ఫెర్టిలిటీ సెంటర్లతో మాతృత్వ మాధుర్యం
మారుతున్న లైఫ్‌స్టైల్, ఆలోచనా విధానంతో సంతానలేమి
ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడి, హార్మోన్ల సమతుల్యతా ఓ కారణమే
మంచి ఆహారపు అలవాట్లు, జీవన విధానంతో సత్ఫలితాలు
రాష్ట్రంలో దాదాపు 15 శాతం మంది దంపతులు సంతానలేమితో బాధపడుతున్నట్లు ఓ సర్వే చెబుతోంది. హైదరాబాద్‌లో కూడా లైఫ్‌స్టైల్ మారడం వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అందులోనూ సంతానలేమి అనేది ప్రముఖంగా చెప్పుకోవచ్చు. జంక్‌ఫుడ్, ఎక్కువసేపు కూర్చుని చేసే డెస్క్ జాబ్‌ల కారణంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో జన్యుపరంగా కూడా ఇన్‌ఫెరి్టలిటీ సమస్యలు వస్తున్నాయని వైద్యులు, నిపుణులు పేర్కొంటున్నారు. చాలామందిలో ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి నిద్ర, ఎక్సర్‌సైజ్‌లు కనుక చేస్తే సంతానలేమి అనేది పెద్ద సమస్య కాదని వైద్యులు సూచిస్తున్నారు.
ఇటీవల దేశంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో పెరుగుతున్న మెట్రో పాలిటన్ కల్చర్ కారణంగా సంతానలేమి సమస్య ఉత్పన్నం అవుతోందని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, క్రమంగా లేని పనివేళలు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అధిక బరువు, మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు, వ్యసనాలు వంటివి సంతాన లేమికి దారితీస్తున్నాయి.
ఒత్తిడి వల్ల కూడా..
మహిళల్లో కనిపించే ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడి, హార్మోన్లలో సమతుల్యత దెబ్బతినడం వంటివి సంతానలేమికి కారణమవుతున్నాయి. అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇంప్లాంటేషన్‌లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. ఇక మగవారిలోనైతే.. శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం సంతనం కలగడానికి
అవరోధంగా నిలుస్తున్నాయి.
సంతానలేమి నిర్ధారణ ఇలా?
సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణా పద్ధతులను పాటించకుండా, కలిసి ఉంటూ ఏడాది పాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రాకపోతే అప్పుడు ఆ దంపతులకు సంతానలేమి సమస్య ఉండే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్యను ప్రైమరీ ఇన్ఫెరి్టలిటీ అంటారు. మొదటిసారి గర్భధారణ తర్వాత, రెండోసారి గర్భధారణ కోరుకున్నప్పుడు ఏడాది పాటు ప్రయతి్నంచినా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు.
ఏయే చికిత్స అందజేస్తారు..
అండం సరిగా పెరగనప్పుడు, అది పెరగడానికి క్లోమిఫిన్, లెట్రోజ్ వంటి కొన్ని రకాల మాత్రలు, వాటి మోతాదులను క్రమంగా పెంచుకుంటూ వాడాలి. కొందరికి గొనాడోట్రోపిన్ హార్మోన్ ఇంజెక్షన్ అవసరమవుతుంది. అండాశయాలలో పీసీఓడీ కారణంగా అండాలు పెరగకపోతే లాప్రోస్కోప్ ఆపరేషన్ ద్వారా, పీసీఓడీలోని నీటితిత్తుల్లో కొన్నింటిని పేల్చడం అవసరం. దీన్నే ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. ఇక అండాశయంలో నీటితిత్తులు, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలను కూడా లాప్రోస్కోపిక్ ప్రక్రియ ద్వారా తొలగించి, ఆ తర్వాత గర్భం వచ్చేందుకు అవసరమైన చికిత్స అందించాలి. థైరాయిడ్ సమస్య ఉంటే దాన్ని తగ్గించే మందులు వాడాలి. అప్పుడు హార్మోన్ల అసమతుల్యత తగ్గి, గర్భధారణకు అవకాశాలు మెరుగుపడతాయి.
ఎవరికి చికిత్స అవసరం..
మహిళకు ప్రతినెలా నెలసరి సక్రమంగా వస్తూ, రెండేళ్ల పాటు ప్రయతి్నంచాక కూడా అప్పటికీ గర్భం రానివారికీ, అలాగే ఆ మహిళ 30 ఏళ్ల వయసుకు చేరుకుంటున్నప్పుడు.. ఆ దంపతులు డాక్టర్‌ను సంప్రదించి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం మంచిది.
గర్భాశయంలో లోపాలు
సాధారణంగా గర్భాశయంలో లోపాల వల్ల గర్భం దాల్చలేని వారు దాదాపు 10% నుంచి 15% వరకూ ఉంటారు. గర్భాశయంలో లోపాలు కూడా అనేక కారణాల వల్ల కలుగుతుంటాయి. గర్భాశయ ముఖద్వారంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పూత ఉన్నా, అక్కడ స్రవించే స్రావాలు చిక్కగా ఉన్నా, గర్భాశయ ముఖద్వారం మరీ సన్నగా ఉన్నప్పుడు వీర్యకణాలు గర్భసంచి లోపలికి ప్రవేశించలేకపోవచ్చు. కొంతమందిలో యోని ద్రవాల్లో ఆమ్లగుణం మరీ ఎక్కువగా ఉంటే అవి వీర్యకణాలను చైతన్యరహితం చేస్తాయి.
ఐవీఎఫ్ ప్రక్రియ పనిచేస్తుందిలా..
స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ సమస్యలు ఉన్నప్పు డాక్టర్లు ఐవీఎఫ్ మార్గాన్ని సూచిస్తారు. ఈ ప్రక్రియలో తొలుత మహిళలో అండాలు బాగా పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి ఆరోగ్యకరమైన అండాలను సేకరించి, పురుషుడి నుంచి స్వీకరించిన శుక్రకణాలతో ప్రయోగశాలలో ఫలదీకరణం చెందిస్తారు. ఈ ఫలదీకరణ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధిచెందుతాయి. ఇందులో నుంచి ఆరోగ్యకరమైన పిండాలను మళ్లీ మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు. మిగతా పిండాలను శీతలీకరించి పక్కన పెట్టుకుంటారు. ఆరు వారాల తర్వాత అ్రల్టాసౌండ్ పరీక్ష చేసి, ఆమెలో గర్భం నిలిచిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకుంటారు. ఒకవేళ గర్భం నిలవకపోతే శీతలీకరించిన పిండాల్లో మరోదాన్ని గర్భంలోకి ప్రవేశపెడుతారు.
ఆహారపు అలవాట్లే కారణం..
ప్రస్తుతం యువతీ, యువకుల్లో ఆహారపు అలవాట్లు సంతానలేమి సమస్యలకు కారణం అవుతున్నాయి. మితిమీరిన ఆల్కహాల్, సిగరెట్ తాగడంతో ప్రత్యుత్పత్తి సంబంధిత సమస్యలు వస్తున్నాయి. గర్భాశయంలో లోపాలు, అండాశయాల్లో బుడగలు (పీసీఓడీ), వీర్యకణాల సంఖ్య తగ్గడం, చలనం లేకుండా పోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆహారపు అలవాట్లు సరిచేసుకుని, ఆరోగ్యకరమైన జీవన విధానంతో సంతానలేమి సమస్యలకు దూరం కావచ్చు.
– జలగం కావ్యా రావు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్
పురుషుల్లోనూ సమస్యలు..
స్త్రీలతో పాటు పురుషుల్లో కూడా పలు సమస్యలు ఉంటాయి. పురుషుల్లో వీర్యకణాలు తక్కువగా ఉండటం అతిపెద్ద సమస్య. సరైన మందులు ఇవ్వడంతో పాటు సరైన జీవన విధానం పాటిస్తే వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కొందరిలో అసాధారణమైన వీర్య కణాలు ఉంటాయి. వాటిలో లోపాలు ఉంటాయి. సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకుంటే వాటి నాణ్యత పెరుగుతుంది. ఇక, కొందరిలో వీర్యకణాల కదలిక తక్కువగా ఉంటుంది. అప్పుడు వీర్యక ణాలు అండంతో ఫలదీకరణ చెందవు. ఈ సమస్యను కూడా మందులతో తగ్గించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment