అలకచెందిన వినియోగదారులను తిరిగి ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది వాట్సాప్. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్‌ల గురించి ఆలోచిస్తుంది. వాట్సాప్ యూజర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ ను ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకి బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఓఎస్ యూజర్స్‌కి కూడా బీటా వెర్షన్‌ను విడుదల చేసినట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ వాట్సాప్ ఖాతా ఉపయోగిస్తున్న ఫోన్ పనిచేయకపోయినా మరో ఫోన్‌లో వాట్సాప్ యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే వేర్వేరు డివైజ్‌లలో ఒకేసారి వాట్సాప్‌ను కనెక్ట్ చెయ్యొచ్చు.
దీనితో పాటు వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ కూడా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిలీట్ మై అకౌంట్ స్థానంలో కొత్తగా లాగౌట్ అనే ఫీచర్ తీసుకొనివస్తున్నారు. దీని వల్ల వినియోగదారులు వేరే పరికరాలలో వాట్సాప్ లాగౌట్ చేయడం మర్చిపోతే ఈ ఫీచర్ తో ఎక్కడి నుంచైనా లాగౌట్ చేయవచ్చు. దీనికి సంబందించిన ఒక వీడియోను వాట్సాప్ తన బ్లాగ్ లో షేర్ చేసింది. అలాగే మ్యూట్ ఫీచర్ ను తీసుకోని వస్తుంది. వేరే యూజర్లకు వీడియో, క్లిప్‌ను పంపించడానికి ముందు మ్యూట్ చేసి పంపవచ్చు. ప్రస్తుతం పరీక్షదశలో ఉన్న ఈ ఫీచర్‌తో వీడియో ఎడిట్, టెక్స్ట్ ఎడిట్, ఇమోజీ...మొదలైనవి చేయవచ్చు. ఈ ఏడాది మొదట్లో వాట్సాప్ ప్రైవసీ పాలసీ పేరిట సరికొత్త నిబంధనలు తీసుకొచ్చి ఇబ్బందులు పడిన సంగతి మనకు తెలిసిందే.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment