వివాహం చేసుకోలేదు..ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతాడు..అలాంటిది తనకు 12 దేశాల్లో 100 మంది పిల్లలున్నారు. అదేంటి పెళ్లి కాకుండా, ఒంటిరిగా ఉంటూ అంతమందికి ఎలా తండ్రాయ్యాడు..? అని ఆశ్చర్యపోతున్నారా.. ఇంతకీ అతను ఎవరు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం.
ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ తనకు 100 మందికి పైగా పిల్లలు ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు టెలిగ్రామ్‌లో సుధీర్ఘ పోస్ట్ చేశారు. వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండేందుకే పావెల్ ఇష్టపడుతారు. అలాంటి వ్యక్తి 100 మందికి ఎలా తండ్రాయ్యడో టెలిగ్రామ్ పోస్ట్‌లో వివరంగా తెలిపారు.
పావెల్ తెలిపిన వివరాల ప్రకారం..‘ప్రపంచవ్యాప్తంగా నాకు 100కు పైగా పిల్లలు ఉన్నారు. ఎన్నడూ వివాహం చేసుకోని, ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తికి ఇది ఎలా సాధ్యమవుతుంది? అనుకుంటున్నారా.. సుమారు 15 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు నా వద్దకు వచ్చి విచిత్రమైన కోరిక కోరాడు. తనకు, తన భార్యకు సంతానోత్పత్తి సమస్య కారణంగా పిల్లలు పుట్టలేదని చెప్పాడు. తనకు సంతానం కలగడానికి నా వీర్యాన్ని దానం చేయాలని కోరాడు. దాంతో నాకు విపరీతంగా నవ్చొచ్చింది. ఆ సమస్య ఎంత తీవ్రమైందో నిజానికి ఆ సమయంలో నాకు తెలియదు. స్పెర్మ్ దానానికి అంగీకరించి క్లినిక్‌కు వెళ్లాను. ఆరోగ్యకరమైన వీర్యకణాలు దొరకడం చాలా కష్టమని డాక్టర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. సంతానంలేని వారికి స్పెర్మ్ దానం చేయడం గొప్ప విషయం అని అన్నాడు. దాంతో సమస్య ఎంత తీవ్రమైందో అర్థమైంది’ అన్నారు.
ఇదీ చదవండి: ‘ఓలా మా డేటా కాపీ చేసింది’
‘ప్రపంచవ్యాప్తంగా నాకు 12 దేశాల్లో దాదాపు 100 మంది పిల్లలున్నారు. నిజానికి ఇలా చెప్పడం ఆమోదయోగ్యం కాకపోయినా స్పెర్మ్ దాతగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. నేను చాలా ఏళ్ల క్రితమే వీర్యదానాన్ని ఆపినప్పటికీ ఇంకా ఫ్రీజ్ చేసిన నా కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకున్నా. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారింది. దాన్ని తగ్గించడంలో నా వంతు సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. మరికొందరు ఆరోగ్యవంతమైన పురుషులను వీర్యదానం కోసం ప్రోత్సహించాలనుకుంటున్నాను. దానివల్ల పిల్లలు కావాలనుకునే కుటుంబాలకు ఎంతో సహాయం చేసినట్లవుతుంది’ అని దురోవ్ చెప్పారు. టెలిగ్రామ్‌లో ఈమేరకు చేసిన పోస్ట్‌ను ఇప్పటికే సుమారు 20 లక్షల మంది వీక్షించారు. దాంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment