అందుబాటులో సులువైన చికిత్స
నేడు అంతర్జాతీయ ఐవీఎఫ్ దినోత్సవం
సంతానలేమితో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) అనేది ఒక వరం లాంటిదని వైద్యురాలు అర్చన అన్నారు. జిల్లా కేంద్రంలో ‘పినాకిల్ ఫెర్టిలిటీ’ సెంటర్ ద్వారా సేవలందిస్తున్న వైద్యురాలు అర్చన.. అంతర్జాతీయ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఇన్‌ఫెర్టిలిటీ సమస్యతో సతమతమవుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) రిపోర్టులు వెల్లడించడం గమనార్హమని అన్నారు.
అడ్వాన్స్‌డ్, ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన ఐవీఎఫ్ విధానం సంతానలేమితో బాధపడుతున్న వారికి మంచి అవకాశమని తెలిపారు. గ్రామీణప్రాంతాల వారికి సైతం తక్కువ ఖర్చుతో ఆధునిక సౌకర్యాల ద్వారా చికిత్స అందించడం పినాకిల్ ఫెర్టిలిటీ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఐవీఎఫ్‌కు సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు సందేహాలను డాక్టర్ అర్చన నివృత్తి చేశారు.
ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల ఆరోగ్యంపై..
1978 జూలై 25న ఐవీఎఫ్ ద్వారా మొదటి బేబి లూయీస్ బ్రౌన్ జన్మించారు. నాలుగు దశాబ్దాలు నాటికి 8 మిలియన్ల పిల్లలు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించారు. ఇప్పటి వరకు చేసిన రిసెర్చ్, ఆర్టికల్స్ ఆధారంగా సహజంగా గర్భం ద్వారా పుట్టిన పిల్లలకి ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి ఎటువంటి తేడా లేదని తేలింది.
ఐవీఎఫ్ ద్వారా కవలలు పుట్టే అవకాశం..
ఐవీఎఫ్ పద్ధతిలో అంటే ఆడవారి అండాలను మగవారి వీర్యకణాలు కలిపితే వచ్చే పిండాలను గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఈ పద్ధతిలో మునుపు రెండు లేక మూడు పిండాలను ప్రవేశపెట్టేవారు. అందువల్ల ఐవీఎఫ్‌లో కవలలు పుట్టే అవకాశం పెరుగుతుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో గర్భం దాల్చే అవకాశాలు మెరుగయ్యాయి.
నొప్పి ఉంటుందంటారు..
ఆడవారు 10–12 రోజులపాటు ఐవీఎఫ్‌లో రోజూ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాతే ఆడవారి శరీరంలో ఉండే అండాలను బయటకు తీసి మగవారి వీర్యకణాలతో కలపడం జరుగుతుంది. అలా పెరిగిన దాన్ని ఆడవారి గర్భసంచిలో ప్రవేశ పెడతాం. ఈ ప్రక్రియలు ఎగ్ పికప్ (ఎమ్‌బ్య్రో ట్రాన్స్‌ఫర్) అంటాం. ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్ అంటే అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. ఐవీఎఫ్‌లో నొప్పి అనేది చాలా తక్కువ
తొమ్మిది నెలలు రెస్ట్ అవసరమా..
ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన తర్వాత ఒక రెండు నెలలు జాగ్రత్త చెబుతాం. ఆ తరువాత సహజ ప్రెగ్నెన్సీ లాగే అన్ని పనులు చేసుకోవచ్చు. ఆఫీస్‌కి వెళ్ళేవాళ్లు, ఇంటి పనులు చేసుకునేవారు ఎప్పటిలాగే వారి పనులను చేసుకోవచ్చు.
సిజేరియన్ అవసరం లేదు..
ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన వాళ్లు నార్మల్ డెలివరీ ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సహజ ప్రెగ్నెన్సీ లాగే ఉంటుంది. వేరే ఇతర కారణాల వల్ల సిజేరియన్ చేయించాల్సిన పరిస్థితి వస్తే తప్ప కేవలం ఐవీఎఫ్ వల్ల సిజేరియన్ చేయించాల్సిన అవసరం అసలు లేదు.
– డాక్టర్ అర్చన, పినాకిల్ ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment