పిల్లల్ని కనడం, పెంచడం, భారం అనుకోవద్దు..
పనితో పాటు కుటుంబాన్ని
బ్యాలెన్స్ చేసుకున్నాం: నటి రమ్యకృష్ణ
సాక్షి, హైదరాబాద్: మాతృత్వం.. ఓ మధురానుభూతి అని ప్రముఖ నటి రమ్యకృష్ణ పేర్కొన్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, పిల్లల్ని కనడం, పెంచడం భారంగా భావిస్తున్నారని చెప్పారు. అలా అనుకోవద్దని తాము కూడా వృత్తితో పాటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకున్నామని తెలిపారు.
నగరంలోని ఓ హోటల్‌లో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ నటి రమ్యకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ దుర్గారావును ఫరి్టలిటీ, ఐవీఎఫ్‌కు సంబంధించి ఆమె పలు ప్రశ్నలను అడిగి నివృత్తి చేసుకున్నారు.
జపాన్‌లో కొన్నేళ్లుగా యువ జనాభా విపరీతంగా తగ్గిపోతోందని, పూర్తిగా వృద్ధుల జనాభా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో అక్కడి ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని డాక్టర్ దుర్గారావు పేర్కొన్నారు. మన దేశంలో కూడా సంతానోత్పత్తి రేటు 1.8 ఉందని, అది 2కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా జని్మంచిన పలువురు పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. వీరంతా రేపటి చాలెంజర్లని, రేపటి రోజును తీర్చిదిద్దే వారిని సమాజానికి అందించినందుకు గర్వంగా ఉందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment