online filing
-
దశల వారీగా ఈ–ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: దేశంలో ఈ–ఎఫ్ఐఆర్ల (ఎల్రక్టానిక్ ప్రాథమిక సమాచార నివేదిక) రిజి్రస్టేషన్ ప్రక్రియను దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని లా కమిషన్ సూచించింది. ఈ మేరకు తన నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. తొలుత మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే నేరాల్లో ఈ–ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని వెల్లడించింది. ఈ–ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్ కోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత జాతీయ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించింది. -
ఆన్లైన్ ఫైలింగ్‌ను అనుసరించాలి
∙పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్యరాజ్ వరంగల్ సిటీ : వ్యాపార లావాదేవీలను ఆన్లైన్ ఫైలింగ్ చేయడం ద్వారా విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్యరాజ్ పారిశ్రామికవేత్తలకు సూచించారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో బుధవారం చాంబర్ సంయుక్త కార్యదర్శి కంది రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అప్లికేషన్’ అనే అంశంపై జిల్లాలోని పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్యరాజ్, ఆ శాఖ జా యింట్ డైరెక్టర్ సురేష్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఆన్లైన్ ఫైలింగ్ ద్వారా వ్యాపార సమాచారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చు లు గణనీయంగా తగ్గుతాయన్నారు. ఇందుకుగానూ ప్రభుత్వం కల్పించే అన్ని రకాల రాయితీలు పక్కాగా అందుతాయని ఉదాహరణ పూర్వకంగా వివరించారు. ఈసందర్భంగా కమిషనర్ మాణిక్యరాజ్‌కు తెలంగాణ కాటన్ మిల్లర్స్, ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు. 2005–10 ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా పాత జిన్నింగ్ మిల్లుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయనను కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇండస్ట్రియల్ సెంటర్ మేనేజర్ వై.హృషికేష్, తెలంగాణ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, చాంబర్ ప్రతినిధులు నాగమళ్ల పూర్ణచందర్, శ్రీమన్నారాయణ, రాజయ్యయాదవ్, రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్, ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, చింతలపెల్లి వీరారావు, నాగభూషణం, కూకట్ల సత్యనారాయణ, వేణుగోపాల్, అగర్వాల్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సురేం దర్, తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్ మెయిన్స్ దరఖాస్తు తేదీల ప్రకటన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ 1న జరిగే మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం తెలిపింది. ఈనెల 20 నుంచి సెప్టెంబర్ 10 వరకూ అభ్యర్థులు తమ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్(డీఏఎఫ్)లను ఆన్లైన్లో సమర్పించాలి. ఇలా సమర్పించిన డీఏఎఫ్ను ప్రింట్ తీసుకోవాలని, ఆ నకలుపై అభ్యర్థి సంతకం చేసి, సంబంధిత డాక్యుమెంట్లు, ఫీజును జత చేసి సెప్టెంబర్ 18లోగా కమిషన్‌కు పంపాలని సూచించింది. అదనంగా 100 ఐఆర్ఎస్ పోస్టులు: ఆదాయపన్ను శాఖను మరింత పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని కేడర్లలోనూ భారీ సంఖ్యలో కొత్త పోస్టులు భర్తీ చేయనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అదనంగా 100 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. రాబోయే యూపీఎస్సీ నోటిఫికేషన్లో వీటిని అదనంగా కలుపుతారు. అలాగే ఆదాయపన్ను శాఖలో దిగువ స్థాయి వివిధ కేడర్లలో 20,751 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు.