గోళ్లు ..పొడవుగా అందంగా ఉండే ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ కొందరిలో కొద్దిగా పెరగగానే విరిగిపోతుంటాయి. కొంతమందికి అసలు పెరగవు. దీంతో నెయిల్ పెయింట్ వేసుకోవాలంటే ఇబ్బంది. గోళ్లను చక్కగా పెంచే ఈ ఐదు చిట్కాలు పాటించి చూడండి మీ కోరిక తీరుతుంది.. గోళ్ల పెరుగుదలను ప్రోత్సహించడంలో ఆలివ్ ఆయిల్ ముందుంటుంది. దీనిలోని విటమిన్ ఇ గోళ్లకు పోషణ అందించి చక్కగా పెరిగేలా చేస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను గోళ్లమీద రాసి మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల గోళ్లకు రక్తప్రసరణ చక్కగా జరిగి గోళ్లలో పెరుగుదల కనిపిస్తుంది.
టీస్పూను యాపిల్ సైడర్ వెనిగర్‌లో టీస్పూను వెల్లుల్లి తరుగు వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గోళ్లపై రాసి పదినిమిషాల తరువాత కడిగేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే గోళ్లు విరగకుండా చక్కగా పెరుగుతాయి. వెల్లుల్లి రెబ్బను రెండు ముక్కలు చేసి గోళ్లపై పదినిమిషాలపాటు రుద్దాలి. కొద్దిరోజుల్లోనే గోళ్ల పెరుగుదల కనిపిస్తుంది. ఆరెంజ్ జ్యూస్‌ను గోళ్లకు పూతలా అప్లైచేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది గోళ్లను అందంగా పెరిగేలా చేస్తుంది. ఇవన్నీ చేయలేకపోతే కొబ్బరినూనెను గోళ్లపై రాసి రోజూ మర్దన చేయాలి. కొబ్బరినూనెలోని ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర పోషకాలు గోళ్ల పెరుగుదలకు దోహదపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment