Fertility Counseling
-
ఐవీఎఫ్‌తో.. సంతనాలేమికి చెక్!
సంతానలేమితో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) అనేది ఒక వరం లాంటిదని వైద్యురాలు అర్చన అన్నారు. జిల్లా కేంద్రంలో ‘పినాకిల్ ఫెర్టిలిటీ’ సెంటర్ ద్వారా సేవలందిస్తున్న వైద్యురాలు అర్చన.. అంతర్జాతీయ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో సతమతమవుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) రిపోర్టులు వెల్లడించడం గమనార్హమని అన్నారు. అడ్వాన్స్డ్, ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన ఐవీఎఫ్ విధానం సంతానలేమితో బాధపడుతున్న వారికి మంచి అవకాశమని తెలిపారు. గ్రామీణప్రాంతాల వారికి సైతం తక్కువ ఖర్చుతో ఆధునిక సౌకర్యాల ద్వారా చికిత్స అందించడం పినాకిల్ ఫెర్టిలిటీ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఐవీఎఫ్‌కు సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు సందేహాలను డాక్టర్ అర్చన నివృత్తి చేశారు.ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల ఆరోగ్యంపై..1978 జూలై 25న ఐవీఎఫ్ ద్వారా మొదటి బేబి లూయీస్ బ్రౌన్ జన్మించారు. నాలుగు దశాబ్దాలు నాటికి 8 మిలియన్ల పిల్లలు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించారు. ఇప్పటి వరకు చేసిన రిసెర్చ్, ఆర్టికల్స్ ఆధారంగా సహజంగా గర్భం ద్వారా పుట్టిన పిల్లలకి ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి ఎటువంటి తేడా లేదని తేలింది.ఐవీఎఫ్ ద్వారా కవలలు పుట్టే అవకాశం..ఐవీఎఫ్ పద్ధతిలో అంటే ఆడవారి అండాలను మగవారి వీర్యకణాలు కలిపితే వచ్చే పిండాలను గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఈ పద్ధతిలో మునుపు రెండు లేక మూడు పిండాలను ప్రవేశపెట్టేవారు. అందువల్ల ఐవీఎఫ్‌లో కవలలు పుట్టే అవకాశం పెరుగుతుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో గర్భం దాల్చే అవకాశాలు మెరుగయ్యాయి.నొప్పి ఉంటుందంటారు..ఆడవారు 10–12 రోజులపాటు ఐవీఎఫ్‌లో రోజూ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాతే ఆడవారి శరీరంలో ఉండే అండాలను బయటకు తీసి మగవారి వీర్యకణాలతో కలపడం జరుగుతుంది. అలా పెరిగిన దాన్ని ఆడవారి గర్భసంచిలో ప్రవేశ పెడతాం. ఈ ప్రక్రియలు ఎగ్ పికప్ (ఎమ్బ్య్రో ట్రాన్స్ఫర్) అంటాం. ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్ అంటే అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. ఐవీఎఫ్‌లో నొప్పి అనేది చాలా తక్కువతొమ్మిది నెలలు రెస్ట్ అవసరమా..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన తర్వాత ఒక రెండు నెలలు జాగ్రత్త చెబుతాం. ఆ తరువాత సహజ ప్రెగ్నెన్సీ లాగే అన్ని పనులు చేసుకోవచ్చు. ఆఫీస్‌కి వెళ్ళేవాళ్లు, ఇంటి పనులు చేసుకునేవారు ఎప్పటిలాగే వారి పనులను చేసుకోవచ్చు.సిజేరియన్ అవసరం లేదు..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన వాళ్లు నార్మల్ డెలివరీ ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సహజ ప్రెగ్నెన్సీ లాగే ఉంటుంది. వేరే ఇతర కారణాల వల్ల సిజేరియన్ చేయించాల్సిన పరిస్థితి వస్తే తప్ప కేవలం ఐవీఎఫ్ వల్ల సిజేరియన్ చేయించాల్సిన అవసరం అసలు లేదు.– డాక్టర్ అర్చన, పినాకిల్ ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్ -
Google: గూగుల్ కీలక నిర్ణయం
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు సమాచారం గోపత్య విషయంలో కీలక ప్రకటన చేసింది. గూగుల్ వినియోగదారులు అబార్షన్ క్లినిక్‌లు, గృహ హింస షెల్టర్స్, ప్రైవసీ కోరుకునే ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు వారి లోకేషన్ హిస్టరీనీ తొలగిస్తామని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రదేశాల్లో ఎవరైనా వినియోగదారులు సందర్శించినట్టు తమ సిస్టమ్స్ గుర్తిస్తే వెంటను ఆ ఎంట్రీలను తొలగిస్తామని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెన్ ఫిట్జ్‌పాట్రిక్ వెల్లడించారు. రాబోయే కొన్ని వారాల్లో ఇది అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇక.. సంతానోత్పత్తి కేంద్రాలు, పలు వ్యసనాల్లో కౌన్సెలింగ్ కేంద్రాలకు సంబంధించి చికిత్స తీసుకునే ప్రదేశాలు, బరువు తగ్గించే క్లినిక్స్‌కు వెళ్లిన డేటాను కూడా సేవ్‌లో ఉండదని ఆయన తెలిపారు. అయితే, అగ్రరాజ్యం అమెరికాలో అబార్షన్‌కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, మే నెలలో డెమోక్రటిక్ చట్టసభ సభ్యుల బృందం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈవో) సుందర్ పిచాయ్‌కు లేఖ రాశారు. సంతానోత్పత్తి కేంద్రాలకు వెళ్లే వారి స్మార్ట్‌ఫోన్ లొకేషన్ డేటాను బహిర్గతం చేయకుండా నిలిపివేయాలని వారు ఆ లేఖలో కోరినట్టు సమాచారం. #abortionishealthcare More good news related to tech and abortions. Google said Friday that it would delete its users’ location history whenever they visit an abortion clinic, domestic violence shelter or other similarly-sensitive…https://t.co/kLFFTLsVMZ https://t.co/ipM5X5gN5c — Regina Phelps 🇺🇦 (@ReginaPhelps) July 1, 2022 -
అప్పుడే పిల్లలు వద్దనుకుని లూప్ వేయించుకున్నాను. ఎంతకాలం ఉంచుకోవచ్చు?
నా వయసు 19 ఏళ్లు. ఎత్తు 5.2, బరువు 48 కిలోలు. ఆరునెలల కిందట నాకు కోవిడ్ వచ్చి, నెల్లాళ్లకు పైగా చికిత్స తర్వాత నయమైంది. కోవిడ్ తగ్గినప్పటి నుంచి నాకు నెలసరి క్రమం తప్పింది. ఒక్కోసారి త్వరగా, ఒక్కోసారి ఆలస్యంగా అవుతోంది. నా సమస్యకు పరిష్కారం ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుజాత, యలమంచిలి నీ ఎత్తుకి నువ్వు బరువు తక్కువగానే ఉన్నావు. కోవిడ్ తర్వాత నువ్వు ఇంకా బలహీనపడి ఉండొచ్చు. మానసిక ఒత్తిడి ఉండొచ్చు. కొందరిలో ఈ మార్పుల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి నెలసరి క్రమం తప్పే అవకాశాలు కొద్దిగా ఉండొచ్చు. కొందరిలో వేరే కారణాల వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. ఒకసారి బరువు ఎంత ఉన్నావు. కోవిడ్ తర్వాత బరువు తగ్గావా లేదా పెరిగావా అనేది చూసుకుని, మరీ తక్కువగా ఉంటే సరైన పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించి చూడవచ్చు. అలాగే మానసిక ఒత్తిడి లేకుండా, బరువు ఎక్కువ ఉంటే తగ్గడానికి యోగా, నడక, ధ్యానం వంటివి చెయ్యడం వల్ల, హార్మోన్ల అసమతుల్యత ఏమైనా ఉంటే, అది సరిగా అయ్యి కొందరిలో పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి గైనకాలజిస్ట్‌ను అవసరమైన రక్తపరీక్షలు, థైరాయిడ్ వంటి హార్మోన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ పెల్విస్ వంటివి చెయ్యించుకుని, పైన చెప్పిన జాగ్రత్తలతో పాటు కారణాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవచ్చు. నా వయసు 28 ఏళ్లు. నాకు పాప పుట్టి ఏడాదైంది. అప్పుడే మళ్లీ పిల్లలు వద్దనుకుని లూప్ వేయించుకున్నాను. రెండో కాన్పు కోసం మరికొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను. లూప్‌ను ఎంతకాలం ఉంచుకోవచ్చు? వేయించుకుని ఏడాది గడిచింది కాబట్టి, పాతది తీయించేసి, కొత్తది వేయించుకోవాల్సి ఉంటుందా? వివరించగలరు. – రాధిక, తాడేపల్లిగూడెం లూప్ లేదా కాపర్ ‘టీ’ (ఐయూసీడీ) అనేది పుల్లలాంటి సన్నటి ప్లాస్టిక్ పరికరంపైన కాపర్ తీగ చుట్టబడి ఉంటుంది. దీనిని గర్భం రాకుండా ఉండటానికి తాత్కాలికంగా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. వీటిలో 3 సంవత్సరాల వరకూ, 5 సంవత్సరాల వరకూ, 10 సంవత్సరాల వరకూ గర్భం రాకుండా చేసే లూప్‌లు ఉంటాయి. లూప్‌లలో ఇంకోరకం హార్మోన్ లూప్ ఉంటుంది. ఇందులో లెవనార్జెస్ట్రాల్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది 5 సంవత్సరాల పాటు గర్భం రాకుండా పని చేస్తుంది. అలాగే పీరియడ్స్ సమస్యలు ఉన్నవారికి కూడా దీనిని గర్భాశయంలోనికి వేయడం జరుగుతుంది. మీరు వేయించుకున్న లూప్ ఎలాంటిది? ఎన్ని సంవత్సరాల వరకు పని చేసేది? అనే విషయాలు తెలియవలసి ఉంది. ఒకసారి మీకు లూప్ వేసిన డాక్టర్ని సంప్రదించి, ఎన్ని సంవత్సరాల వరకు పని చేస్తుందో కనుక్కోవడం మంచిది. లూప్ వల్ల సమస్య ఏమీ లేకపోతే.. 6 నెలల కొకసారి లూప్ పొజిషన్లో ఉందా లేదా? ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని గైనకాలజిస్ట్ వద్ద చెకప్ చేయించుకుంటూ అన్నీ సరిగా ఉంటే కనీసం మూడు సంవత్సరాల వరకూ లూప్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు పెళ్లయి మూడేళ్లయింది. ఇంకా పిల్లల్లేరు. నా వయసు 27 ఏళ్లు. నేనూ మావారూ ఇద్దరమూ అన్ని పరీక్షలూ చేయించుకున్నాం. ఇద్దరికీ ఏ సమస్యా లేదనే డాక్టర్లు చెప్పారు. ఇంకా పిల్లలు కలగకపోవడానికి కారణమేంటో అర్థం కావడంలేదు. మా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – మౌనిక, మహబూబ్‌నగర్ గర్భం దాల్చాలి అంటే ఆడవారిలో గర్భాశయం, అండాశయాలు, హార్మోన్లు అన్నీ సక్రమంగా ఉండాలి. వాటి పనితీరు సరిగా ఉండాలి. నెలనెలా అండం సరిగా విడుదల కావాలి. ఫెలోపియన్ ట్యూబ్స్ తెరుచుకుని ఉండాలి. అలాగే మగవారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత అన్నీ సరిగా ఉండాలి. మీకు చేసిన పరీక్షలలో అన్నీ సాధారణంగానే ఉన్నాయి, ఏ సమస్య లేవంటున్నారు. పిల్లలు కలగకపోవడానికి చేసే పరీక్షలలో 70 శాతం వరకే కారణాలు తెలుస్తాయి. 30 శాతం కారణాలు పరీక్షల్లో తెలియవు. అవి చాలా సూక్ష్మమైన కారణాలు. పరీక్షలలో సమస్యలు ఏమీ కనిపించక పోయినా కానీ కొందరిలో గర్భాశయద్వారం దగ్గర ఉండే యాంటీ స్పెర్మ్ యాంటీబాడిస్ వీర్యకణాలను నిర్వీర్యం చేసి, గర్భాశయంలోనికి వెళ్లనీయకుండా చేయడం, వాటి కదలికను తగ్గించడం వల్ల అండం వరకు చేరలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మరికొందరిలో శుక్రకణాలు.. అండంలో చొచ్చుకునిపోలేకపోవడం, దాని వల్ల ఫలదీకరణ అవ్వకపోవడం వల్ల పిండం ఏర్పడకపోవడం, పిండం ఏర్పడినా, గర్భాశయం పిండాన్ని స్వీకరించకపోవడం వల్ల పిండం గర్భాశయంలో అంటుకోకుండా ఉండడం వల్ల గర్భం రాకపోవచ్చు. సాధారణ పరీక్షల్లో ఈ సమస్యలు తెలియకపోవచ్చు. 3 సంవత్సరాలు అయినా సాధారణ పద్ధతిలో గర్భం రానప్పుడు, రిపోర్టులన్నీ మామూలుగానే ఉన్నప్పుడు.. కొన్ని నెలలు అండం నాణ్యత, వీర్యకణాలు నాణ్యత పెరగడానికి మందులు వాడి చూడవచ్చు. తర్వాత మూడునెలలు అండం విడుదల అయ్యే సమయంలో వీర్యకణాలను శుభ్రపరచి, మంచికణాలను నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం చేయొచ్చు. కొందరిలో గర్భాశయ ముఖద్వారం బిగుతుగా ఉండొచ్చు. అలాంటప్పుడు డీ అండ్ సీ పద్ధతి ద్వారా గర్భాశయ ముఖద్వారాన్ని కొద్దిగా వెడల్పు చేసి, గర్భాశయపొరను శుభ్రపరచడం, ఆ పొరను బయాప్సీకి పంపించడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్లు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి. దాని బట్టి కూడా చికిత్స తీసుకోవచ్చు. కొంతమందికి డీ అండ్ సీ తర్వాత గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. కొందరిలో హిస్టెరోస్కోపీ పద్ధతి ద్వారా నేరుగా గర్భాశయం లోపల చూస్తూ, ఏదైనా పొరలు, వాటి సమస్యలు ఉంటే అప్పుడే తొలగించడం వల్ల కూడా గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. అన్నిరకాలుగా ప్రయత్నించినా గర్భం అందనప్పుడు, చివరిగా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుంది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: Science Facts: ఎక్సర్సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం.. -
ఆ సమయంలో ఆందోళన, కోపం, చిరాకు బాగా ఇబ్బందిపెడుతున్నాయి.. సలహాఇవ్వండి..
మాకు పెళ్లయి ఆరేళ్లయింది. ఇంకా పిల్లల్లేరు. మా వారికి స్పెర్మ్ కౌంట్, మొబిలిటీ బాగానే ఉంది గాని, మార్ఫాలజీ తక్కువ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. మా సమస్యకు పరిష్కారం తెలపండి. – సత్యవతి, ఈ–మెయిల్ పిల్లలు కలగకపోవడానికి 35 శాతం ఆడవారిలో లోపాలు, 35 శాతం మగవారిలో లోపాలు, మిగిలిన 30 శాతం ఇద్దరిలో లోపాలు కారణమవుతాయి. మగవారి లోపాలలో ముఖ్యమైన కారణం వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యతలో లోపాలు. మీ వారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక బాగానే ఉన్నా, వాటి నాణ్యత (మార్ఫాలజీ) సరిగా లేకపోవడం వల్ల అవి అండంలోనికి చొచ్చుకు పోలేవు. దానివల్ల అండం ఫలదీకరణ సరిగా జరగకపోవచ్చు. నాణ్యతలేని వీర్యకణాల వల్ల పిండం సరిగా ఏర్పడకపోవచ్చు. దానిల్ల గర్భం సరిగా నిలబడకపోవడం, అబార్షన్లు కావడం, బిడ్డలో అవయవ లోపాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వీర్యకణాలలో తల, మెడ, తోక అనే మూడు భాగాలు ఉంటాయి. వీటిలో ఏదో ఒక భాగంలో లేదా అన్ని భాగాలలో లోపాలు ఉండవచ్చు. సాధారణంగా వీర్యకణాలలో 4 శాతం కంటే ఎక్కువ వీర్యకణాలు నాణ్యత కలిగి ఉంటే, గర్భం రావడానికి అవకాశాలు బాగా ఉంటాయి. పొగతాగడం, మద్యం తాగడం వంటి అలవాట్లు ఉన్నా, సుగర్, అధిక బరువు, మానసిక ఒత్తిడి, వేరికోసిల్, ఇన్ఫెక్షన్లు ఇంకా ఇతర సమస్యలు ఉన్నట్లయితే వీర్యకణాల నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. ఇన్ఫెక్షన్లు ఉంటే సరైన కోర్సు యాంటీబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు వాడటం, దురలవాట్లు, జంక్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్ వంటివి మానుకోవడం, సుగర్ అదుపులో పెట్టుకోవడం, మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, యోగా, ధ్యానం వంటివి అలవరచుకోవడం వంటివి డాక్టర్ సలహా మేరకు పాటించాలి. అలాగే, అవసరమైన పరీక్షలు చేయించుకుని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం వల్ల కూడా వీర్యకణాల నాణ్యత పెరిగే అవకాశాలు బాగా ఉంటాయి. చదవండి: ఇలా చేస్తే .. ఎప్పటినుంచో వెంటాడుతున్న చుండ్రు సమస్య పరార్!! నా వయసు 23 ఏళ్లు. నాకు ఏడాది కిందట పెళ్లయింది. నెలసరి సమయంలో ఆందోళన, చిరాకు, కోపం బాగా ఇబ్బందిపెడుతున్నాయి. పుట్టింట్లో ఉన్నప్పుడు కోపంతో అరిచినా, చిరాకు పడినా ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఇప్పుడు నా భర్తపై చిరాకు చూపిస్తుండటంతో ఇద్దరికీ తరచు గొడవలు జరుగుతున్నాయి. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. – మానస, ఏలూరు కొందరిలో పీరియడ్స్ మొదలయ్యే పది పదిహేను రోజుల ముందే ప్రొజెస్టిరాన్ హార్మోన్లో మార్పుల వల్ల, కొన్ని మినరల్స్ లోపం వల్ల, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల కోపం, చిరాకు, ఆందోళన, శరీరం బరువెక్కినట్లు ఉండటం, రొమ్ముల్లో నీరు చేరి రొమ్ములు నొప్పిగా బరువుగా ఉండటం వంటి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. దీనినే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. దీనికి చికిత్సలో భాగంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, నడక వంటివి చేస్తూ, డాక్టర్ పర్యవేక్షణలో ప్రైమ్రోజ్ ఆయిల్, మినరల్స్, విటమిన్స్‌తో కూడిన మందులు, ఇంకా ఇతర అవసరమైన మందులు మూడు నెలల పాటు వాడి చూడవచ్చు. జీవనశైలిలో మార్పులు, ఆహారంలో ఉప్పు తగ్గించి తీసుకోవడం, వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే మీ వారికి ఈ సమస్య గురించి వివరించి చెబితే ఆయన మీ పరిస్థితిని అర్థం చేసుకుని, సర్దుకుపోవడం జరుగుతుంది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. మా అమ్మాయి వయసు 13 ఏళ్లు. ఆరు నెలల కిందటే రజస్వల అయింది. రెండు నెలలుగా తనకు విపరీతంగా తెల్లబట్ట అవుతోంది. దుర్వాసన వస్తోంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – వందన, నరసన్నపేట సాధారణంగా అమ్మాయిలలో వాసన, దురద లేని తీగలలాగ, నీరులాగ కొద్దిగా వచ్చే తెల్లబట్ట సాధారణం. ఇది యోనిలోని గ్రంథుల నుంచి ఊరుతుంది. ఈ తెల్లబట్ట పీరియడ్ వచ్చే ముందు పీరియడ్ మధ్యలో ఎక్కువగా ఉండటం సహజం. కొందరిలో కడుపులో నులిపురుగులు ఉన్నా, మలబద్ధకం వల్ల కూడా తెల్లబట్ట ఎక్కువగా కావచ్చు. శారీరక శుభ్రత, జననావయవాల వద్ద వ్యక్తిగత శుభ్రత సరిగా లేకపోయినా, రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు ఉన్నా, వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ అమ్మాయికి పాలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పప్పులతో కూడిన మితమైన పోషకాహారం ఇవ్వండి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనక్కు శుభ్రపరచుకోవాలి. వెనుక నుంచి ముందు వైపుకి శుభ్రపరచుకోవడం ద్వారా మలద్వారం దగ్గర బ్యాక్టీరియా ముందువైపు పాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గైనకాలజిస్టును సంప్రదించి, ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకుని, దానిని బట్టి సరైన మందులు వాడుకోవడం మంచిది. - డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్స్
నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? నా వయసు 26 ఏళ్లు. నాకు పెళ్లయి ఐదేళ్లు అవుతోంది. మా దంపతులం గత మూడున్నర ఏళ్లుగా పిల్లలు కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే నాకు పీరియడ్స్ నాలుగైదు నెలలకొకరాసారి వస్తున్నాయి. డాక్టర్‌ను కలిశాను. స్కానింగ్ తీసి పాలీసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పారు. నాకు ఎప్పటికైనా పిల్లలు పుడతారా? – సోదరి, హైదరాబాద్ మీకు పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సమస్య ఉంది కాబట్టి ఇలా రుతుస్రావం క్రమంగా రాదు. దాంతో మీలో అండాలు ఉత్పత్తి అయ్యే సంఖ్య కూడా బాగా తగ్గుతంది. ఫలితంగా మీలో గర్భధారణకు చాలా టైమ్ పట్టవచ్చు. మీరు ఒకవేళ చాలా ఎక్కువ బరువు ఉంటే దాన్ని క్రమంగా తగ్గించుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చేసుకోండి. ఇదే జరిగితే...మీలో రుతుస్రావం క్రమబద్ధంగా రావడం మొదలవుతుంది. ఇక మీ ఆహారం ముదురాకుపచ్చటి తాజా ఆకుకూరలు చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేయండి. ఈరోజుల్లో మీలో అండం ఉత్పత్తి అయ్యేలా చేసేందుకు చాలా మంది మందులు, వైద్యప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. మొదట టాబ్లెట్స్‌తో ప్రారంభించి, చికిత్సకు మీరు స్పందిస్తున్న తీరు ఆధారంగా క్రమంగా మీకు గొనాడోట్రాపిన్ ఇంజక్షెన్ ఇవ్వడం వంటివి చేస్తాం. లేదా మందులూ, గొనాడోట్రాపిన్ ఇంజెక్షన్ కలిపి కాంబినేషన్లలో కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీలాంటి వారిలో చాలామంది చాలా ప్రాథమిక చికిత్సకే బాగా స్పందిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ఒవేరియర్ డ్రిల్లింగ్ చేస్తాం. ఐవీఎఫ్ అనే అధునాతన చికిత్స చాలా కొద్దిమందికి మాత్రమే అవసరమవుతుంది. మీరు అప్పుడే అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. మీకు పిల్లలు పుట్టేందుకు చాలా అవకాశాలే ఉన్నాయి. ఇక మీకు పీసీఓఎస్ ఉందంటే దీంతోపాటు దీర్ఘకాలంలో డయాబెటిస్, యుటెరైన్ క్యాన్సర్, గుండెసమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మీరు మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోండి. మీరు సరైన చికిత్స తీసుకుంటూ క్రమబద్ధంగా రుతుస్రావం జరిగేలా చూసుకుంటే చాలా సమస్యలు వాటంతట అవే చక్కబడతాయి. ఒవేరియన్ రిజర్వ్ తగ్గడం అంటే? నా వయసు 38 ఏళ్లు. నా భర్తకు 39 ఏళ్లు. మా ఇద్దరిదీ లేట్ మ్యారేజీ. పెళ్లయిన నాటి నుంచీ సంతానం కోసం ప్రయత్నిస్తున్నాం. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాం. ఆమె కొన్ని పరీక్షలు చేసి నా అండాశయాల రిజర్వ్ (ఒవేరియన్ రిజర్వ్) తక్కువగా ఉందని అన్నారు. అంటే ఏమిటి? నాకు పిల్లలు పుడతారా? – ఓ సోదరి, నిడదవోలు ఒవేరియస్ రిజర్వ్ అంటే అండాశయం నుంచి అండాల ఉత్పత్తి తగ్గడం. ఒకే వయసు ఉన్న ఇద్దరు మహిళలకు ఒవేరియన్ రిజర్వ్ అనేది వేర్వేరుగా ఉంటుంది. ఇది పుట్టుకతో వచ్చే తేడా. ఒవేరియన్ రిజర్వ్ కాస్త ఎక్కువగా ఉన్న మహిళలకు తక్కువ మందులతోనే అండాలు ఉత్పత్తి అవుతాయి. ఒవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉన్న స్త్రీలకు అండాల ఉత్పత్తి ఆశించినంతగా ఉండదు. పరిమాణం, నాణ్యత (క్వాంటిటీ అండ్ క్వాలిటీ) కూడా తక్కువే. ఒవేరియన్ రిజర్వ్ కొందరిలో తక్కువగా ఉంటుంది. మరికొందరికి పొగతాగడం, మద్యపానం వల్ల తగ్గుతుంది. క్యాన్సర్‌కు సంబంధించిన మందుల (కీమోథెరపీ)తోనూ, కొన్ని సందర్భాల్లో ఓవరీకి సంబంధించిన శస్త్రచికిత్సలతో కూడా ఒవేరియన్ రిజర్వ్ తగ్గుతుంది. ఒవేరియన్ రిజర్వ్ 30 ఏళ్ల వయసు వరకు బాగా ఉంటుంది. దాని తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తుంది. 33 – 35 ఏళ్ల వయసు వచ్చే వరకు చికిత్సతో దీన్ని సరిచేసుకోవచ్చు. అదే 37– 39 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఒవేరియన్ రిజర్వ్ బాగా తగ్గుతుంది. మందుల మోతాదు కూడా ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. చివరగా మందులు పనిచేయలేని దశలో ఎగ్ డోనర్ ద్వారా చికిత్స అందించవచ్చు. - డాక్టర్ రత్న దూర్వాసుల, సీనియర్ ఇన్ఫెర్టిలిటీ కన్సల్టెంట్, బర్త్ రైట్ బై రెయిన్బో, హైదరాబాద్ -
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్స్
పెళ్లయి ఐదేళ్లయినా పిల్లల్లేరు... కారణాలు ఏమై ఉంటాయి? నా వయసు 34 ఏళ్లు. నా భార్య వయసు 31 ఏళ్లు. మాకు పెళ్లయి ఐదేళ్లయ్యింది. మూడేళ్లుగా మేము ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులనూ పాటించడం లేదు. అయినా సంతానం లేదు. కారణం ఏమై ఉంటుంది? దయచేసి వివరంగా తెలియజేయండి. – డేవిడ్, నకిరేకల్ పూర్తి ఆరోగ్యవంతులైనప్పటికీ కొందరు దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఇందుకు కారణాలను కనుగొనడానికి దంపతులిద్దరికీ విడివిడిగా కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. మహిళల్లో సంతానలేమికి దారితీసే పరిస్థితులను గుర్తించడానికి ప్రాథమిక పరీక్షగా అండాల విడుదలను పరిశీలిస్తారు. ఇందుకోసం గర్భాశయానికి అల్ట్రాసౌండ్ టెస్ట్, ట్యూబ్ టీబీ, హార్మోన్ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల ఫలితాలపై ఆధారపడి, చికిత్సను ప్రారంభించడానికి ముందుగా మరికొన్ని పరీక్షలు చేయాల్సి రావచ్చు. వాటిలో కొన్ని ఎ.ఎమ్.హెచ్, రుబెల్లా 1జీజీ ఎఫ్.టి.3, ఎఫ్.టి.4, బ్లడ్ షుగర్ టెస్ట్, ప్రొలాక్టిన్ టెస్ట్‌లు. అదే సమయంలో పురుషుడి విషయానికి వస్తే... అతడికి వీర్యకణాల పరీక్ష చేయించాల్సి ఉంటుంది. సెమన్ అనాలసిస్ పరీక్షలో పురుష బీజకణాలు తక్కువగా ఉండటం, వాటి రూపంలో లోపం, వాటి కదలికలు సరిపడనంతగా లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు ఏమైనా బయటపడితే మరికొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని... అడ్వాన్స్డ్ స్పెర్మ్ అనాలిసిస్, టెస్టిక్యులార్ బయాప్సీ, జనెటిక్ టెస్ట్, స్క్రోటల్ అల్ట్రాసౌండ్, కేర్యోటైప్ టెస్ట్ వంటివి. మొదట ప్రాథమిక పరీక్షలు, ఆ తర్వాత దంపతులకు అవసరమైన కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించి, వారు సంతానాన్ని పొందడానికి ఏయే లోపాలను సరిదిద్దాలో దానికి అనుగుణంగా చికిత్సను చేయాల్సి ఉంటుంది. శుక్రకణాలు లేవంటున్నారు... పరిష్కారం ఏమైనా ఉందా? నా వయసు 32. నేను, నా భార్య సంతానం కోసం నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఇద్దరమూ వైద్యపరీక్షలు కూడా చేయించుకున్నాం. అందులో... నా భార్యకు అంతా మామూలుగానే ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే నా వీర్యంలో శుక్రకణాలు లేవని వారు అంటున్నారు. మాకు సంతానం కలిగే మార్గం లేదా? దయచేసి తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరుడు, హైదరాబాద్ మీరు మరోమారు వీర్య పరీక్ష చేయించండి. ఈసారి ఫలితాల్లోనూ మీకు శుక్రకణాలు లేవని తెలిస్తే, అందుకు కారణాలు తెలుసుకోవాలి. దీనికి మీ ఎండోక్రైన్ గ్రంథుల వ్యవస్థ సక్రమంగా లేకపోవడమా, వృషణాల పనితీరు సరిగా లేకపోవడమా లేక నాళంలో ఏవైనా అడ్డంకుల వల్లనా అన్నది మొదట తెలుసుకోవాలి. ఒకవేళ మీ చిన్నతనంలో వృషణం కడుపులోనే ఉండిపోయి, కిందికి జారకపోవడం (అన్‌డిసెండెడ్ టెస్టిస్) జరిగిందా లేదా మీకు చిన్నప్పుడు జననావయవాల దగ్గర ఏ కారణంగానైనా సర్జరీ జరిగిందా అన్న విషయాలను మీరు డాక్టర్లకు తెలపాలి. మీలో వేరికోసీల్ వంటి సమస్య ఏదైనా ఉందేమోనని కూడా చూడాల్సి రావచ్చు. అలాగే మీకు కొన్ని రక్తపరీక్షలూ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలూ చేయించాల్సి రావచ్చు. మీకు జన్యుపరమైన సమస్యలు ఏవైనా ఉన్నట్లు తేలితే, అప్పుడు జెనెటిసిస్ట్ కౌన్సెలింగ్ కూడా అవసరం కావచ్చు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి ఆ తర్వాత వీర్యసేకరణ కోసం అవసరాన్ని బట్టి పలు ప్రక్రియలను అవలంబించాల్సి వస్తుంటుంది. అలా వీర్యసేకరణ జరిపాక, అందులోని శుక్రకణాలను ఉపయోగించి ఐసీఎస్ఐ (ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) అనే ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో శుక్రకణాన్ని, మీ భార్య అండంలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇలా మీరు తండ్రి అయ్యే అవకాశం ఉంది. మీ దంపతులిద్దరూ మరోసారి ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించండి. పీసీఓఎస్ సమస్య ఉందంటున్నారు... పిల్లలు పుడతారా? నా వయసు 28 ఏళ్లు. నాకు పెళ్లయి ఐదేళ్లు అవుతోంది. గత మూడేళ్లుగా పిల్లలు కావాలని కోరుకుంటున్నాను. అయితే నాకు పీరియడ్స్ నాలుగైదు నెలలకొకసారి వస్తున్నాయి. డాక్టర్‌ను కలిశాను. పాలీసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పారు. నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? – ఒక సోదరి, విశాఖపట్నం మీకు పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సమస్య ఉందంటున్నారు కాబట్టి రుతుస్రావం క్రమంగా రాకపోవచ్చు. దాంతో మీలో ఉత్పత్తి అయ్యే అండాల సంఖ్య కూడా బాగా తగ్గవచ్చు. దాంతో మీలో గర్భధారణకు చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. మీరు ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే... మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటే వ్యాయామాలతో దాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. దాంతో మీకు రుతుక్రమం సక్రమంగా రావడం మొదలవుతుంది. ఇక మీ ఆహారం లో తాజా ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. జంక్‌ఫుడ్‌ను అవాయిడ్ చేయండి. ఈరోజుల్లో మీలో అండం ఉత్పత్తి అయ్యేలా చేసేందుకు మంచి వైద్యప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. మొదట టాబ్లెట్స్‌తో ప్రారంభించి, చికిత్సకు మీరు స్పందిస్తున్న తీరు ఆధారంగా క్రమంగా మీకు గొనాడోట్రాపిన్ ఇంజెక్షన్ ఇవ్వడం వంటివి చేస్తాం. లేదా మందులూ, గొనాడోట్రాపిన్ ఇంజెక్షన్ కలిపి కాంబినేషన్లలో కూడా ఇచ్చే అవకాశం ఉంది. చాలామంది చాలా ప్రాథమిక చికిత్సకే బాగా స్పందిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ఒవేరియర్ డ్రిల్లింగ్ చేస్తాం. ఐవీఎఫ్ అనే అధునాతన చికిత్స చాలా కొద్దిమందికి మాత్రమే అవసరమవుతుంది. మీరు అప్పుడే అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. మీకు పిల్లలు పుట్టేందుకు చాలా అవకాశాలే ఉన్నాయి. ఇక మీకు పీసీఓఎస్ ఉందంటే దీంతోపాటు దీర్ఘకాలంలో డయాబెటిస్, యుటెరైన్ క్యాన్సర్, గుండె సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మీరు మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోండి. దాంతో సమస్యలు వాటంతట అవే చక్కబడతాయి. - డాక్టర్ లక్ష్మీ కృష్ణలీల ,సీనియర్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్, ,యశోద మదర్ అండ్ ఛైల్డ్ ఇన్స్టిట్యూట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ముందు బరువు తగ్గండి...
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 24 ఏళ్లు. పెళ్లయి మూడేళ్లు అవుతోంది. ఇంకా గర్భం రాలేదు. నాకు పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి. నా బరువు 87 కిలోలు. పీరియడ్స్ క్రమబద్ధం కావడం కోసం, గర్భం దాల్చడం కోసం కొన్ని నెలలుగా చాలామంది డాక్టర్లను సంప్రదించాను. వారు పీసీఓఎస్ ఉందని అన్నారు. ఎన్నో రకాల మందులు వాడాను. కాని ప్రయోజనం లేదు. నా విషయంలో తగిన సలహా ఇవ్వండి. - నాగమణి, వరంగల్ పీసీఓఎస్ అనేది హార్మోన్ల అసమతౌల్యత వల్ల వచ్చే కండిషన్. మహిళలల్లో దాదాపు 10 - 15 శాతం మందిలో ఇది సాధారణంగా కనిపిస్తుంది. ఇది జన్యుపరంగా, వంశపారంపర్యంగా కూడా కుటుంబంలో కనిపిస్తుంటుంది. ఈ కండిషన్ ఉన్నవారిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉంటాయి. (అండం పెరుగుదల ఉండదు). కొన్ని మందులు వాడటం ద్వారా రుతుక్రమాన్ని సరిదిద్దవచ్చు. అయితే మందులు వాడటం మానేస్తే మళ్లీ రుతుక్రమం దెబ్బతింటుంది. చాలామందిలో ఈ పరిస్థితిని శాశ్వతంగా నయం చేయడం అంతగా కుదరకపోవచ్చు. సంతాన సాఫల్యం కలిగించే విషయంలో అండాల పెరుగుదల కోసం కొన్ని ట్యాబ్లెట్లు, హార్మోనల్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావచ్చు. అయితే ఇలాంటి చికిత్సలకు ముందుగా మీరు బరువు తగ్గడం అవసరం. ఇప్పుడు మీ బరువులో కనీసం 10 శాతమైనా తగ్గాలి. ఇలా బరువును నియంత్రించుకొని తగిన మందులు వాడేవారిలో కనీసం 65 నుంచి 75 శాతం మంది గర్భం దాల్చుతారు. మిగతా వారిలో లాపరోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ లేదా ఐవీఎఫ్‌తో ప్రయోజనం ఉండవచ్చు. మీరు ముందుగా కనీసం తొమ్మిది కిలోల బరువు తగ్గి... ఆ తర్వాత ఫెర్టిలిటీ చికిత్స తీసుకోండి. సానుకూల ఫలితాలు కనిపించవచ్చు. నా వయసు 32 ఏళ్లు. నాకు పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. పిల్లలకోసం ప్రయత్నిస్తున్నాం. ఇటీవల నేను వీర్య పరీక్ష చేయించుకుంటే అందులో శుక్రకణాలు లేవని తెలిసింది. మాకు తగిన సలహా ఇవ్వడండి. - నాగేశ్వరరావు, విశాఖపట్నం పురుషుల వీర్యంలో శుక్రకణాలు లేని కండిషన్‌ను అజూస్పెర్మియా అంటారు. దీనికి శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా లేకపోవడం లేదా ఉత్పత్తి అయిన శుక్రకణాలు ప్రయాణం చేసే దారిలో ఏదైనా అడ్డంకి ఉండటం కారణాలు కావచ్చు. అయితే మీలాంటి కేసుల్లో మరల మరల ఇదే పరీక్షను నిర్వహించాలి. ఆ తర్వాత మీరు కొన్ని వైద్య పరీక్షలు... అంటే హార్మోనల్ అల్ట్రాసౌండ్, క్యారియోటైపింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. మీ కండిషన్‌కు తగిన కారణాన్ని నిర్ధారణ చేసుకోవాలి. హార్మోనల్ సప్లిమెంట్స్ ద్వారా శుక్రకణాల సంఖ్య పెంచవచ్చు. అప్పటికీ సాధ్యంకాకపోతే ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్) విత్ టెస్టిక్యులార్ స్పెర్మ్ యాస్పిరేషన్తో చికిత్స చేయవచ్చు. అంటే ఈ ప్రొసీజర్‌లో నేరుగా టెస్టిస్ నుంచి శుక్రకణాలు సేకరిస్తారు. అయితే అన్ని కేసుల్లో ఇలా శుక్రకణాల సేకరణ సాధ్యం కాకపోవచ్చు. అదీ సాధ్యం కాకపోయినా మరికొన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయి. - డాక్టర్ ప్రీతీ రెడ్డి కన్సల్టెంట్ ఇన్ఫెర్టిలిటీ, బర్త్ రైట్ బై రెయిన్బో, బంజారాహిల్స్, హైదరాబాద్ -
తొందరపడి ఆపరేషన్... ఇప్పుడు బిడ్డ కావాలి!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. ఈ వేసవిలో విహారయాత్రకు వెళ్లొచ్చిన తర్వాత ఆకలి మందగించింది. మలబద్దకంగా అనిపించడంతో పాటు మూత్రం పచ్చగా వస్తోంది. కొందరు కామెర్లు వచ్చాయని అంటున్నారు. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? - రాజ్‌కుమార్, హైదరాబాద్ కామెర్లు అనేది కాలేయ సంబంధిత వ్యాధి. ఒక వ్యక్తి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు అతని కంటే ముందుగా ఇతరులే దీన్ని గుర్తిస్తారు. రక్తంలో బిలురుబిన్ పాళ్లు పెరిగినప్పుడు చర్మం, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేన్స్‌లో పసుపుపచ్చ రంగు తేలడాన్ని పచ్చకామెర్లు అంటారు. శరీరానికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్‌ను రక్తంలోకి ఎర్రరక్తకణాలు సరఫరా చేస్తాయి. ఇందులో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని జీవితకాలం 120 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత హీమోగ్లోబిన్‌లోని హీమ్ అనే పదార్థం ప్లీహం (స్ల్పీన్)లో శిథిలమైపోయి బైలురుబిన్, బైలివర్డిన్ అనే పసుపు రంగు వ్యర్థ పదార్థాలుగా మారిపోతాయి. శరీరంలో పసుపు రంగు పదార్థాలు పేరుకుపోవడాన్ని కామెర్లుగా చెప్పవచ్చు. సాధారణంగా కాలేయం ఈ వ్యర్థ పదార్థాలను సేకరించి, పైత్యరసంతో పాటు కాలేయ వాహిక (బైల్ డక్ట్) ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడి నుంచి మలంతో పాటు ఈ పసుపు రంగు వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కామెర్లకు కారణాలు: హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే వైరస్ల కారణంగా కామెర్లు వచ్చే అవకాశం ఉంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కాలేయం పాడైపోవడం కాలేయం నుంచి పేగుల్లోకి వెళ్లే కాలేయ వాహికలో అంతరాయం ఏర్పడటం వంటివి జరిగితే కామెర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. లక్షణాలు: వికారం, వాంతులు పొత్తికడుపులో నొప్పి జ్వరం, నీరసం, తలనొప్పి కడుపు ఉబ్బరంగా ఉండటం కామెర్లు సోకినప్పుడు కళ్లు పచ్చబడటం. వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఎల్ఎఫ్టీ, సీటీ స్కాన్, ఎమ్మారై, అల్ట్రా సౌండ్ స్కాన్ చికిత్స: కామెర్లను తగ్గించడానికి హోమియోపతిలో మంచి మందులున్నాయి. రోగి లక్షణాలను, శారీరక, మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకొని డాక్టర్లు మందులు సూచిస్తారు. ప్రారంభదశలోనే వాడితే కామెర్లను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు హోమియోలో చెలిడోనియం, సెలీనియం, లైకోపోడియం, మెర్క్‌సాల్, నాట్‌సల్ఫ్ వంటి మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు 10 నెలలు. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు పాప ముఖం నీలంగా మారిపోతోంది. ఇది చాలా ఆందోళనగా కలిగిస్తోంది. మా పాప సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - ధరణి, కోదాడ మీ పాప సమస్యను ‘బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండటంతో ఇలా జరుగుతోంది. పిల్లల్లో కోపం / ఫ్రస్టేషన్ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఈ సమస్య గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువ. కుటుంబ చర్రితలో ఈ లక్షణం ఉన్నవారి పిల్లల్లో ఇది ఎక్కువ. ఈ లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్‌లో... సింపుల్, సైనోటిక్, పాలిడ్, కాంప్లికేటెడ్ అని నాలుగు రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం అవసరం. ఎందుకంటే గుండెకు సంబంధించిన తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి చేయాల్సిన పని. ఇక చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్ ఇవ్వడం ఉపయోగకరం. పిల్లలూ, తల్లిదండ్రుల మధ్య ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఈ సమస్య కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా పాపకు ఏవైనా తీవ్రమైన సమస్య ఉన్నాయేమోనని తెలుసుకోడానికి మాత్రమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైనప్పుడు మీ పిల్లల డాక్టర్‌ను ఒకసారి సంప్రదించండి. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. జీవితంలో సెటిల్ అవకముందే పిల్లలు ఎందుకని గతంలో 3 సార్లు మందుల ద్వారా, 2 సార్లు ఆపరేషన్ ద్వారా గర్భధారణ కాకుండా అడ్డుకున్నాం. ఈ మధ్యే ఒక పాప పుట్టింది. ఏదో కంగారులో మా వారు డెలివరీ సమయంలోనే నాకు కు.ని. ఆపరేషన్ చేయించడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడేమో ‘తొందర పడ్డాను, మళ్లీ పిల్లలు కావాలంటే ఎలా’ అని బాధపడుతున్నారు. ఐవీఎఫ్, సర్రోగసీ లాంటి ఖర్చుతో కూడిన పద్ధతులు కాకుండా ఆపరేషన్ జరిగాక కూడా వేరే ఏదైనా పద్ధతి ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందా? ఒకవేళ వీలైనా భవిష్యత్‌లో నాకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా తెలియజేయగలరు? - ఓ సోదరి, విజయవాడ గర్భధారణ ప్రక్రియ నార్మల్‌గానే జరిగేందుకు వీర్యం, అండం, ఫెలోపియన్ ట్యూబ్స్ అవసరం. ట్యూబెక్టమీ ఆపరేషన్‌లో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ రెండింటినీ బ్లాక్ చేస్తారు. ఫలితంగా వీర్యం, అండం ఈ ట్యూబ్లలో కలవడానికి వీలుండదు. తద్వారా గర్భాన్ని నివారించడం జరుగుతుంది. ట్యూబెక్టమీ జరిగితే మీకు నార్మల్‌గా గర్భధారణ సాధ్యం కాదు. ఇక ఉన్న మార్గాల్లో ఒకటి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్). ఇందులో మీ నుంచి అండాన్ని, మీ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి, ల్యాబ్‌లో ఫలదీకరణం చేసి, ఇలా రూపొందిన పిండాన్ని మీ గర్భసంచి (యుటెరస్)లోకి ప్రవేశపెడతారు. కానీ మీరు ఈ ప్రక్రియ పట్ల ఆసక్తిగా లేరు. ఇక రెండో మార్గం... మీ ట్యూబ్స్ మార్గాన్ని పునరుద్ధరించడం. దీన్ని ట్యూబల్ రీ-కెనలైజేషన్ అని అంటారు. ఈ ప్రక్రియలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లో మూసిన మీ ట్యూబ్స్‌ను మళ్లీ తెరుస్తారు. అయితే దీన్ని తెరిచే ముందర కొంత ప్లానింగ్ అవసరం. ఇందులో మీ ఫెలోపియన్ ట్యూబ్‌ల పొడవు, అక్కడ మిగిలి ఉన్న ట్యూబ్‌ల సైజును బట్టి, ఈ ప్రక్రియ ఎంత వరకు విజయవంతమవుతుందో చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో మీకు మత్తు (అనస్థీషియా) ఇచ్చి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే దానికి ముందర మీ దంపతులతో కొన్ని చర్చలు, కొంత కౌన్సెలింగ్ అవసరం. ఇక సరోగసీ లాంటి ప్రక్రియలు మీ కేసులో అవసరం లేదు. గతంలో మీరు మూడు సార్లు మందుల ద్వారా, రెండు సార్లు ఆపరేషన్‌తో రెండు సార్లు గర్భధారణను అడ్డుకున్నారు. అలాంటి ప్రక్రియలతో కొన్నిసార్లు ఫెలోపియన్ ట్యూబ్స్‌లో అడ్డంకులు ఏర్పడటం, మూసుకుపోవడం, గర్భసంచి లోపలి పొర అతుక్కుపోవడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. అలాంటి ప్రమాదాలు నివారించేందుకు తాత్కాలిక గర్భనివారణ మార్గాలు ఎన్నో ఉన్నాయి. మీరు వాటిని అనుసరించి ఉండాల్సింది. అది జరిగిపోయిన విషయం కాబట్టి ఇప్పుడు మీరు తదుపరి బిడ్డ కోసం గట్టిగా నిశ్చయించుకుంటే, ఒకసారి మీకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి మీ డాక్టర్‌తో ఒకసారి నేరుగా చర్చించండి. మీకు ఉపయుక్తమైన మార్గాన్ని అవలంబించండి. -
సిస్ట్లు క్యాన్సర్‌గా మారవు
నా వయసు 38 ఏళ్లు. పెళ్లయి ఐదేళ్లు అవుతోంది. పిల్లలు లేరు. స్కానింగ్ తీయించాం. నా ఓవరీలలో సిస్ట్ ఉందని తేలింది. ఈ సిస్ట్ భవిష్యత్తులో క్యాన్సర్‌గా పరిణమిస్తుందేమోనని ఆందోళనగా ఉంది. నాకు సలహా ఇవ్వండి. - ఒక సోదరి, హెదరాబాద్ ఓవేరియన్ సిస్ట్ (అండాశయాల్లో నీటితిత్తులు) చాలామందిలో కనిపిస్తుంటాయి. ఇది చాలా సాధారణ సమస్య. ఈ నీటితిత్తులు క్యాన్సర్ కణాలుగా మారవు. మీ వయసులో ఉన్న వాళ్లలో చాలామందిలో అవి కొద్దికాలం తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి మీరు వీటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీలా ఒవేరియన్ సిస్ట్స్ ఉన్న మహిళలు మా డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు అవి ఏ తరహాకు చెందినవో గుర్తించేందుకు ప్రయత్నిస్తాం. అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా వాటి పరిమాణం, సంఖ్య, వాటిలోకి జరిగే రక్తసరఫరా వంటి అంశాలను తెలుసుకుంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటి ఇతర పరీక్షలనూ చేయిస్తాం. కుటుంబ చరిత్రను అడిగి తెలుసుకుంటాం. అయితే కుటుంబ చరిత్రలో క్యాన్సర్లు వచ్చిన దాఖలాలు ఉన్నవారికి మరికొన్ని అదనపు పరీక్షలు సైతం చేయించాల్సి ఉంటుంది. ముందుగా చెప్పుకున్నట్లుగానే చాలా సందర్భాల్లో ఒవేరియన్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే వాటి పరిమాణం పెరుగుపోతున్నా లేదా ట్విస్ట్ అవుతున్నా, అవి చీరుకుపోయి రక్తస్రావం అవుతున్నా, వాటి వల్ల నొప్పి కలుగుతుంటే మాత్రం వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్స సైతం లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా చాలా మందికి సాధ్యపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలా సిస్ట్లు రావడం అన్నది ఎండోమెట్రియాసిస్ కారణంగా జరుగుతుంటుంది. అలాంటప్పుడు రుతుస్రావం, కలయిక సమయంలో నొప్పి, గర్భధారణకు అడ్డంకిగా ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే మీకు ఇంకా గర్భధారణ జరగకపోవడానికి ఏయే అంశాలు కారణమో పూర్తిగా తెలుసుకోవాలి. దాంతోపాటు మీలో వచ్చే సిస్ట్లు ఏ తరహాకు చెందినవి అని తెలుసుకోవడం కూడా అవసరం. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భధారణకు అవకాశాలు తగ్గిపోతాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీరు సాధ్యమైనంత త్వరగా వైద్య నిపుణులను కలవండి.