Fertility clinic
-
ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం నటి రమ్యకృష్ణ (ఫొటోలు)
-
మాతృత్వం.. ఓ మధురానుభూతి!
సాక్షి, హైదరాబాద్: మాతృత్వం.. ఓ మధురానుభూతి అని ప్రముఖ నటి రమ్యకృష్ణ పేర్కొన్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, పిల్లల్ని కనడం, పెంచడం భారంగా భావిస్తున్నారని చెప్పారు. అలా అనుకోవద్దని తాము కూడా వృత్తితో పాటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకున్నామని తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ నటి రమ్యకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ దుర్గారావును ఫరి్టలిటీ, ఐవీఎఫ్‌కు సంబంధించి ఆమె పలు ప్రశ్నలను అడిగి నివృత్తి చేసుకున్నారు. జపాన్‌లో కొన్నేళ్లుగా యువ జనాభా విపరీతంగా తగ్గిపోతోందని, పూర్తిగా వృద్ధుల జనాభా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో అక్కడి ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని డాక్టర్ దుర్గారావు పేర్కొన్నారు. మన దేశంలో కూడా సంతానోత్పత్తి రేటు 1.8 ఉందని, అది 2కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా జని్మంచిన పలువురు పిల్లలకు స్కాలర్షిప్లు అందజేశారు. వీరంతా రేపటి చాలెంజర్లని, రేపటి రోజును తీర్చిదిద్దే వారిని సమాజానికి అందించినందుకు గర్వంగా ఉందని వివరించారు. -
ఐవీఎఫ్‌తో... సంతానం సఫలం
రాష్ట్రంలో దాదాపు 15 శాతం మంది దంపతులు సంతానలేమితో బాధపడుతున్నట్లు ఓ సర్వే చెబుతోంది. హైదరాబాద్‌లో కూడా లైఫ్‌స్టైల్ మారడం వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అందులోనూ సంతానలేమి అనేది ప్రముఖంగా చెప్పుకోవచ్చు. జంక్‌ఫుడ్, ఎక్కువసేపు కూర్చుని చేసే డెస్క్ జాబ్‌ల కారణంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో జన్యుపరంగా కూడా ఇన్‌ఫెరి్టలిటీ సమస్యలు వస్తున్నాయని వైద్యులు, నిపుణులు పేర్కొంటున్నారు. చాలామందిలో ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి నిద్ర, ఎక్సర్సైజ్లు కనుక చేస్తే సంతానలేమి అనేది పెద్ద సమస్య కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల దేశంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో పెరుగుతున్న మెట్రో పాలిటన్ కల్చర్ కారణంగా సంతానలేమి సమస్య ఉత్పన్నం అవుతోందని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, క్రమంగా లేని పనివేళలు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అధిక బరువు, మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు, వ్యసనాలు వంటివి సంతాన లేమికి దారితీస్తున్నాయి. ఒత్తిడి వల్ల కూడా.. మహిళల్లో కనిపించే ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడి, హార్మోన్లలో సమతుల్యత దెబ్బతినడం వంటివి సంతానలేమికి కారణమవుతున్నాయి. అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇంప్లాంటేషన్‌లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. ఇక మగవారిలోనైతే.. శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం సంతనం కలగడానికి అవరోధంగా నిలుస్తున్నాయి.సంతానలేమి నిర్ధారణ ఇలా? సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణా పద్ధతులను పాటించకుండా, కలిసి ఉంటూ ఏడాది పాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రాకపోతే అప్పుడు ఆ దంపతులకు సంతానలేమి సమస్య ఉండే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్యను ప్రైమరీ ఇన్‌ఫెరి్టలిటీ అంటారు. మొదటిసారి గర్భధారణ తర్వాత, రెండోసారి గర్భధారణ కోరుకున్నప్పుడు ఏడాది పాటు ప్రయతి్నంచినా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఏయే చికిత్స అందజేస్తారు..అండం సరిగా పెరగనప్పుడు, అది పెరగడానికి క్లోమిఫిన్, లెట్రోజ్ వంటి కొన్ని రకాల మాత్రలు, వాటి మోతాదులను క్రమంగా పెంచుకుంటూ వాడాలి. కొందరికి గొనాడోట్రోపిన్ హార్మోన్ ఇంజెక్షన్ అవసరమవుతుంది. అండాశయాలలో పీసీఓడీ కారణంగా అండాలు పెరగకపోతే లాప్రోస్కోప్ ఆపరేషన్ ద్వారా, పీసీఓడీలోని నీటితిత్తుల్లో కొన్నింటిని పేల్చడం అవసరం. దీన్నే ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. ఇక అండాశయంలో నీటితిత్తులు, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలను కూడా లాప్రోస్కోపిక్ ప్రక్రియ ద్వారా తొలగించి, ఆ తర్వాత గర్భం వచ్చేందుకు అవసరమైన చికిత్స అందించాలి. థైరాయిడ్ సమస్య ఉంటే దాన్ని తగ్గించే మందులు వాడాలి. అప్పుడు హార్మోన్ల అసమతుల్యత తగ్గి, గర్భధారణకు అవకాశాలు మెరుగుపడతాయి.ఎవరికి చికిత్స అవసరం.. మహిళకు ప్రతినెలా నెలసరి సక్రమంగా వస్తూ, రెండేళ్ల పాటు ప్రయతి్నంచాక కూడా అప్పటికీ గర్భం రానివారికీ, అలాగే ఆ మహిళ 30 ఏళ్ల వయసుకు చేరుకుంటున్నప్పుడు.. ఆ దంపతులు డాక్టర్‌ను సంప్రదించి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం మంచిది.గర్భాశయంలో లోపాలు సాధారణంగా గర్భాశయంలో లోపాల వల్ల గర్భం దాల్చలేని వారు దాదాపు 10% నుంచి 15% వరకూ ఉంటారు. గర్భాశయంలో లోపాలు కూడా అనేక కారణాల వల్ల కలుగుతుంటాయి. గర్భాశయ ముఖద్వారంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పూత ఉన్నా, అక్కడ స్రవించే స్రావాలు చిక్కగా ఉన్నా, గర్భాశయ ముఖద్వారం మరీ సన్నగా ఉన్నప్పుడు వీర్యకణాలు గర్భసంచి లోపలికి ప్రవేశించలేకపోవచ్చు. కొంతమందిలో యోని ద్రవాల్లో ఆమ్లగుణం మరీ ఎక్కువగా ఉంటే అవి వీర్యకణాలను చైతన్యరహితం చేస్తాయి. ఐవీఎఫ్ ప్రక్రియ పనిచేస్తుందిలా.. స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ సమస్యలు ఉన్నప్పు డాక్టర్లు ఐవీఎఫ్ మార్గాన్ని సూచిస్తారు. ఈ ప్రక్రియలో తొలుత మహిళలో అండాలు బాగా పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి ఆరోగ్యకరమైన అండాలను సేకరించి, పురుషుడి నుంచి స్వీకరించిన శుక్రకణాలతో ప్రయోగశాలలో ఫలదీకరణం చెందిస్తారు. ఈ ఫలదీకరణ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధిచెందుతాయి. ఇందులో నుంచి ఆరోగ్యకరమైన పిండాలను మళ్లీ మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు. మిగతా పిండాలను శీతలీకరించి పక్కన పెట్టుకుంటారు. ఆరు వారాల తర్వాత అ్రల్టాసౌండ్ పరీక్ష చేసి, ఆమెలో గర్భం నిలిచిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకుంటారు. ఒకవేళ గర్భం నిలవకపోతే శీతలీకరించిన పిండాల్లో మరోదాన్ని గర్భంలోకి ప్రవేశపెడుతారు.ఆహారపు అలవాట్లే కారణం.. ప్రస్తుతం యువతీ, యువకుల్లో ఆహారపు అలవాట్లు సంతానలేమి సమస్యలకు కారణం అవుతున్నాయి. మితిమీరిన ఆల్కహాల్, సిగరెట్ తాగడంతో ప్రత్యుత్పత్తి సంబంధిత సమస్యలు వస్తున్నాయి. గర్భాశయంలో లోపాలు, అండాశయాల్లో బుడగలు (పీసీఓడీ), వీర్యకణాల సంఖ్య తగ్గడం, చలనం లేకుండా పోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆహారపు అలవాట్లు సరిచేసుకుని, ఆరోగ్యకరమైన జీవన విధానంతో సంతానలేమి సమస్యలకు దూరం కావచ్చు. – జలగం కావ్యా రావు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్పురుషుల్లోనూ సమస్యలు.. స్త్రీలతో పాటు పురుషుల్లో కూడా పలు సమస్యలు ఉంటాయి. పురుషుల్లో వీర్యకణాలు తక్కువగా ఉండటం అతిపెద్ద సమస్య. సరైన మందులు ఇవ్వడంతో పాటు సరైన జీవన విధానం పాటిస్తే వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కొందరిలో అసాధారణమైన వీర్య కణాలు ఉంటాయి. వాటిలో లోపాలు ఉంటాయి. సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకుంటే వాటి నాణ్యత పెరుగుతుంది. ఇక, కొందరిలో వీర్యకణాల కదలిక తక్కువగా ఉంటుంది. అప్పుడు వీర్యక ణాలు అండంతో ఫలదీకరణ చెందవు. ఈ సమస్యను కూడా మందులతో తగ్గించవచ్చు. -
పెళ్లి కాకుండానే 100 మందికి తండ్రయ్యాడు..!
వివాహం చేసుకోలేదు..ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతాడు..అలాంటిది తనకు 12 దేశాల్లో 100 మంది పిల్లలున్నారు. అదేంటి పెళ్లి కాకుండా, ఒంటిరిగా ఉంటూ అంతమందికి ఎలా తండ్రాయ్యాడు..? అని ఆశ్చర్యపోతున్నారా.. ఇంతకీ అతను ఎవరు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం.ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ తనకు 100 మందికి పైగా పిల్లలు ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు టెలిగ్రామ్‌లో సుధీర్ఘ పోస్ట్ చేశారు. వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండేందుకే పావెల్ ఇష్టపడుతారు. అలాంటి వ్యక్తి 100 మందికి ఎలా తండ్రాయ్యడో టెలిగ్రామ్ పోస్ట్‌లో వివరంగా తెలిపారు.పావెల్ తెలిపిన వివరాల ప్రకారం..‘ప్రపంచవ్యాప్తంగా నాకు 100కు పైగా పిల్లలు ఉన్నారు. ఎన్నడూ వివాహం చేసుకోని, ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తికి ఇది ఎలా సాధ్యమవుతుంది? అనుకుంటున్నారా.. సుమారు 15 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు నా వద్దకు వచ్చి విచిత్రమైన కోరిక కోరాడు. తనకు, తన భార్యకు సంతానోత్పత్తి సమస్య కారణంగా పిల్లలు పుట్టలేదని చెప్పాడు. తనకు సంతానం కలగడానికి నా వీర్యాన్ని దానం చేయాలని కోరాడు. దాంతో నాకు విపరీతంగా నవ్చొచ్చింది. ఆ సమస్య ఎంత తీవ్రమైందో నిజానికి ఆ సమయంలో నాకు తెలియదు. స్పెర్మ్ దానానికి అంగీకరించి క్లినిక్‌కు వెళ్లాను. ఆరోగ్యకరమైన వీర్యకణాలు దొరకడం చాలా కష్టమని డాక్టర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. సంతానంలేని వారికి స్పెర్మ్ దానం చేయడం గొప్ప విషయం అని అన్నాడు. దాంతో సమస్య ఎంత తీవ్రమైందో అర్థమైంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘ఓలా మా డేటా కాపీ చేసింది’‘ప్రపంచవ్యాప్తంగా నాకు 12 దేశాల్లో దాదాపు 100 మంది పిల్లలున్నారు. నిజానికి ఇలా చెప్పడం ఆమోదయోగ్యం కాకపోయినా స్పెర్మ్ దాతగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. నేను చాలా ఏళ్ల క్రితమే వీర్యదానాన్ని ఆపినప్పటికీ ఇంకా ఫ్రీజ్ చేసిన నా కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకున్నా. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారింది. దాన్ని తగ్గించడంలో నా వంతు సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. మరికొందరు ఆరోగ్యవంతమైన పురుషులను వీర్యదానం కోసం ప్రోత్సహించాలనుకుంటున్నాను. దానివల్ల పిల్లలు కావాలనుకునే కుటుంబాలకు ఎంతో సహాయం చేసినట్లవుతుంది’ అని దురోవ్ చెప్పారు. టెలిగ్రామ్‌లో ఈమేరకు చేసిన పోస్ట్‌ను ఇప్పటికే సుమారు 20 లక్షల మంది వీక్షించారు. దాంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
ఐవీఎఫ్‌తో.. సంతనాలేమికి చెక్!
సంతానలేమితో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) అనేది ఒక వరం లాంటిదని వైద్యురాలు అర్చన అన్నారు. జిల్లా కేంద్రంలో ‘పినాకిల్ ఫెర్టిలిటీ’ సెంటర్ ద్వారా సేవలందిస్తున్న వైద్యురాలు అర్చన.. అంతర్జాతీయ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో సతమతమవుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) రిపోర్టులు వెల్లడించడం గమనార్హమని అన్నారు. అడ్వాన్స్డ్, ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన ఐవీఎఫ్ విధానం సంతానలేమితో బాధపడుతున్న వారికి మంచి అవకాశమని తెలిపారు. గ్రామీణప్రాంతాల వారికి సైతం తక్కువ ఖర్చుతో ఆధునిక సౌకర్యాల ద్వారా చికిత్స అందించడం పినాకిల్ ఫెర్టిలిటీ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఐవీఎఫ్‌కు సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు సందేహాలను డాక్టర్ అర్చన నివృత్తి చేశారు.ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల ఆరోగ్యంపై..1978 జూలై 25న ఐవీఎఫ్ ద్వారా మొదటి బేబి లూయీస్ బ్రౌన్ జన్మించారు. నాలుగు దశాబ్దాలు నాటికి 8 మిలియన్ల పిల్లలు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించారు. ఇప్పటి వరకు చేసిన రిసెర్చ్, ఆర్టికల్స్ ఆధారంగా సహజంగా గర్భం ద్వారా పుట్టిన పిల్లలకి ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి ఎటువంటి తేడా లేదని తేలింది.ఐవీఎఫ్ ద్వారా కవలలు పుట్టే అవకాశం..ఐవీఎఫ్ పద్ధతిలో అంటే ఆడవారి అండాలను మగవారి వీర్యకణాలు కలిపితే వచ్చే పిండాలను గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఈ పద్ధతిలో మునుపు రెండు లేక మూడు పిండాలను ప్రవేశపెట్టేవారు. అందువల్ల ఐవీఎఫ్‌లో కవలలు పుట్టే అవకాశం పెరుగుతుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో గర్భం దాల్చే అవకాశాలు మెరుగయ్యాయి.నొప్పి ఉంటుందంటారు..ఆడవారు 10–12 రోజులపాటు ఐవీఎఫ్‌లో రోజూ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాతే ఆడవారి శరీరంలో ఉండే అండాలను బయటకు తీసి మగవారి వీర్యకణాలతో కలపడం జరుగుతుంది. అలా పెరిగిన దాన్ని ఆడవారి గర్భసంచిలో ప్రవేశ పెడతాం. ఈ ప్రక్రియలు ఎగ్ పికప్ (ఎమ్బ్య్రో ట్రాన్స్ఫర్) అంటాం. ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్ అంటే అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. ఐవీఎఫ్‌లో నొప్పి అనేది చాలా తక్కువతొమ్మిది నెలలు రెస్ట్ అవసరమా..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన తర్వాత ఒక రెండు నెలలు జాగ్రత్త చెబుతాం. ఆ తరువాత సహజ ప్రెగ్నెన్సీ లాగే అన్ని పనులు చేసుకోవచ్చు. ఆఫీస్‌కి వెళ్ళేవాళ్లు, ఇంటి పనులు చేసుకునేవారు ఎప్పటిలాగే వారి పనులను చేసుకోవచ్చు.సిజేరియన్ అవసరం లేదు..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన వాళ్లు నార్మల్ డెలివరీ ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సహజ ప్రెగ్నెన్సీ లాగే ఉంటుంది. వేరే ఇతర కారణాల వల్ల సిజేరియన్ చేయించాల్సిన పరిస్థితి వస్తే తప్ప కేవలం ఐవీఎఫ్ వల్ల సిజేరియన్ చేయించాల్సిన అవసరం అసలు లేదు.– డాక్టర్ అర్చన, పినాకిల్ ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్ -
పురుషుల వంధ్యత్వ సమస్యను పరిష్కరించే ఆండ్రోమాక్స్ ప్రారంభం
-
ప్రెగ్నెన్సీ కోసం ఏ ఏజ్ వరకు ట్రై చేయాలంటే..
-
ఈ చిన్న పరీక్షతో మీ సంతాన లేమి సమస్యలకు చెక్ పెట్టండి....
-
సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగవ్వాలంటే... తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
-
పిల్లలు కావాలా?.. సక్సెస్ రేటు కోసం సంతాన సాఫల్య కేంద్రాల అడ్డదారులు
ఉన్నత చదువులు.. ఉపాధి అవకాశాలు.. ఆలస్యపు పెళ్లిళ్లు.. ఆ తర్వాత భర్త నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే.. భార్య పగలు విధులు నిర్వహించడం వెరసీ.. యువ దంపతుల్లో సంతానలేమి సమస్యకు కారణమవుతోంది. దీంతో పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దంపతుల్లో ఉన్న ఈ బలహీనతను వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. వీర్యకణాల సేకరణ.. అండాల అభివృద్ధి పేరుతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు ఒంటరి పేద మహిళల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. సాక్షి, హైదరాబాద్: ఐటీ, అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు గ్రేటర్ శివారు జిల్లాలు కేంద్ర బిందువుగా మారాయి. ముఖ్యంగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్స్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, హైటెక్ సిటీ, శేర్లింగంపల్లి, కోకాపేట్, నార్సింగి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీలు గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ సహా కీలక ఐటీ అనుంబంధ సంస్థలన్నీ ఇక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వీటిలో ప్రత్యక్షంగా ఏడు లక్షల మంది యువత.. పరోక్షంగా మరో పది లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వీరిలో మెజారిటీ ఉద్యోగులు 35 ఏళ్లలోపు వారే. వీరంతా ఉన్నత చదువులు, ఉపాధి వేటలో పడి వివాహాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. రేడియేషన్ ఎఫెక్ట్.. మూడు పదుల వయసు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. మారిన జీవన శైలికి తోడు ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం, మాంసాహారాలను అధికంగా తీసుకోవడం, రాత్రి వేళల్లో ఎక్కువ సేపు మేల్కొని ఉండటం, శరీరానికి సరైన వ్యాయామం కూడా లేకపోవడంతో హార్మోన్ల సమతుల్యతలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు.. రోజంతా ఒడిలనే ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు పెట్టుకుని కూర్చొవడం వల్ల వాటి నుంచి వెలువడే రేడియేషన్‌తో యువతీ యువకుల్లో అండాలు, వీర్యకణాలు దెబ్బతింటున్నాయి. యుక్త వయస్కుల్లో ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా.. వాటి నాణ్యత అంతంతే. ఫలితంగా ఆయా దంపతుల్లో సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల కోసం వీరంతా సమీపంలోని సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. గైనకాలజిస్టులు వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సరోగసీ విధానంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఇన్ విట్రో ఫెర్టిలేజేషన్ (ఐవీఎ‹ఫ్) ఇంట్రా యుటిరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ)వంటి పద్ధతులను సూచిస్తున్నారు. మహిళల ఆరోగ్యంతో చెలగాటం.. గ్రేటర్ పరిధిలో సుమారు 200 ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో ఎక్కువగా కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, మాదాపూర్, శేర్లింగంపల్లి, మియాపూర్, నార్సింగి, గచ్చిబౌలి, శంషాబాద్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మణికొండ, కోకాపేట్, నార్సింగి, పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిలో పలు ఫెర్టిలిటీ సెంటర్లు సక్సెస్ రేటు కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. పిల్లలు కావాలనే ఆశతో వచి్చన యువ దంపతుల్లో ఉన్న బలహీనతను వీరు క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రభుత్వం సరోగసీ విధానంపై కఠినమైన ఆంక్షలు విధించడంతో ఐవీఎఫ్, ఐయూఐ పేరుతో కొత్త దందాకు తెరతీశాయి. చికిత్స చేసినా పిల్లలు పుట్టేందుకు అవకాశం లేని దంపతులకు ఎలాగైనా పిల్లలను కలిగించి, ఫెర్టిలిటీ సెంటర్‌కు, చికిత్స చేసిన వైద్యులకు మార్కెట్లో మంచి గుర్తింపు తీసుకురావాలని భావిస్తున్నారు. చాలా వరకు మందులతోనే మంచి రిజల్ట్ వస్తుంది. మందులు వాడినా ప్రయోజనం లేని దంపతులకు దాతల నుంచి సేకరించిన అండాలు, వీర్య కణాలను ఆశ చూపుతున్నారు. ఇందుకు ఏ తోడూ లేని ఒంటరి పేద మహిళలను ఎంచుకుని వారికి మాయమాటలు చెబుతున్నారు. వైద్య పరీక్షలు, అండాలు, వీర్యకణాల వృద్ధి పేరుతో మోతాదుకు మించి ఇంజక్షన్లు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. తీరా అనారోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత గుట్టుగా అక్కడి నుంచి జారుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ జిల్లా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్లో వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. -
సరోగసీలో కొత్త సమస్య..ఆ బిడ్డను ఏం చేయాలి?
శ్రీమంతులు, సంతానం కలగడం వీలులేని వారు సరొగసీ ద్వారా తల్లిదండ్రులు కావడం తెలుసు. గర్భాన్ని అద్దెకి ఇచ్చినవారు బిడ్డను కని ఇక ఆ బిడ్డను మర్చిపోవాల్సిందే. అయితే బిడ్డను కనడానికి డబ్బు తీసుకుని నెలలు నిండాక ఆ డబ్బు ఇచ్చినవారు బిడ్డ మాకు వద్దు అనంటే గర్భాన్ని అద్దెకు ఇచ్చిన స్త్రీ ఏం చేయాలి? కడుపులో ఉన్న బిడ్డ ఏం కావాలి? ఈ సమస్యతో ఈ ఒక సినిమా త్వరలో వస్తున్నా ఈ సమస్య కొత్త ప్రశ్నను లేవదీస్తున్నదనేది వాస్తవం. స్త్రీ సమస్య స్త్రీకే అర్థమవుతుంది. ప్రసిద్ధ మరాఠి నటి, దర్శకురాలు సమృద్ధి పోరే 2011లో ఒక సినిమా తీసింది మరాఠిలో. పేరు ‘మాలా ఆయీ వాయ్చే’ (నాకు తల్లి కావాలని ఉంది). అందులో అమెరికా నుంచి వచ్చిన మేరీ అనే మహిళ మహరాష్ట్రలోని హీరోయిన్ను అద్దె గర్భం ద్వారా బిడ్డను కని ఇవ్వమని అడుగుతుంది. హీరోయిన్ అందుకు సమ్మతిస్తుంది. కాని గర్భంలో బిడ్డ ఎదిగాక పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ పుట్టబోయే బిడ్డ కొన్ని అవకరాలతో (వికలాంగ సమస్యతో) పుట్టే అవకాశం ఉందని మేరీకి చెబుతారు. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఎదురు చూస్తున్న మేరీకి ఈ వార్త పెద్ద దెబ్బగా తాకుతుంది. ఆమె ఆ బిడ్డను వద్దనుకుని అమెరికా వెళ్లిపోతుంది. కాని ఇక్కడ గర్భంలో ఉన్న బిడ్డను మోస్తున్న తల్లి దానిని వద్దనుకోగలదా? ఇప్పుడు ఆ బిడ్డ ఉనికి ఏమిటి? అది ఆ సినిమా కథ. ఇప్పుడు ఇదే సమస్యను తీసుకుని హిందీలో తీసిన ‘మిమి’ జూలై 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అద్దెగర్భం–పెద్ద వ్యాపారం గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో సరొగసి ఒక పెద్ద ధోరణిగా సక్రమమైన విషయాలకు అక్రమమైన విషయాలకు కూడా వార్తల్లో ఉంది. ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి 25,000 మంది పిల్లలు సరొగసి ద్వారా పుడుతున్నారని అంచనా. సరొగసి చుట్టూ దాదాపు 3000 కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఉన్న 3000 ఫర్టిలిటీ సెంటరల్లో కొన్ని ఈ సరొగసి పనిలో ఉన్నాయి. పది లక్షల రూపాయల నుంచి పాతిక లక్షల రూపాయలు ఒక్క సరొగసికి మొత్తం ప్యాకేజీ లెక్కన క్లినిక్‌లు మాట్లాడుకుంటున్నాయని తెలుస్తోంది. విదేశీ జంటలు భారతదేశానికి వచ్చి సరొగసి ద్వారా పిల్లల్ని పొందడం వల్ల కావచ్చు, భారతదేశంలో కూడా సబబైన కారణాల వల్ల గాని, కెరీర్లో ఉన్న శ్రీమంతులు గాని సరొగసి ద్వారా బిడ్డలను కనాలనుకోవడం వల్ల ఈ ‘ఇండస్ట్రీ’ బయటకు కొంత తెలిసి, కొంత తెలియక విజయవంతంగా సాగుతోంది. సరొగసి క్రమబద్ధీకరణ కోసం, కమర్షియల్ సరొగసిని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2019 బిల్లు ఇంకా రాజ్యసభ అనుమతి పొందాల్సి ఉంది. ఈలోపు సరొగసితో ముడిపడిన సమస్యలు ప్రసార మాధ్యమాలకు, వినోద మాధ్యమాలకు మంచి ముడిసరుకు అవుతున్నాయి. ఎన్నో సమస్యలు సరొగసిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అద్దె గర్భం ఇచ్చే స్త్రీకి సాధారణ గర్భంలో ఉండే అన్ని రిస్కులతో పాటు భావోద్వేగాల సమస్యలు ఉంటాయి. కృత్రిమ పద్ధతిలో గర్భం ధరిస్తుంది కనుక ఆ పరీక్షల కోసమని, హార్మోన్ల కోసమని, ఫలదీకరణ కోసం చేసే రిపీటెడ్ తంతు ఆమె శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అద్దె గర్భం ప్రసవంలో కూడా చనిపోయిన తల్లులు ఉన్నారు. ఇక పుట్టిన బిడ్డ ‘జాతీయత’ పెద్ద సమస్య అవుతోంది. ఇక్కడ పుట్టిన బిడ్డను తమ దేశానికి తీసుకెళ్లాలనుకునే విదేశీ జంటలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బిడ్డను వద్దనుకుంటే పంకజ్ త్రిపాఠి, క్రితి సనాన్ నటించగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ‘మిమి’ సరొగసిలోని ఈ సమస్యనే చర్చించనుంది. అవివాహిత అయిన హీరోయిన్ను ఆమె మిత్రుడు సరొగసిలో మంచి డబ్బు ఉందని ఒప్పిస్తాడు. విదేశీ జంట నుంచి 20 లక్షల రూపాయలకు డీల్ కుదురుతుంది. ఆ గర్భం దాల్చి బిడ్డను ఇవ్వడంలో భాగంగా ఆమె ఊరు విడిచి ఇంకో కొత్త ప్రాంతానికి వెళ్లి మిత్రుడిని భర్తగా చెప్పి నివాసం ఉంటుంది. అంతా బాగానే ఉందనుకున్న సమయాన డబ్బు ఇచ్చిన విదేశీ జంట తమకు ఆ బిడ్డ వద్దని చెబుతుంది. ఇప్పుడు బిడ్డను ఏం చేయాలి? గర్భాన్ని మోస్తున్న హీరోయిన్ను ఆమె తల్లిదండ్రులు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని నిలదీస్తారు? కన్నాక ఆ బిడ్డ భవిష్యత్తు ఏమిటి... తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేది ఒక సమస్య... వీటన్నింటికీ జవాబు వెతికే ప్రయత్నం ‘మిమి’ చేస్తుంది. గర్భం దాల్చడం భారతీయ సమాజంలో పుణ్యకార్యం. గర్భంతో ఉన్న స్త్రీకి దక్కే గౌరవం, మర్యాద... పిల్లలున్న తల్లికి ఇచ్చే విలువ... వాటి చుట్టూ ఉండే కథలు, గాథలు అందరికీ తెలిసినవే. అద్దె గర్భమే అయినా ఇక్కడి స్త్రీ ఆ గర్భసమయంలో పొందే భావోద్వేగం వేరు. అలాంటిది ఆ బిడ్డకు అసలు హక్కుదారులు తప్పించుకుంటే తాను ఆ బిడ్డను సులువుగా వదులుకునే వీలు ఉండదు. ఈ సెంటిమెంటే ఇప్పుడు ‘మిమి’ సినిమా కథగా చర్చకు వస్తోంది. -
పేద, మధ్య తరగతి దంపతులకు సంతాన ప్రాప్తిరస్తు!
సాక్షి, సిటీబ్యూరో: సంతానలేమి సమస్యతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి దంపతులకు ఇకపై సర్కారీ ప్రసూతి ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ మేరకు గాంధీ, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆరోగ్య కేంద్రాల్లో అత్యాధునిక హంగులతో కూడిన సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద ఒక్కో సెంటర్లో రూ.5 కోట్ల చొప్పున ఖర్చు చేసి, చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలను, ల్యాబ్‌లను సమకూర్చనుంది. ఖరీదైన ఈ సేవలను ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేద, మధ్య తరగతి దంపతులకు మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఐయూవీ (ఇంట్రాయుటెరిన్ ఇన్సెమినేషన్)తో పాటు ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సేవలను ఉచితంగా పొందే అవకాశం పేదలకు లభించనుంది. పిల్లలకోసం ‘ప్రైవేటు’కు పరుగులు నిజానికి ఒకప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాది తిరక్క ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. దీనికి తోడు గంటల తరబడి ల్యాప్‌టాప్‌లను ఒళ్లో పెట్టుకుని పని చేస్తుండటంతో ఉష్ణోగ్రతలకు హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. ఆకలేసినప్పుడల్లా క్యాంటిన్లో రెడిమేడ్‌గా దొరికే పిజ్జాలు, బర్గర్లతో కడుపు నింపుకోవడంతో ఇది స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీకెండ్ పార్టీ పేరుతో అతిగా మద్యం తాగడం వల్ల దాంపత్య సమస్యలు తలెత్తుతున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో ప్రస్తుతం పట్టణాలకు, పల్లెలకు పెద్ద తేడా లేదు. ఫలితంగా ప్రస్తుతం ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. చివరకు సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇవి ఖరీదుతో కూడిన చికిత్సలు కావడంతో ప్రస్తుతం ఈ సేవలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. . ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇవి లేకపోవ డంతో పేద, మధ్య తరగతి దంపతులు పిల్లల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇకపై వారికి పైసా ఖర్చు లేకుండా ఈ ఖరీదైన సేవలను అందించాలని ప్రభుత్వం భావించించింది. రూ.ఐదు కోట్లతో అత్యాధునిక ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు మరో రూ.రెండు కోట్లతో మందులు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చునుంది. పేద దంపతులకు ఇదో వరం రెండేళ్ల క్రితం ప్రభుత్వం గాంధీలో ప్రయోగత్మాకంగా సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రతి గురువారం ఓపీలో సేవలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 400 మందికి ఐయూవీ (ఇంట్రాయుటెరిన్ ఇన్సెమినేషన్), మరో 8 వేల మందికి సాధారణ చికిత్సలు అందించాం. కరోనా కారణంగా గత మార్చి నుంచి ఈ సేవలను నిలిపివేయాల్సి వచి్చంది. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ ఈ సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించాం. ప్రభుత్వం కొత్తగా కేటాయించిన నిధులతో కీలకమైన ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. – డాక్టర్ మహాలక్ష్మి, గైనకాలజిస్ట్, గాంధీ ఆస్పత్రి -
తీరిన కల.. 52 ఏళ్ల వయసులో కవలలకు జననం
టవర్‌సర్కిల్ (కరీంనగర్): ఆమె అమ్మమ్మ.. అయినప్పటికీ వారసత్వం కోసం మళ్లీ పిల్లలు కనాలని తపించింది. ఆమె ఆశయానికి కరీంనగర్‌లోని డాక్ట ర్ పద్మజ సంతానసాఫల్య కేంద్రం అండగా నిలిచింది. 52 ఏళ్ల వయసులో కూడా పండంటి కవలలకు జన్మనిచ్చింది. భద్రాచలంకు చెందిన ఆరె సత్యనారాయణ, రమాదేవి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు వివాహం కాగా, కుమారుడు 2013లో 13 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు మరణించా డు. (చదవండి : ఇది చాలా అనైతికం) ఒంటరితనం బరించలేక ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనాలనే ఆలోచనకు వచ్చి కరీంనగర్‌లోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించారు. డాక్టర్ పద్మజ ఐవీ ఎఫ్ చికిత్సను ప్రారంభించి, ఈ నెల 11న సాధారణ ప్రస వంచేశారు. రమాదేవి కవలలకు జన్మనిచి్చంది. ఐవీఎఫ్ పద్ధతిలో 55 ఏళ్ల లోపు వయసున్న ఎవరికైనా టెస్ట్‌ట్యూబ్ ద్వారా పిల్లలను కనే అవకాశం ఉందని సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ పద్మజ తెలిపారు. (చదవండి : లేటు వయసులో... ఎంతటి మాతృత్వ అనుభూతులో) -
పురుషులలో సంతాన లేమి సాఫల్యానికి మార్గాలు
ఫాదర్స్‌డేకి కాస్త ముందు వెనకలుగా కొన్ని దేశాలలో మెన్స్ హెల్త్ వీక్ జరుపుకుంటాయి. ఈ సంవత్సరం మెన్స్ హెల్త్ వీక్ ఈ నెల 10న ఆరంభం అయింది. నేటితో ముగుస్తోంది. పురుషులు తమ ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన సరైన సమయమిది. బిడ్డకు తల్లి లేదా తండ్రి కావడమనేది ఎంతో ఆనందించదగ్గ విషయం. దురదృష్టవశాత్తూ ప్రస్తుత జీవనశైలిని బట్టి ఇటీవలి కాలంలో చాలా దేశాలలో అదొక పెద్ద సవాలుగా మారింది భారతీయ జనాభాలో వంధ్యత్వం దాదాపు 10 నుంచి 14 శాతం మందిపై ప్రభావం చూపుతోంది. ఎటువంటి గర్భనిరోధక సాధనాలు వాడకుండా ఏడాది పాటు సంసార జీవితం గడుపుతున్నా సంతానం కలగకపోవడాన్ని వంధ్యత్వం అనవచ్చు. ఇంచుమించు అన్ని వంధ్యత్వ కేసులలోనూ, 40 నుంచి 50 శాతం వరకు పురుషులలో వంధ్యత్వానికి సంబంధించినవే. సంతాన లేమితో బాధపడుతున్న చాలామంది పురుషులు దాంపత్య జీవనంలో తమకు ఎదురవుతున్న సవాళ్లను, సమస్యలను ఎవరికీ చెప్పుకోకపోవడం దురదృష్టకరం.. లైంగికపరమైన స్తబ్ధత, తక్కువస్థాయిలో వీర్యం ఉత్పత్తి కావడం. వీర్య ఉత్పత్తిలో అసాధారణ పరిణామాలు, లేదా వీర్యనాళాలలో బ్లాకేజీలు వంటివి వంధ్యత్వానికి ప్రధాన కారణాలు. జబ్బు పడటం, తీవ్ర గాయాల పాలుకావడం, అసాధారణమైన ఆరోగ్య సమస్యలు, జీవనశైలి లక్షణాలు, తదితరమైనవి పురుష వంధ్యత్వానికి దారితీసే మౌలికాంశాలు. సంతానలేమికి ఇతర కారణాలు తక్కువ వీర్యకణాలు ఉండటం: వీర్యంలో మిల్లీలీటరుకు 15 మిలియన్ల కణాలకన్నా తక్కువ ఉండటాన్ని తగినన్ని వీర్యకణాలు లేకపోవడంగా పరిగణింపవచ్చు. సంతానం లేని దంపతులలో దాదాపు మూడవ వంతుమంది జంటలకు తక్కువ వీర్యకణాల వల్లనే సంతానం కలగడం లేదు. వీర్యకణాల కదలిక తక్కువగా ఉండడం: వీర్యంలోనుంచి వీర్యకణాలు అండాన్ని చేరి, ఫలదీకరణ చెందాలంటే కణాలు చురుకుగా కదలాలి. కణాలు ఈదలేకపోతే ఫలదీకరణ జరగదు. అసాధారణమైన వీర్యం: వీర్యకణాలకు సరైన ఆకారం లేకపోవడం వల్ల అండంలోనికి చొచ్చుకుపోలేకపోవడాన్ని అసాధారణమైన వీర్యంగా చెప్పవచ్చు. పురుషులలో వంధ్యత్వానికి దారితీసే ఇటువంటి పరిణామాలకు వృషణాలకు ఇన్ఫెక్షన్ సోకడం లేదా విపరీతమైన వేడిమికి గురవడం, వెరికోసిల్, హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, క్యాన్సర్, శస్త్రచికిత్సలు మొదలైన కారణాలు ఉండవచ్చు. వంధ్యత్వానికి దారితీసే కారకాలు ధూమపానం, మద్యపానం, యాంటిబయొటిక్ స్టెరాయిడ్ల వాడకం, అధికంగా చక్కెర కలిపిన శీతల పానీయాలు సేవించడం, రసాయనాల ప్రభావానికి గురికావడం, అధికబరువు లేదా స్థూలకాయం, మానసిక ఒత్తిడి, అధికంగా వ్యాయామం చేయడం. రోజుకు మూడుగంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం, రెండుగంటల కన్నా ఎక్కువగా మొబైల్ ఫోన్లను వాడటం, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఉన్న ప్రదేశానికి కి.మీ. పరిధిలో నివసించడం వల్ల కూడా వీర్యం తగిన పరిణామంలో ఉత్పత్తి కాదు. వీర్యకణాలలో డి.ఎన్.ఎ. విచ్ఛిత్తి చెందడం ఒక్కోసారి వీర్యకణాలలో డిఎన్ఎ విచ్ఛిత్తి చెందడం వల్ల కూడా పురుషులలో వంధ్యత్వానికి దారితీసే అవకాశం ఉంది. పరిసరాల ప్రభావం, కొని ్నరకాల జీవనశైలి అలవాట్ల వల్ల డిఎన్ఎ విచ్ఛిత్తి చెందుతుంది. రసాయనాల ప్రభావానికి గురికావడం, తీవ్రమైన వేడిమి ఉన్న ప్రదేశాలలో పని చేయడం, ధూమపానం డిఎన్ఎ విచ్ఛిత్తికి దారితీస్తాయి. సాఫల్యానికి సలహాలు తగినంత నీటిని తాగడం, పిల్లలకోసం ప్రయత్నించడానికి కనీసం రెండు మూడు నెలల ముందు నుంచి ధూమపానాన్ని మానివేయడం, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే టొమాటో, చిలకడ దుంపలు, పుచ్చ, గుమ్మడి, క్యారట్లు, చేపలు, వాల్నట్స్, బ్లూ బెర్రీస్, దానిమ్మ, డార్క్ చాకొలేట్స్ వంటి వాటిని తినడం మంచిది. డాక్టర్ స్వప్నాశ్రీనాథ్ ఎఫ్ఎన్బి రిప్రొడక్టివ్ మెడిసిన్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కోమలి ఫెర్టిలిటీ సెంటర్ (ఎ యూనిట్ ఆఫ్ రమేష్ హాస్పిటల్స్) గుంటూరు – విజయవాడ; ఈమెయిల్: drswapnasrinath@gmail.com -
'పిల్లలు జీవితాన్ని మార్చేస్తారు'
పిల్లలు జీవితాన్ని మార్చేస్తారంటూ ఆమిర్ ఖాన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమిర్, కిరణ్ రావ్ దంపతులకు సరోగసీ ద్వారా మూడేళ్ల క్రితం మగబిడ్డ కలిగిన విషయం తెలిసిందే. మరోసారి ఆ సంతోషాన్ని గుర్తుచేసుకున్నారు ఆ దంపతులు. ఓ ఫెర్టిలిటీ క్లినిక్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ఆమీర్ మీడియాతో మాట్లాడుతూ.. 'మేం బిడ్డను కావాలనుకున్నాం. సరోగసీ గురించి తెలుసుకున్నాం. ఆజాద్ పుట్టడం మాకెంతో సంతోషాన్నిచ్చింది. మేం ఎలాంటి తప్పు చేయలేదు, ప్రజలు ఇలాంటి విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పిల్లలు కలగడమనేది జీవితంలో ఎంతో సంతోషకరమైన విషయం.. వాళ్లు మన జీవితాల్లో మార్పు తీసుకొస్తారు. జునైద్ పుట్టుక.. నన్ను, నా జీవితాన్ని మార్చేసింది' అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఆమిర్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న విషయం తెలిసిందే. మాజీ భార్య రీనా దత్తాతో విడిపోయాక కిరణ్ రావ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. లాంచ్‌కు హాజరైన కిరణ్ రావ్ మాట్లాడుతూ.. సరోగసీ ద్వారా తాము తల్లిదండ్రులు అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుషార్ కపూర్, ఫరాఖాన్‌లు పాల్గొన్నారు.