సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సొంతమైన వాట్సాప్‌కు భారీ షాక్ తగిలింది. వాట్సాప్ పోటీ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ యూజర్ బేస్‌లో దూసుకుపోతోంది బుధవారం ఫేస్‌బుక్ మెసేజింగ్ యాప్, వాట్సాప్ యాప్‌లు సేవలు స్తంభించిన నేపథ్యంలో యూజర్లు టెలిగ్రామ్ వైపు మళ్లి పోతున్నారు. కేవలం ఒక్కరోజేలోనే తమ కొత్త యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని స్వయంగా టెలిగ్రామ్ వెల్లడించింది.
ఫేస్‌బుక్ కు చెందిన వాట్సాప్, ఇన్‌స్ట్రా సేవల్లో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో తమ యూజర్ల సంఖ్యా భారీగా పెరిగిందని టెలిగ్రాం తాజాగా వెల్లడించింది. కేవలం 24 గంటల్లోనే 30 లక్షల కొత్త యూజర్లు తన నెట్‌వర్క్‌లో చేరారని టెలిగ్రాం ఫౌండర్ పావెల్ దురోవ్ తెలిపారు. వాట్సాప్‌కు పోటిగా ఎంట్రీ ఇచ్చిన చాటింగ్ యాప్ టెలిగ్రాంకు ప్రస్తుతం 200 మిలియన్ల నెలవారీ యూజర్లున్నారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ సొంతమైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్ సేవలకు బుధవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోడింగ్‌లో సమస్యలు ఎదురైనట్టుగా పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. అటు ఫేస్‌బుక్ కూడా దీన్ని ధృవీకరించింది. అయితే గురువారం ఉదయానికి ఇన్‌స్టాగ్రామ్ సేవలను పునరుద్దిరించినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment