న్యూఢిల్లీ: వాట్సాప్ ఈ ఏడాది మొదట్లో కొత్త ప్రైవసీ నిబందనలను తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. చాలా మంది వాట్సాప్ యూజర్లు ప్రత్యామ్నాయ యాప్‌లైన సిగ్నల్, టెలిగ్రామ్‌ల వైపు వెళ్లారు. అసలు ఈ కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఎంత మంది భారతీయులు వాట్సాప్‌ను తొలగించారో తెలుసుకోవడానికి లోకల్ సర్కిల్స్ ఓ సర్వే చేసింది. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.(చదవండి: రిలయన్స్ జియోకు ఎయిర్‌టెల్ షాక్)
తాజా సర్వేలో 5 శాతం మంది భారతీయులు ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిసింది. ఇప్పటికే కొత్త సోషల్ మెసేజింగ్ యాప్‌లను వాడుతున్నట్లు తెలిపారు, వాట్సాప్‌ను కూడా తొలగించారని చెప్పారు. ఇండియాలో మొత్తం వాట్సాప్ యూజర్ల సంఖ్య 40 కోట్లు కాగా.. ఈ లెక్కన సుమారు 2 కోట్ల మంది తమ వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేశారని భావించవచ్చు. సర్వేలో పాల్గొన్న వారిలో 22 శాతం మంది ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నామని, వాట్సాప్ వాడకాన్ని తగ్గించినట్లు పేర్కొన్నారు. 67 శాతం మంది భారతీయులు ఇప్పటికీ వాట్సాప్‌ను వాడుతునట్లు సర్వేలో తేలింది. 5 శాతం మంది మాత్రమే వాట్సప్ ను తొలగించినట్లు సర్వేలో వెల్లడైంది.
వాట్సాప్ పేకు గట్టి దెబ్బ
ఈ సర్వేలో భారతదేశంలోని 232 జిల్లాల్లోని 17,000 మంది పౌరుల పాల్గొన్నారు. దీనిలో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారు. ఫేస్‌బుక్ భారతదేశంలో అతిపెద్ద యూజర్ బేస్ కలిగి ఉంది. వాట్సాప్ ను 40కోట్ల మంది వినియోగిస్తున్నారు. వాట్సాప్ మెసేజింగ్ యాప్ కంటే వాట్సాప్ పేకు ఈ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల గట్టి ఎదురుదెబ్బ తగిలేలాగా కనిపిస్తోంది. వాట్సాప్ డేటాను ఫేస్‌బుక్, ఇతర థర్డ్ పార్టీలతో పంచుకుంటే.. తాము "వాట్సాప్ పే"ను వాడబోమని సర్వేలో పాల్గొన్న 92 శాతం మంది తేల్చి చెప్పడం విశేషం. అలాగే 79 శాతం మంది తాము వాట్సాప్ బిజినెస్‌ను ఉపయోగించమని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఇప్పటికే 55 శాతం మంది వాట్సాప్ ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment