telegram app
-
ఢిల్లీ పేలుడు: ఖలిస్తానీ హస్తంపై టెలిగ్రామ్‌కు లేఖ
ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. అయితే.. ఈ ఘటనకు నాటు బాంబే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ల బృందాలు విచారణ చేపట్టాయి.ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ.. ప్రతీకారంగా ఈ పేలుడు జరిగిందని టెలిగ్రామ్‌లో ఓ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఓ టెలిగ్రామ్ ఛానెల్ ఈ పోస్ట్‌ను పెట్టినట్లు పోలీసులు గురించారు. దీంతో ఈ దాడికి ఖలిస్థాన్ వేర్పాటువాదులు పాల్పడి ఉంటారని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఘటనకు ఖలిస్తాన్ వేర్పాటవాదులకు ఉన్న లింక్‌ను పరిశీలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. తాజాగా ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్‌కు సంబంధించిన వివరాలను ఇవ్వాలని దర్యాప్తు బృందం లేఖలో కోరింది. అయితే.. టెలిగ్రామ్ నుంచి దర్యాప్తు సంస్థలకు ఇంకా ఎంటువంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు.ఇక.. ఈ పేలుడు తీవ్రతకు స్కూలు ప్రహరీ, ఆ సమీపంలోని దుకాణాల అద్దాలు, ఒక కారు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు.. పండగ సీజన్లో ఇప్పటికే రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత ప్రకటించారు. -
టెలిగ్రామ్ సీఈవో చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ అక్రమ రవాణా.. ఇతరత్రా చట్టవిరుద్ధ కార్యకలాపాల వ్యాప్తిని అరికట్టడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని ప్యారిస్ కోర్టు ధృవీకరించింది. దీంతో ఈ వ్యవహారంలో ఆయన విచారణ ఎదురోవాల్సి ఉండనుంది. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో అభ్యంతరకర కార్యకలాపాలకు(నేరాలుగా పరిగణిస్తూ..) పాల్పడేందుకు ఆయన అనుమతి ఇచ్చారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. అంతేకాదు.. యాప్‌లో పిల్లలపై అశ్లీల కంటెంట్ వ్యాప్తి చేశారనే అరోపణలకుగానూ అధికారులు కోరిన డాక్యుమెంట్లను సమర్పించేందుకు ఆయన నిరాకరించినట్లు ప్యారిస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. దీంతో.. కోర్టు అనుమతితో ఆయన్ని ఫ్రాన్స్ విచారణ జరపనుంది. రష్యాలో జన్మించిన దురోవ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. 2021 ఆగస్టులో ఈయన ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు. టెలిగ్రామ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్లమంది వినియోగిస్తున్నారు. దురోవ్ అరెస్టుపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. వాక్ స్వాతంత్య్రంపై పశ్చిమ దేశాల ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమని రష్యా అంటోంది... గత శనివారం సాయంత్రం అజర్బైజాన్ నుంచి పారిస్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 39 ఏళ్ల పావెల్ దురోవ్‌ను అక్కడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయడం వంటి అభియోగాలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలోనే ఆయనపై అరెస్టు వారెంటు జారీ చేసిన ఫ్రాన్స్ అధికారులు.. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. -
టెలిగ్రామ్‌ను నిషేధిస్తారా..? సీఈఓ అరెస్టు!
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను ప్రాన్స్ నిషేధిస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సంస్థ సీఈఓ పావెల్ దురోవ్(39)ను పారిస్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో ఇటీవల అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి గతంలో ఫ్రెంచ్ అధికారులు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తాజాగా తనను అరెస్టు చేయడంతో ఒకవేళ ఆరోపణలు రుజువైతే స్థానికంగా ప్రాన్స్‌లో ఈ యాప్‌ను నిషేధిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్‌లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆ సమాచారం నియంత్రణకు ప్లాట్ఫామ్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. దాంతో సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దురోవ్ నియంత్రిత కంటెంట్ నిర్వహణలో విఫలమయ్యారని పారిస్ అధికారులు తెలిపారు. అయితే టెలిగ్రామ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం సంస్థ అనుసరిస్తున్న నియంత్రణ పద్ధతులు సమర్థంగా ఉన్నాయని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: పేరుకుపోతున్న ప్యాసింజర్ కార్లు!ఈ వ్యవహారంపై రష్యా రాయబార కార్యాలయం స్పందిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్న దురోవ్‌ను సంప్రదించాలంటే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందడం లేదని తెలిపింది. ఇదిలాఉండగా, రష్యా, ఉక్రెయిన్తోపాటు గతంలోని సోవియట్ కూటమిలో భాగంగా ఉన్న దేశాల్లో ఈ యాప్ ప్రజాదరణ పొందింది. అయితే యూజర్ డేటాను పంచుకోవడానికి దురోవ్ నిరాకరించడంతో 2018లో రష్యా ప్రభుత్వం ఈ యాప్‌ను నిషేధించింది. ఈ నిషేధం 2021లో ముగిసింది. -
పెళ్లి కాకుండానే 100 మందికి తండ్రయ్యాడు..!
వివాహం చేసుకోలేదు..ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతాడు..అలాంటిది తనకు 12 దేశాల్లో 100 మంది పిల్లలున్నారు. అదేంటి పెళ్లి కాకుండా, ఒంటిరిగా ఉంటూ అంతమందికి ఎలా తండ్రాయ్యాడు..? అని ఆశ్చర్యపోతున్నారా.. ఇంతకీ అతను ఎవరు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం.ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ తనకు 100 మందికి పైగా పిల్లలు ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు టెలిగ్రామ్‌లో సుధీర్ఘ పోస్ట్ చేశారు. వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండేందుకే పావెల్ ఇష్టపడుతారు. అలాంటి వ్యక్తి 100 మందికి ఎలా తండ్రాయ్యడో టెలిగ్రామ్ పోస్ట్‌లో వివరంగా తెలిపారు.పావెల్ తెలిపిన వివరాల ప్రకారం..‘ప్రపంచవ్యాప్తంగా నాకు 100కు పైగా పిల్లలు ఉన్నారు. ఎన్నడూ వివాహం చేసుకోని, ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తికి ఇది ఎలా సాధ్యమవుతుంది? అనుకుంటున్నారా.. సుమారు 15 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు నా వద్దకు వచ్చి విచిత్రమైన కోరిక కోరాడు. తనకు, తన భార్యకు సంతానోత్పత్తి సమస్య కారణంగా పిల్లలు పుట్టలేదని చెప్పాడు. తనకు సంతానం కలగడానికి నా వీర్యాన్ని దానం చేయాలని కోరాడు. దాంతో నాకు విపరీతంగా నవ్చొచ్చింది. ఆ సమస్య ఎంత తీవ్రమైందో నిజానికి ఆ సమయంలో నాకు తెలియదు. స్పెర్మ్ దానానికి అంగీకరించి క్లినిక్‌కు వెళ్లాను. ఆరోగ్యకరమైన వీర్యకణాలు దొరకడం చాలా కష్టమని డాక్టర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. సంతానంలేని వారికి స్పెర్మ్ దానం చేయడం గొప్ప విషయం అని అన్నాడు. దాంతో సమస్య ఎంత తీవ్రమైందో అర్థమైంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘ఓలా మా డేటా కాపీ చేసింది’‘ప్రపంచవ్యాప్తంగా నాకు 12 దేశాల్లో దాదాపు 100 మంది పిల్లలున్నారు. నిజానికి ఇలా చెప్పడం ఆమోదయోగ్యం కాకపోయినా స్పెర్మ్ దాతగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. నేను చాలా ఏళ్ల క్రితమే వీర్యదానాన్ని ఆపినప్పటికీ ఇంకా ఫ్రీజ్ చేసిన నా కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకున్నా. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారింది. దాన్ని తగ్గించడంలో నా వంతు సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. మరికొందరు ఆరోగ్యవంతమైన పురుషులను వీర్యదానం కోసం ప్రోత్సహించాలనుకుంటున్నాను. దానివల్ల పిల్లలు కావాలనుకునే కుటుంబాలకు ఎంతో సహాయం చేసినట్లవుతుంది’ అని దురోవ్ చెప్పారు. టెలిగ్రామ్‌లో ఈమేరకు చేసిన పోస్ట్‌ను ఇప్పటికే సుమారు 20 లక్షల మంది వీక్షించారు. దాంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
ఏడాదిలోపు ప్రముఖ యాప్‌లో 100 కోట్ల యూజర్లు
ప్రముఖ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ ఏడాదిలోపు 1 బిలియన్(100 కోట్లు) యాక్టివ్ యూజర్లను సంపాదిస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాప్‌కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. దుబాయ్‌లో టెలిగ్రామ్ యాప్ సబ్స్క్రైబర్లు వేగంగా పెరుగుతున్నారని దురోవ్ చెప్పారు. సందేశాలు, కాల్లు, ఇతర ఫైల్‌లను పంపడానికి యాప్ చాలా ఉపయోగపడుతుందన్నారు. ఈ ఏడాదిలో ఒక బిలియన్(100 కోట్లు) నెలవారీ యాక్టివ్ యూజర్ మార్కును అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ యాప్‌లో 90 కోట్ల యాక్టివ్ వినియోగదారులు ఉన్నారని చెప్పారు. టెలిగ్రామ్ ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకటైన మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ 2 బిలియన్ల(200 కోట్లు) కంటే ఎక్కువ నెలవారీ యాక్లివ్ యాజర్లును కలిగి ఉంది. యాప్ యాజమాన్యం భౌగిళిక రాజకీయాల్లో తటస్థ వైఖరి పాటిస్తున్నట్లు దురోవ్ స్పష్టతనిచ్చారు. రష్యాలో జన్మించిన ఆయన 2014లో తాను స్థాపించిన కంపెనీలో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ రష్యా నుంచి వెళ్లిపోయాడు. రష్యా 2022లో ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన తర్వాత టెలిగ్రామ్‌ను రెండు ప్రభుత్వాలు విరివిగా వాడడం మొదలుపెట్టాయి. యుద్ధానికి సంబంధించిన చాలా విషయాలు పంచుకోవడానికి దీన్ని వేదికగా మార్చుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌లోని దాదాపు అన్ని ప్రధాన మీడియా, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీలు ఇందులో కంటెంట్ ఛానెల్‌లను నిర్వహించారు. ఇదీ చదవండి: కొత్త యూజర్లు ఫీజు చెల్లించాల్సిందే.. ఎందుకంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ తన రోజువారీ వీడియో అప్డేట్లను ఇందులోనే పోస్ట్ చేసేవారు. క్రెమ్లిన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా సాగిన ర్యాలీ విషయాలను టెలిగ్రామ్‌లో తెలియజేసింది. అయితే ఈ యాప్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకు వినియోగిస్తున్నారని కొందరు విమర్శలు చేయడం గమనార్హం. -
దుబాయ్ కేంద్రంగా చైనీయుల దందా
సాక్షి, హైదరాబాద్: టెలిగ్రామ్ యాప్ ద్వారా ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్‌లో చిక్కుకున్న ఓ మహిళ దాదాపు రూ.10 లక్షలు నష్టపోయింది. ఈమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఉత్తరాదికి చెందిన నలుగురి ఖాతాల్లోకి ఆ డబ్బు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం వారిని పట్టుకోగా.. వాళ్లంతా నిందితులుగా మారిన బాధితులని వెల్లడైంది. ప్రత్యేక ప్రోగ్రామింగ్‌తో వ్యవహారం... వివిధ రకాలైన సోషల్ మీడియా లింకుల ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎర వేస్తున్న నేరగాళ్లు తమ మోసాల కోసం ఆయా యాప్స్‌లో ప్రత్యేక ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఒకటి రెండుసార్లు బాధితులు పెట్టిన పెట్టుబడికి 50 నుంచి 80 శాతం లాభాలు రావడంతో పాటు ఆ మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ తర్వాత నుంచి లాభం వచ్చినట్లు యాప్‌లో కనిపించినా డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రతిసారీ పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచుతూ పోవాల్సిందే. ఇన్వెస్ట్ చేయగానే నిర్ణీత కాలంలో ఆ మొత్తం రెట్టింపు అయినట్లు యాప్‌లో కనిపిస్తుందే తప్ప తీసుకునే అవకాశం ఉండదు. హఠాత్తుగా కనిపించకుండా పోతూ... ఇలా బాధితుడి నుంచి కొంత మొత్తం వచ్చిన తర్వాత యాప్‌లో పెట్టుబడి ఆగిపోతుంది. ఆపై హఠాత్తుగా ఆ యాప్‌లోని బాధితుడి ఖాతా ఇక ఓపెన్ కాకుండా అదృశ్యమైపోతుంది. రోజూ రూ.లక్షలు కాజేస్తున్న ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్‌లో చైనీయులే సూత్రధారులుగా ఉంటున్నారు. బాధితులను సంప్రదించి ఖాతాలుకావాలంటూ.. పావులుగా మార్చి ఈ మోసగాళ్లు తమ వలలో పడి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నష్టపోయిన వారినే పావులుగా చేసుకుంటున్నారు. బాధితులతో సంప్రదింపులు జరుపుతూ పోగొట్టుకున్న డబ్బు వెనక్కురావాలంటే తమకు కొన్ని బ్యాంకు ఖాతాలు కావాలంటూ కోరుతున్నారు. ఒక్కోఖాతాను రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఇస్తామంటూ ఆశపెడుతున్నారు. పోగొట్టుకున్న సొమ్ముల్లో ఎంతో కొంత వస్తుందని ఆశ పడిన బాధితులు ఇందుకు అంగీకరించి తమ కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల పేర్ల మీదా ఖాతాలు తెరుస్తున్నారు. అక్కడ నుంచే వీటిని ఆపరేట్ చేస్తూ.. ఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్స్‌లను వాట్సాప్ ద్వారా బాధితులు సూత్రధారులకు పంపిస్తున్నారు. ఆపై వాళ్లు చెప్పే చిరునామాలకు లింకై ఉన్న ఫోన్ నంబర్లకు సంబంధించిన సిమ్‌కార్డులను కొరియర్ చేస్తున్నారు. వీటిని దగ్గర ఉంచుకుంటున్న సూత్రధారులు ఇక్కడ టార్గెట్ చేసిన వారితో నగదు ఈ ఖాతాల్లోనే వేయించుకుంటున్నారు. కేసు నమోదై, పోలీసులు దర్యాప్తు చేపట్టినా బ్యాంకు ఖాతా వివరాలు పంపిన నాటి బాధితుల వద్దకే వెళ్లి ఆగిపోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో ఈ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ పెరిగిపోయాయని చెప్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. పరిచయం లేని వారితో ఆర్థిక లావాదేవీలు, ఇన్వెస్టిమెంట్స్ వద్దని స్పష్టం చేస్తున్నారు. -
అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు
సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి బెంగళూరులో అరెస్టయ్యాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), బెంగళూరు పోలీసులు కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో థణిసంద్రలోని ఓఇంట్లో ఉన్న ఇతడిని అరెస్ట్ చేశారు. ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న అరీఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్లుగా ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో టెలీగ్రాం, డార్క్‌నెట్ ద్వారా సంబంధాలు నెరుపుతున్నట్లు తెలిసింది. ఇతడి కదలికలపై ఎన్ఐఏ కొన్ని రోజులుగా నిఘా ఉంచింది. సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న ఆరీఫ్‌ను పట్టుకుని, ఒక లాప్టాప్, రెండు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13న బెంగళూరులోని ఇంటిని ఖాళీ చేసి యూపీకి వెళ్తున్నట్టు ఇతడు ఇంటి యజమానికి చెప్పాడని పోలీసులు వివరించారు. గత నవంబర్‌లో శివమొగ్గలో ఐఎస్ ప్రేరేపిత ఉగ్ర మాడ్యూల్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. -
టెలిగ్రామ్ యాప్ వల్ల ఎన్నో ప్రయోజనాలు! కానీ.. ఇలా చేశారంటే మాత్రం!
Cyber Crime Prevention Tips In Telugu: టెలిగ్రామ్ రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన క్రాస్–ప్లాట్‌ఫారమ్ మెసేజింగ్ అప్లికేషన్. ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఎందుకంటే ఇది మెరుగైన గోప్యత, ఎన్క్రిప్షన్ లక్షణాలతో పాటు రెండు లక్షల మంది సామర్థ్యం వరకు పెద్ద గ్రూప్ చాట్ ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. టెలిగ్రామ్ తన వినియోగదారులకు మీడియా పరిమాణాలపై పరిమితులు లేకుండా అనేక ఫీచర్లను అందిస్తుంది. ప్రయోజనాలు (ఎ) వాట్సాప్ గ్రూప్‌లలో 256 మంది సభ్యుల వరకు ఉండచ్చు. అదే, టెలిగ్రామ్ అయితే రెండు లక్షల మంది ఒక గ్రూప్‌గా ఉండవచ్చు. (బి) టెలిగ్రామ్ ప్రాథమికంగా మీరు రహస్యంగా ఎంచుకున్న సంభాషణలను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఇది మీ గోప్యతను మెరుగుపరుస్తుంది. (సి) టెలిగ్రామ్ యాప్ పూర్తిగా ఉచితం. టెలిగ్రామ్‌లో బాధించే ప్రకటనలు ఉండవు (డి) మెసేజ్‌లను పంపిన వారికి, వాటిని స్వీకరించిన వారికి భద్రత ఉంటుంది. స్కామ్‌లు టెలిగ్రామ్ స్కామ్‌లు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో జరుగుతాయి లేదా మెసేజింగ్ అప్లికేషన్ నుండి వినియోగదారులను ప్రమాదకరమైన థర్డ్ పార్టీ సైట్లు, అప్లికేషన్ లలోకి లాగుతాయి. టెలిగ్రామ్‌కు విస్తృతమైన ఆమోదం, వాడుకలో సౌలభ్యం కారణంగా స్కామర్లు జొరబడతారు. చాలా సార్లు, స్కామర్లు తమను తాము చట్టబద్ధమైన ఏజెంట్లుగా లేదా వివిధ కార్పొరేషన్ల ఉద్యోగులుగా చూపించుకోవడం చూస్తుంటాం. స్కామర్లు తరచుగా బాధితులను ఆకర్షించడానికి ప్రముఖ ఛానెల్‌ల నకిలీ/నకిలీ వెర్షన్లను సృష్టిస్తారు. ఈ గ్రూప్‌లు ఒకే విధమైన పేర్లు, ప్రొఫైల్ చిత్రాలను కలిగి ఉంటాయి. అదే పిన్ చేయబడిన సందేశాలను కలిగి ఉంటాయి. దాదాపు చట్టబద్ధమైన వాటితో సరిపోలే వినియోగదారు పేర్లతో ఉంటాయి. ప్రమోషన్లు, ఉచిత బహుమతులు, ఎమ్ఎల్ఎమ్ ఆధారిత పథకాలతో కూడిన స్కామ్‌లకు ప్రజలు బలైపోతుంటారు. స్కామర్లు సమస్యను పరిష్కరించడానికి మీ ల్యాప్‌టాప్ లేదా పరికరం రిమోట్ కంట్రోల్ తీసుకోవాలని తరచూ అడుగుతారు. ఈ ప్రక్రియలో మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సేకరిస్తారు. ఎ) బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ స్కామ్‌లు నాణేలు, డబ్బు లేదా ఖాతా లాగిన్ల నుండి బాధితులను స్కామ్ చేయడానికి స్కామర్లు టెలిగ్రామ్‌లో తమను తాము క్రిప్టో నిపుణులుగా చెప్పుకుంటారు. తమను తాము నిపుణులుగా చూపిస్తూ, వారు బాధితుల క్రిప్టో పెట్టుబడులపై హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తారు. వారి స్కామ్‌లో భాగంగా, వారు తమ పెట్టుబడి పెరుగుతున్నట్లు చూపే బాధితుల చార్ట్‌లు, గ్రాఫ్‌లను చూపుతారు (ఈ సభ్యులలో ఎక్కువ మంది నకిలీ లేదా చెల్లించిన సోషల్ మీడియా నిపుణులు). బాధితుడు వాలెట్ లేదా డ్యాష్‌బోర్డ్‌లో ప్రదర్శించిన విధంగా వారి ఆదాయాలను ఉపసంహరించుకోలేరు. ఆ సమయంలో స్కామర్లు అదృశ్యమవుతారు. గ్రూప్‌లలో ఎప్పుడూ స్పందించరు. బి) బాట్లను ఉపయోగించి ఫిషింగ్ టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో బాట్లను నిర్మించే, ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎపిఐ ఉండటం వలన, వారు రియల్ సంభాషణలలో పాల్గొంటారు. దీంతో మీరు స్కామ్‌కి గురవుతున్నారో లేదో చెప్పడం కష్టం. అంటే, ఒక నకిలీ బాట్, బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు అప్లికేషన్ల నుండి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఈ బాట్ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా లాగిన్లు, పాస్వర్డ్లు, క్యూ ఆర్ కోడ్లను కూడా వదులుకోమని వినియోగదారుని కాల్ చేస్తుంది, ఒప్పిస్తుంది. సి) టెక్ సపోర్ట్ స్కామ్‌లు ఈ స్కామ్‌లో స్కామర్లు చట్టబద్ధమైన టెక్ సపోర్ట్ ఏజెంట్లలా నటిస్తుంటారు. స్కామర్లు సమస్యను పరిష్కరించడానికి బాధితుల ల్యాప్‌టాప్ లేదా పరికరాన్ని రిమోట్ కంట్రోల్‌గా తీసుకుంటారు. ఈ ప్రక్రియలో బాధితుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సేకరిస్తారు. డి) రొమాన్స్/ సెక్స్టార్షన్ స్కామ్‌లు సోషల్ మీడియా నిషేధించిన సాన్నిహిత్యాలు, నిషేధించిన ప్రవర్తనలలో పాల్గొనడానికి అవకాశాన్ని సృష్టిస్తుంది. స్కామర్లు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆన్లోలైన్లో వినియోగదారుతో నమ్మకాన్ని పొందేందుకు వారితో సంబంధాన్ని ప్రారంభిస్తారు. బాధితులు తమకు సున్నితమైన ఫొటోలు లేదా వీడియోలను పంపమని అడుగుతారు, ఆ పై వారు బ్లాక్మెయిల్ కోసం ఉపయోగిస్తారు. ఇతర రకాల శృంగార మోసాలు (ఎ) ప్రతిపాదనలతో దోపిడి. (బి) అందమైన స్త్రీ లేదా పురుషుడు. (సి) గే మ్యాన్ పే మేకింగ్. టెలిగ్రామ్ యాప్‌లో భద్రతా చిట్కాలు ఎ) మీ అన్ని రకాల పాస్‌వర్డ్‌లకు కనీసం 10 పెద్ద, చిన్న అక్షరాలు, సంఖ్యలు, చిహ్నాలు, ప్రత్యేకమైనవి, ఊహించడానికి కష్టంగా ఉండేలా నిర్వహణకు ఉపయోగించడాన్ని పరిగణించండి. బి) తెలిసిన మూలాల ద్వారా పంపబడినప్పటికీ, https://www.unshorten.it లేదా https://www.checkshorturl.com ను ఉపయోగించి సంక్షిప్త URLs / Links ధృవీకరించండి సి) తెలియని పరిచయాల ద్వారా పంపబడిన అటాచ్‌మెంట్స్‌ను క్లిక్ చేయడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి ముందు https://www.isitphishing.org or https://www.urlvoid.com వెబ్‌లింక్ ద్వారా ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. డి) వినియోగదారు ప్రొఫైల్‌కి వెళ్లి, మీ స్క్రీన్ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి, ‘యూజర్ బ్లాక్‘ ని ఎంచుకోండి. ఇ) స్కామ్ ఖాతా స్క్రీన్‌షాట్, ఏదైనా ఇతర సమాచారాన్ని టెలిగ్రామ్‌లోని@notoscam పంపండి. లేదా ప్రత్యామ్నాయంగా ఇమెయిల్:abuse@ telegram.orgకి పంపవచ్చు. చదవండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి -
సబ్స్క్రైబర్లతో టెలిగ్రామ్ కుంభకోణం!! కేసు,సెబీ సోదాలు
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను వినియోగించుకుని షేర్ల ట్రేడింగ్ సంబంధ కుంభకోణానికి తెరతీశాయన్న ఆరోపణలున్న సంస్థలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ తాజగా సోదాలకు దిగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఎనిమిది సంస్థలకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు, స్వాదీన చర్యలను చేపట్టింది. ఈ సంస్థలు తొమ్మిది టెలిగ్రామ్ చానళ్ల నిర్వహణ ద్వారా 50 లక్షలకుపైగా సబ్స్కయిబర్లకు రికమండేషన్లు అందించినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన లిస్టెడ్ షేర్లకు సంబంధించి సలహాలు ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లు వీటిలో లావాదేవీలు చేపట్టేలా చేసినట్లు తెలుస్తోంది. తద్వారా ఆయా కౌంటర్లలో కృత్రిమంగా లావాదేవీల పరిమాణం, ధరల పెరుగుదలకు దారిచూపినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వీటితో లింక్ చేసిన సంస్థలు అధిక ధరల వద్ద షేర్లను విక్రయించేందుకు వీలు కల్పించాయి. తద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోగా.. ఈ సంస్థలు లబ్ది పొందినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలకు సంబంధించి తాజాగా ఏడుగురు వ్యక్తులు, ఒక కార్పొరేట్ సంస్థకు చెందిన పలు ప్రాంతాలలో సోదాలు, స్వాధీన చర్యలు చేపట్టినట్లు సెబీ వెల్లడించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, భావనగర్, మధ్యప్రదేశ్‌లోని నీముచ్, ఢిల్లీ, ముంబైలలో సోదాలు జరిగినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా సెబీ అధికారులు 34 మొబైల్ ఫోన్లు, 6 ల్యాప్‌టాప్‌లు, 4 డెస్క్‌టాప్‌లు, 4 ట్యాబ్లెట్లతోపాటు.. 2 హార్డ్ డిస్కులు, పలు రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. -
టెలిగ్రామ్ యాప్ సర్వర్ డౌన్..!
ప్రముఖ మెసేజింగ్ టెలిగ్రామ్ యాప్ సేవలు నేడు కొద్ది సేపు నిలిచిపోయాయి. మన దేశంలో చాలా మంది ఈరోజు రాత్రి 7 నుంచి యాప్ సేవలను వినియోగించుకోలేక పోతున్నట్లు ట్విటర్ వేదికగా పిర్యాదు చేస్తున్నారు. #TelegramDown అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. టెలిగ్రామ్ వినియోగదారులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. టెలిగ్రామ్ యాప్ సర్వర్ డౌన్ విషయాన్ని డౌన్ డిటెక్టర్ వెబ్ సైటు దృవీకరించింది. టెలిగ్రామ్ యూజర్లు యాప్ యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు "Updating" లేదా "Connecting" అనే మెస్సేజ్ వచ్చినట్లు పేర్కొన్నారు. కంపెనీకి ఈ సమస్య గురించి తెలుసో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు. డౌన్ డిటెక్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ప్రకారం.. ప్రస్తుతం యు.ఎస్, యూరప్, భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో టెలిగ్రామ్ యాప్ లో అంతరాయం ఏర్పడింది. ఫిలిపెన్స్ దేశంలో మొదట ఈ సమస్య ఏర్పడింది. యాప్ సర్వర్ డౌన్ చాలా మంది యూజర్లు ట్విటర్ వేదికగా ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. Me switching from Telegram to WhatsApp after #telegramdown pic.twitter.com/rsr9UmeXrU — Anuజ్ఞ (@Anugnareddy11) January 17, 2022 Telegram Showing "Updating"#Telegram#TelegramDown pic.twitter.com/FEhH4ZLr0d — Patel Meet (@mn_google) January 17, 2022 #TelegramDown Telegram Right Now: pic.twitter.com/AVsqTzDGYu — Gyan Prakash (@Gyaaaaani) January 17, 2022 Telegram Down Users be like:#Telegram #telegramdown pic.twitter.com/80rsvliakq — Koushik Yuvaan (@koushi_yuvaan) January 17, 2022 Everyone running to tweeter to check weather Telegram is down or not😂😂#TelegramDown #Telegram pic.twitter.com/mEu0xOZKeb — P R A J J U L L 💜 (@Prajjull) January 17, 2022 (చదవండి: వస్తువులు కొని మోసపోతున్నారా? ఇలా పరిహారం రాబట్టుకోండి) -
‘ఈ ఫేస్బుక్ పాడుగాను’.. వాళ్ల నెత్తిన పాలుపోసింది
పొద్దున లేచి ఫేస్ కడగకుండానే ఫేస్బుక్, వాటర్ తాగకుండానే వాట్సాప్ ఉపయోగించడం మనకు బాగా అలవాటైంది. అంతెందుకు సోషల్ మీడియాకు కొద్దిసేపు దూరంగా ఉన్నా.. విలవిలలాడిపోతుంటారు కొందరు. అలాంటిది ఒక్కరాత్రిలో ఫేస్బుక్ అండ్ కో సర్వీసులకు విఘాతం కలగడంతో అల్లలాడిపోయారు. డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్ఎస్) సమస్య వల్ల బఫరింగ్ స్లో అయిపోవడం, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు రిఫ్రెష్ కాకపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి. వీటికితోడు వాట్సాప్ పూర్తిగా పనిచేయకుండా నిలిచిపోయింది. చివరికి ఫేస్బుక్ వర్చువల్ రియాలిటీ డివిజన్ ‘ఒక్యూలస్’ కూడా ఆగిపోవడం(డౌన్ డిటెక్టర్ సైతం ధృవీకరించింది) ఫేస్‌బుక్‌ను ఘోరంగా దెబ్బతీసింది. ఇక నిన్న(అక్టోబర్ 4, సోమవారం) రాత్రి నుంచి సోషల్ మీడియా టాప్‌లో మొదలైన #instagramdown, #facebookdown, #whatsappdown హ్యాష్‌ట్యాగ్‌లు.. సమస్య తీరాక కూడా ఈ ఉదయం నుంచి ట్రెండ్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ముందెన్నడూ యూజర్లు ఇలాంటి సమస్య ఇంతసేపు ఎదుర్కొనలేదు. దీంతో వాళ్లలో ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరింది. వాట్సాప్‌లో అయినవాళ్లతో ఛాటింగ్, వీడియో కాల్స్‌కు అవకాశం లేకపోవడంతో ఫేస్బుక్ అండ్ కోను విపరీతంగా తిట్టిపోసుసుకున్నారు. ఆ కోపంలో #deletefacbook హ్యాష్‌ట్యాగ్‌ను సైతం ట్విటర్ తెర మీదకు తెచ్చారు. అయితే ఈ పరిణామాల వల్ల ఫేస్బుక్ ఎంతగా నష్టపోయిందో.. కొన్ని ఫ్లాట్‌ఫామ్స్ విపరీతంగా లాభపడ్డాయి. టెలిగ్రామ్ టాప్ టక్కర్ వాట్సాప్ చతికిల పడ్డ టైంలో.. యూజర్లు ఇతర మార్గాలను అన్వేషించారు. యూట్యూబ్, ఇతరత్ర సైటల్లో ఎక్కువసేపు గడిపారు. అదే టైంలో ఇన్స్టంట్ మెసేజింగ్ సర్వీసుల కోసం టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్‌లను ఉపయోగించారు కోట్ల మంది. ముఖ్యంగా టెలిగ్రామ్ మెసేంజర్ యాప్ ఈ ఫేస్బుక్ సర్వీసుల విఘాతం వల్ల బాగా లాభపడింది. కొత్తగా కోట్ల మంది కొత్త యూజర్లు టెలిగ్రామ్‌కు సైన్ అప్ అయ్యారు. చాలామంది సైన్ ఇన్ ద్వారా ఉపయోగించుకున్నారు. whatsapp, Facebook, Instagram VS. Twitter, telegram. @universoANHQV #ANHQV pic.twitter.com/bMFFklaTCP — Alexis Romero🏳️🌈🎃 (@alexisromloz) October 4, 2021 ఈ క్రమంలో టెలిగ్రామ్‌కు యూజర్లు వెల్లువెత్తడంతో.. సర్వీసులు నెమ్మదించి రిపోర్టులు(ఫిర్యాదులు) కుప్పలుగా వచ్చాయి. అయితే ‘ఫేస్బుక్ దెబ్బ’ ప్రభావం వల్ల టెలిగ్రామ్ ఎంతగా లాభపడిందనే గణాంకాలు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు ట్విటర్కీ కోట్ల మంది క్యూ కట్టారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో యూజర్లు ఎంగేజ్ కావడంతో ఫేస్బుక్ ఎంత నష్టపోయిందో.. అవీ అంతే లాభపడి ఉంటాయని భావిస్తున్నారు. Twitter right now pic.twitter.com/GxU31jTRMa — Netflix India South (@Netflix_INSouth) October 4, 2021 ట్విటర్కొచ్చిన వాట్సాప్ ఫేస్బుక్ దాని అనుబంధ సర్వీసులు పని చేయకపోవడంతో నిన్న రాత్రంతా విచిత్రమైన పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. జుకర్‌బర్గ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ హెడ్లు జనాలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. వాట్సాప్.. మరోదారిలేక ట్విటర్‌కి వచ్చి యూజర్లకు క్షమాపణలు చెప్పింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా సైతం ఈ సమస్యను హిలేరియస్ మీమ్‌గా వాడేసుకుంది. ఫేస్బుక్ సర్వీసులకు విఘాతం కలగడంతో ట్విటర్లో నవ్వులు పూయించారు చాలామంది. We’re aware that some people are experiencing issues with WhatsApp at the moment. We’re working to get things back to normal and will send an update here as soon as possible. Thanks for your patience! — WhatsApp (@WhatsApp) October 4, 2021 చదవండి: ఫేస్బుక్ నష్టం.. ఆరు గంటల్లో 50 వేల కోట్లా! -
ఒకే సారి 1000 మంది వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు
టెక్ ప్రపంచంలో యూజర్లను ఆకట్టుకోవడంతో పాటు వారిని సొంతం చేసుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.తాజాగా టెలిగ్రామ్ కొత్త అప్డేట్ తెచ్చింది. ఈ అప్డేట్తో యూజర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో షేరింగ్ ఇటీవల కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా యూజర్లు వాట్సాప్‌కు దూరం అవుతున్నారు. అదే సమయంలో ప్రత్యామ్నయంగా టెలిగ్రామ్ యాప్‌ను వినియోగించుకునేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో టెలిగ్రాం వాట్సాప్‌తో పోటీ పడడంతో పాటు యూజర్లను ఆకట్టుకునేలా కొత్త కొత్త అప్డేట్లతో దూసుకుపోతుంది. తాజాగా ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో పాటు వీడియోలను షేర్ చేసేలా ఫీచర్ ను అప్డేట్ చేసింది. యూజర్లందరు ఒకే సారి గ్రూప్‌కాల్ లో యాడ్ అయ్యే వరకు పరిమితిని పెంచుతూనే ఉండాలని టెలిగ్రామ్ తెలిపింది.1000 మంది వీడియో కాల్ మాట్లాడుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ వల్ల ఆన్లైన్ క్లాసులు, మీటింగ్స్‌లో పాల్గొనే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో ఫీచర్ టెలిగ్రామ్ తన వీడియో షేరింగ్ ఫీచర్‌ని అప్డేట్ చేసింది. మీరు మీ చాట్ బాక్స్‌లోని రికార్డింగ్ బటన్ని ట్యాప్ చేస్తే వీడియో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డైన వీడియోలను మీ స్నేహితులకు షేర్ చేసుకోవచ్చు. -
దేశంలో వాట్సప్ బ్యాన్ కానుందా?
కేంద్ర ప్రభుత్వం నిన్న(ఫిబ్రవరి 25) డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరుతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 అనే కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధనలు అమలైతే ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు చిక్కులు తప్పవని నిపుణులు భావిస్తున్నారు. ఈ నూతన నిబంధనల ప్రకారం వివాదాస్పద మెసేజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు వాటి మూలాలను వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం వంటి ఇతర మెసేజింగ్ సంస్థలు తప్పని సరిగా పాటించాలి. ఈ కొత్త నిబంధనల వల్ల మెసేజ్‌లకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత ఉందని చెబుతున్న వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం వంటి సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజా నిబంధనల ప్రకారం వివాదాస్పద మెసేజ్ మొదటి ఎవరి నుంచి వచ్చిందో కచ్చితంగా తెలియజేయాలి. అలాగే ఓ ట్వీట్ లేదా మెసేజ్ భారత్ నుంచి పోస్ట్ కాలేదని వెల్లడైతే.. అప్పుడు భారత్‌లో దాన్ని ముందుగా ఎవరు రిసీవ్ చేసుకున్నారో సదరు యాప్ తప్పనిసరిగా వెల్లడించాలని నూతన ఐటీ నిబంధనలను ప్రకటిస్తూ కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. గతంలో ఓ మెసేజ్ మూలాలను వెల్లడించాలని వాట్సాప్‌ను ప్రభుత్వం కోరగా ఇది తమ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రతకు విరుద్ధమని మెసేజింగ్ యాప్ ఆ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది. ఇక నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్ విధిగా ప్రభుత్వం అడిగిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేల ఈ కొత్త నిబంధనలు పాటించకపోతే వాట్సాప్‌తో పాటు ఇతర మెసేజింగ్ సంస్థలను బ్యాన్ చేసే అవకాశం ఉంది. చదవండి: గూగుల్ మెసేజిస్ లో అదిరిపోయే ఫీచర్ ఏడు స్క్రీన్ల ల్యాప్‌టాప్‌ను చూశారా! -
వాట్సాప్‌ను వెనక్కి నెట్టేసిన టెలిగ్రాం
2021లో వాట్సాప్‌కు ఏ విదంగాను కలిసి రావడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకువచ్చి చిక్కుల్లో పడింది. ఆప్పటి నుంచి ఎన్ని కొత్త ప్రయత్నాలు చేసిన యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది. దీని ప్రధాన ప్రత్యర్థులైన టెలిగ్రాం, సిగ్నల్ యాప్ లు మాత్రం దూసుకెళ్తున్నాయి. 2021 జనవరిలో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన నాన్-గేమింగ్ యాప్స్‌లో టెలిగ్రాం అన్నిటికంటే ముందంజలో ఉంది. ఈ విషయాన్నీ సెన్సార్ టవర్ అనే డేటా సంస్థ వెల్లడించింది. టెలిగ్రాంను ఎక్కువ శాతం డౌన్లోడ్ చేసిన వారిలో 24 శాతం మంది భారతీయులు ఉన్నారు. ఈ మెసేజింగ్ యాప్ ను గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 6.3కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిలో భారతదేశం నుంచే 1.5 కోట్ల మంది టెలిగ్రామ్ ను డౌన్లోడ్ చేశారు. టెలిగ్రాంను 2020 జనవరిలో డౌన్లోడ్ చేసుకున్న దానికంటే 3.8 రెట్లు ఎక్కువగా ఈసారి డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్లలో ఆకస్మిక పెరుగుదల ప్రధాన కారణం వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలు అనే చెప్పుకోవాలి. వాట్సాప్ కొత్త విధానాలు వినియోగదారులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దింతో చాలా మంది టెలిగ్రామ్‌కు మారారు. 2వ స్థానంలో టిక్‌టాక్ ఇక డౌన్లోడ్ పరంగా టిక్‌టాక్ రెండవ స్థానంలో ఉండగా తర్వాత స్థానాలలో సిగ్నల్, ఫేస్బుక్ ఉన్నాయి. వాట్సాప్ మునుపటితో పీలిస్తే జనవరిలో మూడవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయింది. "టాప్ యాప్స్ వరల్డ్ వైడ్ ఫర్ జనవరి 2021 బై డౌన్లోడ్స్" అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో సెన్సార్ టవర్ ఈ విషయాన్ని తెలిపింది. టెలిగ్రాం డౌన్లోడ్లలో 24 శాతంతో భారత్ ప్రథమ స్థానంలో ఉండగా, 10 శాతం డౌన్లోడ్లతో ఇండోనేషియా రెండవ స్థానంలో ఉంది. మనదేశంలో టిక్‌టాక్ ను బ్యాన్ చేసినప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా డౌన్లోడ్ సంఖ్య 6.2కోట్లకు చేరుకుంది. దీనిలో 17 శాతం చైనా నుంచి కాగా 10శాతం మంది అమెరికా నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. చదవండి: లీకైన వన్‌ప్లస్ 9ప్రో ఫోటోలు గెలాక్సీ ఎఫ్62 లాంచ్ తేదీ వచ్చేసింది! -
వాట్సాప్ చాట్స్ టెలిగ్రాంలోకి
వాట్సాప్ కొత్త ప్రైవసీ నిబంధనలు తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 2 కోట్ల మంది యూజర్లు వాట్సాప్ ని డిలీట్ చేసి ఇతర మెసేజింగ్ యాప్‌లను వాడటం మొదలుపెట్టారు. అన్నిటికంటే ఎక్కువగా టెలిగ్రామ్, సిగ్నల్ మెసేజింగ్ యాప్‌లను వాడుతున్నారు. ఇలా ఇతర యాప్‌లను వాడుతున్న వారు తమ పూర్వ వాట్సాప్ చాట్ లను ఇంపోర్ట్ చేసుకోవడంలో కొంచం అసహనానికి గురిఅవుతున్నారు. అయితే తాజాగా టెలిగ్రామ్ కొత్తగా తన యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకోని వచ్చింది. (చదవండి: మ్యూజిక్ ప్రియుల కోసం సరికొత్త టెక్నాలజీ..!!) ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ చాట్లను కూడా టెలిగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చాట్ హిస్టరీతో పాటు వీడియోలు, డాక్యుమెంట్లు వంటి ఇతర మీడియా కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. కేవలం వాట్సాప్ నుంచే కాకుండా లైన్, కకావో టాక్ వంటి ఇతర యాప్‌ల చాటింగ్‌ను కూడా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇది వ్యక్తిగతమైన చాటింగ్‌తో పాటు గ్రూప్ చాటింగ్‌కు కూడా వర్తించనుంది. దీనికోసం యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసాక మీకు అక్కడ ఎక్స్పోర్ట్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు విత్ మీడియా, విత్ అవుట్ మీడియా అనే ఆప్షన్ లు కనిపిస్తాయి. మీరు విత్ మీడియా ఎంచుకుంటే మీకు అదనంగా స్టోరేజ్ స్పేస్ ఖర్చవుతుంది. ఇలా ఎక్స్పోర్ట్ చేస్తే ఈరోజు వరకు ఉన్న చాటింగ్ కూడా టెలిగ్రాంలోకి వచ్చేస్తుంది. వారు ఎప్పుడు పంపారో అదే టైం స్టాంప్‌తో మెసేజ్‌లు టెలిగ్రాంలోకి ఇంపోర్ట్ అవుతాయి. -
వాట్సాప్ పేకు గట్టి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: వాట్సాప్ ఈ ఏడాది మొదట్లో కొత్త ప్రైవసీ నిబందనలను తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. చాలా మంది వాట్సాప్ యూజర్లు ప్రత్యామ్నాయ యాప్‌లైన సిగ్నల్, టెలిగ్రామ్‌ల వైపు వెళ్లారు. అసలు ఈ కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఎంత మంది భారతీయులు వాట్సాప్‌ను తొలగించారో తెలుసుకోవడానికి లోకల్ సర్కిల్స్ ఓ సర్వే చేసింది. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.(చదవండి: రిలయన్స్ జియోకు ఎయిర్టెల్ షాక్) తాజా సర్వేలో 5 శాతం మంది భారతీయులు ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిసింది. ఇప్పటికే కొత్త సోషల్ మెసేజింగ్ యాప్‌లను వాడుతున్నట్లు తెలిపారు, వాట్సాప్‌ను కూడా తొలగించారని చెప్పారు. ఇండియాలో మొత్తం వాట్సాప్ యూజర్ల సంఖ్య 40 కోట్లు కాగా.. ఈ లెక్కన సుమారు 2 కోట్ల మంది తమ వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేశారని భావించవచ్చు. సర్వేలో పాల్గొన్న వారిలో 22 శాతం మంది ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నామని, వాట్సాప్ వాడకాన్ని తగ్గించినట్లు పేర్కొన్నారు. 67 శాతం మంది భారతీయులు ఇప్పటికీ వాట్సాప్‌ను వాడుతునట్లు సర్వేలో తేలింది. 5 శాతం మంది మాత్రమే వాట్సప్ ను తొలగించినట్లు సర్వేలో వెల్లడైంది. వాట్సాప్ పేకు గట్టి దెబ్బ ఈ సర్వేలో భారతదేశంలోని 232 జిల్లాల్లోని 17,000 మంది పౌరుల పాల్గొన్నారు. దీనిలో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారు. ఫేస్బుక్ భారతదేశంలో అతిపెద్ద యూజర్ బేస్ కలిగి ఉంది. వాట్సాప్ ను 40కోట్ల మంది వినియోగిస్తున్నారు. వాట్సాప్ మెసేజింగ్ యాప్ కంటే వాట్సాప్ పేకు ఈ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల గట్టి ఎదురుదెబ్బ తగిలేలాగా కనిపిస్తోంది. వాట్సాప్ డేటాను ఫేస్బుక్, ఇతర థర్డ్ పార్టీలతో పంచుకుంటే.. తాము "వాట్సాప్ పే"ను వాడబోమని సర్వేలో పాల్గొన్న 92 శాతం మంది తేల్చి చెప్పడం విశేషం. అలాగే 79 శాతం మంది తాము వాట్సాప్ బిజినెస్‌ను ఉపయోగించమని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఇప్పటికే 55 శాతం మంది వాట్సాప్ ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. -
వాట్సాప్, సిగ్నల్ కు ప్రధాన తేడా ఏంటి?
వాట్సాప్ గత కొద్దీ రోజుల క్రితం కొత్తగా ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే కొత్తగా తీసుకువచ్చిన ప్రైవసీ నిబంధనలను అంగీకరించకపోతే ఫిబ్రవరి 8నుంచి వారి మొబైల్ ఫోన్స్ లలో వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి వాట్సాప్ సేవలపై ప్రపంచ వ్యాప్తంగా అనేక రూమర్లు వస్తున్నాయి. వాట్సాప్ యూజర్ల డేటాను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తో షేర్ చేసుకోనున్నట్లు కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. (చదవండి: వాట్సాప్, ఫేస్‌బుక్‌లను నిషేధించండి) తాజాగా వాట్సాప్ ఈ రూమర్లపై స్పందించింది. వ్యక్తిగత ఖాతాల యొక్క డేటాను ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఇతర వాటి కోసం ఉపయోగించదు అని పేర్కొంది. "యూజర్ల పంపిన మెసేజ్ లకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న కారణంగా తన వినియోగదారుల సందేశాలను చదవలేమని, కాల్‌లను వినలేమని" వాట్సాప్ నొక్కి చెప్పింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ మీ వ్యక్తిగత సందేశాలకు ఎటువంటి ఆటంకం కలిగించదని సంస్థ పేర్కొంది. అయితే ఈ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు కేవలం వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ కు మాత్రమే వర్తిస్తుంది అని సంస్థ పేర్కొంది. We want to address some rumors and be 100% clear we continue to protect your private messages with end-to-end encryption. pic.twitter.com/6qDnzQ98MP — WhatsApp (@WhatsApp) January 12, 2021 వారికీ మాత్రమే ప్రైవసీ నిబంధనలు.. వాట్సాప్ బిజినెస్ సేవలను మరింత మెరుగు పరచడం కోసం, వ్యాపార సంస్థలకు తమ ఖాతాదారులతో వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం కోసం ఫేస్బుక్ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలకు మరింత ప్రయోజనం కల్పించడం కోసం వాట్సాప్ లో రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్, మీ లొకేషన్, డివైజ్ మోడల్, ఐపీ అడ్రస్ వంటి వివరాలను సేకరించి ఆయా వ్యాపార సంస్థలు మనకు సేవలు అందించడం కోసం స్టోర్ చేసుకునే అవకాశాన్ని ఫేస్బుక్ కల్పించబోతోంది. వాట్సాప్ బిజినెస్ లో నేరుగా వినియోగదారులు ప్రోడక్టులను, సర్వీసులకి ఆర్డర్ చేసి పేమెంట్ చేసే అవకాశం కూడా రాబోతోంది కాబట్టి, వాట్సప్ పేమెంట్స్ లావాదేవీ వివరాలను కూడా ఆయా వ్యాపార సంస్థలు రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకునే వెసులుబాటుని ఫేస్బుక్ కల్పిస్తూ దానికి మన ఆమోదాన్ని కోరుతూ ప్రైవసీ పాలసీ ముందుపెట్టింది. సిగ్నల్ యాప్ వాట్సాప్ కంటే ఎందుకు భిన్నం? వాట్సాప్ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన వెంటనే చాలా మంది ఇతర యాప్‌ల వైపు మొగ్గు చూపారు. ఆ సమయంలో ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ " సిగ్నల్ వాడండి" అని ట్విటర్ లో ఒక ట్విట్ చేసాడు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా సిగ్నల్ డౌన్లొడ్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దింట్లో కూడా వాట్సాప్ మాదిరిగానే ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ ఉండటం విశేషం.(చదవండి: మీ స్నేహితులను సిగ్నల్‌కు ఆహ్వానించండి ఇలా..?) సిగ్నల్ మెసెంజర్‌ను మోక్సీ మార్లిన్స్పైక్, బ్రియాన్ ఆక్టన్ 2018లో స్థాపించారు. స్పష్టంగా చెప్పాలంటే బ్రియాన్ ఆక్టన్ వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు కూడా. సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్ 19 బిలియన్ డాలర్లకు వాట్సాప్ ను 2014లో కొనుగోలు చేసింది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మరియు సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ మెసేజింగ్ యాప్ ద్వారా డబ్బు సంపాదించాలని అనుకున్నప్పుడు సోషల్ మీడియా సంస్థ నుంచి నిష్క్రమించాలని యాక్టన్ నిర్ణయించుకున్నాడు. సంస్థను విడిచిపెట్టిన వెంటనే బ్రియాన్ ఆక్టన్ ఓపెన్ విస్పర్ సిస్టమ్స్ యొక్క మోక్సీ మార్లిన్‌స్పైక్‌తో జతకట్టి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ సిగ్నల్‌తో పాటు సిగ్నల్ ఫౌండేషన్‌ను 2018లో ఏర్పాటు చేసాడు. You can make an app used by many millions of people that has no data...Cool chart by @forbes & @UKZak 🙈🙊🙉 https://t.co/gWFqyIeoZ3 pic.twitter.com/Unngddaq5M — Signal (@signalapp) January 5, 2021 సిగ్నల్ యొక్క యొక్క ముఖ్య లక్ష్యం తన వినియోగదారులకు అత్యంత సురక్షితమైన మెసెంజర్ యాప్ ను అందించడం. వాస్తవానికి చెప్పాలంటే, ప్రస్తుతం సిగ్నల్ యొక్క ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్‌ను వాట్సాప్ ఉపయోగిస్తుంది. సిగ్నల్ ద్వారా పంపిన సందేశాలు రహస్యంగా ఉంచబడుతాయి. అనగా తన మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో ప్రైవేట్ సందేశాలను, మీడియాను సిగ్నల్ సర్వర్‌లో నిల్వ చేయదు. వాట్సాప్ కూడా సందేశాల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కూడా అందిస్తుంది. కానీ, ఇది ఐపీ అడ్రస్, గ్రూప్ వివరాలు, స్టేటస్ వంటి ఇతర ప్రైవేట్ సమాచారాన్ని యాక్సెస్ చేస్తుంది. సంస్థ క్లౌడ్‌లో నిల్వ చేసిన సందేశాలను కూడా గుప్తీకరించదు(ఎన్క్రిప్షన్). ఇంకో మెసెంజర్ యాప్ టెలిగ్రామ్ కూడా యూజర్ యొక్క కాంటాక్ట్ నంబర్ మరియు యూజర్ ఐడీని నిల్వ చేస్తుంది. అయితే, డివైజ్ ఆఫ్‌లైన్‌లో ఉంటే సందేశాలు పంపబడే వరకు సిగ్నల్ కొన్ని దాని సర్వర్‌లో దాని సందేశాలను నిల్వ చేస్తుంది. సిగ్నల్ రిజిస్ట్రేషన్ లాక్ కోసం పిన్ను సెట్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. ఇది వినియోగదారులకు ప్రైవేట్ ప్రొఫైల్ సమాచారాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఒక వినియోగదారు పరికరాన్ని కోల్పోతే లేదా క్రొత్తదానికి మారిన ప్రొఫైల్, సెట్టింగులు, కాంటాక్ట్స్ ను తిరిగి పొందడానికి ఈ లాక్ పిన్ ఉపయోగపడుతుంది. మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే, వాట్సాప్ మాదిరిగా కాకుండా సిగ్నల్ పెద్ద టెక్నాలజీ సంస్థ యాజమాన్యంలో లేదు. యూజర్ ప్రైవసీ మాట ఏమిటి? వాట్సాప్ మాదిరిగా కాకుండా సిగ్నల్ డేటాలో నిల్వ చేయబడేది కేవలం ఫోన్ నంబర్ మాత్రమే. సందేశాలను రక్షించడంతో పాటు, సిగ్నల్ మెటాడేటా యొక్క సమాచారాన్ని దాచిపెడుతుంది. దింతో ఎవరు ఎవరికి సందేశం పంపిస్తున్నారో తెలియదు. వినియోగదారులు అజ్ఞాత కీబోర్డ్ మోడ్‌ను అందించడంతో పాటు యాప్ లో స్క్రీన్షాట్లను బ్లాక్ చేయవచ్చు. ఇటీవల, యాప్ లో ఫోటోలను పంపే ముందు ముఖాలను బ్లర్ చేయడానికి కొత్తగా ఒక ఫీచర్ ను కూడా తీసుకొచ్చింది. అలాగే దీని కాంటాక్ట్ లిస్ట్ లో మొబైల్ నెంబర్ కనిపించకుండా చేయొచ్చు కూడా. ప్రస్తుతం ఈ యాప్ గ్రాంట్లు, విరాళాల ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు మొబైలలో సిగ్నల్ యాప్ అందుబాటులో ఉంది. వినియోగదారులు డెస్క్‌టాప్ ద్వారా కూడా దీనిని యాక్సెస్ చేయవచ్చు. -
మీ స్నేహితులను సిగ్నల్‌కు ఆహ్వానించండి ఇలా..?
వాట్సాప్ 2021లో కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలపై చాలా విమర్శలు వస్తున్నాయి. దింతో చాలా మంది వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రాం వంటి ఇతర మెసేజింగ్ యాప్స్ వైపు చూస్తున్నారు. ప్రధానంగా మరింత సెక్యూరిటీ అందించే సిగ్నల్ యాప్ వైపు ఎక్కువ యూజర్లు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం కొద్దీ రోజుల క్రితం ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ " సిగ్నల్ వాడండి" అని ఒక మెసేజ్ ట్విటర్ లో పెట్టాడు. దింతో అప్పటి నుండి సిగ్నల్ యాప్ వాడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.(చదవండి: వాట్సాప్‌తో బతుకు బహిరంగమేనా..?) అయితే, కొత్తగా సిగ్నల్ యాప్ ను ఉపయోగించే చాలా మంది వినియోగదారులు తమ బంధువులును, మీత్రులను ఇందులో ఎలా యాడ్ చేయాలో వారికీ అర్ధం కావడం లేదు. కానీ, యూజర్లు వాట్సాప్ తరహాలనో సులభంగా మీ మిత్రులను ఇందులోకి జోడించవచ్చు. మీ మిత్రులు కూడా సిగ్నల్ యాప్ వాడుతుంటే మీ పని ఇంకా చాలా తేలిక అవుతుంది. ఇప్పుడు, మీరు సిగ్నల్ యాప్‌లో కుడి ఎగువ భాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి. అక్కడ మీకు కనిపిస్తున్న ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. షేర్ విత్ కాంటాక్ట్స్ లేదా చూస్ హౌ టూ షేర్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇప్పుడు హౌ టూ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కనిపిస్తున్న లింకును ఇతర గ్రూప్ లలో షేర్ చేసి ఆహ్వానించవచ్చు. -
ఆ దేశంలో టెలిగ్రామ్‌పై నిషేధం ఎత్తివేత!
మాస్కో: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై ఉన్న నిషేధాన్ని రష్యా ఎత్తివేసింది. రష్యా సెన్సార్షిప్ విధానాలకు బాధ్యత వహిస్తున్న ఫెడరల్ సర్వీస్ ఫర్ సూపర్విజన్ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మాస్ మీడియా ఈ ప్రకటన చేసింది. రెండేళ్ల క్రితం టెలిగ్రామ్‌ను ఉగ్రవాదులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని భావించిన రష్యా ప్రభుత్వం తమ దేశంలో టెలిగ్రామ్‌పై నిషేధాన్ని విధించింది. రష్యా పారిశ్రామికవేత్త పావెల్ దురోవ్ అభివృద్ధి చేసిన టెలిగ్రామ్‌ను ఉగ్రవాదులు ఉపయోగించారని అధికారులు ఆరోపించారు. దీనికి సంబంధిన ఎన్క్రిప్షన్ డేటాను ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించారు. (వైరస్ సోకకుండా పుతిన్‌కు భారీ టన్నెల్) అయితే అది వినియోగదారుల గోపత్యకు ఆటంకం అని పావెల్ తిరస్కరించారు. దీంతో యాప్‌ను దేశంలో నిషేధిస్తూ 2018లో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏప్రిల్ 2018లో టెలిగ్రామ్‌ను దేశంలో బ్లాక్ చేయమని టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్లకు సూచించిన తరువాత, ఇది కొద్దిసేపు అందుబాటులో లేకుండా పోయింది. కానీ కొన్ని గంటల్లోనే ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యింది. నిషేధం విధించిన తరువాత కూడా దేశంలో దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. దీన్ని బ్లాక్ చేయడం రష్యా ప్రభుత్వం చేతకాకే నిషేధాన్ని ఎత్తి వేసినట్లు తెలుస్తోంది. (చైనాలో పందుల కొరత.. రష్యా విమానాలకు గిరాకీ) టెలిగ్రామ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యాప్ ద్వారా 200,000 మంది వరకు గ్రూపులోసందేశాలు, ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది చాలా ప్రజాదరణ పొందింది. గత మార్చినెలలో కేవలం 30 రోజుల్లోనే దీనిని 200 మిలియన్ల మంది ఉపయోగించారు. ఇప్పటి వరకు ఇంత ఎక్కువగా ఏ యాప్‌ని ఉపయోగించలేదని టెలిగ్రామ్ సంస్థ తెలిపింది. టెలిగ్రామ్‌ను ఒకదేశంగా భావిస్తే ఎక్కువ జనాభా ఉన్నదేశాల్లో ఇది ఆరవ దేశంగా నిలిచేది. -
24 గంటల్లో 30 లక్షలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సొంతమైన వాట్సాప్‌కు భారీ షాక్ తగిలింది. వాట్సాప్ పోటీ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ యూజర్ బేస్‌లో దూసుకుపోతోంది బుధవారం ఫేస్బుక్ మెసేజింగ్ యాప్, వాట్సాప్ యాప్‌లు సేవలు స్తంభించిన నేపథ్యంలో యూజర్లు టెలిగ్రామ్ వైపు మళ్లి పోతున్నారు. కేవలం ఒక్కరోజేలోనే తమ కొత్త యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని స్వయంగా టెలిగ్రామ్ వెల్లడించింది. ఫేస్బుక్ కు చెందిన వాట్సాప్, ఇన్స్ట్రా సేవల్లో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో తమ యూజర్ల సంఖ్యా భారీగా పెరిగిందని టెలిగ్రాం తాజాగా వెల్లడించింది. కేవలం 24 గంటల్లోనే 30 లక్షల కొత్త యూజర్లు తన నెట్‌వర్క్‌లో చేరారని టెలిగ్రాం ఫౌండర్ పావెల్ దురోవ్ తెలిపారు. వాట్సాప్‌కు పోటిగా ఎంట్రీ ఇచ్చిన చాటింగ్ యాప్ టెలిగ్రాంకు ప్రస్తుతం 200 మిలియన్ల నెలవారీ యూజర్లున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ సొంతమైన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్ సేవలకు బుధవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోడింగ్‌లో సమస్యలు ఎదురైనట్టుగా పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. అటు ఫేస్బుక్ కూడా దీన్ని ధృవీకరించింది. అయితే గురువారం ఉదయానికి ఇన్స్టాగ్రామ్ సేవలను పునరుద్దిరించినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
టెలిగ్రాం యాప్‌లో సరికొత్త ఫీచర్..!
న్యూయార్క్: ఇన్స్టంట్ మెసేజింగ్ మొబైల్ యాప్ ‘టెలిగ్రాం’లో యూజర్లకు ఎంతో ఉపయోగకరమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో మూడు టెలిగ్రాం అకౌంట్లను వాడుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ టెలిగ్రాం అకౌంట్లు ఉన్నవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై లభిస్తున్న టెలిగ్రాం ఆప్‌లో కూడా రెండు కొత్త థీమ్‌లను జత చేశారు. ఇక రెండు ప్లాట్‌ఫాంలపై కూడా టెలిగ్రాం యూజర్లు తమకు వచ్చే మెసేజ్‌లకు క్విక్ రిప్లై ఇవ్వవచ్చు. టెక్ట్స్, ఎమోజీ, స్టిక్కర్, జిఫ్ ఇమేజ్‌లను పంపుకోవచ్చు. తాజా వెర్షన్ 4.7ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు తమ తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఐసిస్ టార్గెట్ తాజ్మహలా?
భారతదేశం మీద త్వరలోనే దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుకూల మీడియా గ్రూపు ఒకటి హెచ్చరించింది. వాళ్ల హెచ్చరికలో ఉపయోగించిన చిత్రంలో తాజ్‌మహల్‌ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. అహ్వాల్ ఉమ్మత్ మీడియా సెంటర్ వాళ్లు ఈ టార్గెట్ గ్రాఫిక్‌ను టెలిగ్రాం యాప్‌లో పోస్ట్ చేశారు. ఇది కేవలం కొంతమందికి మాత్రమే వెళ్లిందని, పూర్తి ఎన్క్రిప్టెడ్ పద్ధతిలో వెళ్లిందని అంటున్నారు. అయినా, జీహాదీల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండే ఇంటెలిజెన్స్ విభాగం ఒకటి దీన్ని గుర్తించింది. సైనిక యూనిఫాంలో ఉండి, తలమీద నల్లటి తలపాగా ధరించిన ఒక వ్యక్తి అసాల్ట్ రైఫిల్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ పట్టుకుని ఆగ్రాలోని తాజ్‌మహల్ దగ్గరలో ఉన్నట్లుగా ఆ గ్రాఫిక్‌లో ఉంది. అలాగే దీనికి ఇన్సెట్లో వాడిన మరో బొమ్మలో తాజ్‌మహల్ బొమ్మ, అక్కడ 'న్యూ టార్గెట్' అని రాసి ఉన్నట్లుగా కనపడుతోంది. ఇక్కడ ఆత్మాహుతి దాడి చేయడానికి వాళ్లు సిద్ధపడుతున్నట్లుగా కూడా అందులో రాసి ఉంది. ఇస్లామిక్ స్టేట్ అనుకూల వర్గాలు భారతదేశం మీద దాడులు చేస్తామని బెదిరించడం ఇది మొదటిసారి ఏమీ కాదు. లక్నోలో ఉగ్రవాద నిందితుడు సైఫుల్లాను భద్రతాదళాలు ఎన్కౌంటర్లో హతమార్చినప్పుడు కూడా భారత్ మీద దాడులు చేస్తామని టెలిగ్రాం యాప్‌లో సందేశాలు వచ్చాయి. సైఫుల్లాను భారతదేశం నుంచి వచ్చిన ఖలీఫా సైనికుడిగా అందులో అభివర్ణించారు. ఇప్పటివరకు ఇస్లామిక్ స్టేట్‌లో దాదాపు 75 మంది భారతీయులు చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఎక్కువగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు.