
న్యూయార్క్: ఇన్‌స్టంట్ మెసేజింగ్ మొబైల్ యాప్ ‘టెలిగ్రాం’లో యూజర్లకు ఎంతో ఉపయోగకరమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ఒక ఆండ్రాయిడ్ ఫోన్‌లో మూడు టెలిగ్రాం అకౌంట్లను వాడుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ టెలిగ్రాం అకౌంట్లు ఉన్నవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఆండ్రాయిడ్ ఫోన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై లభిస్తున్న టెలిగ్రాం ఆప్‌లో కూడా రెండు కొత్త థీమ్‌లను జత చేశారు. ఇక రెండు ప్లాట్‌ఫాంలపై కూడా టెలిగ్రాం యూజర్లు తమకు వచ్చే మెసేజ్‌లకు క్విక్ రిప్లై ఇవ్వవచ్చు. టెక్ట్స్, ఎమోజీ, స్టిక్కర్, జిఫ్ ఇమేజ్‌లను పంపుకోవచ్చు. తాజా వెర్షన్ 4.7ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు తమ తమ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.