్ లో నేరుగా వినియోగదారులు ప్రోడక్టులను, సర్వీసులకి ఆర్డర్ చేసి పేమెంట్ చేసే అవకాశం కూడా రాబోతోంది కాబట్టి, వాట్సప్ పేమెంట్స్ లావాదేవీ వివరాలను కూడా ఆయా వ్యాపార సంస్థలు రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకునే వెసులుబాటుని ఫేస్బుక్ కల్పిస్తూ దానికి మన ఆమోదాన్ని కోరుతూ ప్రైవసీ పాలసీ ముందుపెట్టింది. సిగ్నల్ యాప్ వాట్సాప్ కంటే ఎందుకు భిన్నం? వాట్సాప్ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన వెంటనే చాలా మంది ఇతర యాప్‌ల వైపు మొగ్గు చూపారు. ఆ సమయంలో ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ " సిగ్నల్ వాడండి" అని ట్విటర్ లో ఒక ట్విట్ చేసాడు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా సిగ్నల్ డౌన్లొడ్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దింట్లో కూడా వాట్సాప్ మాదిరిగానే ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ ఉండటం విశేషం.(చదవండి: మీ స్నేహితులను సిగ్నల్‌కు ఆహ్వానించండి ఇలా..?) సిగ్నల్ మెసెంజర్‌ను మోక్సీ మార్లిన్స్పైక్, బ్రియాన్ ఆక్టన్ 2018లో స్థాపించారు. స్పష్టంగా చెప్పాలంటే బ్రియాన్ ఆక్టన్ వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు కూడా. సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్ 19 బిలియన్ డాలర్లకు వాట్సాప్ ను 2014లో కొనుగోలు చేసింది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మరియు సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ మెసేజింగ్ యాప్ ద్వారా డబ్బు సంపాదించాలని అనుకున్నప్పుడు సోషల్ మీడియా సంస్థ నుంచి నిష్క్రమించాలని యాక్టన్ నిర్ణయించుకున్నాడు. సంస్థను విడిచిపెట్టిన వెంటనే బ్రియాన్ ఆక్టన్ ఓపెన్ విస్పర్ సిస్టమ్స్ యొక్క మోక్సీ మార్లిన్‌స్పైక్‌తో జతకట్టి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ సిగ్నల్‌తో పాటు సిగ్నల్ ఫౌండేషన్‌ను 2018లో ఏర్పాటు చేసాడు. You can make an app used by many millions of people that has no data...Cool chart by @forbes & @UKZak 🙈🙊🙉 https://t.co/gWFqyIeoZ3 pic.twitter.com/Unngddaq5M — Signal (@signalapp) January 5, 2021 సిగ్నల్ యొక్క యొక్క ముఖ్య లక్ష్యం తన వినియోగదారులకు అత్యంత సురక్షితమైన మెసెంజర్ యాప్ ను అందించడం. వాస్తవానికి చెప్పాలంటే, ప్రస్తుతం సిగ్నల్ యొక్క ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్‌ను వాట్సాప్ ఉపయోగిస్తుంది. సిగ్నల్ ద్వారా పంపిన సందేశాలు రహస్యంగా ఉంచబడుతాయి. అనగా తన మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో ప్రైవేట్ సందేశాలను, మీడియాను సిగ్నల్ సర్వర్‌లో నిల్వ చేయదు. వాట్సాప్ కూడా సందేశాల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కూడా అందిస్తుంది. కానీ, ఇది ఐపీ అడ్రస్, గ్రూప్ వివరాలు, స్టేటస్ వంటి ఇతర ప్రైవేట్ సమాచారాన్ని యాక్సెస్ చేస్తుంది. సంస్థ క్లౌడ్‌లో నిల్వ చేసిన సందేశాలను కూడా గుప్తీకరించదు(ఎన్క్రిప్షన్). ఇంకో మెసెంజర్ యాప్ టెలిగ్రామ్ కూడా యూజర్ యొక్క కాంటాక్ట్ నంబర్ మరియు యూజర్ ఐడీని నిల్వ చేస్తుంది. అయితే, డివైజ్ ఆఫ్‌లైన్‌లో ఉంటే సందేశాలు పంపబడే వరకు సిగ్నల్ కొన్ని దాని సర్వర్‌లో దాని సందేశాలను నిల్వ చేస్తుంది. సిగ్నల్ రిజిస్ట్రేషన్ లాక్ కోసం పిన్ను సెట్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. ఇది వినియోగదారులకు ప్రైవేట్ ప్రొఫైల్ సమాచారాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఒక వినియోగదారు పరికరాన్ని కోల్పోతే లేదా క్రొత్తదానికి మారిన ప్రొఫైల్, సెట్టింగులు, కాంటాక్ట్స్ ను తిరిగి పొందడానికి ఈ లాక్ పిన్ ఉపయోగపడుతుంది. మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే, వాట్సాప్ మాదిరిగా కాకుండా సిగ్నల్ పెద్ద టెక్నాలజీ సంస్థ యాజమాన్యంలో లేదు. యూజర్ ప్రైవసీ మాట ఏమిటి? వాట్సాప్ మాదిరిగా కాకుండా సిగ్నల్ డేటాలో నిల్వ చేయబడేది కేవలం ఫోన్ నంబర్ మాత్రమే. సందేశాలను రక్షించడంతో పాటు, సిగ్నల్ మెటాడేటా యొక్క సమాచారాన్ని దాచిపెడుతుంది. దింతో ఎవరు ఎవరికి సందేశం పంపిస్తున్నారో తెలియదు. వినియోగదారులు అజ్ఞాత కీబోర్డ్ మోడ్‌ను అందించడంతో పాటు యాప్ లో స్క్రీన్షాట్లను బ్లాక్ చేయవచ్చు. ఇటీవల, యాప్ లో ఫోటోలను పంపే ముందు ముఖాలను బ్లర్ చేయడానికి కొత్తగా ఒక ఫీచర్ ను కూడా తీసుకొచ్చింది. అలాగే దీని కాంటాక్ట్ లిస్ట్ లో మొబైల్ నెంబర్ కనిపించకుండా చేయొచ్చు కూడా. ప్రస్తుతం ఈ యాప్ గ్రాంట్లు, విరాళాల ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు మొబైలలో సిగ్నల్ యాప్ అందుబాటులో ఉంది. వినియోగదారులు డెస్క్‌టాప్ ద్వారా కూడా దీనిని యాక్సెస్ చేయవచ్చు.