టెక్ ప‍్రపంచంలో యూజర్లను ఆకట్టుకోవడంతో పాటు వారిని సొంతం చేసుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.తాజాగా టెలిగ్రామ్ కొత్త అప్‌డేట్ తెచ్చింది. ఈ అప్‌డేట్‌తో యూజర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో షేరింగ్
ఇటీవల కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా యూజర్లు వాట్సాప్‌కు దూరం అవుతున్నారు. అదే సమయంలో ప్రత్యామ్నయంగా టెలిగ్రామ్ యాప్‌ను వినియోగించుకునేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో టెలిగ్రాం వాట్సాప్‌తో పోటీ పడడంతో పాటు యూజర్లను ఆకట్టుకునేలా కొత్త కొత్త అప్‌డేట్‌లతో దూసుకుపోతుంది. తాజాగా ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో పాటు వీడియోలను షేర్ చేసేలా ఫీచర్ ను అప్‌డేట్ చేసింది.
యూజర్లందరు ఒకే సారి గ్రూప్‌కాల్ లో యాడ్ అయ్యే వరకు పరిమితిని పెంచుతూనే ఉండాలని టెలిగ్రామ్ తెలిపింది.1000 మంది వీడియో కాల్ మాట్లాడుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ క్లాసులు, మీటింగ్స్‌లో పాల్గొనే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
వీడియో ఫీచర్
టెలిగ్రామ్ తన వీడియో షేరింగ్ ఫీచర్‌ని అప్‌డేట్ చేసింది. మీరు మీ చాట్ బాక్స్‌లోని రికార్డింగ్ బటన్‌ని ట్యాప్ చేస్తే వీడియో రికార్డ్ అవుతుంది. ఆ రికార‍్డైన వీడియోలను మీ స‍్నేహితులకు షేర్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment