- ఏరువాక శాస్త్రవేత్త సుధాన్షు
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
Published Fri, Aug 12 2016 11:52 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
ఇంద్రవెల్లి : రైతులు వ్యవసాయ అధికారులు ఇచ్చే సూచనలను తప్పక పాటించి, సాగు చేసిన పంటల్లో అధిక దిగుబడి సాధించాలని ఏరువక శాస్త్రవేత్త సుధాన్షు అన్నారు. శుక్రవారం ఆయన ఇంద్రవెల్లి మండలంలోని రాంపూర్, గౌరాపూర్ గ్రామాల్లో పర్యటించారు. రైతులు సాగు చేసిన సోయా పంటను పరిశీలించారు. సోయా పంటకు సోకిన కాండం తొలుచు పురుగు నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ పురుగు నివారణకు రైతులు 2 ఎం.ఎల్. పినల్‌పాస్‌తో పాటు ఒక ఎం.ఎల్. నువాన్ ఒక లీటరు చొప్పున నీటిలో కలిపి స్ప్రే చేయాలని వివరించారు. వ్యవసాయ అధికారి జాదవ్ కైలాస్, రైతులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement